Search
  • Follow NativePlanet
Share
» »బంగారు గనులు తవ్విన ప్రదేశం ఇది, ఇప్పటికీ బంగారం కోసం...

బంగారు గనులు తవ్విన ప్రదేశం ఇది, ఇప్పటికీ బంగారం కోసం...

కోలార్: ఇండియాలో గోల్డెన్ సిటీగా పిలవబడుతున్నది. కర్ణాటక రాష్ట్రంలో కోలార్ జిల్లా ఉంది. ఈ ప్రదేశం గోల్డ్ మైనింగ్ కు చాలా ప్రసిద్ది. కోలార్ సిల్క్, పాలు, మామిడిపండ్లు మరియు బంగారానికి ప్రసిద్ది.

కోలార్: ఇండియాలో గోల్డెన్ సిటీగా పిలవబడుతున్నది. కర్ణాటక రాష్ట్రంలో కోలార్ జిల్లా ఉంది. ఈ ప్రదేశం గోల్డ్ మైనింగ్ కు చాలా ప్రసిద్ది. కోలార్ సిల్క్, పాలు, మామిడిపండ్లు మరియు బంగారానికి ప్రసిద్ది. కోలార్ చుట్టు ప్రక్కల మైదానాల్లో బంగారు గనులు ఉండటం వల్ల ఈ ప్రదేశానికి గోల్డెన్ సిటి అని, ఎక్కువగా పండ్లు దొరకడం వల్ల నేషనల్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు.

కోలార్ సిటిలో సోమేశ్వరస్వామి దేవాలయం మరియు కోలారమ్మ దేవాలయం చాలా ప్రసిద్ది. కోలారమ్మనే కోలార్ నగరంగా పరిగణించబడుతోంది. కర్ణాటక రాష్ట్రంలో ఉన్న కోలార్ జిల్లాల్లో కూడా చాలా వరకూ చూడదగ్గ ప్రదేశాలున్నాయి. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ఆవని :

ఆవని :

ఒక కొండపై ఉన్న సీత ఆలయయానికి ప్రసిద్ధి చెందినది ఆవని. ఇండియాలో సీతా దేవికి అంకితం చేయబడిన ఆలయాల్లో ఒకటి ఆవని. దక్షిణ భారతదేశంలో దీనిని గయా అని కూడా పిలుస్తారు. నోలంబ రాజవంశం కాలానికి చెందిన రామలింగేశ్వర, లక్ష్మనేశ్వర, భరతేశ్వర మరియు శత్రుగనేశ్వర పురాతన దేవాలయాలు ఉన్నాయి. సీతా దేవికి లవ కుశలు జన్మించిన ప్రదేశంగా చెప్పబడుతుంది. ఈ ప్రదేశం కోలార్ జిల్లాకు సుమారు 9 కిలోమీటర్ల దూరంలో ములబాగల్ తాలూకాలో ఉంది.
Photo Courtesy : Dineshkannambadi

<strong>Most Read:దైవభక్తి కంటే వింత, భయంకర ఆచారాలకు నిలయమైన ఆలయాలు</strong>Most Read:దైవభక్తి కంటే వింత, భయంకర ఆచారాలకు నిలయమైన ఆలయాలు

సోమేశ్వర టెంపుల్:

సోమేశ్వర టెంపుల్:

విజయనగర సామ్రాజ్యం కాలం నాటి నిర్మించన ఆలయం ఇది. విజయనగర కాలం నాటి కళాకారులు అద్భుతమైన నైపుణ్యంతో నిర్మింపబడిన ఈ దేవాలయంలో ప్రధానంగా వినాయకుడు, సోమేశ్వర స్వామిగా పూజింపబడుతున్న ఆ పరమశివుడు కొలువుతీరి ఉన్నారు. పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా విభాగం ద్వారా ఈ దేవాలయం జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నంగా పరిగణించబడుతుంది. ఆ ఆలయం ఉదయం 7 గంటల నుండి ఉదయం 11 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు తెరవబడి ఉంటుంది.
Photo Courtesy : commons.wikimedia.org

అంతర్ గంగే గుహలు:

అంతర్ గంగే గుహలు:

కోలార్ ప్రధాన బస్ స్టాండ్ నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంరరగగే గుహలు కోలార్ లో తప్పక సందర్శించవలసిన పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఈ ప్రదేశం ట్రెక్కింగ్ కు ఔత్సాహికులకు అనుకూలంగా ఆకర్షిస్తుంటుంది. అంతర్ గంగే గుహలు శత్రుశుంగా పర్వతంపై ఉన్నది. అలాగే ఇక్కడ ఉన్న ఒక అద్భుతమైన దేవాలయంను తప్పక సందర్శించాలి. దేవాలయానికి వెళ్ళే మార్గం చాలా నిటారుగా ఉంటుంది. దేవాలయం చుట్టూ కోనేరు నిండా నీటితో నిండి పర్యాటకులను ఆకర్షిస్తుంటుంది. కోనేరులోని నీరు నందిని నోటి నుండి నిరంతరం ప్రవహిస్తుంటుంది. కానీ ఈ నీరు ఎక్కడి నుండి వస్తుందో అది ఇప్పటికీ ఎవరూ కనుక్కోలేకపోతున్నారు. ఈ ఆలయం చుట్టు ప్రక్కల గుహలు ఉండటం వల్ల అంతరగంగే గుహలుగా పిలవబడుతోంది. ఈ ప్రదేశంలో ఉండే గ్రానైట్ శిలలు పర్యాటకులను మంత్ర ముగ్ధులను చేస్తుంది.
PC : Vedamurthy J

కోలారమ్మ టెంపుల్:

కోలారమ్మ టెంపుల్:

కొన్ని వేల సంవత్సరాల నాటి ఆలయం కోలారమ్మ ఆలయం. ఈ ఆలయాన్ని చోళులు నిర్మించినట్లు పురాణాలు తెలుపుతున్నాయి. స్వయంగా పార్వతి దేవియే ఇక్కడ కొలారమ్మగా వెలిసినట్లు చెబుతారు. కోలార్ నగరాన్ని కోలారమ్మ రక్షింపబడుతోందని ఇక్కడి భక్తులు నమ్ముతారు. ఇంకా కోలారమ్మే చేలమ్మగా భక్తులు పూజిస్తారు. ఈ దేవత విషసర్పాల కాటులను నయం చేస్తుందని, ఇక్కడ ప్రజలు విశ్వస్తారు. కోలార్ బస్ స్టాండ్ నుండి 1.6 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది.

PC : Hariharan Arunachalam ( NIC )

కోటి లింగేశ్వర టెంపుల్ :

కోటి లింగేశ్వర టెంపుల్ :

కోలార్ గోల్డ్ మైనింగ్ ఫీల్ట్స్ కు 6కిలోమీటర్ల దూరంలో కోటిలింగేశ్వర ఆలయం ఉన్నది. ఈ ఆలయంలో శివుడు ప్రధాన దేవుడు. ప్రపంచంలోనే అతి పెద్ద శివలింగం ఉన్న ఆలయం. ఈ ఆలయంలో 108 అడుగుల పొడవున్న శివలింగంతో పాటు వేల కొద్ది చిన్న చిన్న శివలింగాలు నిర్మితమై పర్యాటకులను ఒక్కసారిగా భక్తిభావంలోనికి తీసుకెళుతుంది. అలాగే శివలింగానికి ఎదురుగా 35అడుగుల ఎత్తులో నంది విగ్రం నిర్మితమైంది. వివిధ పరిమాణాల్లో అనేక లింగాలు ఈ క్షేత్రంలో ఉండటం వల్ల కోటిలింగేశ్వర ఆయలయంగా పేరు పొందినది. ఆ కోటిలింగేశ్వర క్షేత్రం పర్యాటకుల ఆధ్యాత్మిక చింతనకు, ఆహ్లాదానికి చక్కటి ప్రదేశం
Photo Courtesy : Ramesh Kumar R

<strong>Most Read: ఈ వింటర్ సీజన్లో బెంగళూరు సమీపంలో చూడదగ్గ అద్భుతమైన ప్రదేశాలు</strong>Most Read: ఈ వింటర్ సీజన్లో బెంగళూరు సమీపంలో చూడదగ్గ అద్భుతమైన ప్రదేశాలు

మార్కెండేయ హిల్స్:

మార్కెండేయ హిల్స్:

కోలార్ కు సమీపంలో మార్కెండేయ హిల్స్ కనుగొనబడినది. కోలార్ ట్రిప్ కు ప్లాన్ చేసుకొన్నప్పుడు మార్కెండేయ హిల్స్ సందర్శించడం మర్చిపోకండి. ఫ్యామిలి మరియు ఫ్రెండ్స్ తో కలిసి ప్రయాణించడానికి ఈ ప్రదేశం చాలా అందంగా ఉంటుంది. కొండ మీద ఒక చిన్న శివాలయం ఉంది. కోలార్ కు సుమారు 14కిలోమీటర్ల దూరంలో మార్కెండేయ హిల్స్ ఆకర్షణీయంగా ఉంది.

గోల్డ్ మైనింగ్ లాండ్స్:

గోల్డ్ మైనింగ్ లాండ్స్:

బెంగళూరు నుండి వీకెండ్ గేట్ వే ల్యాండ్ ఆఫ్ గోల్డ్ మైన్స్ కోలర్. వీకెండ్ లో పర్యాటకులకు ఒక చక్కటి ప్రదేశం. బెంగలూరు నుండి దాదాపు 69కిలోమీటర్ల దూరంలో ఉంది. గోల్డ్ ఫీల్డ్స్ కు రోబర్ట్ సోన్ పేట్ హెడ్ క్వాటర్స్ గా ఉంది.
Photo Courtesy : Shyamal

<strong>Most Read:ఒక్క ఇంటికి కూడా తలుపులే లేని అద్భుతమైన గ్రామం..!</strong>Most Read:ఒక్క ఇంటికి కూడా తలుపులే లేని అద్భుతమైన గ్రామం..!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X