• Follow NativePlanet
Share
» »తెలుగు రాష్ట్రాలలోని రాక్షస గుళ్ళు

తెలుగు రాష్ట్రాలలోని రాక్షస గుళ్ళు

Written By: Venkatakarunasri

గుప్తనిధి వేటగాళ్ళు నిదినిక్షేపాల కొరకై ప్రాచీన ఆలయాలు,పురాతనకోటలు, పాతకాలపు బురుజులను ధ్వంసం చేసేవారు. ఇప్పుడు వారి దృష్టి ఆంధ్రప్రదేశ్ లో విస్తారంగా వున్న రాక్షస గుళ్ళుపై పడింది.రాక్షసగుళ్ళలో విస్తారంగా నిధినిక్షేపాలు వుండటమే అందుకు కారణమా? అసలు రాక్షసగుళ్ళు అంటే ఏమిటి? నిజంగానే రాక్షసగుళ్ళలో నిధినిక్షేపాలు వున్నాయా?వుంటే వాటి లోకి ఆ నిధినిక్షేపాలు ఎక్కడనుంచి వచ్చాయి?

క్రీ.పూ.2000సం.ల నుండి క్రీ.పూ.500సం.ల మధ్యకాలంలో మానవులు ఎటువంటి జీవనం సాగించేవారు? వారు ఎటువంటి పనిముట్లను ఉపయోగించేవారు? వారు ఎలాంటి ఆహారాన్ని తీసుకునేవారు?మరియు వారి జీవనశైలి ఎలా వుండేది? అనే విషయాలను పరిశోధించుటకు చరిత్రకారులకు బాగా ఉపయోగపడిన చారిత్రికఆధారాలు ఈ రాక్షసగుళ్ళు.వీటిని పాండవ గుళ్ళుఅనీ,ఇంగ్లీష్ లో మెగాలిథ్స్ అని అంటారు.

కొత్త రాతియుగంలో మనిషి గుంపులు గుంపులుగా సంచారం జీవనం సాగించేవాడట.. ఆ ఆదిమ తెగలు తమలో ఎవరైన చనిపోతే తమకు పునర్జన్మ ఉంటుందని భావించి చనిపోయిన శవాన్ని పెద్ద మట్టి కుంట తయారు చేసి అందులో పెట్టి ఆకులు, నారలతో చుట్టి దాన్ని భూమిలో పాతి పెట్టేవారు. ఆ తరువాత ఆ శవాన్ని ఏదీ పీక్క తినకుండా పెద్ద పెద్ద రాళ్లను చుట్టూ పెట్టేవారట. వీటిని పురావస్తు శాస్త్రవేత్తలు పాండవ గుళ్లు లేదా రాక్షస గూళ్ళు గా వ్యవహరిస్తారు.

ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రతి జిల్లాలో రాక్షస గుళ్ళు అధికంగా ఉన్నాయి... గుప్తనిధి వేటగాళ్ళు వాటిని త్రవ్వి నాశనం చేస్తున్నారు...దానికి కారణం ఏమిటి ?

రాక్షస గుళ్లు అంటే ఏమిటి?

రాక్షస గుళ్లు అంటే ఏమిటి?

రాక్షస గూళ్లు బయల్పడటం, ఆయా ప్రాంతంలో పురాతన మానవ ఆవాసానికి ఆనవాళ్ళు. చనిపోయినవారిని సమాధి చేసి పెద్దపెద్ద ప్రాకారాలు నిర్మించేవారు. ఆ సమాధుల్ని రాక్షస గుళ్లు అంటారు.

pc:youtube

రాక్షస గుళ్ళు

రాక్షస గుళ్ళు

ఈ భారీ అంత్యక్రియకు సంబంధించిన కట్టడాలు శ్రీకాకుళం, విజయనగరం, ఉభయ గోదావరి జిల్లాల్లో తక్కువగా, మిగిలిన చోట్ల ఎక్కువగా ఉండేవి. రాయలసీమలో వీటిని నేటికీ పాండవ గుళ్లు అంటారు.

pc:youtube

రాక్షస గుళ్ళు

రాక్షస గుళ్ళు

కర్నూలు జిల్లా శంఖవరంలో గొర్రె ఆకారంలో, నల్గొండ జిల్లా ఏలేశ్వరంలో ఏనుగు ఆకారంలో విశేష నిర్మాణాలు బయల్పడినవి. పెద్ద పెద్ద బండరాళ్ళతో నిర్మించిన ఈ సమాధులు క్రీ.పూ.2000 నుండి క్రీ.పూ.500 సంవత్సరాల మధ్య కాలం నాటివిగా చరిత్రకారులు పేర్కొన్నారు.

pc:youtube

రాక్షస గుళ్ళు

రాక్షస గుళ్ళు

ఈ సమాధులలో మృతుల అస్థికలు గాని, మృతదేహాన్ని గాని ఉంచి వారికి సంబంధించిన వస్తువులను కూడా పూడ్చడం నాడు ఆచారంగా ఉండేది. పురాతత్వ శాస్త్రవేత్తలు వీటిని పరిశీలించి ఈ సమాధులలో బంగారు ఆభరణాలు, వేణువులు, ఇతర వస్తు సముదాయాలను బయల్పరిచారు.

pc:youtube

స్మృతి చిహ్నాలు

స్మృతి చిహ్నాలు

మృతి చెందిన వారితో పాటు వారి వస్తువులను కూడా సమాధులలో ఉంచితే అతని ఆత్మకు శాంతి కలుగుతుందని నాటి ప్రజల విశ్వాసం. సమాధుల చెంత స్మృతి చిహ్నాలుగా శిలాస్తంభాలు ఉంచేవారు. ఇక్ష్వాకు వంశీయుల నాటి ఛాయా స్తంభాలు నాగార్జున కొండ వద్ద తవ్వకాలలో బయల్పరిచారు.

pc:youtube

పురాతత్వ శాస్త్రవేత్తలు

పురాతత్వ శాస్త్రవేత్తలు

ఈ సమాధుల్లోనూ రకాలు ఉన్నాయి. అవి 1. డాల్మెన్‌లు, 2. సిస్త్‌లు ఈ రెండు రకాల సమాధులు తెలుగు నేల మీద వేల సంఖ్యలో ఉన్నట్లు పురాతత్వ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ రెండు రకాల సమాధులకు పై కప్పు బండలకు రంధ్రములు ఏర్పరిచి ఉన్నాయి. ఈ రంధ్రాల ద్వారా ప్రేతాత్మ సమాధి నుండి బయటికి వచ్చి సంచరించి, తిరిగి సమాధులలోకి పోతుందని ఆనాటి ప్రజల విశ్వాసం.

pc:youtube

డాల్మెన్‌లు

డాల్మెన్‌లు

రాతి పలకలతో పెట్టె వలె నిర్మించి, పైన మూత వలె పెద్ద రాతి పలకను ఉంచెడి లోహ యుగం నాటి సమాధులను డాల్మెన్‌లు అంటారు. రాతి పలకకు ఒకవైపు పెద్ద రంధ్రం ఏర్పాటు చేస్తారు. ఈ రాతి పెట్టెను భూమి ఉపరి భాగంలో ఉంచి, శవంతో పాటు, మృతుడు వాడిన వస్తువులను అందులో ఉంచి పైన రాతి పలకను ఉంచెడివారు.

pc:youtube

సిస్త్‌లు

సిస్త్‌లు

పెద్ద గోయి తీసి రాతి పలకలతో సిద్ధపరచిన పెట్టెను శవంతో పాటు భూస్థాపితం చేసి, చుట్టూ వృత్తాకారంలో పెద్ద పెద్ద రాతిగుండ్లను పేర్చి సురక్షితమొనర్చిన సమాధులను సిస్త్‌లు అని అంటారు.

pc:youtube

మెగాలిథ్స్ అంటే ఏమిటి?

మెగాలిథ్స్ అంటే ఏమిటి?

మెగాలిథ్స్ అంటే పెద్ద రాళ్ళతో నిర్మించిన నిర్మాణాలు అని అర్థం. ఇలాంటి మెగాలిథ్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణారాష్ట్రాలలో అధికసంఖ్యలో బయలుపడినాయి.వీటిని కొత్తరాతి యుగం మరియు ఇనుపయుగమునకు చెందిన నిర్మాణాలుగా చరిత్ర కారులు నిర్దారించారు.

pc:youtube

రాక్షస గుళ్ళు

రాక్షస గుళ్ళు

ఆనాటి ప్రజలు తమ వారు ఎవరైనా చనిపోతే వారి అస్తికలు లేదా మృతదేహాలను వాటితోపాటు వారుపయోగించిన వస్తు సామాగ్రిని ఈ రాక్షగుళ్ళలో సమాధిచేసేవారు.

pc:youtube

రాక్షస గుళ్ళు

రాక్షస గుళ్ళు

ఈ వస్తుసామాగ్రిలో ఇనుప పనిముట్లతో పాటు, బంగారుఆభరణాలు, మట్టి పాత్రలు వివిధ చిత్రలేఖనాలు కూడా లభించాయి.వివిధ రాక్షస గుళ్ళు తెలుగురాష్ట్రాలతో పాటు, దక్షిణభారతదేశమంతటా మరియు పశ్చిమ మరియు మధ్యఆసియాలో అనేక చోట్ల బయలుపడినాయి.

pc:youtube

రాక్షస గుళ్ళు

రాక్షస గుళ్ళు

ఆంధ్రప్రదేశ్ లో రాక్షసగుళ్ళు దాదాపుగా 12రకాలు వున్నాయి. వివిధ తెగలవారు విశ్వాసాలు, సాంప్రదాయాలకు అనుగుణంగా వీటిని వివిధరకాలుగా నిర్మించారని భావన.

pc:youtube

రాక్షస గుళ్ళు

రాక్షస గుళ్ళు

వీటిలో చనిపోయినవారికి స్మృతి చిహ్నంగా శిలాస్థంభాలను నిలపటం ఒక రకం.ఇలాంటి స్థంభాలను "మిన్హిర్" అని అంటారు.ఈ మిన్హిర్ రకపు మెగాలిథ్స్ కృష్ణాజిల్లాలో అధికంగా కనిపిస్తాయి.

pc:youtube

రాక్షస గుళ్ళు

రాక్షస గుళ్ళు

భారతదేశంలోని కొన్నిచోట్ల నేటికీ సమాధులపై స్మృతి చిహ్నాలుగా "మిన్హిర్" లను నిలిపే ఆచారం వుంది. నాగార్జునాకొండ ప్రాంతాలలో మిన్హిర్ రకానికి చెందిన రాక్షస గుళ్ళు బయలుపడినాయి.

pc:youtube

రాక్షస గుళ్ళు

రాక్షస గుళ్ళు

పెద్ద రాతిఫలకలతో పెట్టవలె నిర్మించి దానిపై మూతగా మరో రాతిఫలకంనుంచడం ఇంకో పధ్ధతి.ఇందులో ఒక రాతిఫలకకు పెద్ద రంధ్రముంటుంది. ఇలా నిర్మించిన రాతిపెట్టె భూమి ఉపరితలం మీద వుంటే దాల్మిన్ అని అంటారు.

pc:youtube

రాక్షస గుళ్ళు

రాక్షస గుళ్ళు

దాల్మిన్ రకానికి చెందిన మెథాలిక్స్ గోదావరి, కృష్ణా, చిత్తూరుజిల్లాలో అధికం. రాతిఫలకలతో నిర్మించిన పెట్టెను భూస్థాపితం చేసి చుట్టూ వృత్తాకారంలో రాతిగుళ్ళను పేర్చిన,అట్టి రాక్షస గుళ్ళను సిస్తులు అంటారు.సిస్తు రకమునకు చెందిన నిర్మాణాలు విశాఖపట్టణంమినహా ఆంధ్రప్రదేశ్ లోని అన్నిజిల్లాలోనూ కనిపిస్తాయి.

pc:youtube

రాక్షస గుళ్ళు

రాక్షస గుళ్ళు

మట్టి శవపేటికలలో అస్థికలను గానీ,మృతదేహాలను గానీ వుంచి పాతిపెట్టే రాక్షసగుళ్ళు చిత్తూరు,అనంతపురం జిల్లాలో అధికంగా దర్శనమిస్తాయి.మెగాలిథిక్స్ కోసం నిర్మించే రాతి పెట్టెలు రక రకాలుగా వుంటాయి. కొన్ని చోట్ల రాతిపెట్టెలకు కాళ్ళను కూడా అమర్చినారు.

pc:youtube

రాక్షస గుళ్ళు

రాక్షస గుళ్ళు

కడపజిల్లా శంఖవారంలో లభ్యమైన రాతి పెట్టె పుర్రె ఆకారంలోను,నల్గొండజిల్లా ఏలేశ్వరంలో లభించిన పెట్టె ఏనుగుఆకారంలోనూ వున్నాయి.ఈ రాక్షసగుళ్ళ పరిశీలన తర్వాత క్రీ.పూ.500సం.లకు సంబంధించిన అనేక చారిత్రక,నాగరిక విశేషాలు బయటపడుతున్నాయి.

pc:youtube

రాక్షస గుళ్ళు

రాక్షస గుళ్ళు

ఈ రాక్షసగుళ్ళలో ఇనుపపనిముట్లు, ఆయుధాలు,బంగారుఆభరణాలు విరివిగా లభించటం వలన దక్షిణభారత ప్రజలు,ఉత్తరప్రాంతానికి చెందిన వారితో ప్రమేయం లేకుండానే ఇనుపపనిముట్లు తయారుచేయటం నేర్చుకున్నారని చరిత్రకారులు అంచనా.

pc:youtube

రాక్షస గుళ్ళు

రాక్షస గుళ్ళు

ఇనుపపనిముట్లు వాడుకలోనికి రావటం వలన వ్యవసాయం తద్వారా వాణిజ్యం బాగా అభివృద్ది చెంది గ్రామాలు క్రమంగా నగరాలై, నాగరికత పెంపొందుటకు దోహదం చేసింది.ఏలేశ్వరం దగ్గర ఒకే రాక్షసగుళ్ళలో స్త్రీ,మరియు పురుషుల కళేబరాలు లభించాయి.

pc:youtube

రాక్షస గుళ్ళు

రాక్షస గుళ్ళు

దీనినిబట్టి ఆనాటికే సతీ సహగమనం ఆచరణలో వుండొచ్చు.లేదా అక్రమసంబంధాలు నెరిపే వారిని గానీ,జాత్యాంతర ప్రేమలో పడ్డవారిని గాని మరణ శిక్షవిధించి వారి ఆత్మలుశాంతించుటకు వారిని ఒకే మెథాలిక్ లో సమాధిచేసి వుండవచ్చు.

pc:youtube

రాక్షస గుళ్ళు

రాక్షస గుళ్ళు

రాక్షసగుళ్ళను నిర్మించిన ప్రజలకు మరణానంతర జీవితంపై అచంచల విశ్వాసం వుండటం మూలంగానే ఈ రాక్షసగుళ్ళ నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ కనపరచారు.అందుచేతనే వాటిలో వారు ఉపయోగించే వస్తువులతోపాటు విలువైన వస్తుసంపదను వుంచేవారు.

pc:youtube

రాక్షస గుడి గుప్త నిధులు

రాక్షస గుడి గుప్త నిధులు

ద్రవిడభాషలు మాట్లాడే ప్రాంతాలలోను, మధ్యధరాప్రాంతాలలోను,రాక్షసగుళ్ళు అధికంగా బయలుపడటం మూలం వలన మధ్యధరా జాతులవారు ఇక్కడకు వలసవచ్చి వుంటారని ఈ రాక్షసగుళ్ళను వారే నిర్మించివుంటారని కొంత మంది చరిత్రకారుల భావన.

pc:youtube

రాక్షస గుళ్ళు

రాక్షస గుళ్ళు

మెగాలిథ్స్ లోని రాతిఫలకలకు వున్న రంధ్రాలను బట్టి జీవి భూమిపై కి రాకపోకలు జరుపుతుందని వారు విశ్వసించేవారని తెలుస్తుంది. తమిళనాడులోని కొన్ని మెగాలిథ్స్ లలో దొరికిన త్రిశూలాలను బట్టి ఆనాడు అక్కడప్రజలు శైవమతంను ఆచరించే వారని తెలుస్తుంది.

pc:youtube

రాక్షస గుళ్ళు

రాక్షస గుళ్ళు

ఏది ఏమైనప్పటికీ ఈ రాక్షసగుళ్ళు మనపూర్వికుల జీవనశైలికి నిలువెత్తు నిదర్శనం. కొత్త రాతియుగం మరియు ఇనుపయుగంలోనే మానవనాగరికతాఅభివృద్ధికి బీజంపడింది అనటానికి తిరుగులేని సాక్ష్యాలు.ఇలాంటి చారిత్రికఅవశేషాలు మన ఆంధ్రప్రదేశ్ లో ప్రతి జిల్లాలోనూ వుండటం మనకు గర్వకారణం.

pc:youtube

రాక్షస గుళ్ళు

రాక్షస గుళ్ళు

భవిష్యత్తు తరాల అవగాహనకు ఈ చారిత్రకఆధారాలను పరిరక్షించుట మనవిధి.కానీ పురాతన అవశేషాలను ధ్వంసం చేసి అక్కడ లభించిన విలువైన సామాగ్రిని విదేశాలకు అమ్ముకునే కేటగాళ్ళ దృష్టి మెగాలిథిక్స్ లపై పడింది.ఇప్పటికే కొన్ని రాక్షసగుళ్ళను వాళ్ళు నాశనంచేసారు.

pc:youtube

రాక్షస గుళ్ళు

రాక్షస గుళ్ళు

అధికారికలెక్కలకు రాని కొన్నివేల మెగాలిథ్స్ రాష్ట్రంలో వున్నాయి.వాటిలో కొన్నింటిని ఈ గుప్తనిధులవేటగాళ్ళు కాల గర్భంలో కలిపి వేసారు.కావున ఈ దుర్మార్గులను కటకటాల పాలు చేయుటకు ప్రజలు,కటిన శిక్షలు విధించటానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.అంతే కాక ఈ నిర్మాణాల రక్షణకు ప్రత్యేక శ్రద్ధ కనపరచాలి.అప్పుడే ఎంతో విలువైన ఈ చారిత్రకఅవశేషాలను కాపాడిన వారం అవువుతాము.

pc:youtube

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more