Search
  • Follow NativePlanet
Share
» » ఇక్కడ పెళ్లిచేసుకొంటే కొన్ని గంటల్లోనే వైధవ్యం

ఇక్కడ పెళ్లిచేసుకొంటే కొన్ని గంటల్లోనే వైధవ్యం

కువాగం ఉత్సవానికి సంబంధించిన కథనం.

సభ్యసమాజం నుంచి అనాదరణకు గురైన కొంతమంది బిక్షాటన, వేశ్య తదితర వృత్తులతో జీవనం సాగిస్తుంటారు. అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితిలో మార్పు వస్తోంది. వీరిలో కూడ కొంతమంది ప్రొఫెసర్లు, పోలీసు ఆఫీసర్లు కూడా ఉంటున్నారు. వీరిలో చాలా కాలంగా ఒక ఆచారం కొనసాగుతూ వస్తోంది. వీరు కూడా పెళ్లి చేసుకొంటారు. అయితే పెళ్లి చేసుకొన్న వీరు కొన్ని గంటలు మాత్రమే ముతైదువులుగా ఉంటారు. అటు పై వైద్యవ్యానికి సూచికగా తెల్ల చీరను ధరిస్తారు. తరతరాలుగా ఈ ఆచారం కొనసాగుతూనే వస్తోంది. ప్రస్తుతం వారే కాకుండా కొంతమంది పర్యాటకులు ఈ తంతును చూడటానికి ఎక్కువ సంఖ్యలో ఇందుకు సంబంధించిన కథనం మీ కోసం...

కువాగం

కువాగం

P.C: You Tube

హిజ్రాల కథనం అనుసరించి మహాభారత యుద్దంలో పాండవులు గెలవాలంటే ముందుగా ఒక మహావీరుడిని నరబలి ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటి వీరులు పాండవుల్లో ఉన్నారు. అయితే సైనిక బలం కరువుల కంటే పాండవులకు తక్కువ.

కువాగం

కువాగం

P.C: You Tube
ఈ సమయంలో మరో మహావీరుడిని పోగొట్టుకోవడం వారికి ఇష్టముండదు. దీంతో ఈ గండం నుంచి గట్టెక్కించాల్సిందిగా శ్రీకృష్ణుడిని కోరుతారు. దీంతో శ్రీకృష్ణుడు బాగా ఆలోచించి అర్జునుడు, నాగకన్యకు జన్మించిన ఐరావంతుడు ఇందుకు సరైన వ్యక్తిగా భావిస్తాడు.

కువాగం

కువాగం


P.C: You Tube
విషయాన్ని ఐరావంతుడికి తెలిపి బలికి సిద్ధం చేస్తాడు. అయితే బలికి ముందు తాను వివాహం చేసుకోవాలనుకుంటున్నానని ఐరావంతుడు శ్రీకృష్ణుడికి తెలియజేస్తాడు. దీంతో శ్రీకృష్ణుడితో పాటు పాండవులు ఆలోచనలో పడుతారు.

కువాగం

కువాగం

P.C: You Tube
బలికాబోయే వారికి కోరి పిల్లను ఎవరిస్తారని వారు చింతిస్తుంటారు. ఈ సమయంలో శ్రీకృష్ణుడు మోహినీ అవతారమెత్తి ఐరావంతుడిని పెళ్లి చేసుకొంటారు. అలా ఆ మోహినీ అవతారంతోనే తాము పుట్టామని హిజ్రాలు చాలా ఏళ్లుగా నమ్ముతున్నారు.

కువాగం

కువాగం

P.C: You Tube
అందుకే ఐరావంతుడిని తమ భర్తగా వారు భావించి కొలుస్తారు. ఏడాది మొత్తం దేశంలో వివిధ చోట్ల ఉండే హిజ్రాలు చైత్రమాస పౌర్ణమి రోజున తమిళనాడులోని విల్లుపురం జిల్లాలోని కువాగం గ్రామనికి చేరుకొంటారు.

కువాగం

కువాగం

P.C: You Tube
అక్కడి కుతాండవర్ అనే ఆలయంలో పెళ్లి చేసుకోవడానికి సర్వం సిద్ధం చేసుకొంటారు. వారం ముందునుంచే పలు పలు ప్రాంతాల నుంచి హిజ్రాలు విల్లుపురం చేరుకొని పూటకు ఒక విధంగా అలంకరించుకొంటారు.

కువాగం

కువాగం

P.C: You Tube
వీధుల్లో ఆటపాటలు పాడుతూ ఆనందిస్తారు. ఈ సందర్భంగా హిజ్రాలకు డ్యాన్స్, అందాల పోటీలను కూడా నిర్వహిస్తారు. కళ్యాణోత్సవం రోజున హిజ్రాలందరూ పట్టుచీరలు ధరించి పెళ్లికూతురులాగా అలంకరించుకొని ఐరావంతుడి దర్శనానికి వెలుతారు.

కువాగం

కువాగం

P.C: You Tube
అటు పై అక్కడి పూజారులతో పుసుపుతాడును తాళిగా కట్టించుకొంటారు. అలా తాళిని కట్టించుకున్న హిజ్రాలు ఆ రాత్రంతా ఆలయంలోనే ఆడుతూ పాడుతూ సంతోషంగా గడుపుతారు. చెక్కలతో చేసిన ఐరావంతుని విగ్రహాన్ని ఊరంతా ఊరేగిస్తారు.

కువాగం

కువాగం


P.C: You Tube
తెల్లవారుజామున ఐరావంతుడి బలికి సూచికగా విగ్రహం తలను తీసేస్తారు. అతవరకూ ఆనందోత్సవాలతో ఆడిపాడిన హిజ్రాలు ఐరావంతుడు బలైనాడని గుండెలు బాదుకొంటూ జుట్టు విరబోసుకొని హాహాకారాలు చేస్తూ తమ విచారాన్ని వెలుబుచ్చుతారు.

కువాగం

కువాగం

P.C: You Tube
ఆ తరువాత తాళిని తెంపేసి, గాజులను పగులగొట్టి స్నానం చేసి వైవిద్యానికి సూచికగా తెల్లని చీర కట్టుకొని ఆ ఊరి విడిచి తమ స్వగ్రామాలకు చేరుకొంటారు. దీంతో ఆ ఏడు ఉత్సవం ముగుస్తుంది. ఇలా పెళ్లి అయిన కొన్ని గంటల వ్యవధిలోనే వారు వైవిధ్యాన్ని అనుభవిస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X