Search
  • Follow NativePlanet
Share
» »కటీల్ - పురాణగాధలతో నిండిన ప్రదేశం !

కటీల్ - పురాణగాధలతో నిండిన ప్రదేశం !

By Mohammad

కటీల్ లేదా కటీలు పట్టణం, దక్షిణ కన్నడ జిల్లాలో ప్రసిద్ధి చెందిన 'దేవాలయాల పట్టణం'. ఇది మంగళూరు కు 29 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిందువుల పవిత్ర క్షేత్రం. ఈ పట్టణ ప్రధాన ఆకర్షణ శ్రీ దుర్గ పరమేశ్వరి ఆలయం. ఈ ఆలయాన్ని శక్తి పీఠాలలో ఒకటిగా భావిస్తారు ఇక్కడికి వచ్చే భక్తులు. నందిని నది ఒడ్డున ఈ పవిత్ర దుర్గ పరమేశ్వరి ఆలయం నిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది.

ఇది కూడా చదవండి : బెంగుళూరు టు మంగళూరు రోడ్ ట్రిప్ జర్నీ !

కటీల్ లోని అందమైన ఆలయం, చుట్టూ ఉన్న నందిని నది, పచ్చని మొక్కలతో నిండిన కొండలు పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటాయి. కర్ణాటకలో బాగా ప్రాచూర్యం పొందిన అతి కొద్ది క్షేత్రాలలో ఒకటైన 'కటీల్' చరిత్రను ఒకసారి గమనిస్తే ..

కటీల్ పురాణగాధ

కటీల్ పురాణగాధ

పురాతన కాలంలో, ఈ ప్రాంతంలో అరుణాసుర అనే పేరుగల అసురుడు ఉండేవాడు. అతని చేష్టల వల్ల ఈ ప్రాంతం కరువులో కూరుకుపోయింది.

చిత్ర కృప : kateeldevi.in

కటీల్ పురాణగాధ

కటీల్ పురాణగాధ

తీవ్ర ధ్యానంలో ఉన్న జాబాలీ అనే మహర్షి, తన మనోనేత్రంతో ప్రజలు బాధలు పడటం చూస్తాడు. అందుకోసమై ఒక యజ్ఞన్ని తలపెట్టుతాడు. యజ్ఞానికి కామధేనువు అవసరం. దానికొసమై దేవేంద్రుడిని అనుమతి కోరతాడు. కామధేనువు వరుణలోకం వెళ్లినందువల్ల ఆమె పుత్రిక నందినిని తీసుకు వెళ్ళవలసిందిగా చెప్పాడు ఇంద్రుడు.

చిత్ర కృప : kateeldevi.in

కటీల్ పురాణగాధ

కటీల్ పురాణగాధ

నందిని పొగరుగా, భూమ్మీద పాపాత్ములు వుంటారని, అక్కడ ఎప్పటికీ అడుగుపెట్టనని తెగేసి చెప్పింది. ఆమె వస్తే ప్రజల బాధ తగ్గుతాయని మహర్షి బ్రతిమలాడుతున్నా వినకపోవడంతో, చివరికి ముని ఆగ్రహించి ఆమెను భూమి మీద నదిగా పుట్టమని శపిస్తాడు. భీతిల్లిన నందిని తనను అనుగ్రహించి శాప విమోచనం చెప్పమని అడిగింది. ముని ఆమెను దుర్గా దేవి ని పూజించమనీ, ఆవిడే ఆమెను రక్షిస్తుందని చెప్పాడు.

చిత్ర కృప : kateeldevi.in

కటీల్ పురాణగాధ

కటీల్ పురాణగాధ

నందిని మొర ఆలకించి దుర్గా దేవి ప్రత్యక్షమైంది. ముని శాపం ప్రకారమే నందిని భువిలో నదిగా ప్రవహించమని దుర్గా దేవి చెప్పింది. ఆమెకు శాప విమోచనం చేయడానికి తానె ఆమె కూతురుగా పుడతానని మాటిచ్చింది. అప్పుడు నందిని కటీల్ లోని కనకగిరి మీదుగా నదిగా మారి ప్రవహించింది. ఇప్పుడున్న నందిని నది అదే ..!

చిత్ర కృప : Umakant Mishra

కటీల్ పురాణగాధ

కటీల్ పురాణగాధ

ఈలోగా అరుణాసురుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి బాగా వరాలు పొందాడు. రెండు కాళ్ళ జంతువు తో కానీ, నాలుగు కాళ్ళ జంతువుతో కానీ లేదా మరేని ఆయుధంతో కానీ చావు ఉండదని బ్రహ్మ వరం ఇస్తాడు. ఈ వరం పొందిన అతను దేవతలను భయభ్రాంతులకు గురిచేస్తాడు. చేసేదేమీ లేక దేవతలందరూ దుర్గా దేవిని ఆశ్రయిస్తారు.

చిత్ర కృప : Umakant Mishra

కటీల్ పురాణగాధ

కటీల్ పురాణగాధ

దుర్గా దేవి అరుణాసురుడు ముందు అందమైన స్త్రీ గా ప్రత్యేక్షమై అతన్ని ఆకర్షిస్తుంది. మోహితుడైన అసురుడు ఆమెను వెంబడిస్తాడు. అలా కొంత దూరం వెళ్లేసరికి దుర్గా దేవి తానెవరో చెప్పేసరికి, అసురుడు కోపోద్రిక్తుడై ఆమెను చంపాలని ప్రయత్నిస్తాడు . ఇంతలో ఆమె శిలగా మారిపోయి, అందులోంచి తేనేటీగల దండు బయటికి వచ్చి అతన్ని కుట్టి చంపేస్తాయి. బ్రహ్మ ఇచ్చిన వరం వళ్ళ అతనికి చావు లేకుండంతో దుర్గమ్మ పై విధంగా చేసింది.

చిత్ర కృప : kateeldevi.in

కటీల్ పురాణగాధ

కటీల్ పురాణగాధ

దేవతలప్పుడు భ్రమరాంబికను (భ్రమరాల రాణి) తన సత్వ, శుభ రూపం లోకి రావాలని ప్రార్ధించారు. అప్పుడు ఆ దేవత నందిని నది మధ్యలో ఒక అందమైన రూపంలో ప్రత్యక్షమై, నందిని కి కూతురుగా పుడతానని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. ఆవిడ ప్రత్యక్షమైన ద్వీపా౦శాన్ని కటీల్ అంటారు. సంస్కృతంలో కటి అంటే 'మధ', ఇల అంటే 'భూమి'.

చిత్ర కృప : kateeldevi.in

ఆలయం లో జరిగే వేడుకలు

ఆలయం లో జరిగే వేడుకలు

ఏప్రిల్ లో ఎనిమిది రోజుల పాటు జరిగే మకర సంక్రమణ పర్వదినాలు, నవరాత్రి ఉత్సవాలు, నందిని నదిగా అవతరించిన మాఘ శుద్ధ పూర్ణిమ, వినాయక చవితి, కృష్ణ జన్మాష్టమి, కదిరు హబ్బ, లక్ష దీపోత్సవం లాంటి పండుగలు ఇక్కడ ప్రత్యేకంగా నిర్వహిస్తారు.

చిత్ర కృప : kateeldevi.in

ఆలయ సందర్శన

ఆలయ సందర్శన

శ్రీ దుర్గ పరమేశ్వరి ఆలయాన్ని ఉదయం తెల్లవారుజామున 4 గంటలకు తెరిచి, రాత్రి 10 గంటలకు మూసేస్తారు. భక్తులు ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు అమ్మవారిని దర్శించుకోవచ్చు.

చిత్ర కృప : Premkudva

ఆలయ సదుపాయాలు

ఆలయ సదుపాయాలు

మెడికల్ సదుపాయం, కమ్యూనిటీ హాల్, నిత్య అన్నదానం (మధ్యాహ్నం 12:30 నుండి 3:00 వరకు మరియు తిరిగి రాత్రి 8:30 నుండి 10:00 గంటల వరకు), ప్రసాదం, తాగునీటి సదుపాయం, పార్కింగ్ మొదలైనవి ఉన్నాయి.

చిత్ర కృప : kateeldevi.in

వసతి

వసతి

ఆలయం వద్ద లాడ్జీలు, హోటళ్ళు, సత్రాలు ఉన్నాయి. డబుల్ బెడ్ రూమ్స్ , సూట్ రూమ్స్ , డీలక్స్ రూమ్స్, ఏసీ గదులు అన్ని తరగతుల వారికి అందుబాటు ధరలలోనే లభిస్తాయి.

ఆలయానికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

చిత్ర కృప : Sundaram TV

కటీల్ ఎలా చేరుకోవాలి ?

కటీల్ ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం

మంగళూరు వద్ద ఉన్న బాజ్పే విమానాశ్రయం (16 కి.మీ) కటీల్ పట్టణానికి సమీపాన ఉన్నది. మైసూర్ ఎయిర్ పోర్ట్ (210 కి.మీ), బెంగళూరు ఎయిర్ పోర్ట్ (292 కి.మీ) లు కూడా ఈ పట్టణానికి సమీపాన ఉండి, విమాన సర్వీసులను అందిస్తున్నది.

రైలు మార్గం

ముంబై నుండి వచ్చే కొంకణ్ రైళ్ళు, కేరళ -మంగళూరు రైళ్ళు, బెంగళూరు - హస్సన్ - మంగళూరు రైళ్ళు ప్రధాన రైలు సర్వీసులు గా ఉన్నాయి. కటీల్ కు ముల్కి రైల్వే స్టేషన్ 8 కి.మి. దూరంలో, సురత్కల్ రైల్వే స్టేషన్ 9 కి.మీ దూరంలో కలవు.

రోడ్డు / బస్సు మార్గం

NH 17 మరియు NH 48 రోడ్డు మార్గాల ద్వారా కటీల్ సులభంగా చేరుకోవచ్చు. మంగళూరు (18 కి.మీ) నుండి ప్రభుత్వ / ప్రవేట్ బస్సులు ప్రతి రోజూ కటీల్ కు నడుస్తుంటాయి.

చిత్ర కృప : Praveena for

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X