Search
  • Follow NativePlanet
Share
» »చందన, కుంకుమ విభూది లేపనాలతో నయనమనోహరంగా శ్రీ కాశీ విశ్వనాథ స్వామి ఆలయం, పాలక్కాడ్

చందన, కుంకుమ విభూది లేపనాలతో నయనమనోహరంగా శ్రీ కాశీ విశ్వనాథ స్వామి ఆలయం, పాలక్కాడ్

పాలక్కాడ్ మధ్య కేరళ రాష్ట్రానికి చెందిన ఒక పట్టణం మరియు పాలక్కాడ్ జిల్లా కేంద్రం. దీని పూర్వ నామం పాలఘాట్. పశ్చిమ కనుమల గుండా ప్రవహించే పొన్నాని నదికి సమీపంలో ఉంది. పాలక్కాడ్ కోటలు,దేవాలయాలు, ఆనకట్టలు, అభయారణ్యాలు, జలపాతాలు, పార్కులు మరియు సుందరమైన ప్రకృతి దృశ్యాలు పర్యాటకుల సందర్శనకు చాలా ఉన్నాయి.పాలక్కాడ్ ఫోర్ట్ మరియు జైన దేవాలయం ప్రముఖ చారిత్రక ఆసక్తి ఉన్నవారు మరియు సంవత్సరం పొడవునా పర్యాటకులు వస్తారు.మలంపుజ్హఆనకట్ట మరియు తోటలు,వినోద పార్కుతో పాటు అద్భుతమైన పిక్నిక్ స్థలాలు ఉన్నాయి. నేల్లింపతి హిల్ స్టేషన్, సైలెంట్ వ్యాలీ జాతీయ ఉద్యానవనం మరియు మంచి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.పరంబిక్కులం వన్యప్రాణుల అభయారణ్యం ప్రకృతి ప్రేమికులకు మరియు వన్యప్రాణుల ఔత్సాహికులను బాగా అలరిస్తుంది.

పాలక్కాడ్ పట్టణంలో ఉన్న అనేక ఆలయాల్లో కలపతి విశ్వనాథ స్వామి ఆలయం ఒకటి

పాలక్కాడ్ పట్టణంలో ఉన్న అనేక ఆలయాల్లో కలపతి విశ్వనాథ స్వామి ఆలయం ఒకటి

పాలక్కాడ్ పట్టణంలో ఉన్న అనేక ఆలయాల్లో కలపతి విశ్వనాథ స్వామి ఆలయం ఒకటి. ఈ ఆలయం విశేషమైన చరిత్ర కలది. అంతే కాదు చుట్టు పక్కల ఉన్న ఆలయాల నిర్మాణాలకు ఈ ఆలయం నాంది పలికించింది కూడా ఈ ఆలయమే!

దక్షిణ వారణాసి

దక్షిణ వారణాసి

ఇది కేరళ పురాతన శివాలయాలలో ఒకటిగా ఉంది.1425 AD లో నిర్మించి మరియు నిజంగా మంత్రముగ్ధులను చేసే నిర్మాణ శైలితో ఉంటుంది. ఈ ఆలయం భక్తులను మరియు పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఈ ఆలయం కలపతి అనే గ్రామం లో ఉంది.పాలక్కాడ్ పట్టణం నుండి కొన్ని కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం దక్షిణ భారతదేశం యొక్క సాంస్కృతిక చరిత్రలో దాని ప్రాముఖ్యత కారణంగా 'దక్షిణ వారణాసి' అని పిలుస్తారు.

Official Site

ఈ ఆలయాన్ని శ్రీ వెంకటనారాయణ అయ్యర్, శ్రీమతి లక్ష్మీ అమ్మాళ్

ఈ ఆలయాన్ని శ్రీ వెంకటనారాయణ అయ్యర్, శ్రీమతి లక్ష్మీ అమ్మాళ్

ఈ ఆలయాన్ని శ్రీ వెంకటనారాయణ అయ్యర్, శ్రీమతి లక్ష్మీ అమ్మాళ్ దంపతులు నిర్మించారు. శివభక్తులైన ఈ దంపతులు వారణాసి వెళ్లి శ్రీ విశ్వేశ్వర స్వామిని, శ్రీ విశాలాక్షి అమ్మవార్లను దర్శించుకుని తమ గ్రామంలో కూడా ఇలాంటి కైలాస పతి ఆలయం ఉంటే బాగుండని నిర్థారించుకున్నారు. తిరుగు ప్రయాణంలో కొన్ని శివలింగాలను, అమ్మవారిని విగ్రహాలను తమ వెంట తెచ్చారు.

వీరి స్వగ్రామమైన పాలక్కాడ్ కు 25కిలోమీటర్ల దూరంలో ఉన్న కొల్లైన్ గోడ్

వీరి స్వగ్రామమైన పాలక్కాడ్ కు 25కిలోమీటర్ల దూరంలో ఉన్న కొల్లైన్ గోడ్

వీరి స్వగ్రామమైన పాలక్కాడ్ కు 25కిలోమీటర్ల దూరంలో ఉన్న కొల్లైన్ గోడ్. ఇక్కడ ఒక అద్భుతమైన శ్రీ మహావిష్ణువు ఆలయం ఉంది. ఈ దంపతులు పాలక్కాడ్ పాలకుడైన ‘ఇత్తికంబి' వద్దకు వెళ్ళి పట్టణం పక్కగా ప్రవహించే పవిత్ర నీలా నది ఒడ్డున గంగాధరుని, అమ్మవారిని ప్రతిష్టించమని అర్ధించారు. కొంత ధనం విరాళంగా కూడా ఇచ్చారు. దైవభక్తి పరాయణుడైన రాజు ఆలయం నిర్మించడమే కాకుండా భూరి భూదానం ఆలయం నిర్వహణ నిమిత్తం సమర్పించుకున్నారు.

శాసనాన్ని ఆలయ ధ్వజస్థంభం వద్ద చూడవచ్చును.

శాసనాన్ని ఆలయ ధ్వజస్థంభం వద్ద చూడవచ్చును.

దంపతులు ఇచ్చిన ధనంతో ఒక నిధిని ఏర్పాటు చేసి దానితో ప్రధాన ఉత్సవాలను నిర్వహించమని ఆదేశించారు. ఈ శాసనాన్ని ఆలయ ధ్వజస్థంభం వద్ద చూడవచ్చును. ఇది 15వ శతాబ్దంలో జరిగి ఉండవచ్చని చరిత్ర ద్వారా తెలుస్తున్నది! ఈ శాసనకాలం 1424వ సంవత్సరం. ఈ ఆలయం గురించి పూర్తి సమాచారంను ఆంగ్లేయ చరిత్ర కారుడు రాబర్ట్ సెవల్ 1882వ సంవత్సరంలో రాసిన పుస్తకంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ పుస్తకంలో కేరళ, తమిళనాడు రాష్ట్రాలలోని ఎన్నో పురాతన ఆలయాల వివరాలున్నాయి.

PC: Prof tpms

పాలక్కాడ్ శ్రీ విశ్వనాథ స్వామి ఆలయానికి, కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయానికి

పాలక్కాడ్ శ్రీ విశ్వనాథ స్వామి ఆలయానికి, కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయానికి

పాలక్కాడ్ శ్రీ విశ్వనాథ స్వామి ఆలయానికి, కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయానికి పేరు దగ్గర నుండి కొన్ని పోలికలుండటం విశేషం. ముక్తి క్షేత్రమైన వారణాసిలో గంగా తీరంలో స్వామి కొలువు దీరారు. ఇక్కడ కాశీ నుండి తెచ్చిన లింగాన్ని నీలా నది ఒడ్డున ప్రతిష్టించారు.

ఇక్కడ పితృ దేవతలకు సద్గతులు కలగాలని

ఇక్కడ పితృ దేవతలకు సద్గతులు కలగాలని

ఇక్కడ పితృ దేవతలకు సద్గతులు కలగాలని అస్థి నిమజ్జనం, పిండ ప్రధాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. అభిషేకాలు, అర్చనలు , ఆరాధనలు నియమంగా నిర్వహిస్తారు.

టిప్పు సుల్తాన్ ఈ ప్రాంతం మీద దండయాత్ర

టిప్పు సుల్తాన్ ఈ ప్రాంతం మీద దండయాత్ర

అప్పట్లో మైసూర్ పాలకుడైన టిప్పు సుల్తాన్ ఈ ప్రాంతం మీద దండయాత్ర చేసిన సమయంలో ఈ ఆలయాన్ని ద్వంసం చేయాలనుకున్నాడు. కానీ స్థానికులు ప్రభావంతో అలా చేయలేకపోయాడట.పాలక్కాడ్ తమిళనాడు రాష్ట్ర సరిహద్దు కావడం వల్ల, చాలా కాలం తమిళనాడు రాష్ట్రంలో భాగంగా ఉండటం వల్ల గతం నుండి అక్కడ తమిళ ఆఛారవ్యవహారల ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల ఈ ఊరిలోని చాలా వరకు ఆలయాల్లో తెలుగు ఆగమాల ప్రకారం పూజా విధులు నిర్వహిస్తారు. విశ్వనాథ స్వామి ఆలయంలో కూడా అంతే.

ఈ ఆలయం చుట్టూ బ్రహ్మాణ అగ్రహారాలుంటాయి

ఈ ఆలయం చుట్టూ బ్రహ్మాణ అగ్రహారాలుంటాయి

ఈ ఆలయం చుట్టూ బ్రహ్మాణ అగ్రహారాలుంటాయి. ఈ ఆలయం రహదారి నుండి క్రిందికి విశాలమైన ప్రాంగణంలో కేరళ మరియు ద్రావిడ నిర్మాణంలో ఉంటుంది. తూర్పుముఖ ద్వారం వద్ద శ్రీ క్షిప్ర ప్రసాద మహాగణపతికి ఒక ప్రత్యేక ఆలయం నిర్మించబడినది. తొలి పూజ ఈయనకే!

ధ్వజస్థంభం, బలిపీఠాలు, నంది పీఠం ఉన్నాయి

ధ్వజస్థంభం, బలిపీఠాలు, నంది పీఠం ఉన్నాయి

ధ్వజస్థంభం, బలిపీఠాలు, నంది పీఠం ఉన్నాయి. శాసనం దాటి మండపం గుండా లోనికి వెళితే శ్రీ వినాయక, శ్రీ షణ్ముఖ మరియు విశాలాక్షీ అమ్మవార్లు విడివిడిగా తమ తమ సన్నిధులలో కొలువైఉన్నారు. గర్భాలయంలో శ్రీ కాశీ విశ్వనాథ స్వామి లింగ రూపంలో చందన, కుంకుమ విభూది లేపనాలతో రమణీయ పుష్పాలంకరణతో నయనమనోహరంగా దర్శనమిస్తారు.

Viz114


ఇక్కడ నియమానుసారంగా రోజుకి మూడు పూజలు జరుగుతాయి.

ఇక్కడ నియమానుసారంగా రోజుకి మూడు పూజలు జరుగుతాయి.

ఇక్కడ నియమానుసారంగా రోజుకి మూడు పూజలు జరుగుతాయి. ప్రదక్షిణాపథంలో అశ్వధ్ధ వృక్షం, చుట్టూ నాగ ప్రతిష్టలు కనబడుతాయి. నాగదోషంతో వివాహం కానీ యువతీ యువకులు ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అవసరమైన వారు నాగ ప్రతిష్టలు చేస్తారు.

Viz114

సమయం

సమయం

ఉదయం 5.30 తెరిచి తిరిగి మధ్యహ్నాం 12గంటలకు మూసివేస్తారు. సాయంత్రం నాలుగు గంట నుండి రాత్రి ఎనిమిది గంటల దాకా తెరిచి ఉంటుంది.

అన్ని హిందూ పర్వదినాలలో విశేష పూజలు జరపుతారు.

అన్ని హిందూ పర్వదినాలలో విశేష పూజలు జరపుతారు.

అన్ని హిందూ పర్వదినాలలో విశేష పూజలు జరపుతారు. మహాశివరాత్రి పర్వదినాన్ని ఘనంగా 5రోజుల పాటు నిర్వహిస్తారు. ఆఖరి రోజున జరిగే రథోత్సవం కేరళలోని మరే ఆలయంలోనూ అంత గొప్పగా జరగదు. లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. తప్పక చూడవల్సిన ఉత్సవం.

Viz114

కలపతి రథ ఉత్సవం

కలపతి రథ ఉత్సవం

కేరళ ప్రఖ్యాత దేవాలయ ఉత్సవములలో కలపతి రథ ఉత్సవం ఒకటి.ప్రతి సంవత్సరం ఈ రథ ఉత్సవంను నవంబర్ నెలలో జరుపుకుంటారు. రథ ఉత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. ఇక్కడ పర్యాటకుల ప్రచారం విస్తృతంగా ఉంటుంది. మజేస్తికాల్లీ గ్రామ వీధుల గుండా గీయబడిన, మరియు అందంగా అలంకరించబడిన రథాలు చాల మనోహరంగా ఉంటాయి.

Official Site

పాలక్కాడ్ చేరటానికి రైలు మరియు రోడ్డు ద్వారా మార్గాలు ఉన్నాయి

పాలక్కాడ్ చేరటానికి రైలు మరియు రోడ్డు ద్వారా మార్గాలు ఉన్నాయి

పాలక్కాడ్ చేరటానికి రైలు మరియు రోడ్డు ద్వారా మార్గాలు ఉన్నాయి.ఇక్కడి వాతావరణం వేసవి తప్ప సంవత్సరం పొడవునా ఆహ్లాదకరంగా ఉంటుంది.అరుదైన సంప్రదాయాలు, ప్రకృతి దృశ్యాలు, అరుదైన సందర్శనా స్థలాలు, ఫెస్టివల్స్ ఉండుటవల్ల దక్షిణ భారతదేశంలో ప్రయాణానికి పాలక్కాడ్ గమ్యస్థానంగా ఉన్నది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X