Search
  • Follow NativePlanet
Share
» »భూమికి దిగి వచ్చిన సూర్యుడు !

భూమికి దిగి వచ్చిన సూర్యుడు !

ఓడిశా లోని కోణార్క్ ప్రదేశానికి కోణార్క్ సన్ టెంపుల్ ప్రధాన ఆకర్షణ. ఈ దేవాలయ శిల్ప శైలి అందాలు ఆకర్షణీయంగా వుండి పర్యాటకులను ఆశ్చర్య పడేలా చేస్తుంది. ఎంతో ప్రసిద్ధి చెందినా ఈ టెంపుల్ యునెస్కో సంస్థ చే హెరిటేజ్ సైట్ గా కూడా గుర్తించబడింది. ఈ టెంపుల్ 13 వ శతాబ్దం లో నిర్మించబడింది. కాలానుగునంగా వచ్చే మార్పులు, విదేశీయుల దండయాత్రలు ఈ టెంపుల్ శోభను ఎంత తగ్గించినప్పటికీ, నేటికీ ఈ దేవాలయం కోణార్క్ లో ఒక ప్రసిద్ధ ఆకర్షణగా కొనసాగుతూ పర్యాటకులను అచ్చేరువొందిస్తోంది. కోణార్క్ దేవాలయం సూర్య భగవానుడికి అంకితం ఇవ్వబడింది. సోర్యుడు భూమికి దిగి వచ్చాడా అనేలా ఈ దేవాలయంలోని విగ్రహాలు మీకు దర్శనం ఇస్తాయి.

రధం ఆకారంలో

రధం ఆకారంలో

ఈ టెంపుల్ ను అద్భుతం అనిపించేట్లుగా ఒక పెద్ద రధం ఆకారంలో నిర్మించారు. మంచి అలంకరణ కల తూర్పు గెట్ టెంపుల్ కు ప్రధాన ప్రవేశంగా వుంటుంది. ఇదే టెంపుల్ కు ప్రధాన ఆకర్షణ.

నట మందిర్

నట మందిర్

నట మందిర్ టెంపుల్ లో ఒక భాగం. ఇది కోణార్క్ సన్ టెంపుల్ లో ఒక ప్రధాన ఆకర్షణ. తప్పక చూడ దగినది. దీనిలో ఆనాటి టెంపుల్ నాట్య కారిణి లు డాన్స్ లు చేసేవారు. సూర్య దేవుడికి నివాళులు అర్పించేవారు.

పెయింటింగ్ లు

పెయింటింగ్ లు

దేవాలయం వెలుపల, లోపల కల అందమైన టెంపుల్ పెయింటింగ్ లు మిమ్ములను అచ్చేరువొందిస్తాయి. ప్రతి ఒక్క పెయింటింగ్ మీకు ఒక పురాణ గాఢ ను వివరిస్తుంది. కొన్ని గోడలపై, కామ కేళి , సరస సల్లాపాలు కూడా కనపడతాయి.

టెంపుల్ వాస్తవాలు

టెంపుల్ వాస్తవాలు

కోణార్క్ సన్ టెంపుల్ కు పన్నెండు జతల చక్రాలు నిర్మించ బడి వుంటాయి. Photo Courtesy: Raveesh Vyas

 గుర్రాల చిత్రాలు

గుర్రాల చిత్రాలు

టెంపుల్ లోని గుర్రాల చిత్రాలు సూర్యదేవుడి అస్వాలను సూచిస్తూ అందంగా వుంటాయి. సూర్య భగవానుడు తన రధంపై ప్రయాణిస్తున్నట్లు కనపడుతుంది. Photo Courtesy: Souvik Burman

కోణార్క్ ఎలా చేరాలి ?

కోణార్క్ ఎలా చేరాలి ?

కోణార్క్ సన్ టెంపుల్ భువనేశ్వర్ ఎయిర్ పోర్ట్ కు 62 కి. మీ. ల దూరంలో కలదు. పూరి రైల్వే స్టేషన్ కు 35 కి. మీ. లు. టెంపుల్ చేరేందుకు టాక్సీ లు, కేబ్ లు దొరుకుతాయి. ఈ టెంపుల్ కు వెళ్ళే ముందు మా ట్రావెల్ గైడ్ తప్పక తీసుకు వెళ్ళండి. సహాయ కారిగా వుంటుంది.

ఎపుడు సందర్సించాలి ?

ఎపుడు సందర్సించాలి ?

టెంపుల్ సందర్శనకు వేసవి అనుకూలం కాదు. కనుక అక్టోబర్ నుండి మార్చ్ వరకు గల శీతాకాలం మీ ప్రయాణానికి ఆహ్లాదకరంగా వుంటుంది.

 టైమింగ్స్ ఏమిటి ?

టైమింగ్స్ ఏమిటి ?

ఈ దేవాలయం ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు వారంలో ప్రతి రోజూ తెరిచి వుంటుంది.
Photo Courtesy: Mayank Choudhary
కో

 సమీపంలో ఏమి చూడాలి ?

సమీపంలో ఏమి చూడాలి ?

టెంపుల్ సమీపంలో ఇతర ఆకర్షణలు అయిన చంద్ర భాగ సి బీచ్, చౌరాసి మరియు రామచండి వంటి ప్రధాన ప్రదేశాలు చూడవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X