Search
  • Follow NativePlanet
Share
» » పార్వతీ దేవి నెమలి రూపంలో శివుడి గురించి తపస్సు చేసిన చోటు సందర్శిస్తే అన్నింటా విజయమే

పార్వతీ దేవి నెమలి రూపంలో శివుడి గురించి తపస్సు చేసిన చోటు సందర్శిస్తే అన్నింటా విజయమే

చెన్నై మైలాపూర్ లో ఉన్న కపాలీశ్వర్ దేవాలయం గురించి కథనం.

లయకారకుడైన పరమశివుడికి శ్రావణ మాసం అత్యంత ప్రీతిపాత్రమైనది. దీంతో ఈ నెల రోజుల పాటు శైవ భక్తులు ఆ పరమేశ్వరుడు కొలువై ఉన్న పుణ్యక్షేత్రాల సందర్శనం చేసుకోవడం పరమపవిత్రంగా భావిస్తారు. అటువంటి పుణ్యక్షేత్రాల్లో విశిష్టమైనదే మైలాపూర్ ప్రాంతంలో ఉన్న కపాలీశ్వర్ దేవాలయం. చెన్నైలోని ఈ మైలాపూర్ లోని కపాలీశ్వర్ దేవాలయం పురాణ ప్రాధాన్యత కలిగినది. ఇక్కడ పార్వతీ దేవి, బ్రహ్మ, సుబ్రహ్మణ్యస్వామితో పాటు నాలుగు వేదాలతో ముడిపడిన ఎన్నో కథనాలు ఉన్నాయి. వాటితో పాటు ఈ ఆలయ విశేషాలు మీ కోసం...

మైలాపూర్, చెన్నై

మైలాపూర్, చెన్నై

P.C: You Tube

తమిళభాషలో మైలైయే కైలై...కైలైయే మైలై అనే సామెత ఉంది. అంటే మైలాపూరే కైలాసము-కైలాసమే మైలాపూర్ అని అర్థం. అంటే మైలాపూర్ దర్శనం వల్ల కైలాసాన్ని దర్శించుకొన్న పుణ్యం లభిస్తుందని అర్థం.

మైలాపూర్, చెన్నై

మైలాపూర్, చెన్నై

P.C: You Tube

ఈ మైలాపూర్ కు సంబంధించి అనేక పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. పరమశివుడు పార్వతీ దేవికి న మ: శి వా య అనే పంచాక్షరీ మంత్రంతో పాటు విభూతి ధారణ వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ ఉంటాడు.

మైలాపూర్, చెన్నై

మైలాపూర్, చెన్నై

P.C: You Tube

ఆ సమయంలో పార్వతి దేవి లిప్త కాలం తన దగ్గరగా వచ్చిన నెమలి పట్ల ఆకర్షితురాలవుతుంది. దీంతో పరమశివుడు కోపగించుకొని పార్వతీ దేవిని నెమలిగా మారిపోవాలని శాపం పెడుతాడు. అటు పై కోపం తగ్గిన తర్వాత పార్వతీ దేవికి శాప విమోచన రహస్యం కూడా చెబుతాడు.

మైలాపూర్, చెన్నై

మైలాపూర్, చెన్నై

P.C: You Tube

దాని ప్రకారం పార్వతీ దేవి ప్రస్తుతం మైలాపురం ఉన్న చోట నెమలి రూపంలోనే వెయ్యేళ్లు తపస్సు చేస్తుంది. పార్వతి దేవి నెమలి రూపంలో తపస్సు చేసిన ప్రాంతము కాబట్టే దీనికి మైలాపూర్ అని పేరు వచ్చినట్లు చెబుతారు.

మైలాపూర్, చెన్నై

మైలాపూర్, చెన్నై

P.C: You Tube

తమిళంలో మైలు అంటే నెమలి అని అర్థం. అదే విధంగా ఒకసారి శుక్రాచార్యుడు తాను పోగొట్టుకున్న ఒక కన్నును తిరిగి పొందడానికి ఇక్కడే శివుడి గురించి తప్పస్సు చేశాడని చెబుతారు. అందువల్లే మైలాపూర్ కు శుక్రపురి అని పేరు.

మైలాపూర్, చెన్నై

మైలాపూర్, చెన్నై

P.C: You Tube

నాలుగు వేదాలు ఆ పరమశివుడి ఇక్కడే అర్చించాయి. అందువల్లే ఈ మైలాపూర్ కు వేదపురి అని కూడా పేరు. ఈ మైలాపూర్ లోనే సుబ్రహ్మణ్యస్వామి తన ఆయుధమైన శక్తి వేల్ ను పార్వతి దేవి నుంచి పొందారని చెబుతారు.

మైలాపూర్, చెన్నై

మైలాపూర్, చెన్నై

P.C: You Tube

అందుల్లే ఇక్కడికి వెలితే అన్నింటా విజయం సంభవిస్తుందని చెబుతారు. ఇదిలా ఉండగా ఇక్కడ ఉన్న పరమేశ్వరుడిని కపాలీశ్వర్ అని పిలవడం వెనుక కూడా ఒక పురాణ కథ దాగిఉంది. దాని ప్రకారం ఒకసారి కైలాసంలో త్రిమూర్తుల ఆధ్వర్యంలో ఒక చర్చ జరుగుతూ ఉంటుంది

మైలాపూర్, చెన్నై

మైలాపూర్, చెన్నై

P.C: You Tube

ఆ చర్చలో బ్రహ్మ శివుడి పట్ల అహంకారంతో ప్రవర్తించి నిందిస్తాడు. దీంతో కోపగించుకొన్న పరమశివుడు ఆ బ్రహ్మ తలలో ఒక తలను నరికేస్తాడు. దీంతో బ్రహ్మ తన తప్పును తెలుసుకొని పాపపరిహారం సూచించమని అడుగుతాడు.

మైలాపూర్, చెన్నై

మైలాపూర్, చెన్నై

P.C: You Tube

మైలాపూర్ ప్రాంతంలో శివలింగాన్ని ప్రతిష్టించి పూజించాల్సిందిగా సూచిస్తాడు. దీని ప్రకారం బ్రహ్మ మైలాపూర్ కు వచ్చి అక్కడ శివలింగాన్ని ప్రతిష్టించి పూజిస్తాడు. అటు పై బ్రహ్మకు తన తల తిరిగి వస్తుంది. బ్రహ్మ తలను (కపాళం) తిరిగి ఇప్పించాడు కాబట్టే ఇక్కడి పరమశివుడిని కపాలీశ్వర్ అని అంటారు.

మైలాపూర్, చెన్నై

మైలాపూర్, చెన్నై

P.C: You Tube

మైలాపూర్ లో పరమశివుడు కపాలీశ్వర్ గా లింగ రూపంలో పూజలు అందుకొంటూ ఉంటే పార్వతీ దేవి కర్పాంగల్ పేరుతో భక్తులకు దర్శనమిస్తుంది. అంటే కోరిన కోర్కెలు తీర్చే చెట్టు అని అర్థం.

మైలాపూర్, చెన్నై

మైలాపూర్, చెన్నై

P.C: You Tube

ద్రావిడ శైలిలో నిర్మితమైన ఈ దేవాలయం భారతీయ వాస్తు శైలి దేవాలయానికి ప్రత్యక్ష ఉదాహరణ. ఈ దేవాలయాన్ని ఏడో శతాబ్దంలో నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ దేవాలయంలో కపాలీశ్వర్, కర్పాంగల్ కు వేర్వేదు దేవాలయాలు ఉండటం విశేషం.

మైలాపూర్, చెన్నై

మైలాపూర్, చెన్నై

P.C: You Tube

అంతేకాకుండా దేవాలయం ప్రాంగణంలో విష్ణువు, బ్రహ్మ, లక్ష్మీ, గణపతి, కుమారస్వామి తదితర దేవుళ్లకు కూడా వేర్వేరు ఉపాలయాలు ఉన్నాయి. భారత దేశంలో ఎతైన గోపురాలు కలిగిన దేవాలయాల్లో కపాలీశ్వర దేవాలయం కూడా ఒకటి.

మైలాపూర్, చెన్నై

మైలాపూర్, చెన్నై

P.C: You Tube

ఇక ఈ దేవాలయం రెండు గోపురాలను కలిగి ఉంటుంది. తూర్పు వైపున ఉన్న గోపురం 40 మీటర్ల ఎత్తు ఉంటే పశ్చిమ వైపున ఉన్న గోపురం దాని కంటే కొంత తక్కువ ఎత్తులో ఉంటుంది. ఈ గోపురాల పై ఉన్న శిల్పాలు చూడముచ్చటగా ఉంటాయి.

మైలాపూర్, చెన్నై

మైలాపూర్, చెన్నై

P.C: You Tube

ఈ దేవాలయం ఉదయం 5.30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ తెరిచే ఉంటుది. మధ్యలో మధ్యాహ్నం కొద్ది సేపు మూసివేస్తారు. ప్రతి రోజూ ఆరు ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. ఏడాది మొత్తం అనేక ప్రత్యేక ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి.

మైలాపూర్, చెన్నై

మైలాపూర్, చెన్నై

P.C: You Tube

అయితే మార్చి -ఏప్రిల్ మధ్య కాలంలో తొమ్మిది రోజుల పాటు నిర్వహించే వసంత ఉత్సవం, బ్రహోత్సవాలకు దేశ విదేశాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు. చెన్నై బస్, రైల్వే స్టేషన్ నుంచి మైలాపూర్ కు అనేక ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు, ఆటోలు నిత్యం అందుబాటులో ఉంటాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X