Search
  • Follow NativePlanet
Share
» »కొల్లి హిల్స్ చుట్టుప్రక్కల సందర్శించవలసిన పర్యాటక స్థలాలు !

కొల్లి హిల్స్ చుట్టుప్రక్కల సందర్శించవలసిన పర్యాటక స్థలాలు !

By Mohammad

ఎవ్వరికైనా సెలవులు వస్తే ఏంచేస్తారు ? హోమ్ సిక్ తో బాధపడేవారు స్వస్థలాలకి, ఇండ్లకాడ ఉండే వారు ఏదైనా టూర్ కి వెళ్ళాలని ఆశపడతుంటారు. ఎక్కువ రోజులు సెలవులు వస్తే లాంగ్ జర్నిలకు ఇష్టపడతారు. అదే తక్కువ రోజులు సెలవులు వస్తే దగ్గరలోనే ఏదైనా మంచి పర్యాటక ప్రదేశానికి వెళ్ళి ఆహ్లాదంగా గడిపేస్తారు.

ఉత్తర భారతదేశంలో అయితే అందరి దృష్టి సిమ్లా, డెహ్రాడూన్, కులు-మనాలి వంటి ప్రదేశాలవైపు, దక్షిణ భారతదేశంలో ఐతే ఊటీ లేదంటే కొడైకెనాల్ వంటి ప్రదేశాలని ఎంచుకుంటుంటారు పర్యాటకులు. ఎందుకంటే అవి హిల్ స్టేషన్ లు మరియు అక్కడికి చేరుకోవటానికి అన్నివిధాల రవాణ సౌకర్యాలు సులభంగా ఉంటాయి.

ఇది కూడా చదవండి : ఉల్లాసపరిచే ఊటీ రైలు ప్రయాణం !

దక్షిణ భారత దేశంలో ఊటీ, కొడైకెనాల్ తప్పనిచ్చి మరేదైనా హిల్ స్టేషన్ ఉందా ... అంటే ఆది కొల్లి హిల్స్. కొల్లి హిల్స్ ను మీరు ఇదివరకెన్నడూ చూసిలేకుంటారు సరికదా వినిఉండరు. అవును నిజమే ..! ఇది చాలామందికి తెలీని హిల్ స్టేషన్. నిజం చెప్పాలంటే తమిళ ప్రజలకు కూడా ఇది తెలీదు. వారు తెలియక సాధారణంగా రొటీన్ ప్రదేశాలనే తిరిగొస్తుంటారు.

ఇది కూడా చదవండి : తమిళనాడులోని పిక్నిక్ ప్రదేశాలు !

కొలి హిల్స్ లేదా కొల్లి కొండలు అనేవి ఒక పర్వత శ్రేణి. తమిళనాడు లోని నామక్కల్ జిల్లాలో ఈ హిల్ స్టేషన్ ఉంది. నామక్కల్ కి 35 కి.మీ. దూరంలో, సేలం కి 61 కి.మీ. దూరంలో ఉంది ఈ హిల్ స్టేషన్. సుమారు 280 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ కొండ ప్రాంతం సముద్రమట్టానికి 1000 - 15000 మీటర్ల ఎత్తున ఉంటుంది. ఎటుచూసినా చుట్టూ కనువిందు చేసే ప్రకృతి సౌందర్యం, కొండలు, అడవులు .... మనస్సుకి ప్రశాంతతను చేకూరుస్తాయి.

ఇది కూడా చదవండి : సేలం పర్యాటక ప్రదేశాలు !

కొల్లి హిల్స్ బెంగళూరు నగరానికి 263 కి.మీ. దూరంలో, చెన్నై నగరానికి 366 కి.మీ. దూరంలో, ఊటీ కి 254 కి.మీ. దూరంలో మరియు కొడైకెనాల్ కి 245 కి.మీ. దూరంలో ఉన్నది. మరి ఇక ఆలస్యం చేయకుండా కొల్లి హిల్స్ చుట్టుప్రక్కల సందర్శించవలసిన పర్యాటక స్థలాలు గురించి తెలుసుకొని సెలవులను హాయిగా గడిపెద్దాం... ఈ ప్రదేశం ఎవ్వరికీ పెద్దగా తెలియదు కనుక పర్యాటకుల తాకిడి పెద్దగా కనిపించదు కావున మీ ప్రశాంతతకు ఎటువంటి భగంవాటిల్లదు. ఎంత ఉత్సాహంతోనైతే వెళుతున్నారో ... అంతకంటే ఎక్కువ ఉత్సాహంతో తిరుగు ప్రయాణమవుతారు. కానీ ...!

ఇది కూడా చదవండి : తమిళనాడు అంటే చాలు గుర్తుకొచ్చేస్తాయ్ !

ముఖ్య గమనిక ఏమిటంటే దెయ్యాలు మామూలుగా రాత్రిపూట సంచరిస్తాయి కానీ కొల్లి హిల్స్ లో పగలు కూడా సంచరిస్తాయని పుకారు కూడా ఉంది. అందుకే కాబోలు ఇక్కడికి రావటానికి ఎవ్వరూ సాహసించారు. ఇవన్ని ఒట్టి మూఢనమ్మకాలని జనవిజ్ఞాన వేదికలు, సామాజిక ఉద్యమకారులు, ప్రభుత్వాలు నెత్తి నోరు బాదుకుంటున్నా, అరిచిగోపెట్టుతున్న గిరిజనులు మాత్రం ఇక్కడ వారి పూర్వీకులు దయ్యాలై తిరుగుతున్నారని అందుకే పర్యాటకులకు కొన్ని ప్రాంతాల్లో సంచరించవద్దని చెబుతున్నామని వాపోతున్నారు.

అగాయ గంగై జలపాతం, కొల్లి హిల్స్

అగాయ గంగై జలపాతం, కొల్లి హిల్స్

అగాయ గంగై ఒక జలపాతం. ఇది కొల్లి హిల్స్ నుండి 12 కి. మీ. దూరంలో ఉండి, పావు గంటలో చేరుకొనే విధంగా ఉంటుంది. సుమారు 300 అడుగుల ఎత్తు నుంచి కిందికి పడుతుంది ఈ జలపాతం.

చిత్ర కృప : Joel Suganth

అగాయ గంగై జలపాతం, కొల్లి హిల్స్

అగాయ గంగై జలపాతం, కొల్లి హిల్స్

అన్నివైపులా దట్టమైన పర్వతాలతో చుట్టుముట్టిన అగాయ గంగా జలపాతంను చేరుకోవటానికి 1032 మెట్లు దిగవలసి ఉంటుంది. కిందకు చేరుకోగానే రాతి శిలల నుంచి జారువాలే నీటిధార ను చూస్తే అప్పటి వరకు పడ్డ కష్టం మరిచిపోయి, ఉత్సాహంతో చిందులు వేస్తారు.

ఇది కూడా చదవండి : కాంచీపురం పర్యాటక ప్రదేశాలు !

చిత్ర కృప : Nellai S S Mani

అరపలీస్వరార్ ఆలయం, కొల్లి హిల్స్

అరపలీస్వరార్ ఆలయం, కొల్లి హిల్స్

అగాయ గంగా జలపాతం సమీపంలో అరపలీస్వరార్ ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని వల్విల్ ఒరి పాలనలో (క్రీ.శ. 1 - 2 వ శతాబ్ధంలో) నిర్మించినారు. ఇది మహా శివునికి అంకితం చేయబడ్డ గుడి. ఈ ఆలయం వద్ద చోళ కాలం నాటి శాసనాలు చూడవచ్చు. అలాగే పురాణాల ప్రకారం, పొలం దున్నతున్న రైతుకి శివలింగం తగిలి రక్త స్రావం అయ్యెను. అప్పుడు శివలింగం మీద ఏర్పడ్డ చిన్న గాయం నేటికీ కనిపిస్తుంది.

ఇది కూడా చదవండి : ఆధ్యాత్మిక రత్నం - అన్నామలై !

చిత్ర కృప : Nellai S S Mani

కొల్లి హిల్స్

కొల్లి హిల్స్

నిజం చెప్పాలంటే, కొల్లి హిల్స్‌కు చేరుకొనే దారి ఎంతో ఆసక్తికరంగా, సాహసోపేతంగా ఉంటుంది. మెట్ట ప్రాంతం నుంచి ఆ కొండల మీదకు దూరం పదిహేను కొలోమీటర్లే అయినప్పటికీ, పాము మెలికలు తిరిగినట్లు, దాదాపు 70 మలుపులతో ఉంటుందా దారి. పగటిపూట ఈ మార్గంలో ప్రయాణం చేస్తే, కొండల అందాల్ని కళ్ళారా చూడవచ్చు. అక్కడే ఉన్న పోటొగ్రాఫర్లతో చక్కటి ఫోటోలు కూడా తీయించుకోవచ్చు.

చిత్ర కృప : Wild Orchids Camp

సెమ్మేడు, కొల్లి హిల్స్

సెమ్మేడు, కొల్లి హిల్స్

కొల్లి హిల్స్ పైకి చేరుకోగానే, సెమ్మేడు అనే పట్నం కనిపిస్తుంది. అక్కడ బస చేసి, ఆ చుట్టుపక్కలి ప్రాంతాల్ని కలియతిరగొచ్చు. సెమ్మేడు లో వసతి కొరకై స్టార్ హోటళ్ళు, రిసార్టులు ఉన్నాయి. ఈ పట్నానికి 17 కి.మీ.ల దూరంలో ఓ జలపాతం ఉంది. ఇక్కడకు వెళితే, ఆ పరిసరాలు ఎంత అందంగా ఉంటాయో! వెళితేగానీ చెప్పలేం.

ఇది కూడా చదవండి : తమిళనాడులోని నవగ్రహాలు !

చిత్ర కృప : Austin Perez

తోటలు, కొల్లి హిల్స్

తోటలు, కొల్లి హిల్స్

ప్రకృతి ప్రేమికులకు ఈ ప్రాంతం ఓ అదృష్టం. ఇక్కడ సేంద్రియ పద్దతిలో చిరుధాన్యాలను పండించి బయట అమ్ముతుంటారు. అలాగే, ఈ కొండల నిండా అనాస, పనస, సపోటా, బత్తాయి, పైనాపిల్ తోటలు సమృద్దిగా ఉన్నాయి. మిరియాలు, కాఫీ వంటి వాణిజ్య పంటలు సైతం ఈ కొండల్లో పండిస్తారు. ఈ ప్రాంతాన్ని సందర్శించేవారు గుర్తుగా వీటిలో కొన్నింటిని తీసుకువెళ్ళచ్చు.

చిత్ర కృప : Prateek Kanswa

అడవులు, కొల్లి హిల్స్

అడవులు, కొల్లి హిల్స్

కొల్లి హిల్స్ మీద సుమారుగా 100 దాకా అడవులు ఉన్నాయి. పవిత్రంగా భావించే ఈ అడవుల్లోని కొన్ని ప్రాంతాల్లోకి గిరిజనులు ఎవ్వరినీ అనుమతించరట కారణం ఈ ప్రాంతాల్లోనే వారు తమ బంధువులను, పూర్వీకులను ఖననం చేస్తారు.

ఇది కూడా చదవండి : వేలూరు - గోల్డెన్ టెంపుల్ !

చిత్ర కృప : Bo Kage Carlson

సీకుపరై & సేలూర్ నాడు, కొల్లి హిల్స్

సీకుపరై & సేలూర్ నాడు, కొల్లి హిల్స్

సీకుపరై & సేలూర్ నాడు అనేవి కొల్లి హిల్స్ లోని రెండు వ్యూ పాయింట్ లు. ట్రెక్కింగ్, బోటింగ్ మరియు ధ్యానం వంటి వాటికి ఈ ప్రదేశం అనుకూలంగా ఉంటుంది. నిర్మలమైన సహజ ప్రకృతి దృశ్యాలను కళ్ళార్పకుండా వీక్షించేందుకు, అద్భుతమైన సూర్యోదాయ, సూర్యాస్తమ సమయాలను గడపటానికి సందర్శకులు ఇక్కడికి వస్తుంటారు.

చిత్ర కృప : Radhakrishnan Sadasivam

మసిలా జలపాతం ,కొల్లి హిల్స్

మసిలా జలపాతం ,కొల్లి హిల్స్

మసిలా జలపాతం చూడటానికి ఆకర్షణీయంగా ఉండటంవల్ల సెలవు రోజులలో కుటుంబాలతో కలసి గడపటానికి బాగుంటుంది. ఈ జలపాతం ఎత్తు 200 అడుగులు ఉంటుంది. కుడివైపు జలపాతం వరకు విస్తరించి ఒక కాంక్రీట్ మార్గం మరియు పార్కింగ్ స్పాట్ ను పర్యాటకుల కొరకు ఏర్పాటుచేశారు. పర్యాటకులు జలపాతం వద్ద స్నానం చేస్తే తప్పక రిఫ్రెష్ పొందుతారు.

ఇది కూడా చదవండి : ఎన్నో ఆకర్షణల ఏలాగిరి హిల్ స్టేషన్ !

చిత్ర కృప : A. Vaman Pai

మసిలా జలపాతం టైమింగ్స్

మసిలా జలపాతం టైమింగ్స్

మసిలా జలపాతాన్ని సందర్శించడానికి ఒక టైమింగ్ అంటూ ఉంది.జలపాతాన్ని చూడటానికి వాహనాన్ని తీసుకొనివెళితే రూ. 10 ఛార్జి వసూలు చేస్తారు. ఈ జలపాత సందర్శన సందర్శించు సమయం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు. మసిలా జలపాతం యొక్క పైభాగంలో మాసి పెరియాస్వామి దేవాలయం ఉంది. ఆలయం సమీపంలో నుండి జలపాత వీక్షణ మంత్రముగ్ధులను చేస్తుంది.

చిత్ర కృప : Siddharthan Rajaraman

స్వామి ప్రనవానంద ఆశ్రమం, కొల్లి హిల్స్

స్వామి ప్రనవానంద ఆశ్రమం, కొల్లి హిల్స్

స్వామి ప్రనవానంద ఆశ్రమం మానవ నివాసాలకు దూరంగా, ప్రశాంత వాతావరణంలో ఉంటుంది. స్వామీజీ తపస్సు సమయంలో శివుడు ఇచ్చిన అజ్ఞ మేరకు దేవునికి అంకితం చేయబడిన ఒక దేవాలయమును కట్టించెను. ఈ ఆశ్రమంలోఆధ్యాత్మికం మీద చర్చలు మరియు ధ్యానం వంటి రోజు వారి కార్యక్రమాలు ఉంటాయి.

ఇది కూడా చదవండి : కరూర్ లో చూడవలసిన ప్రదేశాలు !

చిత్ర కృప : Adithya Ramesh

బొటానికల్ గార్డెన్, కొల్లి హిల్స్

బొటానికల్ గార్డెన్, కొల్లి హిల్స్

కొల్లి హిల్స్ చేరువలో ఉన్న బొటానికల్ గార్డెన్ పిక్నిక్ స్పాట్ గా చెప్పవచ్చు. ఈ పార్క్ లో ఎకో - ఫ్రెండ్లీ కాటేజీలు, రోజా పూల తోటలు, హెర్బల్ పార్క్ మరియు వ్యూ పాయింట్ లు కనిపిస్తాయి. చిన్న పిల్లలకైతే ఆడుకోవడానికి సీసా, వేవ్ స్లైడ్, నిలబడిన జంతువుల బొమ్మలు ఇంకా అనేక రైడ్ లు ఉన్నాయి. ఈ గార్డెన్ లో ప్రత్యేకమైనవి పైనాపిల్ పరిశోధన క్షేత్రం మరియు ఫ్లవర్ షో.

చిత్ర కృప : Nellai S S Mani

బోట్ హౌస్, కొల్లి హిల్స్

బోట్ హౌస్, కొల్లి హిల్స్

కొల్లి హిల్స్ కి చేరువలో ఉన్న వసలుర్ పట్టి వద్ద బోట్ హౌస్ ను ప్రభుత్వం వారు నిర్వహిస్తుంటారు. ఈ గ్రామం సోలక్కాడు - తిన్ననూర్ పట్టి రోడ్డు మార్గంలో ఉన్నది. ఇక్కడ బోట్ విహారం చేయటానికి అనుకూలంగా ఉంటుంది. సరస్సు మధ్యలో సహజంగా ఏర్పడ్డ ఐలాండ్ ఇక్కడి అదనపు ఆకర్షణ.

ఇది కూడా చదవండి : మధురై - మాతా మీనాక్షి కొలువు !

చిత్ర కృప : Thangaraj Kumaravel

మిని ఫాల్స్, కొల్లి హిల్స్

మిని ఫాల్స్, కొల్లి హిల్స్

మిని ఫాల్స్ కొల్లి హిల్స్ వద్ద ఉన్నాయి. సుమారు 90 అడుగుల ఎత్తు నుండి కిందపడే నీటిధార చూడటానికి ఉత్సాహంగా ఉంటుంది. అలాగే ఈ జలపాతం చుట్టూ కప్పబడిఉన్న ఆయుర్వేద మొక్కలు ఈ ప్రాంత అందాల్ని మరింత పెంచుతున్నాయి.

ఇది కూడా చదవండి : తిరుచిరాపల్లి - తమిళనాడు గుండెకాయ !

చిత్ర కృప : VD

సిద్ధర్ గుహలు, కొల్లి హిల్స్

సిద్ధర్ గుహలు, కొల్లి హిల్స్

సిద్ధర్ గుహలు కొల్లి హిల్స్ చేరువలో ఉన్నాయి. చోళుల కాలంలో ఆయుర్వేద వైద్యులు ఇక్కడ ఔషధాలను తయారు చేసేవారని అక్కడ కనిపించే దృశ్యాల వల్ల తేటతెల్లమవుతుంది. ఈ గుహల చుట్టూ కూడా ఔషధ మొక్కలు విరివిగా ఉన్నాయి.

చిత్ర కృప : durga

వేశాధారణలు

వేశాధారణలు

కొల్లి హిల్స్‌లో 'మలయాళీ గిరిజనులు'గా అందరూ పిలిచే స్థానిక గిరిజన తెగల వాళ్ళు ఎక్కువగా కనిపిస్తుంటారు. గిరిజనులు ఎంతో సంస్కారయుతంగా దుస్తులు వేసుకుంటారు. వాళ్ళ ఇంటి ముందు కూడా ఓపెన్ డ్రెయిన్లేవీ ఉండవు.

ఇది కూడా చదవండి : ఏర్కాడ్ - పేదల ఊటీ !

చిత్ర కృప : Bo Kage Carlson

వసతి

వసతి

కొల్లి హిల్స్ లో తక్కువ ధరకే బస చేసేందుకు వీలుగా హోటళ్లు, రిసార్ట్‌లు ఉన్నాయి. భోజనం కూడా తక్కువ ధరకే లభిస్తుంది.

చిత్ర కృప : Wild Orchids Camp

పండుగలు

పండుగలు

ఒరి ఫెస్టివల్ ఇక్కడి గిరిజనులు జరుపుకొనే ప్రధాన పండగ. అలాగే , ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి.

చిత్ర కృప : Neglected and Underutilized Species

వాతావరణం

వాతావరణం

ఇక్కడి వాతావరణం చల్లాగా ఉంటుంది కానీ చలిపెట్టదు. మిగిలిన హిల్ స్టేషన్ల వాతావరణానికి వేరుగా కొల్లి హిల్స్ వేసవి కాలంలో పగటి ఉష్ణోగ్రత 28 - 33 డిగ్రీల సెల్సియస్, రాత్రిపూట ఉష్ణోగ్రత 16 - 22 డిగ్రీలు ఉంటుంది. అయితే, చలికాలంలో మాత్రం ఇక్కడ ఉష్ణోగ్రత పగటిపూట 10 డిగ్రీలు, రాత్రిపూట 5 డిగ్రీలు ఉంటుంది కనుకనే ఎండ నుంచి తప్పించుకోవడానికి ఇది చక్కటి పర్యాటక ప్రాంతంగా చెప్పవచ్చు.

ఇది కూడా చదవండి : తమిళనాడు లో ప్రసిద్ది చెందిన జలపాతాలు !

చిత్ర కృప : Ashwanth RT

కొల్లి హిల్స్ ఎలా చేరుకోవాలి ??

కొల్లి హిల్స్ ఎలా చేరుకోవాలి ??

కొల్లి హిల్స్ చేరుకోటానికి అన్ని రకాల రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.

వాయు మార్గం

కొల్లి హిల్స్ కి 110 కి. మీ. దూరంలో ఉన్న ట్రిచీ సమీప విమానాశ్రయం. ట్రిచీ కి రెగ్యులర్ విమానాలు చెన్నై నుంచి అందుబాటులో ఉన్నాయి. ట్రిచీ విమానాశ్రయం నుండి కొల్లి హిల్స్ కు టాక్సీ రైడ్ కు సగటున 1200 రూపాయలు ఖర్చవుతుంది.

రైలు మార్గం

కొల్లి హిల్స్ కు సమీపంలోని రైల్వే స్టేషన్ 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న సేలంలో ఉంది. ట్రిచీ రైల్వే స్టేషన్ 90 కి. మీ. దూరంలో ఉంది. సేలం లేదా ట్రిచీ నుండి కొల్లి హిల్ కు టాక్సీ లేదా ఇతర ప్రవేట్, ప్రభుత్వ వాహనాల్లో ప్రయాణించి చేరుకోవచ్చు.

రోడ్డు మార్గం

కొల్లి హిల్స్ కు రోడ్ సౌకర్యం చక్కగా ఉంది మరియు చెన్నై మరియు సేలం వంటి నగరాలకు కలపబడింది. సేలం నుండి ప్రైవేట్ మరియు ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణించి కొల్లి చేరుకోవచ్చు. అలాగే చెన్నై, మధురై మరియు ట్రిచీ నుండి కూడా చేరుకోవచ్చు. సేలంలో బస్ స్టాండ్ నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొల్లి కొండలు చేరటానికి ఒకవేళ మీరు టాక్సీ అద్దెకు తీసుకుంటే సగటున రూ. 1100 చెల్లించవలసి వస్తుంది.

చిత్ర కృప : Keerthi JS

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X