Search
  • Follow NativePlanet
Share
» »కేర‌ళ అంటే.. ప్ర‌కృతి అందాల‌కే కాదు.. చారిత్ర‌క కోట‌ల‌కూ నిల‌యం!

కేర‌ళ అంటే.. ప్ర‌కృతి అందాల‌కే కాదు.. చారిత్ర‌క కోట‌ల‌కూ నిల‌యం!

కేర‌ళ అంటే.. ప్ర‌కృతి అందాల‌కే కాదు.. చారిత్ర‌క కోట‌ల‌కూ నిల‌యం!

కేరళ ప్రకృతి అందాలకు మాత్రమే కాదు.. అనేక చారిత్రక కోటలకు ప్ర‌సిద్ధి పొందింది. నిజానికి, కేరళ సందర్శన అన‌గానే, ప్రశాంతమైన బ్యాక్ వాటర్, ఆకాశాన్ని తాకేట్లు క‌నిపించే కొబ్బరి చెట్లు, సముద్రపు ఉప్పు చేప‌లు, అల‌ల‌పై తేలియాడే పడవ ప్రయాణం ఇలా చాలా జ్ఞాప‌కాలు గుర్తుకు వస్తాయి. అందుకే కాబోలు ప్రకృతి సౌందర్యం దృష్ట్యా కేరళ చాలా అందమైన నగరంగా చెప్పుకుంటారు. ఇది దేవుని స్వంత దేశం అని పిలువబడిందంటే దాని అందాన్ని అంచనా వేయవచ్చు. అయితే, ఈ రాష్ట్రం ప్రకృతి ప్రేమికులకు స్వర్గం మాత్రమే కాదు, చరిత్రపై ఆసక్తి ఉన్నవారికి విడిది కేంద్రం. అందుకే కేర‌ళ‌లో దాగిన ఆ చారిత్ర‌క నిర్మాణాల విశేషాల‌ను తెలుసుకుందాం.

కేరళ రాష్ట్రంలో అనేక చోట్ల పురాతన‌ కోటలు ఉన్నాయి. వీటిని చారిత్రక కోణం ప‌రిశీలిస్తే చాలా ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు తెలుసుకోవ‌చ్చు. వీటిలో కొన్ని 16వ శతాబ్దానికి చెందినవి. ఇవి నేడు శిథిలాలుగా మారాయి. కానీ ఇప్పటికీ పర్యాటకుల నుండి చరిత్రకారుల వరకు ఆకర్షిస్తున్నాయి. కేరళలో ఉన్న కొన్ని పురాతన కోటలలో ముఖ్య‌మైన‌వి..

సెయింట్ ఏంజెలో కోట

సెయింట్ ఏంజెలో కోట

సెయింట్ ఏంజెలో కోటను 1505లో నిర్మించారు. దీనిని కన్నూర్ కోట అని కూడా అంటారు. ఈ కోట‌ను స్థానిక పాలకుడు అలీ రాజాస్ అనుమతితో భారతదేశపు మొదటి పోర్చుగీస్ వైస్రాయ్ డోమ్ ఫ్రాన్సిస్కో డి అల్మేడా నిర్మించారు. ఈ భారీ నిర్మాణం పైనుంచి ప‌రిశీలిస్తే.. అరేబియా సముద్రం యొక్క అందమైన విశాల దృశ్యాలను క‌ళ్ల‌ముందు చూపిస్తుంది. ఈ కోటను లేటరైట్ రాళ్ల సహాయంతో నిర్మించారు.

పల్లిపురం కోట

పల్లిపురం కోట

పల్లిపురం కోటను అయికోట లేదా అలికోట అని కూడా అంటారు. ఎర్నాకులంలో ఉన్న పల్లిపురం కోట భారతదేశంలో ప్రస్తుతం ఉన్న పురాతన యూరోపియన్ కోటలలో ఒకటి. దీనిని 1503లో పోర్చుగీసు వారు నిర్మించారు. లేటరైట్, సున్నం మరియు కలపతో నిర్మించబడిన ఈ కోట అపురూప నిర్మాణ శైలిలో ఉంది. అయితే, ఈ కోట ఇప్పుడు శిథిలావస్థకు చేరుకుంది. కోట చుట్టూ ద‌ట్ట‌మైన వృక్షాల‌తో నిండిపోవ‌డం వ‌ల్ల ఇక్క‌డ ప‌ర్యాట‌కం ఎంతో స‌హ‌నంతో కూడుకున్న‌ది.

పాలక్కాడ్ కోట

పాలక్కాడ్ కోట

పాలక్కాడ్ నడిబొడ్డున ఉన్న ఈ కోట దక్షిణ భారతదేశంలోని నేటికీ చెక్కుచెద‌ర‌ని కోటలలో ఒకటిగా చెప్పుకోవ‌చ్చు. ఇది 1766లో మైసూర్ రాజ్య పాలకుడు హైదర్ అలీ ఖాన్ పర్యవేక్షణలో నిర్మించబడింది. ఈ కోటను టిప్పు కోట అని కూడా అంటారు. ఒకప్పుడు కోటను జామోరిన్ సైన్యం కొంతకాలం ఆక్రమించిందని చెబుతారు. నేడు, కోటలో ప్రభుత్వ కార్యాలయాలు, సబ్ జైలు మరియు చిన్న దేవాలయం కూడా ఉన్నాయి.

హోస్‌దుర్గ్ కోట

హోస్‌దుర్గ్ కోట

ఇది కూడా కాసరగోడ్‌లో ఉన్న పురాతన కోట. ఈ హోస్‌దుర్గ్ కోటను ఇక్కేరిలోని కేలాడి నాయక్ రాజవంశానికి చెందిన సోమశేఖర్ నాయక్ నిర్మించారు. నేడు కోట యొక్క శిధిలాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇక్క‌డికి సమీపంలో స్వామి నిత్యానంద ఆశ్రమం ఉంది. ఇందులో 45 గుహలు ఉన్నాయి.

చంద్రగిరి కోట, కాసరగోడ్

చంద్రగిరి కోట, కాసరగోడ్

కాసరగోడ్‌లోని చంద్రగిరి కోట పయస్విని నది అరేబియా సముద్రం కలిసే ప్రదేశంలో ఉంది. ఈ కోట 17వ శతాబ్దంలో నిర్మించబడింది. విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత బెద్నాపూర్‌కు చెందిన శివప్ప నాయక్ ఈ కోటను నిర్మించాడు. ఇది సముద్ర మట్టానికి 46 మీటర్ల (150 అడుగులు) ఎత్తులో ఒక కొండ పైన ఉంది.

బేకల్ ఫోర్ట్, కాసరగోడ్

బేకల్ ఫోర్ట్, కాసరగోడ్

ఈ కోటను క్రీ.శ.1650లో కేలాడికి చెందిన శివప్ప నాయక్ నిర్మించాడు. 40 ఎకరాల్లో విస్తరించి ఉన్న బేకల్ కోట కేరళలో అతిపెద్ద కోట. మీరు ఇక్కడ ఉన్నట్లయితే, మీరు చుట్టుపక్కల బీచ్ యొక్క ఆహ్లాదకరమైన అనుభూతిని పొందుతారు. ఇక్కడ నుండి సూర్యాస్తమయాన్ని చూడటం కూడా జీవితంలో మ‌ర్చిపోలేని అనుభవం.

Read more about: kerala st angelo fort
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X