Search
  • Follow NativePlanet
Share
» »రాముడు బాణంతో పాతాళ గంగను పైకి తెచ్చిన ఊరు మనరాష్ట్రంలోనే..అక్కడి రహస్యాలు ఇవే !

రాముడు బాణంతో పాతాళ గంగను పైకి తెచ్చిన ఊరు మనరాష్ట్రంలోనే..అక్కడి రహస్యాలు ఇవే !

ఒంటిమిట్ట క్షేత్రము ఏకశిలానగరము అని ప్రసిద్ధి చెందినది. ఇక్కడ ఉన్న కోదండ రామాలయంలోని విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్టించాడు. ఒకే శిలలో శ్రీరామున్ని సీతను లక్ష్మణుని ఇక్కడ చూడవచ్చు.

By Venkatakarunasri

ఈ రోజు మనం ఈ వ్యాసంలో చెప్పుకునే విషయం ఒంటిమిట్ట. ఒంటిమిట్ట అనేది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఒక మండలము.

ఎక్కడ వుంది?

ఎక్కడ వుంది?

కడప నుంచి రాజంపేటకు వెళ్ళే మార్గంలో 27 కి.మీ. దూరంలో ఒంటిమిట్ట ఉంది. ఈ క్షేత్రము ఏకశిలానగరము అని ప్రసిద్ధి చెందినది. ఇక్కడ ఉన్న కోదండ రామాలయంలోని విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్టించాడు. ఒకే శిలలో శ్రీరామున్ని సీతను లక్ష్మణుని ఇక్కడ చూడవచ్చు.

pc: rajaraman sundaram

రామాలయ గోపురం

రామాలయ గోపురం

ఈ దేవాలయంలో శ్రీరామ తీర్ధము ఉంది సీత కోరికపై శ్రీ రాముడు రామ బాణంతో పాతాళ గంగను పైకి తెచ్చాడని స్థల పురాణంలో వివరించబడినది. గోపురనిర్మాణము చోళ శిల్ప సాంప్రదాయంలో అత్యద్భుతముగా ఉంటుంది. ఫ్రెంచి యాత్రికుడు టావెర్నియర్ 16వ శాతాబ్దంలో ఈ రామాలయాన్ని దర్శించి "భారతదేశంలోని పెద్ద గోపురాలలో ఈ రామాలయ గోపురం ఒకటి" అని కీర్తించాడు.

pc:Joshri

ఒక మిట్ట పైన రామాలయం

ఒక మిట్ట పైన రామాలయం

ఒక మిట్ట పైన ఈ రామాలయం నిర్మించబడింది. అందుకని ఒంటిమిట్ట అని ఈ రామాలయానికి, గ్రామానికి పేరు వచ్చింది. ఒంటడు, మిట్టడు అనే ఇద్దరు దొంగలు ఇక్కడ రాముణ్ణి కొలిచి తమ వృత్తిని మానుకుని నిజాయితీగా బ్రతికారని, వారి పేరు మీదుగానే ఒంటిమిట్ట అని పేరు వచ్చిందని ఇంకొక కథనం కూడ ఉంది.

pc:MADHURANTHAKAN JAGADEESAN

ఏకశైలపురి

ఏకశైలపురి

మిట్టను సంస్కృతంలో శైలమంటారు. ఆంధ్ర మహాభాగవతాన్ని రచించిన పోతన తాను ఏకశైలపురి వాసినని చెప్పుకున్నాడు. అంతే గాక తన భాగవతాన్ని ఈ కోదండ రామునికి అంకితం గావించాడు. దాన్ని బట్టి, భాగవతంలో ఈ ప్రాంతానికి చెందిన వాడుక మాటలు కొన్ని ఉండడాన్ని బట్టి ఆయన కొంతకాలం ఇక్కడ నివసించాడని భావిస్తున్నారు.

pc:MADHURANTHAKAN JAGADEESAN

హనుమంతుడు లేని రామాలయం

హనుమంతుడు లేని రామాలయం

ఈ ఆలయంలో సీతారామలక్ష్మణులు ఒకే రాతిలో చిత్రించబడ్డారు. కాబట్టి ఏకశిలానగరమనీ పేరు వచ్చింది. హనుమంతుడు లేని రామాలయం భారత దేశంలో ఇదొక్కటే. రామ లక్ష్మణులు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, విశ్వామిత్రుడు వారిని తమ యాగరక్షణకు తీసుకున్నాడని తెలిసిందే.

pc:MADHURANTHAKAN JAGADEESAN

యాగ రక్షణ

యాగ రక్షణ

కానీ సీతారామ కల్యాణం జరిగాక కూడా, అలాంటి సందర్భమే ఒకటి ఏర్పడింది. అప్పుడు మృకండు మహర్షి, శృంగి మహర్షి రాముని ప్రార్థించడంతో దుష్టశిక్షణ కోసం, ఆ స్వామి సీతా లక్ష్మణ సమేతుడై అంబుల పొది, పిడిబాకు, కోదండం, పట్టుకుని ఈ ప్రాంతానికి వచ్చి యాగ రక్షణ చేశాడని పురాణం చెబుతుంది.

pc:Kashyap Kondamudi

సీతారామ లక్ష్మణుల విగ్రహాలు

సీతారామ లక్ష్మణుల విగ్రహాలు

అందుకు ప్రతిగా ఆ మహర్షులు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలగా చెక్కించారనీ, తరువాత జాంబవంతుడు ఈ విగ్రహాలను ప్రాణప్రతిష్ట చేశారనీ ఇక్కడ ప్రజల విశ్వాసం. ఈ గ్రామము ఒంటిమిట్టకు సుమారు 3 కి.మీ దూరంలో ఉంది.

pc:Krishna Jakkinapalli

బ్రహ్మోత్సవాలు

బ్రహ్మోత్సవాలు

ఇది ఒంటిమిట్టకు అతి సమీప గ్రామము, ఈ గ్రామములో పొలేరమ్మ, యల్లమ్మ, అంకాలమ్మ, వీర గంగమ్మల గ్రామదేవతల దేవాలయాలు ఉన్నాయి, మరియు శ్రీ రామాలయం,శ్రీ రాముని దూత హనుమంతుడి దేవాలయాలు ఉన్నాయి. ఒంటిమిట్టలో ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమి నుండి బహుళ విదియ దాకా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.

pc:Siva1249

రథోత్సవం

రథోత్సవం

చతుర్దశి నాడు కళ్యాణం, పౌర్ణమి నాడు రథోత్సవం ఉంటాయి. నవమి నాడు పోతన జయంతి నిర్వహిస్తారు . ఈ బ్రహ్మోత్సవాలలొ మలకాటి పల్లెకు చెందిన వారు. చాలా చురుకుగా, ఆనందంగా జరుపు కుంటారు.

pc:Bhaskaranaidu

ఆశ్రమం

ఆశ్రమం

ఏకశిలానగరానికి పడమరవైపున, ఒక కి.మీ.దూరంలో ఉన్న ఈ ఆశ్రమం, పూర్వం మృకుందమహర్షి చే నిర్మితమైనదని పురాణాల ఉవాచ. ఆయన ఈ ఆశ్రమంలో కొలువైన ముక్కంటిని నిత్యం ఆరాధించేవారని పూర్వీకుల కథనం.

pc: rajaraman sundaram

జలధార

జలధార

అందువలన ఈ గ్రామానికి ఆ పేరు వచ్చినది. ఈ ఆలయానికి సమీపములోని ఉన్న ఒక 'వంక (వాగు), దక్షిణం నుండి ఉత్తరంవైపు ప్రవహించుచూ ఉండటంతో, ఇందులోని జలధారను భక్తులు పవిత్రమైనదిగా భావించుచున్నారు.

pc:Joshri

ఔషధ మొక్కలూ

ఔషధ మొక్కలూ

చుట్టూ అటవీ ప్రాంతం కావడంతో ఫలాలు, ఔషధ మొక్కలూ అధికంగా అందుబాటులో ఉండేవి. యఙయాగాదులు, తపస్సుల నిర్వహణకు అనుకూలంగా ఉండటంతో, మునులు, మహర్షులు ఈ ప్రాంతంలో నివాసాలు ఏర్పాటు చేసుకునేవారు.

pc:MADHURANTHAKAN JAGADEESAN

చరిత్ర పరిశోధకులు

చరిత్ర పరిశోధకులు

మృకుందాశ్రమానికీ, ఈ ముకుందాపురానికీ జైనమతంతో సంబంధం ఉన్నట్లు ఆనవాళ్ళు ఉన్నాయని చరిత్ర పరిశోధకులు శ్రీ కట్టా నరసింహులు తెలియజేసినారు. స్కంద పురాణంలో ఈ ఆశ్రమ ప్రస్తావన ఉన్నట్లు గూడా ఆయన వివరించినారు.

pc:MADHURANTHAKAN JAGADEESAN

భక్తులు

భక్తులు

ఇక్కడ పరమేశ్వరుని లింగం, వినాయకుడు, సుబ్రహ్మణ్యస్వామి, భ్రమరాంబ, నందీశ్వరుడు, భృంగీశ్వరుడు, కాలభైరవుల విగ్రహాలు కొలువై ఉన్నవి. ప్రతి సంవత్సరం కార్తీకమాసంలో ఈ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది.

pc:MADHURANTHAKAN JAGADEESAN

ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

హైదరాబాద్ నుండి మెహబూబ్ నగర్ మీదుగా కర్నూలు, ప్రొద్దుటూరు, కడప మీదుగా వొంటిమిట్టకు 7గంటలలో చేరుకొనవచ్చును

తాడిపత్రి మీదుగానయితే 12గం లలో చేరుకొనవచ్చును.

pc:google maps

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X