Search
  • Follow NativePlanet
Share
» »ఈ ఆలయాన్ని దర్శిస్తేనే కాశి దర్శన ఫలితం, అప్పుడే సర్వ పాపాల నుంచి ముక్తి

ఈ ఆలయాన్ని దర్శిస్తేనే కాశి దర్శన ఫలితం, అప్పుడే సర్వ పాపాల నుంచి ముక్తి

వారాణాసికి సంబంధించిన కథనం

By Beldaru Sajjendrakishore

కాశీ లేదా వారాణసి భారతదేశపు అతి ప్రాచీన నగరాల్లో ఒకటి. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్య క్షేత్రము. కాశీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోవుంది. ఇక్కడ ప్రవహించే గంగానదిలో స్నానం ఆచరిస్తే సర్వపాపాలు నశించి పునర్జన్మ నుంచి విముక్తులౌతారని హిందువుల నమ్మకం. వరుణ, అసి అనే రెండు నదులు ఈ నగరం వద్ద గంగానదిలో కలుస్తాయి. అంచేత, ఈ క్షేత్రానికి వారణాసి (వారణాసి అని అంటుంటారు) అని కూడా నామాంతరం ఉంది. బ్రిటిషువారి వాడుకలో కాశీ, వారణాసి, బెనారస్ అయింది. కాశ్యాన్తు మరణాన్ ముక్తి: - "కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది" - అని హిందువులు విశ్వసిస్తారు.

ఆదిమ మానవుడు నివసించిన ప్రాంతం...భీముడు తలదాచుకున్న చోటు ఒకటేనాఆదిమ మానవుడు నివసించిన ప్రాంతం...భీముడు తలదాచుకున్న చోటు ఒకటేనా

శంకరాచార్యులకు అమ్మవారు పరీక్షపెట్టిన చోటు ....ఇక్కడికి వెళ్లితే అన్ని రంగాల్లో విజయమేశంకరాచార్యులకు అమ్మవారు పరీక్షపెట్టిన చోటు ....ఇక్కడికి వెళ్లితే అన్ని రంగాల్లో విజయమే

ఎడారి రాష్ట్రంలో అందమైన సరస్సుల నగరం...సందర్శిస్తే మనస్సు ఆహ్లాదమే...ఎడారి రాష్ట్రంలో అందమైన సరస్సుల నగరం...సందర్శిస్తే మనస్సు ఆహ్లాదమే...

ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన విశ్వేశ్వర లింగం ఇక్కడ ఉంది. బౌద్ధులకు, జైనులకు కూడా ఇది పుణ్యక్షేత్రం. వారాణసి ప్రపంచంలోనే అవిచ్ఛిన్నంగా జనావాసం ఉన్న నగరాలలోఅత్యంత పురాతనమైనది అని భావిస్తున్నారు. ఇంతటి విశిష్టత కలిగిన ఈ కాశీ ఫలితం దక్కాలంటే అక్కడే ఉన్న మరో ఆలయాన్ని మాత్రం తప్పక సందర్శించాలి. అప్పుడే కాశీ సందర్శన ఫలితం దక్కుతుందని సాక్షాత్తు శివుడే చెప్పాడంటా. ఇక ఈ నగరంలోని ప్రధాన ఆలయాన్ని సందర్శించాలంటే మరొకరి అనుమతి తప్పని సరి ఆ వివరాలతో పాటు ఇక్కడ ఉన్న పలు సందర్శనీయ స్థలాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

1.కవళి మాత...

1.కవళి మాత...

Image source:

కవళి అనే ఆమె ఒకప్పుడు కాశిలో నివసిస్తూ ఉండేది. ఆమె జీవనోపాధి కొరకు గవ్వలను అమ్ముతూ ఉండేది. ఆమె సదావిశ్వేరుని భక్తిశ్రద్ధాసక్తులతో ఆరాధించేది. శివారాధనకు ముందుగా గంగానదిలో స్నానం ఆచరించేది. గంగాస్నానం తరువాత విశ్వేశ్వర దర్శనం అయిన తరువాత ఆమె ఆహారాన్ని స్వీకరించేది. ఒకరోజు ఆమె స్నాంచేసి గట్టుకు రాగానే ఒక హరిజనుడు ఆమెను ముట్టుకున్నాడు. దీంతో ఆమె చాలా కోపగించుకుటుంది.

2. అన్నపూర్ణ దేవి ప్రత్యక్షమైన తర్వాత కూడా

2. అన్నపూర్ణ దేవి ప్రత్యక్షమైన తర్వాత కూడా

Image source:


హరిజన స్పర్శ కారణంగా ఆమె తిరిగి గంగలో స్నానానికి వెళ్ళింది. అలా ఆమె స్నానం చెయ్యడం తిరిగి హరిజనుడు స్పృజించడం తిరిగి గంగాస్నానానికి పోవడం చేస్తుండగా రాత్రి అయింది. ఆమె ఆరోజంతా భోజనం చేయలేదు. కాశీ అన్నపూర్ణా మాత క్షేత్రం కనుక ఆక్షేత్ర సరిహద్దులలో ఎవరూ భోజనం చేయకుండా ఉండకూడదు కనుక అన్నపూర్ణాదేవి స్వయంగా కవళీకి ప్రత్యక్షమై తనక్షేత్రంలో ఎవరూ పస్తులు ఉండదు కనుక భోజనం చెయ్యమని చెప్పింది.

3. మొండిపట్టు వీడలేదు

3. మొండిపట్టు వీడలేదు

Image source:

కవళీ మాత్రం విశ్వేశ్వర దర్శనం చేయకుండా భోజనం చెయ్యనని చెప్పింది. అన్నపూర్ణా మాత కోపించి ఆమెను కాశీ సరిహద్దులు దాటి వెళ్ళమని ఆదేశించింది. కవళీ కాశీ సరిహద్దులు దాటి వెళ్ళిన ఆమె విశ్వేశ్వర దర్శనం చెయ్యలేక పోయినందుకు చింతిస్తూ శివుని గురించి తపసు చేసింది. ఆమెకు శివిడు ప్రత్యక్షం కాగానే ఆమె " ఈశ్వరా ! నాభక్తిలో లోపమేమిటి. నన్నిలా కాశీనుండి పంపిన తరువాత నేనిక నీదర్శనం ఎలాచేయగలను. " అని ఆవేదనపడింది.

4. ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు

4. ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు

Image source:


ఈశ్వరుడు " కవళీ ! నీ భక్తి తిరుగులేనిది అయినప్పటికీ హరిజనుడు స్పృజించాడని తిరిగి స్నానం చేయడం అపరాధమే. నాకు హరిజనులు, పురజనులే కాదు. సకల ప్రాణులూ ఒకటే. ఎవరైనా నన్ను స్పృజించి నమస్కరించడానికి అర్హులే. నీవు హరిజన స్పర్శ అపవిత్రమని భావించి చేసిన అపరాధానికే ఈ దండన లభించింది.

అయినప్పటికీ నీభక్తికి, తపసుకు మెచ్చి నీకు ఒక వరం ఇస్తాను. ఇక మీదట నా భక్తులు నన్ను సందర్శించిన ఫలితం నీకు ఇస్తాను. భక్తులు నీకు కానుకలు సమర్పించి వారి దర్శన ఫలితాలను తిరిగి పొందగలరు " అని చెప్పి అదృశ్యం అయ్యాడు.

5. ఈశ్వరుడే వరం ఇచ్చాడు

5. ఈశ్వరుడే వరం ఇచ్చాడు

Image source:


అప్పటి నుండి కవళీ " కవళీ మాత " అయింది. కనుక భక్తులు కాశీ విశ్వేరదర్శనం చేసుకున్న ఫలితం కవళీ మాతకు దక్కుతుంది. అందుకు పరిహారంగా భక్తులు కవళీమాత దర్శనం చేసుకుని ఆమెతో " ఈ గవ్వలు నీకు సమర్పిస్తున్నాము. కాశీ ఫలితం నాకు ఇవ్వు " అని ప్రార్థించిన భక్తులకు కాశీ పోయిన ఫలితం దక్కుతుందని విశ్వశించబడుతుంది. కనుక కాశీవిశ్వేశ్వర దర్శనం చేసుకున్న భక్తులు కవళీమాతను కూడా దర్శించుకుంటారు.

6. ఆయన అనుమతి తప్పనిసరి

6. ఆయన అనుమతి తప్పనిసరి

Image source:


కాలభైరవుడు కాశీక్షేత్రానికి క్షేత్రపాలకుడు. విశ్వేశ్వర దర్శనం చేసుకోవడానికి ముందుగా కాలభైరవుని దర్శించుకుని ఆయన అనుమతి తీసుకుని విశ్వేశ్వర దర్శనం చేసుకోవాలని పురాణకథనం మనకు వివరిస్తుంది. కనుక భక్తులు విశ్వేశ్వర దర్శనానికి ముందుగా కాలభైరవుని దర్శించుకుని విశ్వనాథ దర్శనానికి అనుమతి ఇవ్వమని ప్రార్ధిస్తారు. ఈ ఆలయం విశ్వేశ్వర్ గంజ్ ప్రధాన పోస్టాఫీసు సమీపంలో ఉంది.

7. అన్ని రోగాలు నయమవుతాయి...

7. అన్ని రోగాలు నయమవుతాయి...

Image source:


ఈ అలయం నుండి దారానగర్ పోయే మార్గంలో మృత్యుంజయ (శివుడు) మందిరం ఉంది. ఆలయసమీపంలో ఉన్న బావికి ఒక ప్రత్యేకత ఉంది. బావిలోకి పలు అంతర్గత ప్రవాహాలనుండి నీరు ఊరుతుందని ఈ జలాలకు రోగవిముక్తి చేసే శక్తి ఉందని విశ్వసిస్తున్నారు. అందువల్ల భక్తులు కాశీ విశ్వేశ్వరుడిని దర్శించడానికి ముందు ఇక్కడి జలాలను తాకుతారు. అందువల్ల తమకు ఉన్న అన్ని రోగాలు నయమవుతాయని నమ్ముతారు.

8. ఆలయాలకు నెలవు...

8. ఆలయాలకు నెలవు...

Image source:


వారణాసి ఆలయాలకు నెలవు. చరిత్రలో వివిధ కాలాల్లో నిర్మించబడ్డ పెద్ద పెద్ద ఆలయాలు ఉన్నాయి. ఇంకా ప్రతీ వీధిలోనూ ఒక ఆలయాన్ని దర్శించవచ్చు. చిన్న ఆలయాల్లో కూడా దైనందిన ప్రార్థనలు, కార్యక్రమాలు జరుగుతుంటాయి. వారణాశిలో అనేక (దాదాపు 23,000) ఆలయాలు ఉన్నాయి. అయినప్పటికీ అత్యధికంగా ఆరాధించబడే ఆలయం విశ్వనాధ మంధిరం, హనుమాన్ మందిరం మరియు దుర్గా మందిరం ( ఈ మందిర సమీపంలో నివసిస్తున్న అనేక ఉన్న కోతుల కారణంగా ఈ మందిరం కోతుల ఆలయంగా కూడా పిలువబడుతుంది).

9. ప్రధాన ఆలయం ఇదే...

9. ప్రధాన ఆలయం ఇదే...

Image source:


కాశీ విశ్వనాధ మందిరం వారాణసిలో ప్రధాన ఆలయంగా చెప్పుకోవచ్చును. దీని గోపురంపైన పూసిన స్వచ్ఛమైన బంగారు పూత కారణంగా ఈ మందిరాన్ని "బంగారు మందిరం" అని కూడా అంటుంటారు. ప్రస్తుతం ఉన్న మందిరాన్ని 1780లో ఇండోర్ రాణి అహల్యాబాయి హోల్కర్ కట్టింపించింది. ఇందులో లింగాకారంగా కొలువై ఉన్న దేవుడు "విశ్వేశ్వరుడు", "విశ్వనాధుడు" పేర్లతో పూజలందుకొంటుంటాడు.

10. అధిక ఫలప్రధమని నమ్ముతారు...

10. అధిక ఫలప్రధమని నమ్ముతారు...

Image source:


ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఈ విశ్వేశ్వర లింగం దర్శనం తక్కిన లింగాల దర్శనం కంటే అధిక ఫలప్రథమని భక్తుల విశ్వాసం. ఈ ఆలయం పలుమార్లు విధ్వశం చేయబడి తిరిగి నిర్మించబడింది. ఆలయసమీపంలో ఉన్న " గ్యాంవాపీ " మసీదు ప్రాంతమే అసలైన ఆలయం ఉన్న ప్రదేశం. 1785లో అప్పటి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్ సూచనల మేరకు కలెక్టర్ మొహమ్మద్ ఇబ్రాహీమ్ ఖాన్ ఈ ఆలయం ముందు భాగంలో ఒక "నౌబత్ ఖానా" కట్టించాడు.

11. బంగాపూత పూయించాడు...

11. బంగాపూత పూయించాడు...

Image source:


1839లో పంజాబ్ కేసరిగా పేరొందిన మహారాజా రంజిత్ సింగ్ ఈ ఆలయం రెండు గోపురాలకు బంగారపు పూత పూయించడానికి సరిపడా బంగారం సమర్పించాడు. 1983 జనవరి28న ఈ మందిరం నిర్వహణా బాధ్యతలను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం హస్తగతం చేసుకొని అప్పటి కాశీ రాజు డా. విభూతి నారాయణ సింగ్ అధ్వర్యంలోని ఒక ట్రస్టుకు అప్పగించింది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కాలంలో అప్పటి మందరిరం విధ్వంసం చేయబడింది. తరువాత సమీపంలో మరొక మందిరం కట్టబడింది.

12. ద్వారపర యుగంలో కూడా...

12. ద్వారపర యుగంలో కూడా...

Image source:


కురుక్షేత్ర యుద్ధం తరువాత పాండవులు భాతృహత్య మరియు బ్రహ్మహత్యా పాతకాల నుండి విముక్తులవడానికి సప్తముక్తిపూరాలలో ఒకటైన కాశీ పట్టణానికి వస్తారు. అయోధ్య, మథుర, గయ,కాశి, అవంతిక, కంచి, ద్వారక నగరాలను సప్తముక్తి నగరాలని హిందువుల ప్రగాడ విశ్వాసం. ఆరంభకాల పూరాతతత్వ పరిశోధనలు వారణాశి పరిసరప్రాంతాలలో 11-12 శతాబ్ధాలలో నివాసాలు ఆరంభమయ్యాయని అక్కడ దొరికిన ఆధారాలను బట్టి తెలియజేస్తున్నాయి.

13. అత్యంత ప్రాచీనమైనది

13. అత్యంత ప్రాచీనమైనది

Image source:

ప్రపంచంలో నిరంతరంగా నివాసయోగ్యమైన ప్రదేశాలలో కాశీ ప్రథమ స్థానంలో ఉందని భావిస్తున్నారు. పురాతత్వ అవశేషాలు వారణాశి వేదకాల ప్రజల అవాసమని వివరిస్తున్నాయి. కాశీ పట్టణం గురించి ప్రథమంగా అధర్వణ వేదంలో వర్ణించబడింది. అధర్వణవేదం సుమారుగా వేదకాల ప్రజలిక్కడ నివసించారని భాస్తున్న సమయానికి సరొపోతున్నాయి.

14. స్నానఘట్టాలు

14. స్నానఘట్టాలు

Image source:


వారణాశిలోని గంగా తీరం అంతా స్నానఘట్టాలతో నిండి ఉన్నాయి. స్నాఘట్టాలలో రాతిపలకతో నిర్మించబడిన మెట్లు ఉంటాయి. యాత్రీకులు స్నానం ఆచరించడానికి, సంప్రదాయక ఆచారాలను అనుష్ఠించడానికి అనువైన ఏర్పాట్లు ఇక్కడ చేయబడి ఉన్నాయి. వారాణసిలో సుమారు 84 ఘాట్‌లు ఉన్నట్లు చెబుతారు. వీటిలో చాలా వరకు ఇక్కడ మరాఠా పరిపాలనా కాలంలో అభివృద్ధి చేయబడ్డాయి.

15. ప్రైవేటు ఘాట్ లు కూడా

15. ప్రైవేటు ఘాట్ లు కూడా

Image source:


కొన్ని ఘాట్‌లు ప్రైవేటు ఆస్తులుగా ఉంటున్నాయి. ఉదాహరణకు "శివాలా ఘాట్" మరియు "కాళీ ఘాట్"లకు స్వంతదారు కాశీ మహారాజు. ఎక్కువ ఘాట్‌లు స్నానానికి మరియు దహనకాండలకు వాడుతారు. కొన్న ఘాట్‌లు పురాణ గాథలతో ముడివడి ఉన్నాయి. ఆధ్యాత్మిక, భౌతిక భావాలతో కూడిన పవిత్రభావాలకు ఈ స్నానఘట్టాలు ప్రతీకలుగా ప్రశంశించబడుతున్నాయి. ఈ స్నానఘట్టాలు పురాణ ఘట్టాలతో ముడివడి ఉన్నాయి.

16. స్నానఘట్టాల్లో ఆలయాలు కూడా..

16. స్నానఘట్టాల్లో ఆలయాలు కూడా..

Image source:


వీటిలో దశాశ్వమేధఘట్టం, పనచగంగ ఘట్టం మరియు ధహనసంస్కారాలు జరిపించే మణికర్ణికా, హరిశ్చంద్రా ఘాట్లు ప్రత్యేకమైనవి. ఉదయం బోటులో స్నానఘట్టాలను దర్శించడం యాత్రీకులను ఎక్కువగా ఆకర్షించే విషయాలలో ఒకటి. స్నానఘట్టాలలో అనేక ఆలయాలు కూడా ఉంటాయి. వారాణసికి దేవాలయాలను చూడటానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో ఈ ఘాట్ ను సందర్శించడానికి కూడా భక్తులు అంతే ప్రాధాన్యత ఇస్తారు.

17. దశాశ్వమేధ ఘాట్

17. దశాశ్వమేధ ఘాట్

Image source:


కాశీ విశ్వనాధ మందిరం ప్రక్కనే ఉన్న దశాశ్వమేధ ఘాట్ వారణాశిలో ఉన్న స్నాన ఘట్టాలలో అతి పురాతనమైనదిగా భావిస్తున్నారు. బ్రహ్మ స్వయంగా ఇక్కడ పది అశ్వమేధ యాగాలు చేసి శివుడిని ఇక్కడ కొలువుండమని కోరాడని పురాణ గాథ. ప్రతి రోజూ సాయంకాలం పూజారులు ఇక్కడ అగ్ని పూజ చేసి, శివుడిని, గంగమ్మను, సూర్యుడిని, అగ్నిని, విశ్వాన్ని కొలుస్తారు. ఇక్కడ శూలకంథేశ్వరుడు, బ్రహ్మేశ్వరుడు, వరాహేశ్వరుడు, అభయవినాయక ఆలయాలతో గంగా, బండిదేవి ఆలయాలు ఉన్నాయి.

18. పడవల్లో ప్రయాణం...

18. పడవల్లో ప్రయాణం...

Image source:


ఇక్కడ ప్రతిరోజు నిర్వహించే హారతి నదిలో నుండి చూడడానికి యాత్రీకులు ఇక్కడి ఇక్కడ ఉన్న పడవలను మాత్రమే ఎక్కాలి. వారు ఒకసారి ఘాట్లన్నింటిని చూపించి తిరిగి ఘాటు వద్దకు బోట్లను తీసుకువచ్చి నదిలో నిలిపి వేస్తారు. యాత్రీకులు అక్కడి నుండి హారతి చూడవచ్చు. సాధారణంగా హారతి ముగిసిన తరువాత నది నిర్మానుష్యం ఔతుంది. బోటులో ఉండగానే చిన్న చిన్న వ్యాపారులు తమవస్తువులను విక్రయించడం యాత్రీకులను ఆకర్షించే విషయాలలో ఒకటి.

19. మణి కర్ణికా ఘాట్...

19. మణి కర్ణికా ఘాట్...

Image source:

మణి కర్ణికా ఘట్టం ఎంతో పావనమైనదిగా హిందువులు భావిస్తారు. ఒక గాథ ప్రకారం శివుని సమక్షంలో విష్ణువు ఇక్కడ తన సుదర్శన చక్రంతో ఒక గోతిని తవ్వాడు. దానిని తన స్వేదంతో నింపుతుండగా విష్ణువు చెవి కుండలం (మణి కర్ణిక) అందులో పడింది. మరొక కథ ప్రకారం పార్వతీదేవి తన చెవిపోగు (మణికర్ణిక)ను ఇక్కడ దాచిపెట్టి, దానిని వెతకమని శివుడిని కోరింది. దానికోసం వెతుకుతూ అక్కడే శివుడు ఉండిపోవడం వల్ల అతడు దేశద్రిమ్మరి కాడని పార్వతి ఆలోచన.

20. ఇక్కడే హరిశ్చంద్రుడు

20. ఇక్కడే హరిశ్చంద్రుడు

Image source:


ఇక్కడ దహనమైన శరీరం తాలూకు ఆత్మను శివుడు స్వయంగా మణికర్ణిక కనిపించిందేమోనని అడుగుతాడట. పురాణ కథనాల ప్రకారం ఈ మణికర్ణికా ఘాట్ యజమానే హరిశ్చంద్రుడు. అంతటి వాడు హరిశ్చంద్ర ఘాట్‌లో కాటిపనికి నియమించాడు. మణి కర్ణికా ఘాట్, హరిశ్చంద్రఘాట్‌లలో మిగిలిన వాటితో పోలిస్తే అధికంగా దహన సంస్కారాలు జరుగుతుంటాయి. మణికర్ణికాఘాటుకు మహాశ్మశానమని మరొక పేరుకూడా ఉంది.

21. ఇక్కడ మరణిస్తే మోక్షం...

21. ఇక్కడ మరణిస్తే మోక్షం...

Image source:


ఈ ఘాట్ గురించి మరొక కథనం కూడా ప్రచారంలో ఉంది. ప్రస్తుత ఘాట్ 1032 లో నిర్మించబడింది. 4వ శతాబ్దంలో గుప్తుల కాలంలో ఈ ఘాట్ ప్రస్తావన ఉంది. ఈ ఘాట్ వద్ద ఉన్న తారకేశ్వరాలయంలో నుండి పరమశివుడు మరణిస్తున్న వారి చెవిలో తారకనామం ఉపదేశిస్తుంటాడని విశ్వసించబడుతుంది. ఇక్కడ మరణించిన వారికి మోక్షం ప్రసాదించమని పరమశివుడు విష్ణువును కోరిన ప్రదేశమిదే అని ప్రజల విశ్వాసం.

22. వసతి ఇలా...

22. వసతి ఇలా...

Image source:


ఇక్కడ జంగంబాడి సత్తరం ఉంది.ఇచ్చట గదులు తక్కువ అద్దెకు ఇస్తారు.ఉచిత భోజనం వసతికూడా ఉంది.మరియు నాట్టు కోట్టై నగర సత్తరం తమిళనాడు వారిచే నిర్వహించ బడుచున్నది.ఇచ్చట తక్కువ అద్దెకు గదులు దొరుకుతాయి.సత్తరం చాల పరిశుభ్రంగా ఉంటుంది. ఇచ్చట తక్కువ దరకే ఉదయం టిఫన్,మద్యాన్నం భోజనం,రాత్రికి టిఫన్ లభించును.ఇధి ఆంధ్రావారికి,తమిళ వాడు వారికి భాగుంటుంది.

23.మ్యూజియం

23.మ్యూజియం

Image source:


రామనగర్ కోట గంగానది తూర్పుతీరంలో తులసీఘాటుకు ఎదురుగా ఉంది. రామనగర్ కోటను 18వ శతాబ్దంలో కాశీనరేష్ రాజా బలవంత్ సింగ్ చేత నిర్మించబడిది. ఈ కోట చునార్ ఇసుకరాళ్ళతో నిర్మించబడింది. ఇది మొగల్ నిర్మాణశైలితో వంపైన బాల్కనీలు, బహిరంగ సభామండపాలు మరియు సుందర ద్వారాలు కలిగిఉంది. ప్రస్తుతం ఈ కోట జీర్ణావస్థలో ఉంది. ఈ కోట మరియు ఇందులో ఉన్న పురాతన వస్తుసంగ్రహాలయంలో బెనారస్ రాజవంశానికి చెందిన వస్తువులు బధ్రపరచబడి ఉన్నాయి.

24. జంతర్ మంతర్

24. జంతర్ మంతర్

Image source:


గంగాతీరంలో ఉన్న పర్యాటక ఆకర్షణలలో జంతర్ అంతర్ ఒకటి. ద్శాశ్వమేధ్ ఘాట్ సమీపంలో గంగాతీరంలో ఎత్తైనప్రదేశంలో జయపూర్ రాజు అయిన రాజా జై సింగ్ ఘాటును ఆనుకుని జంతర్ మంతర్ ఉంది. డిల్లీ మరియు జైపూర్ అబ్జ్ర్వేటరీలలా వారణాశి అబ్జర్వేటరీలో ఉపకరణాలు తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ ఇక్కడ ఉన్న జంతర్ మంతర్ను ఒకే ఒకేఒక న్యక్తి నిర్వహిస్తూ వివరాలనలు నమోదు చేయబడుతున్నాయి.

25. రవాణా ఇలా...

25. రవాణా ఇలా...

Image source:


ప్రస్తుతం వారాణసి నగరం దేశంలో అన్ని ప్రధాన నగరాలనుండి రోడ్డు, రైలు, విమాన మార్గాల ద్వారా కలుపబడింది. ఇది రెండవ నంబరు ఢిల్లీ కొలకత్తా జాతీయ రహదారిపై ఢిల్లీ నుండి 800 కిలోమీటర్లు కొలకత్తా నుండి 700 కిలోమీటర్లు దూరంలో ఉన్న పట్టణం. బాబత్‌పూర్ విమానాశ్రయంనగరం నడిబొడ్డునుండి 25 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడికి ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కొలకత్తా, నేపాల్ లకు విమాన స్వీసులు ఉన్నాయి.

26. రైలు, బస్సులు కూడా...

26. రైలు, బస్సులు కూడా...

Image source:


వారాణసి రైల్వేస్టేషను ఢిల్లీ - కలకత్తా ప్రధాన రైలు మార్గంలో ఉంది. నగరం లోపల సిటీ బస్సులున్నాయి. కాని అత్యధికంగా ప్రైవేటు వాహనాలు, ఆటోరిక్షాలు, సైకిల్ రిక్షాలు నగరం లోపలి ప్రయాణాలకు వాడుతుంటారు. గంగా నదిని దాటడానికి చిన్న పడవలు, స్టీమర్లు ఉపయోగిస్తారు. వారాణసి ప్రక్కనే గంగానదిపై వంతెన ఉంది. అటువైపు మొఘల్ సరాయి రైల్వే జంక్షన్ పట్టణం ఉంది. నగరం లోపల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ మార్గాలు ఇరుకైనవి. ఇక్కడి నుండి అలహాబాద్ 120 కిలోమీటర్లు దూరంలో ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X