» »గొల్కోండ కోటలో దాగున్న రహస్యాలు !

గొల్కోండ కోటలో దాగున్న రహస్యాలు !

By: Venkata Karunasri Nalluru

హైదరాబాద్ నుండి 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోల్కొండ ఒక ప్రసిద్ధ చారిత్రక కోట. ఇది దక్కన్ పీఠభూమిలో గల అతి పెద్ద కోట. ఈ అద్భుతమైన కోటను పలు రాజలు పరిపాలించిరి. గోల్కొండ కోట ... దాదాపు హైదరాబాద్ పర్యటన చేసేవారు తప్పక దీనిని సందర్శిస్తారు. కుతుబ్ షాహీ రాజుల హయాంలో నిర్మించిన ఈ భారీ కట్టడాన్ని చూస్తే ఎవ్వరికైనా ఔరా! అని అనిపించకమానదు. కోటలోని గోడలు, కింద చప్పట్లు కొడితే ... అక్కడెక్కడో కొండ పైన ఉన్న రాణి మహల్ వరకు వినిపించే శబ్దం నేటికీ ఆశ్చర్యచకితులను చేస్తాయి. కోట గురించి మరిన్ని విశేషాలు ఏంటో చూద్దామా !

1.పర్యాటక ఆకర్షణ

1.పర్యాటక ఆకర్షణ

హైదరాబాద్ ను పాలించిన అన్ని రాజవంశాలకు ఆవాసంగా కోట వుండినది. 800 సంవత్సరాల క్రితం నిర్మితమైన ఈ కోట ఇప్పటికీ ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణగా వుంది.
PC: Sanyam Bahga

2.కోట బురుజులు

2.కోట బురుజులు

కోటలో 87 బురుజులు ఉన్నాయి. వాటిలో పెట్లా, మూసా, మజ్ను బురుజులు ప్రసిద్ధి చెందినాయి. వీటి మీద సైనికులు నిలబడి శత్రువుల రాకను పసిగట్టేవారు. బురుజులు మీద శత్రువుల వైపు గురిపెట్టే విధంగా ఫిరంగులను అమర్చారు.
PC: Nimesh Madhavan

3. భక్త రామదాసు జైలు

3. భక్త రామదాసు జైలు

భక్త రామదాసు గా ప్రసిద్ధికెక్కిన కంచర్ల గోపన్న నాటి తానిషా హయాంలో భద్రాచలం తహసీల్దార్. ఈయన మంత్రివర్యులైన మాదన్న మేనల్లుడు. ఈయన జైలు శిక్ష సమయంలో చెరసాలలో ఉన్నప్పుడు రామ లక్ష్మణుల ప్రతిమలను, హాముమంతుడు ప్రతిమలను సృష్టించాడు. నేటికీ వాటిని గోల్కొండ కోటలో చూడవచ్చు.
PC: Felix Engelhardt

4. కరోఠా హౌస్

4. కరోఠా హౌస్

కరోఠా హౌస్ బారాహిసార్ కు ఉత్తరం దిక్కున కలదు. ఇది కుతుబ్ షాహీల వినోద స్ధలం . 200 అడుగుల పొడవు, వెడల్పు, 5 గజాల లోతు ఉంటుంది. దీనికి నీరు సమీపాన ఉన్న చెరువు నుండి వచ్చేది. దీనిని పడమర వైపు ఉన్న గేటు దగ్గర శబ్దం చేస్తే అది అన్ని దిక్కులకు ప్రతిధ్వనించేది. రాజులు, మరికొంత మంది రాజప్రముఖులు వినోద స్థలంగా ఉపయోగించేవారు.
PC: Bhaskaranaidu

5. దాద్ మహల్

5. దాద్ మహల్

దీని బాల్కనీ రోడ్డుకు తూర్పు వైపున ఉన్నది. దీని ముందు ఉన్నపెద్ద స్థలంలో ప్రజలు వచ్చి కష్టసుఖాలు చెప్పేవారు. రాజు ఇక్కడ నుంచే సమస్యలను విని పరిష్కారం చెప్పేవాడు.
PC: Jidutorrentz

6. విజయ ద్వారము

6. విజయ ద్వారము

ఔరంగజేబు గోల్కొండ పై విజయము తర్వాత ఫతే దర్వాజా గుండా తన సైన్యాన్ని నడిపించాడు. ఈ దర్వాజా నిర్మించటానికి ధ్వని శాస్త్రాన్ని అవపోసనపట్టినట్లుంది. మరి కాకపోతే ఏంటండీ కింద చప్పట్లు కొడితే అక్కడెక్కడో పైన ఉన్న మహల్ వద్ద వినిపించడం వింత కాకపోతే!
PC: Shravya

7. ద్వారాలు

7. ద్వారాలు

గోల్కొండ నాలుగు వేర్వేరు కోటల సముదాయం. కోటకు మొత్తం 9 ద్వారాలు ఉన్నాయి. అందులో ఫతే దర్వాజా (విజయ దర్వాజా), మోతీ దర్వాజా, కొత్తకోట, జమాలి, మక్కా దర్వాజా లు కొన్ని. ఇప్పుడు మనము కోటలోకి వెళుతున్నది ఫతే దర్వాజా నుండే.
PC: Sukanto Debnath

Please Wait while comments are loading...