Search
  • Follow NativePlanet
Share
» »కన్నౌజ్ - భారత 'పెర్ఫ్యూమ్' రాజధాని !

కన్నౌజ్ - భారత 'పెర్ఫ్యూమ్' రాజధాని !

By Mohammad

పెర్ఫ్యూమ్ దీనినే ఉర్దూలో 'అత్తర్' అని పిలుస్తారు. రాజుల కాలం నుండి సంప్రదాయంగా కొనసాగుతూ వస్తున్న అత్తర్ యొక్క పరిమళం మనస్సుకు ఎంతో హాయిని ఇస్తుంది. ఎంత ఎక్కువ కాలం భద్రపరిస్తే అది (అత్తర్) మరింత ఘాటుగా మారి సువాసనలను వెదజల్లుతుంది. పెళ్ళిళ్ళల్లో సాధారణంగా అత్తర్ ను వాడుతుంటారు.

ముస్లీంలకైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు ప్రతి ముస్లీం ఇంట్లో అత్తర్ తప్పకుండా ఉండాల్సిందే. శుభకార్యాలకు, పండుగలకు, నమాజ్( ప్రార్థనలు) కు వెళ్ళేటప్పుడు ఇలా ప్రతి సందర్భంలోనూ అత్తర్ ను విరివిగా వాడుతుంటారు. బహుశా ... ! ఇంతగా వీరు తప్ప అంతగా మరెవరూ వాడరేమో ..! అత్తర్ వేసుకొని రోడ్డు మీద ప్రయాణిస్తే ఆ గుబాళింపులు చుట్టుపక్కల గుప్పుగుప్పు మంటాయి. అదే ఊరంతా అత్తరైతే ...! ఇంకేముంది ఊరు మొత్తం సువాసనలే సువాసనలు.

ఉత్తర ప్రదేశ్ నడిబొడ్డున గల 'కన్నౌజ్' అనే చిన్న పట్టణం అత్తర్ లకు పేరుగాంచినది. ఇక్కడ రకరకాల ఫ్లేవర్ లలో అత్తర్ లను తయారు చేస్తారు. అందుకే ఇది భారత దేశపు 'అత్తర్ రాజధాని' గా రాజుల కాలం నుండి (హర్షవర్ధనుడు, అక్బర్) కొనసాగుతూ వస్తుంది. ఆలస్యం చేయకుండా త్వరగా అత్తర్ సువాసనల పరిమళాలను పీల్చుదాం పదండి ..!

ఇది కూడా చదవండి : లక్నోలో లక్కీగా ఒక్క రౌండ్ !

కన్నౌజ్

కన్నౌజ్

కన్నౌజ్ పట్టణ పొలిమేరల్లోకి వెళ్ళివెళ్ళగానే ముందుగా మట్టివాసన మనల్ని చుట్టుముట్టుతుంది. కొద్ది దూరం ముందుకు వెళ్ళాక గతం తాలూకూ చందనోత్సవాల స్మృతుల పరిమళాలు కప్పేస్తాయి. ఇంకా రోడ్డుకి కాస్త దూరం వెళితే గులాబి తోటలు, మల్లెపూల తోటలు గతం తాలూకూ జ్ఞాపకాలను మళ్ళిమళ్ళి గుర్తుకుతెస్తాయి.

చిత్ర కృప : Aaron Warren Follow

అతి పురాతన పట్టణం

అతి పురాతన పట్టణం

నిజానికి కన్నౌజ్ అతి పురాతన పట్టణం. గంగా, కాళీ నదుల సంగమ ప్రదేశంలో ఉంటుంది. క్రీ.శ. 600 సంవత్సరాలప్పటి మాట ..! అప్పుడు వర్థన వంశానికి చెందిన చక్రవర్తి హర్షవర్ధనుడు కన్నౌజ్ ను రాజధానిగా చేసుకొని పరిపాలించేవాడు.

చిత్ర కృప : Manfred Sommer

అతి పురాతన పట్టణం

అతి పురాతన పట్టణం

హర్షవర్ధనుడి కి పెర్ఫ్యూమ్ లన్నా , సువాసనలు వెదజల్లే ఆయింట్మెంట్ లన్నా మహా మోజు. సువాసనల అత్తర్ ల తయారీని ప్రోత్సహించేవాడు, రాయితీలు ఇచ్చేవాడు. తన రాజ్యానికి విచ్చేసిన విదేశీయులకు, ఇతర రాజ్యాలకు చెందిన ప్రముఖులకు అత్తర్ లను బహుమతులుగా ఇచ్చేవాడట ..! దాంతో ఈ పట్టణం ప్రాచూర్యం చెందినది.

చిత్ర కృప : Hafiz Issadeen

అక్బర్ కూడా

అక్బర్ కూడా

అక్బర్ చక్రవర్తి తన హయాంలో కూడా అత్తర్ లు, సబ్బులు, అగర్బత్తీలకు సంభందించిన ప్రత్యేక కుటీర పరిశ్రమలను కన్నౌజ్ లో ప్రోత్సహించేవాడు. తనకు తాను పెర్ఫ్యూమ్, బంగారం, వెండి, కస్తూరి, ముడి సిల్క్ లతో తులాభారం తూగేవాడని ఐన్ - ఇ - అక్బర్ అనే గ్రంధం లో పేర్కొన్నారు.

చిత్ర కృప : Chandrasekhar Kornepati

సంప్రదాయ పెర్ఫ్యూమ్ తయారీ !

సంప్రదాయ పెర్ఫ్యూమ్ తయారీ !

కన్నౌజ్ లో 650 కు పైగా పెర్ఫ్యూమ్ తయారీ కేంద్రాలు (పెర్ఫ్యూమ్ హౌస్ ) లు ఉన్నాయి. 'డిగ్స్' అని పిలవబడే రాగి దెగిశాల్లో అత్తర్ లను ఉడికిస్తారు. ఆ తరువాత చెట్టు బెరడ్లు, పూలు, చెక్కల నుండి తీసిన చందనం, మూల నూనె లతో కలుపుతారు.

చిత్ర కృప : scrolleditorial

ఖరీదు వేలల్లో !

ఖరీదు వేలల్లో !

తయారయ్యే ప్రదేశం కదా అని తక్కువగా దొరుకుతాయి లే అనుకుంటే పొరబడి నట్లే ..! 100 గ్రాముల ఆర్గానిక్ మస్క్, రోజ్ లేదా హీనా అత్తర్ విలువ 12 వేల నుండి 15 వేల వరకు ఉంటుంది. రసాయనాల్ని వాడి తయారుచేసే అత్తర్ లు 500 నుండి 1100 వరకు పలుకుతాయి. దహనల్ ఊద్ అత్తర్ తులానికి 2 నుండి 6 వేల ధర పలుకుతుంది.

చిత్ర కృప : Stacey Price

షాపింగ్

షాపింగ్

కన్నౌజ్ లో కేవలం అత్తర్ దుకాణాల సందడే కాదు, సీసాల తయారీ దారులు, పూలు అమ్మేవారి గోల అంతా ఇంతా కాదు. సీసాలు కూడా చాలా అందంగా ఉంటాయి. సువాసనలు వెదజల్లే అ సీసాలలో ఏది కొనుక్కోవాలో కష్టమైనా పనే ..! ఇక్కడి విజయ్ మార్కెట్ లోని అత్తర్ లు కొనకుండా పోతే మీ పర్యటన పూర్తి కాదు.

చిత్ర కృప : Tomas Barrios

రోజ్ లస్సీ .. !

రోజ్ లస్సీ .. !

పరిమళాలను వెదజల్లే కన్నౌజ్ లో స్ట్రీట్ ఫుడ్ రుచికరంగా ఉంటుంది. ఘుమఘుమలకు ఏమాత్రం తీసిపోదు. ఇక్కడ రోజ్ వాటర్ వేసి కలిపిన లస్సి తాగాల్సిందే ..!

చిత్ర కృప : Manuela Zangara

స్మారకాలు

స్మారకాలు

కాస్త పెర్ఫ్యూమ్ సువాసనల నుండి బయటికి వస్తే, ఈ ప్రదేశానికి కూత వేటు దూరంలో రెండు సమాధులు కనిపిస్తాయి. అందులో ఒకటేమో ఇబ్రహీం షా నిర్మిస్తే, మరొకదానిని స్థానిక మతపెద్ద స్మారకంగా నిర్మించారు.

చిత్ర కృప : Manfred Sommer

గౌరీ శంకర్ దేవాలయం

గౌరీ శంకర్ దేవాలయం

బాలాపీర్ గా ప్రసిద్ధి గాంచిన ఈ ప్రదేశం లోని కట్టడాల లోపల అందమైన చిత్రాలు కనిపిస్తాయి. ప్రతి వీధిలోనూ పెద్ద పెద్ద భవంతులు, దేవాలయాలు కనిపిస్తాయి. అందులో ప్రధానమైంది గౌరీ శంకర్ దేవాలయం.

చిత్ర కృప : Atul Bais

సిద్దేశ్వర్ ఆలయం

సిద్దేశ్వర్ ఆలయం

గంగానదీ తీరాన వెలసిన ఆలయం సిద్దేశ్వర్ ఆలయం ఈ ఆలయం 500 సంవత్సరాల క్రితం నాటిది. పవిత్ర పర్వదినాల్లో భక్తులు నదిలో స్నానం చేసి దైవదర్శనం చేసుకుంటారు.

చిత్ర కృప : rajan171

కన్నౌజ్ లో ఏమి చూడాలి ?

కన్నౌజ్ లో ఏమి చూడాలి ?

కాన్పూర్ కు 3 గంటల ప్రయాణం లో, లక్నో కు 4 గంటల ప్రయాణంలో ఉండే కన్నౌజ్ లో సంప్రదాయ పెర్ఫ్యూమ్ హౌస్ లను, దాని తయారీని తప్పక చూసి తీరాలి. పురావస్తు మ్యూజియం కూడా ఇక్కడ చూడదగినదే. అంతే కాదు సమయముంటే 20 కి. మీ . దూరంలో ఉన్న లాఖ్ బహోసి బర్డ్ సంరక్షణాలయం కూడా చూడవలసిందే ..!

చిత్ర కృప : Debojit Deb

కన్నౌజ్ ఎలా చేరుకోవాలి ?

కన్నౌజ్ ఎలా చేరుకోవాలి ?

సమీప విమానాశ్రయం - కాన్పూర్ విమానాశ్రయం (76 కి.మీ), లక్నో విమానాశ్రయం (103 కి.మీ).

సమీప రైల్వే స్టేషన్ - కన్నౌజ్ రైల్వే స్టేషన్. దేశంలోని అన్ని ప్రధాన నగరాలతో ఈ స్టేషన్ చక్కగా అనుసంధానించబడింది. సమీపంలోనే కాన్పూర్ పెద్ద జంక్షన్ గా కూడా ఉంది.

రోడ్డు లేదా బస్సు మార్గం - కన్నౌజ్ కి హర్దొయ్ (46 కి.మీ) , ఫరూఖాబాద్ (54 కి.మీ) నుండి నిత్యం బస్సులు తిరుగుతుంటాయి. లక్నో, కాన్పూర్ నుండి కూడా ప్రవేట్ / ప్రభుత్వ బస్సు సౌకర్యం లభిస్తుంది.

చిత్ర కృప : Deependra Solanky

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more