Search
  • Follow NativePlanet
Share
» »క‌ళ్లు చెదిరే ఒంపుల మార్గం..కొల్లి హిల్స్...

క‌ళ్లు చెదిరే ఒంపుల మార్గం..కొల్లి హిల్స్...

కొల్లి హిల్స్‌ తమిళనాడు రాష్ట్రంలోని నమక్కల్ జిల్లాలో ఉన్న అందమైన ప్రదేశాలలో ఒకటి. ఈ ప్రాంతాన్నే కొల్లి మలై అని పిలుస్తారు. అంటే, దీని అర్థం మృత్యు పర్వతాలు అని. శిఖ‌రాగ్రాన్ని చేరుకునేందుకు చేసే ప్ర‌యాణంలోనే దీనికి ఆ పేరు ఎందుకు వ‌చ్చిందో అర్థ‌మైపోతుంది. దాదాపు 1000 నుండి 1300 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ కొండలు 280 చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్ల‌ కంటే ఎక్కువ విస్తరించి ఉన్నాయి. ఇక్క‌డి ప‌ర్య‌త శిఖ‌రాల‌ను చేరుకునేందుకు చేసే ప్ర‌యాణంలో దాదాపు 70 హెయిర్‌పిన్ మ‌లుపుల‌ను చూడొచ్చు. ఒంపులు తిరిగే ఈ మార్గ‌మే పర్యాటకులను కొండపైకి తీసుకువెళుతుంది. పైకి చేరుకున్నాక చూస్తే కొల్లి హిల్స్ లోని అద్భుతం క‌ళ్ల‌కు క‌నిపిస్తుంది. సంవ‌త్స‌రం పొడ‌వునా ఇక్క‌డికి ప‌ర్యాట‌కులు వ‌స్తూ ఉంటారు. మ‌రీ ముఖ్యంగా ఈ సీజ‌న్‌లో కొల్లి హిల్స్ ప్ర‌యాణం కాస్త రిస్క్‌తో కూడుకున్న‌ది. అయినా స‌రే ప‌ర్యాట‌క ప్రేమికులు వెన‌క‌డుగు వేయ‌డం లేదు. ఇక్క‌డికి ద‌గ్గ‌రలో మ‌రికొన్ని సంద‌ర్శ‌నీయ ప్రాంతాల‌ను చూద్దాం.

 క‌ళ్లు చెదిరే ఒంపుల

క‌ళ్లు చెదిరే ఒంపుల

కొల్లి హిల్స్‌ తమిళనాడు రాష్ట్రంలోని నమక్కల్ జిల్లాలో ఉన్న అందమైన ప్రదేశాలలో ఒకటి. ఈ ప్రాంతాన్నే కొల్లి మలై అని పిలుస్తారు. అంటే, దీని అర్థం మృత్యు పర్వతాలు అని. శిఖ‌రాగ్రాన్ని చేరుకునేందుకు చేసే ప్ర‌యాణంలోనే దీనికి ఆ పేరు ఎందుకు వ‌చ్చిందో అర్థ‌మైపోతుంది. దాదాపు 1000 నుండి 1300 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ కొండలు 280 చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్ల‌ కంటే ఎక్కువ విస్తరించి ఉన్నాయి. ఇక్క‌డి ప‌ర్య‌త శిఖ‌రాల‌ను చేరుకునేందుకు చేసే ప్ర‌యాణంలో దాదాపు 70 హెయిర్‌పిన్ మ‌లుపుల‌ను చూడొచ్చు. ఒంపులు తిరిగే ఈ మార్గ‌మే పర్యాటకులను కొండపైకి తీసుకువెళుతుంది. పైకి చేరుకున్నాక చూస్తే కొల్లి హిల్స్ లోని అద్భుతం క‌ళ్ల‌కు క‌నిపిస్తుంది. సంవ‌త్స‌రం పొడ‌వునా ఇక్క‌డికి ప‌ర్యాట‌కులు వ‌స్తూ ఉంటారు. మ‌రీ ముఖ్యంగా ఈ సీజ‌న్‌లో కొల్లి హిల్స్ ప్ర‌యాణం కాస్త రిస్క్‌తో కూడుకున్న‌ది. అయినా స‌రే ప‌ర్యాట‌క ప్రేమికులు వెన‌క‌డుగు వేయ‌డం లేదు. ఇక్క‌డికి ద‌గ్గ‌రలో మ‌రికొన్ని సంద‌ర్శ‌నీయ ప్రాంతాల‌ను చూద్దాం

అర్ప‌లేశ్వ‌ర ఆల‌యం...

అర్ప‌లేశ్వ‌ర ఆల‌యం...

కొల్లి హిల్స్ ద‌గ్గ‌ర ప్ర‌ముఖ‌మైన సంద‌ర్శ‌నా ప్ర‌దేశంగా అర్ప‌లేశ్వ‌ర ఆల‌యం నిలుస్తోంది. దీనిని ఒక‌టో శ‌తాబ్దంలో వ‌ల్విల్ ఓరి నిర్మించారు. ఇది శివునికి అంకితం చేయ‌బ‌డిన‌దిగా చెబుతారు. ఈ ఆల‌యం నేటికీ అద్భుత‌మైన ద్ర‌విడ నిర్మాణ శైలికి నిలువెత్తు నిద‌ర్శ‌నంగా నిలుస్తుంది. ఆల‌య నిర్మాణం ప‌ర్యాట‌కుల‌ను చూపుతిప్పుకోనిదు. ఈ పురాత‌న రాతి నిర్మాణం అబ్బుర‌ప‌రిచేదిగా ఉంటుంది. నిత్యం ఆల‌య ప‌రిస‌రాలు నిర్మానుష్యంగా ఉన్న‌ప్ప‌టికీ, అక్క‌డ వేసే ప్ర‌తి అడుగూ మ‌ర్చిపోలేని అనుభూతుల‌ను అందిస్తుంది.

 బొటానిక‌ల్ గార్డెన్‌...

బొటానిక‌ల్ గార్డెన్‌...

ఇది సెమ్మెడ్ నుంచి మూడు కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది. కొల్లి హిల్స్‌ల‌లో చూడాల్సిన ముఖ్య‌మైన ప్ర‌దేశాల‌లో బొటానిక‌ల్ గార్డెన్ ఒక‌టి. గార్డెన్ లోప‌ల‌కు ప్ర‌వేశించేందుకు పెద్ద‌ల‌కు 20, పిల్ల‌ల‌కు 10 రూపాయిలు చెల్లించాల్సి ఉంటుంది. చుట్టూ గులాబీ తోట‌ల‌తో ఈ గార్డెన్ క‌నువిందు చేస్తుంది. ప‌ర్యావ‌ర‌ణ హిత‌మైన కాటేజీలు ఇక్క‌డి ప్ర‌త్యేక‌త‌. కుటుంబంతో వ‌చ్చేవారికి పిల్ల‌ల కోసం ఏర్పాటు చేసిన చిల్డ్ర‌న్స్ పార్క్ అద‌న‌పు ఆక‌ర్ష‌ణ అనే చెప్పాలి. ఇక్క‌డికి ద‌గ్గ‌ర‌లోనే టాంప్కొల్ ఔష‌ధ ఉద్యాన‌వ‌నం ఉంది. ఎటు చూసినా ఎన్నో ర‌కాల ఔష‌ధ మొక్క‌లు ఇక్క‌డ ద‌ర్శ‌న‌మిస్తాయి. అంతేకాదు, చుట్టూ విహ‌రించేందుకు అనువుగా ప‌చ్చ‌ద‌నం నిండిన గార్డెన్ కూడా ఇక్క‌డ అందుబాటులో ఉంది. ప్ర‌కృతిని ఆస్వాదించాలి అనుకునేవారికి ఈ ప్రాంతం ఎంతో న‌చ్చుతుంది.

ఎలా చేరుకోవాలి

ఎలా చేరుకోవాలి

వాయు మార్గంలో చేరుకునేందుకు త్రిచీ విమానాశ్ర‌యం ద్వారా ఇక్క‌డికి సుల‌భంగా చేరుకోవ‌చ్చు. కొల్లి హిల్స్ ఇక్క‌డికి 90 కిలోమీట‌ర్ల దూరంలో ఉంది. అక్క‌డి నుంచి ప్రీపెయిడ్ టాక్సీలు అందుబాటులో ఉంటాయి. సేలం రైల్వే స్టేష‌న్ కొల్లి హిల్స్‌కు ద‌గ్గ‌ర‌లోని రైల్వే స్టేష‌న్‌. దీని బ‌య‌ట ఇక్క‌డ‌కు నేరుగా చేరుకునేందుకు బ‌స్సులు ఉంటాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X