Search
  • Follow NativePlanet
Share
» »శ్రావణ మాసంలో తిరుపతిలో శ్రీవారితో పాటు ఇక్కడి ఈశ్వరుడినీ సందర్శిస్తే...

శ్రావణ మాసంలో తిరుపతిలో శ్రీవారితో పాటు ఇక్కడి ఈశ్వరుడినీ సందర్శిస్తే...

కపిల తీర్థానికి సంబంధించిన కథనం.

తిరుపతి భారత దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత ఉన్నతమైన వైష్ణవ క్షేత్రమని తెలుసు. ఇక్కడ శ్రీవారి ఉత్సవాలు నిత్యం ఏదో ఒక రూపంలో జరుగుతూనే ఉంటాయి. వీటిని సందర్శించడానికి లక్షల సంఖ్యలో ప్రజలు వస్తూ ఉంటారు. అయితే అదే సమయంలో శివుడికి ఇష్టమైన శ్రావణ మాసంలో ఈ వైష్ణవ క్షేత్రంలోని ఓ పుష్కరిణిలో స్నానం చేసి పాపాలను పోగొట్టుకోవాలని చాలా మంది భక్తులు భావిస్తుంటారు. ఇందు కోసం సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడకు చేరుకొంటారు. అన్నట్టు అ శైవ దేవాలయం పక్కనే మనోహరమైన జలపాతం కూడా మనకు కనిపిస్తుంది. శ్రావణమాసం సందర్భంగా ఆ శైవ క్షేత్రానికి సంబంధించిన కథనం మీ కోసం.

శ్రావణ మాసంలో కపిల తీర్థం

శ్రావణ మాసంలో కపిల తీర్థం

P.C: You Tube

ప్రపంచ ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం తిరుమల, తిరుపతి. ఇక్కడ శ్రీవారి ఆలయంతో పాటు గోవిందరాజస్వామి ఆలయం, కోదండరామస్వామి ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయాలన్నీ వైష్ణవాలయాలే. అందువల్లే ఎక్కువ మంది వైష్ణవులు ఈ క్షేత్రాన్ని సందర్శిస్తూ ఉంటారు.

శ్రావణ మాసంలో కపిల తీర్థం

శ్రావణ మాసంలో కపిల తీర్థం

P.C: You Tube

గొప్ప వైష్ణవ క్షేత్రమైన తిరుపతిలో ఓ శైవ క్షేత్రం కూడా ఉంది. అదే కపిలతీర్థం. తిరుపతికి ఉత్తరంగ, తిరుపతి కొండలకు ఆనుకొని అలిపిరి దిగువకు వెలితే మనోహరమైన ఈ తీర్థం మనకు కనిపిస్తుంది. ఇది చూడటానికి మనోహరంగా ఉండటమే కాకుండా పరమ పవిత్రమైన జలపాతంగా భావిస్తారు.

శ్రావణ మాసంలో కపిల తీర్థం

శ్రావణ మాసంలో కపిల తీర్థం

P.C: You Tube

ముఖ్యంగా వర్షాలు బాగాపడే వర్షాకాలంలో ఇక్కడకు వస్తే ప్రప్రకృతి సుందర జలపాత దృశ్యాలు ముగ్ధ మనోహరంగా కనబడుతుంది. అందువల్ల ఈ క్షేత్రాన్ని అటు ఆధ్యాత్మికత పరంగానే కాకుండా మానసిక ఉల్లాసం కోసం కూడా సందర్శించేవారూ పర్యాటకుల్లో ఉంటారు.

శ్రావణ మాసంలో కపిల తీర్థం

శ్రావణ మాసంలో కపిల తీర్థం

P.C: You Tube

ఇది శైవ క్షేత్రం. కృతయుగంలో కపిల మహర్షి ఇక్కడ ఈశ్వరుడి కోసం ఘోర తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు పాతాళం నుంచి భూమిని చీల్చుకుని ఇక్కడ లింగ రూపంలో వెలిశాడని చెబుతారు.

శ్రావణ మాసంలో కపిల తీర్థం

శ్రావణ మాసంలో కపిల తీర్థం

P.C: You Tube

కపిలముని తపస్సు కారణంగా ఇక్కడ ఈశ్వరుడు కొలువై ఉన్నాడు కాబట్టి ఆయన్ను కపిలేశ్వరుడుని పిలుస్తారు. ఇక్కడి లింగాన్ని కూడా కపిల లింగమని అంటారు. అంటే ఈ శివలింగం వేల ఏళ్ల నాటిదని అర్థమవుతోంది.

శ్రావణ మాసంలో కపిల తీర్థం

శ్రావణ మాసంలో కపిల తీర్థం

P.C: You Tube

ఆ తర్వాత త్రేతాయుగంలో అగ్ని దేవుడు ఈ క్షేత్రంలో ముక్కంటిని పూజించారు. అందువల్ల ఈ క్షేత్రంలోని కపిలేశ్వరుడిని ఆగ్నేయలింగమని కూడా పిలుస్తారు. అంతే కాకుండా స్వయంభువు అయిన ఈ శివలింగాన్ని ఎంతో మంది దేవతలు, మునులు కూడా సందర్శించారు.

శ్రావణ మాసంలో కపిల తీర్థం

శ్రావణ మాసంలో కపిల తీర్థం

P.C: You Tube

ఇక్కడ కపిలేశ్వరుడు కామాక్షి అమ్మవారి సమేతంగా కొలువై ఉన్నాడు. ఇక్కడి కొండల నుంచి గలగలా పారుతూ 20 అడుగుల ఎత్తు నుంచి ఆలయ పుష్కరిణిలోకి ఆకాశగంగ దూకుతుంది. సాక్షాత్తు గంగమ్మ తల్లి కైలాసం నుంచి ఇక్కడకు తరలి వస్తుందని భక్తుల నమ్మకం.

శ్రావణ మాసంలో కపిల తీర్థం

శ్రావణ మాసంలో కపిల తీర్థం

P.C: You Tube

ఈ పుష్కరిణినే కపిల తీర్థం అని అంటారు. దీనిని శైవులు కపిల తీర్థమని అంటారు. శివుడికి ఇష్టమైన ఈ మాసంలో ఈ తీర్థంలో స్నానం చేస్తే సమస్త పాపాలు పోతాయని చెబుతారు. అందువల్లే ఈ క్షేత్రాన్ని శ్రావణ మాసంలో ఎక్కువ మంది సందర్శిస్తూ ఉంటారు.

శ్రావణ మాసంలో కపిల తీర్థం

శ్రావణ మాసంలో కపిల తీర్థం

P.C: You Tube

వైష్ణవులకు కూడా ఈ తీర్థాన్ని ఆళ్వార్ తీర్థమని పిలుస్తారు. అదే విధంగా ఈ పుష్కరిణి చుట్టూ నాలుగు మూలల్లో నాలుగు సుదర్శన రాతిశిలలను స్థాపించారు. అందువల్ల దీనిని చక్రతీర్థమని కూడా పిలుస్తారు. అందువల్లే ఇక్కడ స్నానాలు చేయడానికి హిందువులు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు.

శ్రావణ మాసంలో కపిల తీర్థం

శ్రావణ మాసంలో కపిల తీర్థం

P.C: You Tube

11వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన మొదటి రాజేంద్రచోళుని కాలంలో ఆ ఆలయ నిర్మాణం జరిగిందని చారిత్రాత్మక ఆధారలను బట్టి తెలుస్తోంది. చోళులు శివ భక్తులు కావడంతో ఈ ఆలయాన్ని అత్యంత భక్తి శ్రద్దలతో నిర్మించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X