Search
  • Follow NativePlanet
Share
» »కుమారస్వామి ముడుపులుగా మేకలు, కోళ్లు స్వీకరిస్తాడు

కుమారస్వామి ముడుపులుగా మేకలు, కోళ్లు స్వీకరిస్తాడు

కొలన్ జియప్పార్ దేవాలయం గురించి కథనం.

ఇదొక విశిష్టమైన కుమారస్వామి దేవాలయం. శివుడి ఆదేశాలను అనుసరించి భూమి పైకి వచ్చిన కుమారస్వామి ఇక్కడే ఉంటూ తన భక్తుల కోర్కెలన్నీ తీరుస్తున్నాడు. సాధారణంగా జంతుబలులు దేవతలు ప్రధాన దైవంగా కలిగిన దేవాలయాల్లో జంతుబలులు సర్వసాధారణం. అయితే ఈ కుమార స్వామికి ముడుపులుగా కోళ్లు, మేకలను ముడుపులుగా చెల్లించి వాటిని బలిస్తారు. మరికొంతమంది తమ బరువుతో సమానమైన వస్తువులను కానుకలుగా ఈ కుమారస్వామికి ఇస్తుంటారు. ఇంతటి విశిష్టమైన కుమారస్వామి కొలువై ఉన్న దేవాలయానికి సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం...

కొలన్ జియప్పార్ దేవాలయం

కొలన్ జియప్పార్ దేవాలయం

P.C: You Tube

పూర్వం ఈ దేవాలయంలో నరబలులు జరిగేవి. అంతేకాకుండా ఎవరైనా తాము కోరిన కోర్కెలన్నీ తీరితే తమ శరీర భాగంలో చెవులు, కాళ్లు, చేతులు, వేళ్లు ఇలా ఏదో ఒక శరీరభాగాన్ని ముడుపుగా ఈ కుమారస్వామికి చెల్లించేవారు.

కొలన్ జియప్పార్ దేవాలయం

కొలన్ జియప్పార్ దేవాలయం

P.C: You Tube

అయితే ప్రస్తుతం నరబలులతో పాటు అవయవాలను ముడుపులుగా చెల్లించడం నిషేదించారు. దీంతో మొక్కులు తీరిన వారు శరీర భాగాలను పోలినవాటిని రేకుతో చేయించి వాటిని ఆ కుమారస్వామికి ముడుపులుగా చెల్లిస్తుంటారు.

కొలన్ జియప్పార్ దేవాలయం

కొలన్ జియప్పార్ దేవాలయం

P.C: You Tube

ఇలాంటి శరీర భాగాలను వేల సంఖ్యలో దేవాలయం పరిసర ప్రాంతాల్లో మనం చూడవచ్చు. ఈ దేవాలయానికి సంబంధించిన ఓ పురాణ కథనం ప్రచారంలో ఉంది.

కొలన్ జియప్పార్ దేవాలయం

కొలన్ జియప్పార్ దేవాలయం

P.C: You Tube

దానిని అనుసరించి తమిళ కవి సుందర్ శివుడికి పరమ ప్రీతిపాత్రమైన భక్తుడు. ఆయన శివుడికి సంబంధించిన అనేక పాటలను, పద్యాలను రాయడమే కాకుండా స్వరం సవరించి పాటలు కూడా పాడేవాడు.

కొలన్ జియప్పార్ దేవాలయం

కొలన్ జియప్పార్ దేవాలయం

P.C: You Tube

ఆయన శివుడిని పొగుడుతూ పాడుతుంటే ఎటువంటి వారైనా మై మరిచిపోవాల్సిందే. ముసలితనంలో ఒకసారి సుందర్ ప్రస్తుతం ఈ దేవాలయానికి వచ్చి వ`ద్ద గిరీశ్వర్ పేరుతో ఉన్న శివుడి గురించి పాటలు పాడాడు.

కొలన్ జియప్పార్ దేవాలయం

కొలన్ జియప్పార్ దేవాలయం

P.C: You Tube

ఇలా పాటలు పాడి కొద్ది సేపు అదే ప్రాంతంలో విశ్రాంతి తీసుకొని ముందుకు వెళ్లిపోయాడు. ఇక ఆ పాటల్లోని మాదుర్యాన్ని విని పరమశివుడు మైమరిచిపోయారడు. అంతేాకాకుండా మరోసారి వినాలని భావించాడు.

కొలన్ జియప్పార్ దేవాలయం

కొలన్ జియప్పార్ దేవాలయం

P.C: You Tube

దీంతో తన కుమారుడైన కుమారస్వామిని పిలిచి సుందర్ ను మారోసారి అదే ప్రాంతానికి వచ్చి పాటలు పాడేలా చేయాలని సూచించాడు. దీంతో కుమారస్వామి ఒక వేటగాడి రూపంలో కూలంజి అరణ్య ప్రాంతంలోకి ప్రవేశించాడు.

కొలన్ జియప్పార్ దేవాలయం

కొలన్ జియప్పార్ దేవాలయం

P.C: You Tube

అంతేకాకుండా సుందర్ వద్ద ఉన్న అనేక వస్తువులను స్వాధీనం చేసుకొన్నాడు. తన వస్తువులను తిరిగి ఇవ్వాల్సిందిగా సుందర్ వేటగాడి రూపంలో ఉన్న కుమారస్వామిని వేడుకొంటాడు.

కొలన్ జియప్పార్ దేవాలయం

కొలన్ జియప్పార్ దేవాలయం

P.C: You Tube

దీంతో కుమారస్వామి నేను చెప్పిన చోటుకు వచ్చి శివుడి గురించి పాటలు పాడితే వదిలేస్తానని చెబుతాడు. దీంతో వచ్చినవాడు సామాన్యుడు కాదని సుందర్ గ్రహిస్తాడు. అటు పై ఇది దైవేచ్చగా భావించి అక్కడికి వెళ్లి పాటలు పాడుతాడు.

కొలన్ జియప్పార్ దేవాలయం

కొలన్ జియప్పార్ దేవాలయం

P.C: You Tube

దీంతో కుమారస్వామి ప్రత్యక్షతమయ్యి సుందర్ ను కరునిస్తాడు. అంతేకాకుండా సుందర్ తో పాటు ఈశ్వరుడి ఆదేశాలను అనుసరించి ఇక్కడ కొలువై ఉండిపోతాడు. కాగా ఇక్కడ వెలిసిన ఈ కుమారస్వామి లేదా మురుగన్ ను కొలంజియప్పర్ కుమారస్వామి అని పిలుస్తారు.

కొలన్ జియప్పార్ దేవాలయం

కొలన్ జియప్పార్ దేవాలయం

P.C: You Tube

కొలంజియప్పర్ తమిళనాడులోని కడలూరు జిల్లా విరుధాలం పట్టణం శివారులోని మనవలనల్లూరు అనే గ్రామంలో ఉంది. ఇక్కడి వెళ్లడానికి కడలూరు నుంచి నేరుగా బస్సు సౌకర్యం ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X