Search
  • Follow NativePlanet
Share
» »గ్రహాలకు అనుగుణంగా కదిలే అర్థనారీశ్వర లింగం...సందర్శిస్తే భార్య భర్తల మధ్య గొడవలు...

గ్రహాలకు అనుగుణంగా కదిలే అర్థనారీశ్వర లింగం...సందర్శిస్తే భార్య భర్తల మధ్య గొడవలు...

కత్ గాథ్ లో ఉన్న అర్థనారీశ్వర లింగం దేవాలయానికి సంబంధించిన కథనం.

By Kishore

భారత దేశంలోని హిమాలయాలకు ధార్మిక గుర్తింపు ఉంది. ఇక్కడ సమస్త దేవతలూ నివశిస్తూ ఉన్నారని ఇప్పటికీ చాలా మంది హిందువుల ప్రగాడ విశ్వాసం. ముఖ్యంగా కైలాసనాధుడైన పరమశివుడు నివశించేది ఈ ప్రాంతంలోనేనని వారు చెబుతుంటారు. అటువంటి హిమాచల్ ప్రదేశ్ లో ఒక విచిత్రమైన శివలింగం ఉంది. దీనిని దర్శిస్తే భార్యా భర్తల మధ్య గొడవలు పూర్తిగా సమసి పోతాయని నమ్ముతారు. అంతేకాకుండా ఆ కుటుంబంలో ఎప్పుడూ శాంతి, సౌభాగ్యాలు విరాజిల్లుతాయని నమ్ముతారు. ఈ విచిత్రమైన శివలింగం గురించిన సమాచారం మీ కోసం....

పెళ్లికి ముందు ఆ పని కోసం ఈ ప్రాంతాలు ఉత్తమంపెళ్లికి ముందు ఆ పని కోసం ఈ ప్రాంతాలు ఉత్తమం

అంత ఎత్తులో మీ 'పక్క' పైన ఉన్నవారిని కెవ్వు మని కేక పెట్టించకమానరుఅంత ఎత్తులో మీ 'పక్క' పైన ఉన్నవారిని కెవ్వు మని కేక పెట్టించకమానరు

 1. అర్థనారీశ్వర రూపం...

1. అర్థనారీశ్వర రూపం...

Image Source:

హిమాచల్ ప్రదేశ్ లోని కత్ గాథ్ అనే పట్టణంలో శివలింగం అర్థనారీశ్వర రూపంలో ఉంటుంది. ఒక భాగం పెద్ద ఆకారంలో మరో భాగం చిన్నగా ఉంటుంది. పెద్ద భాగాన్ని శివుడిగా, చిన్నగా ఉన్న భాగాన్ని పార్వతిగా భావిస్తారు. ఈ రెండు భాగాలు, గ్రహాల స్థితిగతులకు అనుగుణంగా కదులుతూ ఉంటాయి. అంటే ఈ రెండు భాగాలు దూరంగా పోవడం లేదా దగ్గరగా రావడం చేస్తుంటాయి.

2. ప్రపంచంలో ఇటువంటిది ఇదొక్కటే...

2. ప్రపంచంలో ఇటువంటిది ఇదొక్కటే...

Image Source:

ప్రపంచంలో ఇటువంటి శివలింగం ఇదొక్కటే. అంటే శివలింగం రెండు భాగాలుగా ఉండి ఆ రెండు భాగాలు పూజింపబడటం అన్నమాట. అదే విధంగా ఈ రెండు భాగాలు వేసవి కాలంలో దూరంగా జరగడం ప్రారంభిస్తాయి. ఇక చలికాలంలో దగ్గరగా వస్తాయి.

3. ఎవరు నిర్మించారు.

3. ఎవరు నిర్మించారు.

Image Source:

చరిత్రను అనుసరించి ఈ దేవాలయాన్ని చాలా కాలం క్రితం సికిందర్ అనే రాజు నిర్మించారు. ఈ శివలింగాన్ని కొంతమంది స్వయంభువు అని చెప్పగా మరికొంతమంది భూమి లోపల ఉన్న ఈ రెండు శివలింగాలను సికిందర్ భూమి పైకి తీసుకువచ్చి ఖగోళ సూత్రాలకు అనుగుణంగా నిర్మింపజేశారని చెబుతారు. ఈ విషయం పై స్థానికుల్లోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

4. ఎనిమిది అడుగులు

4. ఎనిమిది అడుగులు

Image Source:

ఈ రెండు శివలింగాల్లో పెద్ద శివలింగం ఎనిమిది అడుగులు ఉండగా రెండో శివలింగం 5 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ రెండు శివలింగాలు నల్లటి రంగులో ఉంటాయి. గ్రహ స్థితులకు అనుగుణంగా చలనం కలిగిన ఈ రెండు శివలింగాలు శివరాత్రి రోజున మాత్రం ఒకటవుతాయి. ఇందుకు గల కారణాలు మాత్రం ఇప్పటి వరకూ ఎవరకూ చెప్పడం లేదు.

5. ప్రత్యేక పూజలు

5. ప్రత్యేక పూజలు

Image Source:

ఇక్కడ శివరాత్రి రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ పూజలు మూడు రోజుల పాటు కొనసాగుతాయి. ముఖ్యంగా రెండు శివలింగాలు ఒక్కటిగా మారే సమయంలో ఇక్కడ వివిధ రాష్ట్రల నుంచి వేల సంఖ్యలో ఇక్కడి భక్తులు వస్తుంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X