Search
  • Follow NativePlanet
Share
» » కర్నాటక పర్యాటక ప్రదేశాలు - అన్ని కాలాలకు !

కర్నాటక పర్యాటక ప్రదేశాలు - అన్ని కాలాలకు !

కర్నాటక లో అన్ని కాలలోను సందర్శించ దాగిన ప్రదేశాలు కొన్ని కలవు. ఈ ప్రదేశాలలోని ప్రశాంతతకు, ఆహ్లాదకర వాతావరణానికి సంవత్సరంలో ఎపుడైనా సరే వెళ్లి ఆనందించ వచ్చు.

అటువంటి ప్రదేశాలలో కొన్నిటిని మీ పర్యటనకు గాను ఇక్కడ పొందుపరుస్తున్నాము. చిత్ర సహితంగా పరిశీలించండి. ఇవ్వబడే ఈ పర్యాతక్క ప్రదేశాలు, అన్ని వయసుల వారికి ఆనందం కలిగిస్తాయి.

బెంగుళూరు హోటల్ వసతులకు క్లిక్ చేయండి

బండి పూర్

బండి పూర్

బండి పూర్ కాబిని నది తీరంలో కల ఒక అరణ్య ప్రదేశం. ఈ అరణ్య ప్రాంతం అనేక వన్య జీవులు కు నిలయంగా వుంటుంది.

బండి పూర్

బండి పూర్

పులులు, అడవి ఎద్దు, లేడి, అడవి ఏనుగులు, అడవి ఎలుగు బంతి, నక్క వంటివి ఎన్నిటినో చూడవచ్చు.

బండి పూర్

బండి పూర్

బండి పూర్ ఫారెస్ట్ రిజర్వు ఇండియా లో ప్రసిద్ధ టైగర్ రిజర్వు. శాండల్ వుడ్, రోజ్ వుడ్, టేకు చెట్లు ఇక్కడి వన్య జీవులకు నివాస ప్రదేశాలు. ఇవి వాటి సహజ నిలయాలు.

బన్నెర ఘట్ట

బన్నెర ఘట్ట

బన్నెర ఘట్ట నేషనల్ పార్క్ లో ప్రధాన ఆకర్షణ అక్కడ కల పులులు. ఇండియా లో కొన్ని ప్రదేశాలలో మాత్రమే సింహాలను వాటి సహజ ప్రదేశాలలో చూడగలరు.

బన్నెర ఘట్ట

బన్నెర ఘట్ట

వాటిలో బంనేరఘట్ట నేషనల్ పార్క్ ఒకటి. ఇక్కడ అరణ్య శాఖ లయన్ మరియు టైగర్ సఫారీలు లేదా గ్రాండ్ సఫారి నిర్వహిస్తుంది. ఈ సఫారిలో మీరు అనేక ఇతర జంతువులను కూడా చూడవచ్చు.

చిక్క మగళూర్

చిక్క మగళూర్

చిక్క మగళూర్ అంటే చిన్న కుమార్తె ఊరు అని అర్ధం. చిక్క మగళూర్ టవున్ ఎంతో ప్రశాంతంగా వుండి పూర్తి విశ్రాన్తినిస్తుంది.

చిక్క మగళూర్

చిక్క మగళూర్

చుట్ట పట్ల ప్రదేశాలు అనేక సుందర దృశ్యాలు కలిగి వుంటాయి. కొండ ప్రాంతాలు, మైదాన ప్రాంతాలు అనేకం ఈ మల్నాడ్ ప్రాంతంలో కలవు. ఈ జిల్లాలో అనేక కాఫీ ఎస్టేట్ లు కలవు. అందుకనే దీనిని కర్నాటక రాష్ట్ర కాఫీ రాజధాని అంటారు.

ధర్మస్థల

ధర్మస్థల

ధర్మస్థల ఒక యాత్రా స్థలం. పడమటి కనుమల ఒడిలో నేత్రావతి నదీ తీరాన కలదు. ఈ ప్రదేశానికి మత పర ప్రాధాన్యతే కాక చారిత్రక ప్రాధాన్యత కూడా కలదు.

ధర్మస్థల

ధర్మస్థల

ధర్మస్థల లో మంజునాధే స్వర దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందినది. ఈ దేవాలయంలో శివుడు ప్రధాన దైవం. శివుడి లింగం బంగారుతో చేయబడినది.

ధర్మస్థల

ధర్మస్థల

ధర్మస్థల లో కల ఒక చిన్న కొండపై జైన మతస్తుల మందిరం కూడా కలదు.

గాలి బోర్

గాలి బోర్

గాలి బోర్ ఒక ప్రసిద్ధ ఫిషింగ్ క్రీడల మరియు ప్రకృతి దృశ్యాల నివాసం. ఇది కావేరి నదీ తీరంలో కలదు.

గాలి బోర్

గాలి బోర్

ఈ ప్రాంతంలో అనేక పచ్చట దట్టమైన వృక్షాలు కలవు. చుట్టూ కొండల శ్రేణులు. గాలిబోర్ ప్రదేశం దట్టమైన పచ్చదనం కలిగి వుంటుంది.

గాలి బోర్

గాలి బోర్

ప్రకృతి ప్రియులు, సాహస క్రీడల ఉత్సాహవంతులు ఈ ప్రదేశానికి తరచుగా వస్తారు. ఇక్కడ అధికంగా ఫిషింగ్ చేస్తారు.

ఘటి సుబ్రమణ్య

ఘటి సుబ్రమణ్య

ఘటి సుబ్రమణ్య దేవాలయం బెంగుళూరు సమీపంలోని దోడ్డ బల్లాపూర్ లో కలదు. ఇది ఒక ప్రసిద్ధ యాత్రా స్థలం. ప్రతి నిత్యం వేలాది భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు.

ఘటి సుబ్రమణ్య

ఘటి సుబ్రమణ్య

ఘటి సుబ్రమణ్య దేవాలయం మహిమ కలదని కోరికలు దేముడు తీరుస్తాడని భక్తులు అమితంగా నమ్ముతారు.

ఘటి సుబ్రమణ్య

ఘటి సుబ్రమణ్య

ఘటి సుబ్రమణ్య దేవాలయ ప్రధాన దైవం సుబ్రమణ్య మరియు లక్ష్మి నారాయణ. ఈ రెండు దైవాలు ఒకే విగ్రహంలో ఒక దానికి వెనుక మరొకటి చెక్కబడ్డాయి. భక్తులు ముందు నుండి సుబ్రమణ్య దైవాన్ని , అక్కడే ఏర్పరచిన ఒక అద్దంలో విగ్రహం వెనుక వైపున కల లక్ష్మి నారాయణుడిని దర్శించవచ్చు.

బెంగుళూరు ఆకర్షణలకు ఇక్కడ క్లిక్ చేయండి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X