Search
  • Follow NativePlanet
Share
» »అందాల కోవలం - ఆకర్షణీయ ప్రదేశాలు!

అందాల కోవలం - ఆకర్షణీయ ప్రదేశాలు!

కేరళ రాష్ట్రం లోని కోవలం అందమైన పట్టణం మరియు ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. మీ పర్యాటక ప్రణాళిక లో తప్పక చేర్చ దగినది. ఇక్కడ కల మెరిసే ఇసుకలు కల బీచ్ లు, రాజసంతో హుందా గా కనపడే పాలస్ లు ఆకర్షనీయం గా వుంటాయి.

హవా బీచ్
హవా బీచ్ కోవలం పట్టణానికి 2 కి. మీ. ల దూరంలో కలదు. కోవలం లో ఈ బీచ్ ప్రధాన ఆకర్షణ. బీచ్ లో జనాలు ఒక మోస్తరు సంఖ్యలో వుంటారు. కనుక మీరు అధికంగా ప్రకృతి దృశ్యాలతో ఆనందించవచ్చు.

ఈ హవా బీచ్ లో అన్ని సౌకర్యాలతో కోడిన ఒక హవా బీచ్ రిసార్ట్ కూడా కలదు. మీరు ప్రకృతి తో ఆనందిస్తూ, బీచ్ అలల ధ్వనులు వింటూ ఈ బీచ్ రిసార్ట్ లో కల మసాజ్ వంటి సౌకర్యాలు అనుభవించవచ్చు. మనస్సు, శరీరం ఒకే సారి ఒక కొత్త అనుభూతికి లోనవుతాయి. ఇక రాత్రి వెలుగులు వచ్చాయంటే చాలు, మీరు మెత్తటి ఇసుక తిన్నెలపై చక్కని షికార్లు చేస్తూ, నల్లని అలలను చూసి ఆనందించవచ్చు.

చౌరా
చౌరా గ్రామం ఒక చిన్న మత్స్య కారుల పల్లె. ఇది కోవలం కు 6 కి. మీ. ల దూరం. అందమైన ఈ విలేజ్ కి వెళ్ళాలంటే, కాలి నడకన లేదా అక్కడ అద్దెకు దొరికే గేర్లు లేని మోటార్ బైక్ లు వాకావచ్చు. ఈ విలేజ్ లో ఒక కొండపై కల అయ్యప్ప టెంపుల్ కూడా దర్శించవచ్చు. ప్రతి సంవత్సరం, ఈ టెంపుల్ 56 రోజుల పాటు అంటే నవంబర్ 15 నుండి జనవరి 15 వరకూ అయ్యప్ప ఉత్సవాలు నిర్వహిస్తుంది.

లైట్ హౌస్ బీచ్
కోవలం కు దక్షిణ భాగం చివరి వైపుగా లైట్ హౌస్ బీచ్ కలదు. కోవలం లో ఈ బీచ్ ని చాలా మంది పర్యాటకులు ఇశ్తపదథారుఇ. ఇక్కడ కొండపై కల లైట్ హౌస్ కారణంగా ఈ బీచ్ కు ఈ పేరు వచ్చింది.

ఈ లైట్ హౌస్ పూర్వ కాలంలో ఇక్కడకు వచ్చే ఓడలకు దోవ చూపేది. ఇప్పటికీ ఈ లైట్ హౌస్ నుండి కాంతి కిరణాలు బీచ్ అలలపై పడి వెలుగులు విరజిమ్ము తూ వుంటాయి. ప్రశాంతమైన ఈ బీచ్ లో స్విమ్మింగ్ చేసి ఆనందించవచ్చు.

వెల్ల యని లేక్
వెల్ల యని లేక్ తిరువనంతపురం జిల్లా లో ఒక అతి పెద్ద మంచినీటి సరస్సు. వెల్ల యని లేక్ ను వెల్ల యని కాయల్ అని కూడా అంటారు. ఇది కోవలంల్ పట్టణానికి 6 కి. మీ. ల ల్దూరంలో వుంటుంది. ఈ సరస్సు లోని తాజా నీరు, అందమైన పరిసరాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. కేరళ ప్రాంతంలో అతి అట్టహాసంగా జరిగే ఓనం పండుగ సమయంలో వెల్ల యని లకేలో బోటు రేస్ లు జరుపుతారు. సెప్టెంబర్ నెలలో కనుక మీరు కోవలం పర్యటిస్తే, ఉత్సాహ పూరితమైన కేరళకు ప్రతిష్టాత్మకమైన ఈ బోటు రేస్ లు చూసి తప్పక ఆనందించవచ్చు.

విజింఝాం కొండ రాతి గుహలు
విజిమ్ఘాం కొండ రాతి గుహలు కోవలం కు ఒక కి. మీ. దూరం మాత్రమే. ఈ గుహలు 18 వ శతాబ్దం నాటివిగా చెపుతారు. ఈ గుహలు ఆ నాటి శిల్ప చాతుర్యానికి అద్దం పడతాయి. ఇటీవలి కాలం లోనే ఈ గుహలు పర్యటనకు పేరు పడ్డాయి.

అందాల కోవలం - ఆకర్షణీయ ప్రదేశాలు!

శంఘు ముఘం బీచ్
శంఘు ముఘం బీచ్ కోవలం పట్టణానికి 12 కి. మీ. కల దూరంలో కలదు. ఈ బీచ్ లోని అందమైన ప్రకృతి దృశ్యాలు చూడవచ్చు. కోవలం పట్టణ అది దేవత అయిన శ్రీ అనంత పద్మనాభ స్వామీ సైతం ఇక్కడ స్నానం చేసే వాడని చెపుతారు. విశాలమైన ఈ బీచ్ లోని తెల్లటి ఇసుకలు మీ సాయంత్రపు రిలాక్సేషన్ కు ఎంతో అనుకూలం. బీచ్ సమీపంలో కల స్టార్ ఫిష్ రెస్టారెంట్ , ఇండియన్ కాఫీ హౌస్ లలో రుచికర ఆహారాలు తినవచ్చు.

కోవలం లోని ఈ ఆకర్షనలే కాక, సమీపం లోని తిరువనంతపురం పట్టణం లో కూడా మీరు తప్పక చూడవలసిన ప్రదేశాలు ఎన్నో కలవు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X