India
Search
  • Follow NativePlanet
Share
» »దేశంలోనే గుర్తింపు పొందిన పులుల ఆవాసం.. క‌న్హా నేష‌న‌ల్ పార్క్‌..

దేశంలోనే గుర్తింపు పొందిన పులుల ఆవాసం.. క‌న్హా నేష‌న‌ల్ పార్క్‌..

కిలోమీట‌ర్ల మేర విస్త‌రించి ఉన్న అట‌వీ ప్రాంతం. ఎటుచూసినా ఒళ్లు గ‌గుర్పాటు క‌లిగించే వ‌న్య‌మృగాల భీక‌ర శ‌బ్ధాలు. అలాంటి జంతు జాలాల నివాసాల గుండా మాన‌వ‌బృందాలు సంచ‌రిస్తే ఎలా ఉంటుంది? అలాంటి అనుభూతుల‌ను చేరువ చేస్తుంది క‌న్హా టైగ‌ర్ రిజ‌ర్వ్ పార్క్. ప‌చ్చిక‌బైళ్ల సందుల్లో దాగిన వన్య‌ప్రాణుల ఆవాసాల‌ను మ‌న‌సారా చూసి త‌రించాలంటే ద‌శాబ్దాల చ‌రిత్ర క‌లిగిన ఈ పార్క్‌లో స‌ఫారీ చేయాల్సిందే. అరుదైన పెద్ద పులుల ఆవాసంగా చెప్పుకునే ఈ నేష‌న‌ల్ పార్క్‌లో మ‌న‌ము అడుగు పెడ‌దాం ప‌దండి.

దేశంలోనే గుర్తింపు పొందిన పులుల ఆవాసం.. క‌న్హా నేష‌న‌ల్ పార్క్‌..

దేశంలోనే గుర్తింపు పొందిన పులుల ఆవాసం.. క‌న్హా నేష‌న‌ల్ పార్క్‌..

క‌న్హా టైగ‌ర్ రిజ‌ర్వ్ లేదా క‌న్హా నేష‌న‌ల్ పార్క్ అని పిలుస్తారు. ఇది భార‌త దేశంలో టైగ‌ర్ రిజ‌ర్వ్‌ల‌లో ఒక‌టి. మ‌ధ్యప్ర‌దేశ్‌లో అతి పెద్ద ఉద్యానవ‌నంగా పేరుగాంచింది. సుమారు 940 చ‌ద‌ర‌పు కిలోమీట‌రు విస్తీర్ణంలో విస్త‌రించి ఉంది. భార‌త‌దేశంలో ప్ర‌సిద్ధిగాంచిన ప‌ది ప్రాంతాల్లో క‌న్హా టైగ‌ర్ రిజ‌ర్వ్ పార్క్ స్థానం సంపాదించింది. అనేక వ‌న్య‌ప్రాణుల సంర‌క్ష‌ణ కేంద్రంగా పేరుగాంచింది. వ‌న్య‌ప్రాణుల ప్రేమికుల‌తో పాటు ప్ర‌కృతి ప్రేమికులు విహారానికి క‌న్హా టైగ‌ర్ రిజ‌ర్వ్ ఫారెస్ట్ ఓ అద్భుత‌మైన ఎంపిక‌గా చెప్పొచ్చు. కిలోమీట‌ర్ల మేర విస్త‌రించి ఉండ‌డం వ‌ల్ల సందర్శ‌కులు అక్క‌డి విశేషాల‌ను తెలుసుకునేందుకు ప్ర‌త్యేక మ్యూజియ‌మ్ ఏర్పాటు చేశారు. ఈ మ్యూజియంలో వ‌న్య‌ప్రాణుల సంర‌క్ష‌ణ‌, దాని ప్రాధాన్య‌తతో పాటు వాటి చ‌రిత్ర‌ను తెలుసుకోవ‌చ్చు. అరుదైన జంతుజాలం చిత్రాల‌ను ఈ మ్యూజియంలో ప్ర‌ద‌ర్శ‌న‌కు ఉంచారు. స్టాన్లీ బ్రీడెన్‌, బెలిండా రైట్ 1980లో నేష‌న‌ల్ జియోగ్రాఫిక్ ఫిల్మ్ ల్యాండ్ ఆఫ్ ది టైగ‌ర్స్ ని ఇక్క‌డ చిత్రీక‌రించారు. వెయ్యి ర‌కాల కంటే ఎక్కువ అరుదైన మొక్క‌ల‌ను ఈ అట‌వీ ప్రాంతంలో గుర్తించారు. వివిధ జాతుల ఔష‌ధ గుణాలు ఉన్న గ‌డ్డి ర‌కాలు ఇక్క‌డ అందుబాటులో ఉన్నాయి.

జంగిల్ స‌ఫారీ

జంగిల్ స‌ఫారీ

క‌న్హా టైగ‌ర్ రిజ‌ర్వ్ ఫారెస్ట్‌లో జంగిల్ స‌ఫారీ ఎంతో ప్ర‌త్యేక‌త చాటుకుంది. క్రూర‌మృగాల‌ను సైతం ద‌గ్గ‌ర‌గా చూసే అవ‌కాశం ఇక్క‌డ ఉంది. ఆ అనుభ‌వాల‌ను మాట‌ల్లో చెప్ప‌డం కాస్త క‌ష్ట‌మే. రాయ‌ల్ బెంగాలీ టైగ‌ర్, భార‌తీయ చిరుత‌పులి, అడ‌వికుక్క‌లతో పాటు అనేక జంతువుల‌ను చూసేందుకు అవ‌కాశం ఉంది. ప‌ర్యాట‌కులు ఆ ఆపురూప చిత్రాల‌ను త‌మ కెమెరాల్లో బంధిస్తూ క‌నబ‌డ‌తారు. ఇక్క‌డ స‌ఫారీలు రెండుర‌కాలుగా ఉన్నాయి. ఒక‌టి. జీప్ స‌పారీ, రెండు. ఏనుగు స‌ఫారీ. సంద‌ర్శ‌కుల తాకిడిని బ‌ట్టి స‌ఫారీ ధ‌ర‌లు మారుతూ ఉంటాయి. ప‌చ్చ‌ని ప్ర‌కృతి ఒడిలో ఏనుగుపై స‌ఫారీ చేస్తుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. స్థానిక పార్క్ అధికారులు నియ‌మించిన అనుభ‌వజ్క్షులైన ప‌ర్య‌వేక్షకులు నిరంత‌రం సంద‌ర్శ‌కుల‌కు అందుబాటులో ఉంటారు.

ఎలా చేరుకోవాలి?

ఎలా చేరుకోవాలి?

క‌న్హా నేష‌న‌ల్ పార్క్ చేరుకునేందుకు జ‌బ‌ల్‌పూర్ ఎయిర్‌పోర్ట్ 160 కిలోమీట‌ర్లు, రాయ్‌పూర్ ఎయిర్‌పోర్ట్ 250 కిలోమీట‌ర్లు, నాగ్‌పూర్ ఎయిర్‌పోర్ట్ 300 కిలోమీట‌ర్ల దూరంలో ఉంది. రైలు మార్గంలో అయితే, గొండియా రైల్వేస్టేష‌న్ 145 కిలోమీట‌ర్ల దూరంలో ఉంది. జ‌బ‌ల్‌పూర్ రైల్వేస్టేష‌న్ 160 కిలోమీట‌ర్ల దూరంలో ఉంది. రోడ్డు మార్గం ద్వారా అయితే మ‌హారాష్ట్ర, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, ఛ‌త్తీస్‌ఘ‌డ్ ప్ర‌ధాన గ‌మ్య‌స్థానాల నుండి ప్ర‌యాణ సౌక‌ర్యం ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X