Search
  • Follow NativePlanet
Share
» »ముక్కంటి ముక్కోపిగా మారిన ప్రాంతం చూశారా? ఇక్కడ నుంచి ఆకాశం చూస్తే స్వర్గ ప్రాప్తి

ముక్కంటి ముక్కోపిగా మారిన ప్రాంతం చూశారా? ఇక్కడ నుంచి ఆకాశం చూస్తే స్వర్గ ప్రాప్తి

కొల్లాపూర్ కోపేశ్వర దేవాలయం గురించి కథనం.

దేవాలయాలు భారత దేశ ఆస్తి అని చెబుతారు. పురాణ కాలం నుంచి భారత దేశంలో ఈ దేవాలయాల నిర్మాణం కొనసాగుతూనే ఉంది. పురాణాల కథలను అనుసరించి ఆ దేవాలయాల నిర్మాణం ఉంటుందనడంలో సందేహం లేదు. మరికొన్ని చోట్ల గర్భగుడిలోని దైవం స్వయంభువుగా వెలిసి ఉంటాడు. కొన్ని దేవాలయాల్లో శిల్పకళ చూడటానికి వెయ్యి కళ్లు చాలవు. అటువంటి కోవకు చెందినదే మహారాష్ట్ర లోని కొల్లాపూర్ లో ఉన్న కోపేశ్వర దేవాలయం. పురాణ ప్రాధాన్యతతో పాటు భారత దేశ శిల్పకళను చాటి చెప్పే ఎన్నో శిల్పాలు ఈ దేవాలయం సొంతం. ఈ నేపథ్యంలో ఈ కోపేశ్వర దేవాలయానికి సంబంధించిన కథనం.

కోపేశ్వర దేవాలయం, కొల్లాపుర్

కోపేశ్వర దేవాలయం, కొల్లాపుర్

P.C: You Tube

సతీదేవి తన తండ్రి దక్ష ప్రజాపతికి ఇష్టం లేకపోయినా ఆ పరమశివుడిని పెళ్లి చేసుకొంటుంది. దీంతో దక్షప్రజాపతి పరమశివుడితో పాటు తన కూతురైన సతీదేవి పై ద్వేషం పెంచుకొంటారు.

కోపేశ్వర దేవాలయం, కొల్లాపుర్

కోపేశ్వర దేవాలయం, కొల్లాపుర్

P.C: You Tube
ఈ క్రమంలో ఒకసారి ఒక గొప్ప యాగాన్ని నిర్వహిస్తాడు. ఈ యాగానికి దేవతలందరినీ ఆహ్వానిస్తాడు. అయితే సొంత కూతురైన సతీదేవి, ఈశ్వరుడిని మాత్రం ఆహ్వనించడు.

కోపేశ్వర దేవాలయం, కొల్లాపుర్

కోపేశ్వర దేవాలయం, కొల్లాపుర్

P.C: You Tube
అయినా పుట్టింటి పై మమకారం చావని సతీదేవి ఆ యాగానికి వెళ్లాలని భావిస్తుంది. అయితే పరమశివుడు పిలువని పేరంటానికి వెళ్ల కూడదని ఎంతో నచ్చజెప్పాలని భావిస్తాడు.

కోపేశ్వర దేవాలయం, కొల్లాపుర్

కోపేశ్వర దేవాలయం, కొల్లాపుర్

P.C: You Tube
అయితే సతీదేవి మాత్రం తాను పుట్టింటికి వెళ్లి తీరుతానని చెబుతారు. దీంతో తన వాహనమైన నందిని తోడు ఇచ్చి పరమశివుడు సతీదేవిని పుట్టింటుకు పంపిస్తాడు.

కోపేశ్వర దేవాలయం, కొల్లాపుర్

కోపేశ్వర దేవాలయం, కొల్లాపుర్

P.C: You Tube
అయితే పుట్టింటిలో సతీదేవి తీవ్రంగా అవమానించబడుతుంది. చివరికి సొంత తండ్రి అయిన దక్షప్రజాపతి కూడా ఆమెను నానామాటలతో బాధపెడుతాడు.

కోపేశ్వర దేవాలయం, కొల్లాపుర్

కోపేశ్వర దేవాలయం, కొల్లాపుర్

P.C: You Tube
అయితే పుట్టింటిలో సతీదేవి తీవ్రంగా అవమానించబడుతుంది. చివరికి సొంత తండ్రి అయిన దక్షప్రజాపతి కూడా ఆమెను నానామాటలతో బాధపెడుతాడు.

కోపేశ్వర దేవాలయం, కొల్లాపుర్

కోపేశ్వర దేవాలయం, కొల్లాపుర్

P.C: You Tube
అంతే కాకుండా పరమశివుడిని కూడా తూలనాడుతాడు. ఈ అవమానాభారాన్ని భరించలేక సతీదేవి అక్కడి హోమగుండంలోకి దూకి ప్రాణాలు విడిచిపెడుతుంది.

కోపేశ్వర దేవాలయం, కొల్లాపుర్

కోపేశ్వర దేవాలయం, కొల్లాపుర్

P.C: You Tube
విషయం తెలుసుకున్న పరమశివుడు రుద్రుడైపోతాడు. తీవ్రమైన కోపంతో తన జటాఝూటం నుంచి వీరభద్రుడిని స`ష్టించి ఆ యాగాన్ని ధ్వంసం చేయమని సూచిస్తాడు.

కోపేశ్వర దేవాలయం, కొల్లాపుర్

కోపేశ్వర దేవాలయం, కొల్లాపుర్

P.C: You Tube
ఆ విధంగా పరమశివుడు తీవ్ర మైన కోపంతో వీరభద్రుడిని స`ష్టించిన ప్రదేశం కాబట్టే దీనిని కోపేశ్వర దేవాలయం అని అంటారు. దీనిని నిత్యం వేల మంది భక్తులు సందర్శిస్తూ ఉంటారు.

కోపేశ్వర దేవాలయం, కొల్లాపుర్

కోపేశ్వర దేవాలయం, కొల్లాపుర్

P.C: You Tube
లయ కారకుడైన పరమశివుడి కోపం వల్ల ఈ విశ్వం మొత్తం అల్లకల్లోలమవుతుంది. దీంతో పరమశివుడి కోపాన్ని విష్ణువు ఇక్కడికి వచ్చి తగ్గించివేస్తాడు.

కోపేశ్వర దేవాలయం, కొల్లాపుర్

కోపేశ్వర దేవాలయం, కొల్లాపుర్

P.C: You Tube
అందువల్ల ఈ కోపేశ్వర దేవాలయంలో మనం విష్ణువు విగ్రహాన్ని కూడా చూడవచ్చు. సతీదేవికి తోడుగా నందిని పంపించడం వల్ల ఈ శివాలయంలో నంది మనకు కనిపించదు.

కోపేశ్వర దేవాలయం, కొల్లాపుర్

కోపేశ్వర దేవాలయం, కొల్లాపుర్

P.C: You Tube
ఈ కోపేశ్వర దేవాలయం మహారాష్ట్రలోని కొల్లాపూర జిల్లాలలో ఖిద్రాపుర అనే చిన్న పట్టణంలో ఈ దేవాలయం ఉంది.

కోపేశ్వర దేవాలయం, కొల్లాపుర్

కోపేశ్వర దేవాలయం, కొల్లాపుర్

P.C: You Tube
ఈ కోపేశ్వర దేవాలయాన్ని 12వ శతాబ్దంలో గండరాదిత్య నిర్మించారు. అటు పై విజయాదిత్య, బోజ్ దేవ అనే రాజులు ఈ దేవాలయాన్ని క్రీస్తు శకం 1109 నుంచి 1178 మధ్య రెండు సార్లు పున: నిర్మించారని ఇక్కడ దొరికిన శాసనాలు చెబుతున్నాయి.

కోపేశ్వర దేవాలయం, కొల్లాపుర్

కోపేశ్వర దేవాలయం, కొల్లాపుర్

P.C: You Tube
ఈ దేవాలయంలో వాస్తు, శిల్పకళ అత్యంత సుందరంగా ఉంటుంది. దేవతామూర్తులు, యక్షిణులు, నాట్యగత్తెలు తదితర శిల్పాలెన్నో మనం చూడవచ్చు. ఈ దేవాలయ శిల్పకళను చూడటానికి విదేశీయులు సైతం పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు.

కోపేశ్వర దేవాలయం, కొల్లాపుర్

కోపేశ్వర దేవాలయం, కొల్లాపుర్

P.C: You Tube
ఈ సుందరమైన కోపేశ్వర దేవాలయం క`ష్ణానది ఒడ్డున ఉంది. ఈ దేవాలయంలో సుమారు 48 స్తంభాలు ఉన్నాయి. ప్రతి స్తంభం పై అద్భుతమైన శిల్పాలను మనం చూడవచ్చు.

కోపేశ్వర దేవాలయం, కొల్లాపుర్

కోపేశ్వర దేవాలయం, కొల్లాపుర్

P.C: You Tube
సాధారణంగా ఈ కోపేశ్వర దేవాలయం ప్రవేశంలోనే స్వర్గ మంటపం ఉంది. ఈ మంటపానికి పై కప్పు కమనకు కనిపించదు. ఖాళీ ప్రదేశం ఉంటుంది. ఆ ఖాళీ ప్రదేశం నుంచి ఆకాంశం అందంగా కనిపిస్తుంది.

కోపేశ్వర దేవాలయం, కొల్లాపుర్

కోపేశ్వర దేవాలయం, కొల్లాపుర్

P.C: You Tube
స్థానికుల నమ్మకం ప్రకాశం శివరాత్రి రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఉపవాసం ఉండి రాత్రి సమయంలో ఈ స్వర్గ మంటపం నుంచి పైన కనబడే ఆకాశాన్ని చూస్తే మోక్షం లభిస్తుందని చెబుతారు.

మరో పదమూడు రోజుల్లో సూర్యకిరణాలు తాకే ఈ విగ్రహాన్ని చూస్తే మోక్షం ఖచ్చితంమరో పదమూడు రోజుల్లో సూర్యకిరణాలు తాకే ఈ విగ్రహాన్ని చూస్తే మోక్షం ఖచ్చితం

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X