Search
  • Follow NativePlanet
Share
» »ఈ పుణ్యక్షేత్రంలో అమ్మవారిని ఎలా తిడుతారో తెలుసా

ఈ పుణ్యక్షేత్రంలో అమ్మవారిని ఎలా తిడుతారో తెలుసా

కొడంగల్లూర్ దేవాలయంలో భరణి ఉత్సవం గురించి.

By Kishore

సాధారణంగా ఏ పుణ్యక్షేత్రంలోనైనా, ఏ దేవాలయంలో ఉన్న దేవతనైనా పూజిస్తారు. అయితే కేరళలోని ఓ దేవాలయంలో మాత్రం తిడుతారు. ఒక్కొక్కసారి బయటికి చెప్పలేని, రాయడానికి వీలులేని పదాలు కూడా అందులో ఉంటాయి. ఉగ్రస్వరూపం అయిన ఆ దేవతను అలా తిట్టడం వల్ల ఆ స్వభావం నుంచి చల్లబడక ఉగ్రరూపంలోనే ఉండి భూత, ప్రేతాల నుంచి తమను కాపాడుతుందని స్థానికుల నమ్మకం ఈ సమయంలో భక్తుల వస్త్రధారణ కూడా చాలా విభిన్నంగా ఉంటుంది. ఇక దేవాలయంలో జరిగే కావు తీండల్, భరణి ఉత్సవాలను చూడటానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. తమిళప్రాచీన గ్రంథం 'శిలప్పదిగారం'లో కూడా ఈ దేవత ప్రస్తావన ఉంది. ఇన్ని విశిష్టతలు ఉన్న ఈ దేవాలయం గురించి వివరాలు మీ కోసం.

పక్క చూపులు చూస్తున్న 'స్వామి' ఉన్న క్షేత్ర సందర్శనతో మీరు అలా పిలిపించుకొంటారుపక్క చూపులు చూస్తున్న 'స్వామి' ఉన్న క్షేత్ర సందర్శనతో మీరు అలా పిలిపించుకొంటారు

1. దారుక అనే రాక్షసుడు

1. దారుక అనే రాక్షసుడు

Image Source:


స్థానిక పురాణం ప్రకారం విష్ణువు అవతారమైన పరుశురాముడు కేరళను సముద్రం నుంచి వెలికి తీసినట్లు చెబుతారు. అయితే ఈ కేరళను దారుక అనే రాక్షసుడు ఈ కేరళలోని ప్రజలను తీవ్రంగా హింసించసాగాడు. దీంతో కేరళ ప్రజలు పరుశరాముడి వద్దకు వెళ్లి తమ గోడును వెళ్లబోసుకొన్నాడు. దీంతో పరుశురాముడు ఆ పరమశివుడిని ప్రార్థిస్తాడు. దీంతో పరమశివుడు తన తపోశక్తితో భద్రకాళి ప్రతిమను స`ష్టించి పరుశురాముడికి ఇస్తాడు.

2. కొడుంగల్లూర్

2. కొడుంగల్లూర్

P.C: Sujithvv

పరుశురాముడు ఆ ప్రతిమను తీసకొని ప్రస్తుతం కొడుంగల్లూర్ అనే ప్రాంతంలో ప్రతిష్టించాడు. అటు పై ఇక్కడి ప్రజలను హింసించడానికి వచ్చిన దారుకతో అమ్మవారు యుద్ధం చేసి అతన్ని సంహరిస్తుంది. తమను కాపాడినదానికి గుర్తుగా భక్తులు ఆమ్మవారికి నిత్యం అర్చనలు అభిషేకాలు నిర్వహిస్తుంటారు. ఇదిలా ఉండగా ఈ ఆలయంలో జరిగే కొన్ని ఉత్తవాలను చూడటానికి చాలా దూరం నుంచి భక్తులు వేల సంఖ్యలో వస్తుంటారు.

3. కావు తీండల్

3. కావు తీండల్

P.C: Challiyan

ముఖ్యంగాఆయుధాలను చేత పట్టుకొని అమ్మవారు యుద్ధానికి వెళ్లిన సంఘటనను గుర్తుకు చేసుకొంటూ స్థానికులు కావు తీండల్ అనే ఉత్సవాన్ని జరుపుకొంటారు. గతంలో అమ్మవారు అప్పట్లో వాడిన ఆయుధాలను ధరించి వీరు కూడా వీరంగం ఆడేవారు. అయితే ఇటీవల అటువంటి ఆయుధాలను ధరించడం నిషేధించడం వల్ల ప్రస్తుతం కర్రలను చేతపట్టుకొని దేవాలయం చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేస్తారు.

4. భరణి ఉత్సవం

4. భరణి ఉత్సవం

P.C: Challiyan

ఇక అన్నింటికంటే ముఖ్యమైనది భరణి ఉత్సవం. ఈ ఉత్సవాన్ని సాధారణంగా మార్చి ఏప్రిల్ నెలల మధ్య నిర్వహిస్తారు. ఆ సమయంలో స్థానికులు రెండు గ్రూపులుగా విడిపోయి ఒక గ్రూపు దేవాలయంలో ఉంటుంది. మరో గ్రూపు దేవాలయం బయట ఉంటుంది. బయట ఉన్న వారు పూనకం వచ్చినవారిలా ఊగిపోతూ గుడిచుట్టూ పరుగులు పెడుతూ అమ్మవారిని దుర్భాషలాడుతారు. ఒక్కొక్కసారి బయటికి చెప్పలేని, రాయడానికి వీలులేని పదాలు కూడా అందులో ఉంటాయి.

5. ఉగ్రరూపినిగా

5. ఉగ్రరూపినిగా

P.C: നിരക്ഷരൻ

ఇలా చేయడం వల్ల అమ్మవారు ఉగ్రరూపంలోనే ఉండి భూత, ప్రేతాల నుంచి తమను కాపాడుతుందని స్థానికుల నమ్మకం. కొడుంగల్లుర్ అమ్మవారి ఆలయం పది ఎకరల స్థలం మధ్యలో ఉత్తరముఖంగా ఉంటుంది. అమ్మవారి విగ్రహం ఎనిమిది చేతులతో ఉగ్రరూపినిగా మనకు కనిపిస్తుంది. అమ్మవారిని శాంతపరచడానికి ఏడాదికి ఒకసారి చందనోత్సవాన్ని కూడా ఇక్కడ నిర్వహిస్తారు.

6.శిలప్పదిగారం

6.శిలప్పదిగారం

P.C: Challiyan

అమ్మవారి విగ్రహంతో పాటు సప్తమాత`కలు, వీరభద్రుడు, గణపతి విగ్రహాలు మనం ఇక్కడ చూడవచ్చు. చాలా ఏళ్లుగా కొడుంగల్లుర్ సంస్థానానికి చెందిన రాజులు ఈ ఆలయాన్ని పర్యవేక్షిస్తున్నారు. కేవలం కొడుంగల్లుర్ సంస్థానానికి, ఆ ప్రాంత ప్రజలకే కాకుండా కేరళను పరిపాలించిన ఎంతోమంది రాజులకు కొడుంగల్లూరు భగవతి అమ్మవారు కులదైవం. తమిళప్రాచీన గ్రంథం ‘శిలప్పదిగారం'లో కూడా ఈ దేవత ప్రస్తావన ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X