Search
  • Follow NativePlanet
Share
» »ప్రకృతి అందాలకు నిలయం: నిసర్గ ధామ ఐల్యాండ్‌

ప్రకృతి అందాలకు నిలయం: నిసర్గ ధామ ఐల్యాండ్‌

ప్రకృతి అందాలకు నిలయం: నిసర్గధామ ఐల్యాండ్‌

దట్టమైన అడవులు, నురుగులు కక్కే జలపాతాలు, పరవశింప జేసే పశ్చిమ కనుమలు, ఆకుపచ్చని కాఫీతోటలు, మత్తెక్కించే సుగంధ ద్రవ్యాల సువాసనలు... ఎన్నని చెప్పాలి? దక్షిణ భారత దేశంలోని పాపులర్ హిల్ స్టేషన్స్‌లో కర్ణాటకలో ఉన్న కూర్గ్‌ది ప్రత్యేక స్థానం. కొడగు, స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా అని కూడా పిలిచే ఈ ప్రదేశం, మంచి సమ్మర్ టూరిస్టు కేంద్రమే కాదు... బెస్ట్ హనీమూన్ డెస్టినేషన్ కూడా.

కూర్గ్ జిల్లాలో ఉన్న మడికెరీ మంచి టూరిస్ట్ ప్లేస్. పశ్చిమ కనుమల్లో ఉండటం వల్ల ఎప్పుడూ చల్లగానే ఉంటుంది. ఉష్ణోగ్రత వేసవిలో కూడా ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు డిగ్రీలను మించదు. జనవరిలో అయితే పది వరకూ పడిపోతుంది. అసలీ ఈ పట్టణాన్ని గతంలో ముద్దురాజాకెరీ అని పిలిచేవారు. అంటే ముద్దురాజా పట్టణం అని అర్థం. హలేరీ వంశానికి చెందిన ముద్దురాజా కొడగును 1633 నుంచి 1687 వరకూ పాలించాడు. అతని పేరు మీద ఏర్పడిన పట్టణమిది.

ఆ రాజావారి కోట ఇప్పటికీ అక్కడ ఉంది. ఈ పట్టణానికి శివారులో ఉండే ఓ ప్రత్యేక నిర్మాణాన్ని 'రాజాస్ సీట్' అంటారు. నాలుగు స్తంభాల ఆధారంగా, ఓ చరియ మీద అర్ధచంద్రాకారంలో నిర్మించిన ఈ నిర్మాణం ప్రముఖ సందర్శనీయ స్థలం. ఇక్కడ్నుంచి సూర్యాస్తమయాన్ని చూడటానికి అందరూ క్యూ కడతారు.

ప్రకృతి అందాలకు నిలయమైన జలపాతాలు, పర్వత శిఖరాలతో

ప్రకృతి అందాలకు నిలయమైన జలపాతాలు, పర్వత శిఖరాలతో

కూర్గ్‌లో చూడదగిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ ప్రకృతి అందాలకు నిలయమైన జలపాతాలు, పర్వత శిఖరాలతో పాటు ధార్మిక ప్రాంతాలు కూడా ఎన్నో ఉన్నాయి. కర్నాటక జీవనదిగా పర్కొనబడే కావేరి జన్మస్థలమైన భాగమండలం, టిబేటియన్‌ గోల్డన్‌ టెంపుల్‌, ఓంకారేశ్వర దేవస్థానాలను చూసేందుకు దేశ విదేశాల నుంచి హిందూ, బౌధ మతానికి సంబంధించిన భక్తులు ఎక్కువ మంది ఇక్కడికి వస్తుంటారు.

జలపాతాల నిలయం

జలపాతాల నిలయం

హారంగి డ్యాం, కావేరి నిసర్గధామ, దుబారే ఎలిఫెంట్‌ క్యాంప్‌, అబ్బి జలపాతం, ఇర్ఫు జలపాతం, మళ్లళ్లి జలపాతం ఇలా ఎన్నో జలపాతాలను ఈ ప్రాంతంలో మనం చూడవచ్చు. అదే విధంగా మడికేరి కోట, నాల్కోనాడ్‌ ప్యాలెస్‌ వంటివి కూడా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.

నిసర్గధామ ఐల్యాండ్‌ను

నిసర్గధామ ఐల్యాండ్‌ను

మడికెరీకి ముప్ఫై కిలోమీటర్ల దూరంలో ఉండే నిసర్గధామ ఐల్యాండ్‌ను చూడకపోతే కూర్గ్ సందర్శన పూర్తి చేసినట్టు కాదు. కావేరీ జలాల మధ్య ఏర్పడిన ఈ దీవిలో వెదురు, చందనపు చెట్ల అందాలు వర్ణించతరం కాదు. కుందేళ్ల పార్క్, లేళ్ల పార్క్, నెమళ్ల పార్కులు ఈ దీవిలో తప్పక చూడాల్సిన ప్రత్యేకతలు. ఏనుగు స్వారీ, బోట్ రైడ్స్ వంటి అదనపు ఆకర్షణలూ ఉన్నాయి.

Photo Courtesy: Tinucherian

కొండల మీద నుండి పరవళ్ళు తొక్కుతూ జలపాతాలు

కొండల మీద నుండి పరవళ్ళు తొక్కుతూ జలపాతాలు

కొండల మీద నుండి పరవళ్ళు తొక్కుతూ జలపాతాలు క్రింది దూకుతుంటాయి. పశ్చిమకనుమల్లోని జలపాతాలు అడుగడుగునా పలకిస్తూ పులకరిస్తుంటాయి. దేని శోభ దానిదే. మరొక దానితో పోల్చలేము.

Photo Courtesy: Tinucherian

రోప్ బ్రిడ్జి లేదా హ్యాంగింగ్ బ్రిడ్జ్

రోప్ బ్రిడ్జి లేదా హ్యాంగింగ్ బ్రిడ్జ్

వెరైటీ గా ప్రకృతి అందాలు కల నిసర్గ ధామను ఒక రోప్ బ్రిడ్జి ద్వారా చేరాలి. స్థానికులు, టూరిస్ట్ లు ఈ ప్రదేశాన్ని అమితంగా ఇష్టపడతారు. ఇక్కడ నుండి మీరు మడి కేరి చేరవచ్చు. మార్గం పొడవునా అనేక కాఫీ లేదా సుగంధపు ద్రవ్యాల తోటలు చూస్తూ ప్రయాణం చేయవచ్చు.

Photo Courtesy: Siji Menon

ముద్దు ముద్దగా కనిపంచే కుందేళ్ళు

ముద్దు ముద్దగా కనిపంచే కుందేళ్ళు

రోప్ బ్రిడ్జ్ దాటతానే వివిధ రంగుల్లో ముద్దు ముద్దగా కనిపంచే కుందేళ్ళు, అక్కడి నుండి కదలనివ్వకుండా చేస్తాయి.

Photo Courtesy: Tinucherian

ఎలిఫెంట్ సఫారీ

ఎలిఫెంట్ సఫారీ

చెక్క వంతెనలు, చెక్క రహదారుల మధ్య ఎలిఫెంట్ సఫారీ పర్యాటలకును అమితంగా ఆకర్షిస్తుంది.

Photo Courtesy: Tinucherian

జింకల పార్క్:

జింకల పార్క్:

కావేరీ నిసర్గ ధామ లో జింకల పార్క్ ప్రధాన ఆకర్షణ. అందమైన జింక పిల్లలకు ఆహారాన్ని అందివ్వడానికి పర్యాటకులు ఎక్కువగా ఉత్సహాం చూపిస్తూ ఆనందిస్తుంటారు.

Photo Courtesy: Tinucherian

వెదురు షెల్టర్లు:

వెదురు షెల్టర్లు:

వెదురు పొదల్లో నడుచుకుంటూ వచ్చే పర్యాటకలు అక్కడక్కడ సేద తీరడానికి బ్యాంబూ షెడ్స్ ను ఏర్పాటు చేయడం వల్ల పర్యాటకలు కొద్ది సమయం అక్కడ సేద తీరవచ్చు. రిసార్ట్ లోపల ఇలాంటీ వెదురు షెల్టర్లు అనేకం ఉన్నాయి.

Photo Courtesy: Siji Menon

ఉడెన్ కాటేజ్ :

ఉడెన్ కాటేజ్ :

రాత్రుల్లో ఎవరైన అక్కడే బస చేయాలని కోరుకునే వారి కోసం ఉడెన్ కాటేజ్ లు అందుబాటులో ఉన్నాయి. నది ప్రక్కన ఉడెన్ కాటేజ్ బాల్కనీ నుండి చూడటం చాలా అద్భుతంగా..ఉల్లాసంగా ఉంటుంది.

Photo Courtesy: Akshatha Vinayak

ఓల్డ్ బ్రిడ్జ్ :

ఓల్డ్ బ్రిడ్జ్ :

పర్యాటలకు ప్రస్తుతం ఉన్న కొత్త బ్రిడ్జ్ నుండి పాత బ్రిడ్జ్ ను తిలకించవచ్చు. అయితే పాత బ్రిడ్జ్ నడవడానికి వీలుపడని కారణంగా దాన్ని ఇప్పుడు మూసివేయబడినది.

Photo Courtesy: Tinucherian

పర్యాటకులకు బసచేసేందుకు కాటేజీలు కలవు.

పర్యాటకులకు బసచేసేందుకు కాటేజీలు కలవు.

పర్యాటకులకు బసచేసేందుకు కాటేజీలు కలవు. వినోద, విహారాలు కోరే పర్యాటకులకు ఈ ప్రదేశం ఎంతో ఆనందం కలిగిస్తుంది.

ప్రశాంతతకు ఆలవాలమైన నిసర్గధామ పర్యా టక స్థలాలు ప్రకృతి రమణీయతకు అద్దం పడుతున్నాయి.ఇలా ప్రకృతి రమణీయతనంతా ఒకే చోట పోతపోసినట్లు ఉన్న ఈ అద్భుత దృశ్యాలను ఒక్కసారెైనా దర్శించాల్సిందే.

Pic credit: Viswaprasad Raju

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X