Search
  • Follow NativePlanet
Share
» »ఆ సమయంలో ఈ గుడిలోకి పోతే రాళ్లుగా మారిపోతారట!

ఆ సమయంలో ఈ గుడిలోకి పోతే రాళ్లుగా మారిపోతారట!

By Staff

ప్రపంచములో ఎన్నో గొప్ప గొప్ప దేవాలయాలు ఉన్నాయి. వాటన్నింటిని చూసి రావాలంటే ఈ జన్మ చాలదు. మనకు తెలియని విషయాలు, వింతలు వీటిచుట్టూ అప్పటికీ ఇప్పటికీ తిరుగుతూనే ఉన్నాయి. కాలానుగుణంగా ఈ దేవాలయాలు కొంత కాలం స్తబ్దుగానే ఉన్నా సోషల్ మీడియా పుణ్యమా అని వెలుగులోకి వస్తున్నాయి. దాంతో పర్యాటకులు అక్కడికి వెళ్లి ఆ వింతలేంటో, విశేషాలేంటో తెలుసుకొని వస్తున్నారు. ఎన్ని ఉన్నా కొన్ని వింతలు మాత్రం ఇప్పటికీ రహస్యాలుగానే ఉన్నాయి. ఎన్నేళ్ళైనా వీటిలో మార్పు రావటం లేదు.

ఇక అసలు విషయానికి వద్దాం. రాజస్థాన్ లో ఒక దేవాలయం ఉంది. ఏముంది అంటారా ? అక్కడికే వస్తున్నా. ఇంతవరకు సినిమాలో ముట్టుకోగానే రాళ్లుగా మారటాన్ని గమనించి ఉంటాం అవునా ? సరిగ్గా ఈ దేవాలయం కూడా అలాంటిదే! వెళ్ళారా, రాయిగా మారాల్సిందే!

ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం : కిరడు ఆలయానికి సమీపాన 128 కి. మీ ల దూరంలో జైసల్మీర్ ఎయిర్ పోర్ట్ కలదు. ఇక్కడి నుండి క్యాబ్ లేదా టాక్సీలను అద్దెకు తీసుకొని ప్రయాణించవచ్చు.

రైలు మార్గం : బార్మర్ రైల్వే స్టేషన్ కిరడు ఆలయానికి సమీపాన 30 కి. మీ ల దూరంలో కలదు. స్థానిక బస్సులలో, అద్దె వాహనాలలో ప్రయాణించి చేరుకోవచ్చు.

బస్సు/ రోడ్డు మార్గం : కిరడు దేవాలయానికి బార్మర్ , జైసల్మీర్ తదితర సమీప ప్రాంతాల నుండి బస్సులు వస్తుంటాయి.

ఇది కూడా చదవండి : థార్ ఎడారి లో ఏమేమి చూడాలి ?

ఎక్కడ ఉంది ?

ఎక్కడ ఉంది ?

రాజస్థాన్ లోని బార్మర్ జిల్లాలో కిరడు దేవాలయం కలదు. ఇది జైసల్మీర్ కు 157 కిలోమీటర్ల దూరంలో థార్ ఎడారిలోని ఒక టౌన్ లో ఉంది.

చిత్రకృప : Parminder Singh

ఆలయాలు

ఆలయాలు

ఒకప్పుడు ఇక్కడ చాలా ఆలయాలు ఉండేవట. కానీ ప్రస్తుతం ఐదు ఆలయాలు మాత్రమే కనిపిస్తాయి. ఈ దేవాలయాలన్నీ అద్భుత శిల్పశైలితో మరియు సోలంకి నిర్మాణ శైలిలో నిర్మించారు.

చిత్రకృప : Parminder Singh

సూర్యాస్తమయం దాటితే

సూర్యాస్తమయం దాటితే

ఈ దేవాలయంలో సూర్యాస్తమయం దాటిన తర్వాత ఎవ్వరూ లోనికి రారు. రాత్రుళ్ళు నిద్రపోరు. ఒకేవేళ ఉంటె వారు రాళ్లుగా మారుతారు.

చిత్రకృప : Parminder Singh

అద్భుతమైన కట్టడాలు

అద్భుతమైన కట్టడాలు

ఈ దేవాలయాలను గనక మీరు చూస్తే ఎడారిలో కూడా ఇంతటి అద్భుతమైన కట్టడాలు ఉంటాయా ? అని అనిపించకమానదు.

చిత్రకృప : Parminder Singh

శివ ఉపాసకులు

శివ ఉపాసకులు

దాదాపు దేవాలయాలన్నీ శివాలయానికి చెందినవి. అందుకేనేమో ఈ ఊరిలో ఎక్కువగా శివుని ఉపాసకులు ఉంటారు.

చిత్రకృప : Parminder Singh

తురుష్కుల దాడిలో

తురుష్కుల దాడిలో

క్రీ.శ. 12 వ శతాబ్దంలో కిరడు రాజ్యాన్ని సోమేశ్వర్ అనే రాజు పరిపాలించేవాడు. అయన కాలంలోనే ఈ దేవాలయాలన్నీ తురుష్కుల దాడిలో ధ్వంసం అయ్యాయి.

చిత్రకృప : Parminder Singh

అసలు రహస్యం

అసలు రహస్యం

కిరడు దేవాలయంలో ఇలా రాళ్లుగా మారటానికి ఒక చిన్న కథ ఉంది. అదేమిటంటే ఒక సాధువు తన ప్రియ శిష్యులతో కలిసి దేవాలయానికి వచ్చాడట. అతను శిష్యులను దేవాలయంలో వదిలి స్థానికంగా ఉన్న ప్రాంతాన్ని చూడటానికి వెళ్ళాడట.

చిత్రకృప : Parminder Singh

అటునుంచి ఆటే

అటునుంచి ఆటే

సాధువు అలాగే అటునుంచి ఆటే రాజ్యంలోని మరికొన్ని ప్రదేశాలను చూడటానికి వెళ్ళాడట. అసలు శిష్యులు ఉన్న విషయమే మరిచిపోయాడట.

చిత్రకృప : Parminder Singh

శాపం

శాపం

అప్పడే కొన్ని రోజులు గడిచిపోయాయి. శిష్యులు తిండి దొరక్క ఆ ఎడారి ప్రాంతంలో జబ్బు పడ్డారు. ఊరి వారు ఎవరూ వారికి సహాయపడలేదు. కొన్ని రోజుల తర్వాత వచ్చిన ఋషి జరిగిన విషయాన్ని తెలుసుకొని ఆగ్రహించి - "రాళ్ళ లాంటి హృదయం కలిగిన స్థానికులను రాళ్లుగా మారిపో"మని శపించాడట.

చిత్రకృప : Krishna Kumar Debnath

వెనక్కు తిరగకుండా వెళ్ళు

వెనక్కు తిరగకుండా వెళ్ళు

కాగా ఆ ఊరిలో ఒక మహిళ మాత్రం శిష్యులకు సహాయం చేసిందట. దాంతో సాధువు ఆమెకు శాపం వర్తించకుండా చేసాడు. అయితే ఆమెను వెనక్కు తిరగకుండా వెళ్ళమని చెబుతాడు. కానీ మహిళ మాత్రం వెనక్కు తిరిగి చూస్తుంది. దీంతో ఆమె కూడా రాయిగా మారిపోయింది.

చిత్రకృప : My Favourite Things

ఇప్పటికీ రహస్యమే !

ఇప్పటికీ రహస్యమే !

దీనికి సంబంధించిన ఎటువంటి సైన్టిఫిక్ దాఖలాలైతే లేవుగానీ, ఈ దేవాలయం గురించి తెలిసిన వారు మాత్రం ఇప్పటికీ సూర్యాస్తమయం తర్వాత అటువైపు వెళ్లారు.

చిత్రకృప : Harshavardhan Rathore‎

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X