Search
  • Follow NativePlanet
Share
» »ప్రాణాలు పొగొట్టుకోకూడదనుకుంటే అటు వైపు చూడకండి

ప్రాణాలు పొగొట్టుకోకూడదనుకుంటే అటు వైపు చూడకండి

ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ట్రెక్కింగ్ మార్గం గురించి కథనం.

By Kishore

భారత దేశం విశాలమైన భూభాగంలో అనేక ప్రకృతి అందాలు ఉంటాయి. ఈ అందాలు ఒక్కొక్కసారి మనిషికి సవాలు విసురుతుంటాయి. అటువంటి కోవకు చెందినదే ముంబైకు దగ్గరగా ఉన్న కలావతిన్ దుర్గం. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ట్రెక్కింగ్ ప్రాంతం. సముద్రమట్టానికి 2,300 అడుగుల ఎత్తులో ఉండే ట్రెక్కింగ్ మార్గం ఇరుకైనా రాతి మెట్ల మీదుగా సాగుతుంది. ఈ రాతిమెట్ల మీద నుంచి పైకి చేరుకోవడం ఒక ఎత్తు అయితే కిందికి దిగడం మరో ఎత్తు. చాలా జాగ్రత్తగా ఈ ట్రెక్కింగ్ మార్గంలో ప్రయాణం కొనసాగించాలి. లేదంటే ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. ఇంత ప్రమాద కరమైన ప్రాంతంలో మనస్సు, శరీరాన్ని లగ్నం చేసి ప్రయాణం కొనసాగించాల్సి ఉంటుంది. ఈ ట్రెక్కింగ్ చాలా ప్రమాదమని తెలిసినా దేశంలోని పలు ప్రాంతల నుంచి ట్రెక్కిగ్ లవర్స్ ఇక్కడికి ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు.

'వైకుంఠ' దేవాలయం సందర్శిస్తే మన తల రాత తిరిగి మార్చే బ్రహ్మ'వైకుంఠ' దేవాలయం సందర్శిస్తే మన తల రాత తిరిగి మార్చే బ్రహ్మ

రాక్షసరాజు చే ప్రతిష్టించిన స్వామి వారి విగ్రహం..దర్శిస్తే వద్దన్నా వివాహం ఆ పై అన్నీ...రాక్షసరాజు చే ప్రతిష్టించిన స్వామి వారి విగ్రహం..దర్శిస్తే వద్దన్నా వివాహం ఆ పై అన్నీ...

 1. ముంబై సమీపంలో

1. ముంబై సమీపంలో

Image Source:

ముంబై సమీపంలోని పశ్చిమ కనుమల్లో సముద్ర మట్టానికి దాదాపు 701 మీటర్లు అంటే 2,300 అడుగుల ఎత్తులో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ట్రెక్కింగ్ మార్గం ఉంది. దీనిని సాధారణంగా ట్రెక్కర్స్ హెవెన్ క్లైంబింగ్ అని అంటారు. అంటే స్వర్గానికి ఎగబాకుట అని అర్థం.

2. చుట్టూ అందమైన ప్రదేశాలు

2. చుట్టూ అందమైన ప్రదేశాలు

Image Source:

చుట్టు ఉన్న అందమైన ప్రదేశాలు, ఉత్కంఠభరితంగా ఉన్న మార్గం తదితర కారణాల వల్ల దీనిని ఆ పేరుతో పిలుస్తారు. అసలు ఇది ఒక కోట. దీనిని కలావతిన్ కోట అని అంటారు. ఒక కొండకు దాదాపు 90 డిగ్రీల కోణంలో మలిచిన చిన్ని రాతి మెట్ల పై ఈ ట్రెక్కింగ్ సాగుతుంది.

3. కలావతిన్ కోట

3. కలావతిన్ కోట

Image Source:

ఈ ట్రెక్కింగ్ కలావతిన్ కోటకు దగ్గరగా ఉన్న తకుర్వాడి పల్లె నుంచి సాగుతుంది. దాదాపు మూడు గంటల పాటు సాగే ఈ ట్రెక్కింగ్ ఇరుకైన ప్రాంతం గుండా వెలుతుంది. భూమి నుంచి నిటారుగా పైకి ఎక్కాల్సి ఉంటుంది. ఈ సమయంలో తలతిరగడం, వాంతులు చేసుకోవడం వంటి జరిగినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. అయితే ట్రెక్కింగ్ లో అనుభవమున్నవారికి మాత్రం ఈ మార్గం చాలా బాగా నచ్చుతుంది.

4. మరింత అందంగా కనిపిస్తుంది

4. మరింత అందంగా కనిపిస్తుంది

Image Source:

పైకి ఎక్కిన కొద్దీ చుట్టూ ఉన్న ప్రక`తి మరింత అందంగా కనిపిస్తుంది. ఒక్కొక్కసారి ట్రెక్కింగ్ ప్రాంతంలో వర్షం వస్తే ఈ ప్రయాణం మరింత కఠినమవుతుంది. అందుకే ట్రెక్కింగ్ లో అనుభవమున్న వారు మాత్రమే ఈ మార్గంలో ట్రెక్కింగ్ కు వస్తారు. ఇక ఈ ట్రెక్ లో కోట పై భాగానికి చేరుకోవడం ఒక ఎత్తు అయితే తిరిగి కిందికి రావడం మరొక ఎత్తు.

5. దిగడం చాలా కష్టం

5. దిగడం చాలా కష్టం

Image Source:

రాతి మెట్లు పాచితో కూడుకొని ఉంటాయి. అందువల్ల దిగేసమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పట్టు తప్పితే కాలు లేదా చెయ్యి విరగడం ఖచ్చితం. ఒక్కొక్కసారి ప్రాణాలకు కూడా గ్యారెంటీ ఉండదు. అయితే చాలా మంది ట్రెక్కింగ్ ప్రియులు ఇక్కడకు వస్తుంటారు. అక్టోబర్ నుంచి మే మధ్య ఈ ప్రాంతం ట్రెక్కింగ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది.

6. వర్షాకాలంలో మాత్రం వద్దు

6. వర్షాకాలంలో మాత్రం వద్దు

Image Source:

వర్షాకాలంలో చాలా వరకూ ఈ ప్రాంతానికి ట్రెక్కింగ్ చేయడానికి రాకపోవడం మంచిది. ముందే చెప్పుకొన్నట్లు ట్రెక్కింగ్ తకుర్వాడి పల్లె నుంచి ప్రారంభమవుతుంది. ముంబై నుంచి ఇక్కడికి రైలు సౌకర్యం ఉంది. అనేక ట్రావెల్ ఏజెన్సీ కంపెనీలు ఈ ట్రెక్కింగ్ ప్యాకేజీని అందిస్తున్నాయి. ఈ ప్యాకేజీలోనే ప్రాయణం ఖర్చు, టెంట్ సౌకర్యం, టీ, స్నాక్స్ తదితరాలను అందిస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X