Search
  • Follow NativePlanet
Share
» »శ్రావణ శుక్రవారం 40 కిలోల బంగారు, వజ్రాల కిరీటం ఉన్న లక్ష్మీ దేవిని సందర్శిస్తే...

శ్రావణ శుక్రవారం 40 కిలోల బంగారు, వజ్రాల కిరీటం ఉన్న లక్ష్మీ దేవిని సందర్శిస్తే...

కొల్హాపూర్ మహాలక్ష్మీ దేవాలయానికి సంబంధించిన కథనం.

మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో ఉన్న మహాలక్ష్మీ దేవాలయం ప్రళయ కాలం కంటే పురాతనమైనది. సాక్షాత్తు ఆ పరమశివుడే ఈ కొల్హాపూర్ క్షేత్రం కాశీవంటి పరమ పవిత్ర క్షేత్రమని అగస్త్యమహామునికి చెప్పాడంటే ఈ క్షేత్రం ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు. మొదట ఈ కొల్హాపూర్ ను కరవీరపురమని పేరు. అదే కాలక్రమంలో కొల్హాపూర్ గా మారిపోయింది.

కొల్లా అంటే లోయ అని పూర్ అంటే పట్టణమనే అర్థంలో ఈ క్షేత్రానికి కొల్హాపూర్ అని పేరు వచ్చినట్లు మరో కథనం కూడా ఉంది. ఇక్కడ ఉన్న మహాలక్ష్మీ దేవిని శ్రావణ శుక్రవారం దర్శించుకొంటే అంతులేని ఐశ్వర్యంతో సంతోషంతో జీవిస్తామని భక్తులు నమ్ముతారు.

అందువల్లే ఈ క్షేత్రానికి మిగిలిన రోజులతో పోలిస్తే ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు. ఈ దేవాలయం నిర్మాణం భారతీయ వాస్తు కళకు అద్దం పడుతుంది. సూర్యకిరణాలు అమ్మవారిని తాకుతూ ఆలయ పరిసర ప్రాంతాల్లో అలౌకిక ఆధ్యాత్మిక భావనను పెంపొందిస్తాయి.

మహాలక్ష్మీ ఆలయం, కొల్హాపూర్

మహాలక్ష్మీ ఆలయం, కొల్హాపూర్

P.C: You Tube

శ్రీ మహాలక్ష్మీ దేవాలయం భారత దేశంలోని మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో ఉంది. ఇది శక్తి పీఠంగా కూడా భాసిల్లుతోంది. ఇక్కడ ఉన్న మహాలక్ష్మిని ప్రేమగా అంబా బాయి అని కూడా పిలుస్తారు. ప్రతి ఏడాది లక్షల సంఖ్యలో ఈ లక్ష్మీ దేవిని సందర్శిస్తారు.

మహాలక్ష్మీ ఆలయం, కొల్హాపూర్

మహాలక్ష్మీ ఆలయం, కొల్హాపూర్

P.C: You Tube

మూడు అడుగుల ఎత్తు కలిగిన ఒకే రాతిపీఠం మీద నాలుగు చేతులతో అమ్మవారు ఉంటారు. అమ్మవారి నాలుగు చేతుల్లో ఒక దానిలో మాలుంగ ఫలం ఉండగా మరో చేతిలో ఒక పాత్ర ఉంటుంది. ఆలయంలోని ఒక గోడ పై శ్రీ యంత్రం చెక్కబడి ఉంటుంది.

ఇక్కడ ఆ అక్షరాలను చదివడం మీకు తెలిస్తే చాలు వేలకోట్ల సంపద మీ వశంఇక్కడ ఆ అక్షరాలను చదివడం మీకు తెలిస్తే చాలు వేలకోట్ల సంపద మీ వశం

మహాలక్ష్మీ ఆలయం, కొల్హాపూర్

మహాలక్ష్మీ ఆలయం, కొల్హాపూర్

P.C: You Tube

అమ్మవారి వెనక భాగంలో రాతితో చేయబడిన సింహం ప్రతిమ ఉంటుంది. అదేవిధంగా 40 కిలోల బంగారు, వజ్రాలతో తయారైన కిరీటంతో మహాలక్ష్మీ అమ్మవారు కొలువై ఉంటారు. ప్రతి రోజూ ఇక్కడ సూర్యకిరణాలు అమ్మవారిని తాకుతూ ఉండేలా ఈ దేవాలయాన్ని నిర్మించారు.

మహాలక్ష్మీ ఆలయం, కొల్హాపూర్

మహాలక్ష్మీ ఆలయం, కొల్హాపూర్

P.C: You Tube

ముఖ్యంగా గర్భగుడిలో పశ్చిమవైపున ఉన్న కిటికీ గుండా ప్రతి ఏడాది మార్చి 21 అదే విధంగా సెప్టెంబర్ 21న మూడు రోజుల పాటు సూర్య కిరణాలు ఇక్కడ అమ్మవారి విగ్రహం పై పడుతాయి. ఆ సమయంలో అమ్మవారి విగ్రహం దేదీప్యమానంగా వెలిగిపోతూ చూడటానికి కన్నుల పండువుగా ఉంటుంది.

మహాలక్ష్మీ ఆలయం, కొల్హాపూర్

మహాలక్ష్మీ ఆలయం, కొల్హాపూర్

P.C: You Tube

ఆలయం పరిసర ప్రాంతాల్లో నవగ్రహాలు, సూర్యుడు, మహిసాసుర మర్ధిని, విఠల్-రఖ్ మయి, శివుడు, విష్ణువు, తుల్జా భవాని వంటి విగ్రహాలు ఉన్నాయి. వీటిలో కొన్ని 11వ శతాబ్దానికి చెందినవి కావడం గమనార్హం. అంతేకాకుండా వీటిలో కొన్ని ఇటీవల ప్రతిష్టించిన విగ్రహాలు కూడా ఉన్నాయి.

మహాలక్ష్మీ ఆలయం, కొల్హాపూర్

మహాలక్ష్మీ ఆలయం, కొల్హాపూర్

P.C: You Tube

ఆలయం వద్ద మణికర్ణికా కుండం అనే కొలను ఉంటుంది. ఈ కొలనులో స్నానం చేసి ఒడ్డున ఉన్న విశ్వేశ్వర మహాదేవ్ విగ్రహాన్ని సందర్శించుకొన్న తర్వాత అమ్మవారి దర్శనానికి భక్తులు వెళ్లడం సర్వసాధారణం.

మహాలక్ష్మీ ఆలయం, కొల్హాపూర్

మహాలక్ష్మీ ఆలయం, కొల్హాపూర్

P.C: You Tube

ఇక్కడ అమ్మవారికి రోజుకు ఐదుసార్లు అర్చన జరుగుతుంది. ఉదయం ఐదు గంటలకు శ్రీ మహాలక్ష్మీ దేవికి సుప్రభాత సేవ చేస్తారు. అటు పై ఎనిమిది గంటలకు షోడశోపచార పూజ నిర్వహిస్తారు. మధ్యాహ్నం, సాయంత్రాల్లో పూజు, శేజ్ హారతితో పాటు రాత్రి ప్రత్యేక హారతి ఉంటుంది. ఇక అమ్మవారికి ప్రతి శుక్రవారం కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

మహాలక్ష్మీ ఆలయం, కొల్హాపూర్

మహాలక్ష్మీ ఆలయం, కొల్హాపూర్

P.C: You Tube

చైత్రమాసంలో వచ్చే పౌర్ణమితో పాటు నవరాత్రుల సమయంలో అమ్మవారికి ఉత్సవాలు జరుపుతారు. ఈ సమయంలో లక్షల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఇందులో విదేశీయులు కూడా ఉండటం గమనార్హం. అదే విధంగా ప్రతి శుక్రవారం సాయంత్రాల్లో, పౌర్ణమి రోజుల్లో అమ్మవారిని ఆలయం వెలుపల ఊరేగిస్తారు.

మహాలక్ష్మీ ఆలయం, కొల్హాపూర్

మహాలక్ష్మీ ఆలయం, కొల్హాపూర్

P.C: You Tube

ముఖ్యంగా అమ్మవారిని మహారాష్ట్రీయులు అంబాబాయి అని పిలుస్తారు. ఇక్కడ జరిగే ప్రధాన ఉత్సవం నవరాత్రి ఉత్సవం. ముఖ్యంగా ఆశ్వయుజ శుద్ధ పంచమి నాడు విశేషంగా పెద్ద ఎత్తున ఉత్సవం జరుగుతుంది.

మహాలక్ష్మీ ఆలయం, కొల్హాపూర్

మహాలక్ష్మీ ఆలయం, కొల్హాపూర్

P.C: You Tube

ఆ రోజున అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని నగరానికి తూర్పు దిశగా ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న తెంబ్లాయి అమ్మవారి ఆలయం వద్దకు ఊరేగింపుగా తీసుకువెలుతారు. అంతేకాకుండా చైత్ర పూర్ణిమ రోజున జరిగే ఉత్సవంలో అమ్మవారిని నగరమంతా ఊరేగిస్తారు.

మహాలక్ష్మీ ఆలయం, కొల్హాపూర్

మహాలక్ష్మీ ఆలయం, కొల్హాపూర్

P.C: You Tube

అమ్మవారి ఆలయం ఒక అద్భుత కళాస`ష్టి. ఈ మహాలక్ష్మ దేవాలయం హేమాండ్ పంతి నిర్మాణశైలిలో కట్టబడింది. ఇది చాలా విశాలమైన ప్రాంగణంలో చుట్టూ ఎత్తైన ప్రహరీగోడతో ఉంటుంది. ఆలయం మొత్తం మనోహరమైన శిల్పాలతో నిండి ఉంటుంది.

మహాలక్ష్మీ ఆలయం, కొల్హాపూర్

మహాలక్ష్మీ ఆలయం, కొల్హాపూర్

P.C: You Tube

పశ్చిమాభిముఖంగా ఉండే గర్భగుడి ముందు సుమారు వంద అడుగుల పొడవైన విశాల మండపం ఉంటుంది. గర్భగుడి చుట్టూ సన్నని ప్రదక్షిణ మార్గం ఉంది. మహారాష్ట్రీయులకే కాకుండా అనేకమంది హిందువులకు ఈ దేవాలయం అత్యంత పవిత్ర యాత్రాస్థలం.

మహాలక్ష్మీ ఆలయం, కొల్హాపూర్

మహాలక్ష్మీ ఆలయం, కొల్హాపూర్

P.C: You Tube

గుడి ప్రాంగణంలో ఉన్న అనేక ఆలయాల్లో విఠోబా ఆలయం కూడా చాలా పురాతనమైనది. ప్రళయకాలంలో పరమశివుడు మహాలక్ష్మీ అమ్మవారు ఈ కొల్హాపూర్ ను తన కరుములతో పైకి ఎత్తినందువల్ల ఈ క్షేత్రానికి కరవీర క్షేత్రమని పేరు వచ్చినట్లు చెబుతారు.

మహాలక్ష్మీ ఆలయం, కొల్హాపూర్

మహాలక్ష్మీ ఆలయం, కొల్హాపూర్

P.C: You Tube

ఈ క్షేత్రంలో మహాలక్ష్మీ అధిష్టాన దేవత కాగా, శివుడు, నీరుగా, విష్ణువు రాయిగా మహర్షులు ఇసుకగా, దేవతలు చెట్లుగా కొలువై ఉన్నట్లు చెబుతారు. ముఖ్యంగా మూడున్నర కోట్ల తీర్థాలూ సూర్యగ్రహణం రోజున ఇక్కడ కొలువై ఉంటాయని స్థలపురాణం చెబుతుంది.

మహాలక్ష్మీ ఆలయం, కొల్హాపూర్

మహాలక్ష్మీ ఆలయం, కొల్హాపూర్

P.C: You Tube

అందుకే సూర్యగ్రహణం రోజున ఈ క్షేత్రంలో స్నానాలు చేస్తే పంచ మహాపాతకాలు సైతం ప్రక్షాళన అవుతాయని చెబుతారు. అందుకే సూర్యగ్రహణం రోజుల లక్షల సంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుతారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X