» »ఆంధ్రప్రదేశ్ లో ప్రాముఖ్యత గల్గిన కొల్లేరు బర్డ్ శాంక్చురీ

ఆంధ్రప్రదేశ్ లో ప్రాముఖ్యత గల్గిన కొల్లేరు బర్డ్ శాంక్చురీ

By: Venkata Karunasri Nalluru

ప్రతి శీతాకాలంలో కొల్లేరు సరస్సుకు పక్షుల వలస వస్తుంటాయి. మీరు ఒక పక్షి ప్రేమికుడే కానక్కరలేదు. ఇక్కడకు

వచ్చి చూస్తే మీకు ఎప్పటికీ ఈ జ్ఞాపకాలు గుర్తుండిపోతుంది. ఒకప్పుడు ఇది ఒక పెద్ద సరస్సు మాత్రమే కానీ ఇప్పుడు

ఈ స్థలం "ఆంధ్రప్రదేశ్లో కొల్లేరు బర్డ్ శాంక్చురీ"గా అభివృద్ది చెందింది.

కొల్లేరు సరస్సు ఒక మంచినీటి సరస్సు. కాలానుగుణంగా బడమేరు మరియు తమ్మిలేరు అనే రెండు ప్రవాహాలుగా

ప్రవహిస్తూ వుంది. ఇది ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా, పశ్చిమగోదావరి అనే రెండు జిల్లాలకు విస్తరించి ఉంది.

Kolleru Bird Sanctuary in Andhra Pradesh

Kolleru Lake

PC: J.M.Garg

కొల్లేరు బర్డ్ అభయారణ్యంలో గల ఆకర్షణలు:

పక్షులు ఇక్కడ అందర్నీ ఆకట్టుకొంటాయి. శీతాకాలంలో ఈ సరస్సులో సుమారు 2 మిలియన్ల పక్షులు ఆశ్రయం కోసం వస్తాయి. ఈ కాలంలో కొల్లేరు సరస్సు సందర్శకులను కనువిందు చేస్తుంది.

ఈ సరస్సులో అనేక రకాలైన పక్షి జాతులు మనకు దర్శనమిస్తాయి. అవి కామన్ రెడ్ షాంక్స్, రెడ్-పింఛం పోచర్డ్, నిగనిగలాడే కంకణాలు, చెరువు కాకులు, ఆసియా ఓపెన్ బిల్ గూడకొంగ, ఫ్లామిగోస్ మొదలైనవి. కొల్లేరు సరస్సులో ఆసియా మరియు యూరప్ దేశాల యొక్క ఇతర ప్రాంతాల నుంచి కూడా పక్షులు వలస వస్తాయి.

Kolleru Bird Sanctuary in Andhra Pradesh

Kolleru Lake

PC: J.M.Garg

కొల్లేరు బర్డ్ సంక్చురి సందర్శనకు ఉత్తమ సమయం:

కొల్లేరు బర్డ్ శాంక్చురీ వద్ద శీతాకాల ఫెస్ట్ ఉంటుంది. అక్టోబర్ నుంచి మార్చి నెలలు కొల్లేరు బర్డ్ సంక్చురిని సందర్శించడానికి ఉత్తమ సమయం. ఇక్కడ పక్షులు చూడటానికి అద్భుతంగా ఉంటుంది. ఈ ప్రదేశం ఫొటోగ్రఫీకి చాలా బాగుంటుంది.

కొల్లేరు బర్డ్ సంక్చురి యొక్క చరిత్ర:

కొల్లేరు బర్డ్ శాంక్చురీ 1999సం.లో వన్యప్రాణి అభయారణ్యంగా ప్రకటించబడింది. తర్వాత దీనిని అంతర్జాతీయ ప్రాధాన్యమున్న వెట్లాండ్ గా రామ్సర్ కన్వెన్షన్ క్రింద చేర్చారు.

Kolleru Bird Sanctuary in Andhra Pradesh

Kolleru Bird Sanctuary

PC: J.M.Garg

కొల్లేరు సరస్సుకు బెదిరింపులు:

కొల్లేరు సరస్సు ప్రాంతం చుట్టూ అనేక కార్యకలాపాల పారంపర్యాల ముప్పు ఉంది. సరస్సు యొక్క చాలా భాగాలను ఆక్వాకల్చర్ కోసం ఉపయోగిస్తారు. చేపలు పట్టుకోవటానికి అనువుగా సరస్సు లోపల అనేక చిన్న చిన్న కొలనులు వున్నాయి. సరస్సు ప్రాంతంలో గల ఇతర సగభాగం వ్యవసాయానికి ఉపయోగిస్తారు. కొలను ఆవరణలో గల పర్యావరణ అసమతుల్య కాలుష్యాన్ని తగ్గించటానికి అనేక ఏర్పాట్లు జరుగుతున్నాయి.

పరిరక్షణ:

ఇక్కడ వన్యప్రాణి అభయారణ్యంగా ఏర్పడినప్పటి నుండి కొన్ని కోర్ ప్రాంతాల్లో ఇతర ఏ కార్యకలాపాలకు అనుమతి లేదు. పక్షులకు స్థావరం అయిన ఈ సరస్సును సంరక్షించేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో కొల్లేరు సరస్సు శీతాకాలంలో తప్పనిసరిగా చూడవలసిన సందర్శన స్థలం. ఇక్కడ విస్తారంగా ఎగిరే పక్షులను చూడటానికి వివిధ ప్రాంతాల ప్రజలు ఇక్కడకు చేరుకొని పండుగలా జరుపుకుంటారు.

Please Wait while comments are loading...