Search
  • Follow NativePlanet
Share
» » ఇక్కడ పురుషులు మహిళలైతే మాత్రమే మంచి ఉద్యోగం దొరుకుతుంది

ఇక్కడ పురుషులు మహిళలైతే మాత్రమే మంచి ఉద్యోగం దొరుకుతుంది

కొత్తాంగులంగర దేవి దేవాలయం గురించిన సమాచారం.

భారత దేశంలో పురుషులకు ప్రవేశం లేని ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. అటువంటి దేవాలయాల్లో ఒకటి. ఇక్కడ పురుషులను ఎట్టి పరిస్థితుల్లోనూ లోనికి వదలరు. అయితే వారు మహిళలుగా మారితేనే సదరు దేవాలయంలోకి ప్రవేశించడానికి వీలవుతుంది. ఇటువంటి విచిత్ర దేవాలయానికి సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం....

శ్రీరాముడు నిర్మించిన ఈ తీర్థంలో స్నానం చేస్తే సర్వ రోగాలు బలాదూర్శ్రీరాముడు నిర్మించిన ఈ తీర్థంలో స్నానం చేస్తే సర్వ రోగాలు బలాదూర్

దక్షయాగం జరిగిన ప్రదేశం ఏడాదికి నాలుగు నెలలు మాత్రమే సందర్శనకు అనుమతిదక్షయాగం జరిగిన ప్రదేశం ఏడాదికి నాలుగు నెలలు మాత్రమే సందర్శనకు అనుమతి

ఇక్కడ 24 గంటలూ చలిస్తుండే శివలింగానికి అభిషేకం చేసిన పాలకు గల శక్తి గురించి తెలుసాఇక్కడ 24 గంటలూ చలిస్తుండే శివలింగానికి అభిషేకం చేసిన పాలకు గల శక్తి గురించి తెలుసా

మహిళలకు మాత్రమే

మహిళలకు మాత్రమే

P.C: You Tube

మామూలుగా ఈ దేవాలయంలో మహిళలతో పాటు లింగ అల్పసంఖ్యాకులకు ప్రవేశం ఉంది. అయితే పురుషులకు ప్రవేశం లేదు. అయితే ఒక చిన్న పనిచేస్తే మాత్రం పురుషులు ఈ దేవాలయంలోకి ప్రవేశించడానికి అర్హత సంపాదిస్తారు. అదే మహిళలుగా తయారవడం.

మేకప్ వేసుకోవాలి

మేకప్ వేసుకోవాలి

P.C: You Tube

అంటే మహిళల మాదిరి చీరలు, నగలు ధరించి వారిలా మేకప్ చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా మేకప్ అంటే మనకు మొదట గుర్తుకు వచ్చేది మహిళలే. అయితే పురుషులు లిప్ స్టిక్ వేసుకొని, ఐ లాష్ పెట్టుకొంటే ఎలా ఉంటారో చూడాలనుకొంటే మాత్రం కేరళలోని కొల్లం కు వెళ్లాల్సి ఉంటుంది.

చీరలు కట్టుకోవాలి

చీరలు కట్టుకోవాలి

P.C: You Tube

ఇక్కడ పురుషులు మహిళల వలే చీరలకు కట్టుకొని జడలు వేసుకొని పువ్వులు కూడా ముడుచుకొంటారు. ఈ విధంగా వారు మేకప్ వేసుకోవడం వెనుక ఒక కారణం ఉంది. ఈ విధంగా పురుషులు మహిళల వలే మారి ఇక్కడి దేవుడికి పూజలు చేస్తే వారికి మంచి ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుందని భావిస్తారు.

ప్రభుత్వ ఉద్యోగం

ప్రభుత్వ ఉద్యోగం

P.C: You Tube

అంతేకాకుండా ధనలాభం కలుగుతుందని నమ్మకం. అందువల్లే పురుషులు ఈ విధంగా మేకప్ చేసుకొంటారు. ఆ దేవాలయం పేరు కొట్టుకులంగర దేవి మందిరం. ఇది కేరళలోని కొల్లం జిల్లాలోని చవారా అనే ప్రాంతంలో ఉంది. ఈ ఆచారం ఇప్పటిది కాదు. దాదాపు శతాబ్ద కాలంగా నడుచుకొంటూ వస్తోంది.

శిఖరం పై కలశం ఉండదు.

శిఖరం పై కలశం ఉండదు.

P.C: You Tube

సాధారణంగా మార్చి నెలలో జరిగే చమాయివిలక్కు అనే ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవంలో పాల్గొనడానికి లక్షల సంఖ్యలో పురుషులు ఇక్కడికి వస్తారు. ఈ మందిరంలో ఉన్న దేవత స్వయంభువుగా చెబుతారు. ఇక్కడి దేవాలయ శిఖరం పై కలశం ఉండదు. కేరళలో దేవాలయ శిఖరం పై కలశం లేని ఏకైక దేవాలయం ఇదే.

స్థానిక కథనాన్ని అనుసరించి

స్థానిక కథనాన్ని అనుసరించి

P.C: You Tube

స్థానిక కథనాన్ని అనుసరించి ఒకప్పుడు ఈ ప్రాంతం దట్టమైన అటవీ ప్రాంతం. ఈ దేవాలయానికి ఒక పక్కన ఎల్లప్పుడు పచ్చగా ఉండటమే కాకుండా అక్కడ ఎక్కువగా పాములు ఉండేవి. దీంతో స్థానికులు ఈ ప్రాంతాన్ని భూతకులం అని పిలిచేవారు.

చిన్న సరస్సు

చిన్న సరస్సు

P.C: You Tube

మరోవైపున ఒక చిన్న సరస్సు ఉండేది. దాని పక్కనే పచ్చటి గడ్డి మైదానం ఉండేది. దీంతో ఇక్కడ పుష్కలంగా నీరు, గడ్డి ఉండటంతో స్థానికులు ఇక్కడ గోవులను మేపేవారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఒక రోజు గోవులు కాసేవారికి ఒక కొబ్బరి కాయ దొరికింది.

పీచును తీయడం కోసం

పీచును తీయడం కోసం

P.C: You Tube

దీని పై ఉన్న పీచును తీయడం కోసం భూత కులం పక్కనే ఉన్న రాతి పై కొట్టారు. అయితే ఆ రాయి నుంచి రక్తం వచ్చింది. ఈ విషయాన్ని తమ కుల పెద్దలకు చెప్పారు. వారు పండితులతో చర్చించిన అనంతరం ఆ రాయికి అతీత శక్తులు ఉన్నాయనే నిర్ణయానికి వచ్చారు.

పార్వతీ దేవి ప్రతి రూపం

పార్వతీ దేవి ప్రతి రూపం

P.C: You Tube

ఆ రాయిని పార్వతీ దేవి ప్రతి రూపంగా భావిస్తూ వచ్చారు. అటు పై స్థానికంగా దొరికే చెట్ల ఆకులు, కొమ్మలతోనే దేవాలయాన్ని నిర్మించారు. ఆ రాయిని పార్వతీ దేవి ప్రతి రూపంగా కొలిచేవారు. అయితే ఆ
విగ్రహం స్థానిక అమ్మాయిలు తయారు చేసిన పూల మాలలను మాత్రమే స్వీకరించేది.

పురుషులు తయారు చేసిన

పురుషులు తయారు చేసిన

P.C: You Tube

అంటే పురుషులు తయారు చేసిన పూలమూలలు ఎన్ని సార్లు ఆ రాయి పై వేసిని కిందికి పడిపోతుండేవి. దీంతో పండితుల సూచనల మేరకు పురుషులు అమ్మాయిలాగా వేషం వేసుకొని పూలమాలలు సమర్పించారు. అప్పుడు ఆ పూల మాలలు అలాగే విగ్రహం పై ఉండిపోయాయి. ఆ ఆచారం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X