Search
  • Follow NativePlanet
Share
» »ఆంధ్రప్రదేశ్ కీర్తికి...నెల్లూరుకే తలమానికంగా నిలచిన ఈ ఓడ రేవు ఓ అద్భుతం.!!

ఆంధ్రప్రదేశ్ కీర్తికి...నెల్లూరుకే తలమానికంగా నిలచిన ఈ ఓడ రేవు ఓ అద్భుతం.!!

నెల్లూరు జిల్లాలో నెల్లూరుకు తూర్పుగా 18కిలోమీటర్ల దూరంలో కృష్ణపట్నం పోర్ట్ ఉంది. ఇది సుమారు 500ఏళ్ళ క్రితమే సహజ ఓడరేవుగా గుర్తింపబడినది. శ్రీ కృష్ణ దేవరాయలు నాటి కాలంలో సరకు రవాణా కోసం ఈ ఓడరేవును వాడ

నెల్లూరు జిల్లాలో నెల్లూరుకు తూర్పుగా 18కిలోమీటర్ల దూరంలో కృష్ణపట్నం పోర్ట్ ఉంది. ఇది సుమారు 500ఏళ్ళ క్రితమే సహజ ఓడరేవుగా గుర్తింపబడినది. శ్రీ కృష్ణ దేవరాయలు నాటి కాలంలో సరకు రవాణా కోసం ఈ ఓడరేవును వాడే వారట. అందుకే దీనికి కృష్ణపట్నం పోర్ట్ ఓడరేవు అనే పేరొచ్చిందని స్థానికులు చెబుతుంటారు.

ఇక్కడ పూర్వం శ్రీకృష్ణదేవరాయల కాలంలో సుగంధ ద్రవ్యాల దిగుమతి జరిగినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ప్రస్తుతం సహజ ఓడరేవుగా ఉన్న కృష్ణపట్నం చెక్కర, బొగ్గు, భారీ యంత్ర సామగ్రి లను దిగిమతి చేసుకుంటుంది.

ఈ ఓడరేవుకు భారతదేశంలో అతి పెద్ద ఓడరేవుగా గుర్తింపు ఉంది. 500ఏళ్ళ క్రితమే ఏర్పడిన సహజ ఓడరేవు. తర్వాత దీన్ని రూ.7500కోట్లతో ప్రభుత్వం ఆధునీకరించి..అభివృద్ధి చేసింది. ఆంధ్రప్రదేశ్ కీర్తికి శిఖరంగా నిలిచింది.

భారీ, అతి భారీ సరకు రవాణకు ఈ ఓడరేవు ఒక వేదిక

భారీ, అతి భారీ సరకు రవాణకు ఈ ఓడరేవు ఒక వేదిక

భారీ, అతి భారీ సరకు రవాణకు ఈ ఓడరేవు ఒక వేదిక అయ్యింది. ఈ ఓడ రేవు 2008 జూలై 17వ తేదీన జాతీయ గుర్తింపు పొందినది. జాతికి అంకితమిచ్చి నేటికి సరిగ్గా పదకొండేళ్లు. ఈ 11 ఏళ్లలో పోర్ట్ ఎన్నో మైలురాళ్ళను అధిగమించింది.

krishnapatnamport.com

దేశంలోనే అతి లోతైన వారట్ పోర్ట్ గా ఖ్యాతిగాంచినది

దేశంలోనే అతి లోతైన వారట్ పోర్ట్ గా ఖ్యాతిగాంచినది

దేశంలోనే అతి లోతైన వారట్ పోర్ట్ గా ఖ్యాతిగాంచిన కృష్ణపట్నం పోర్ట్ అతి పెద్ద నౌకల నిర్వాహణకు అనువుగా 16 బెర్తులున్నాయి. అంతే కాకు 15 మిలియన్ టన్నుల కార్గోను నిల్వచేసేందుకు వీలుగా 11 పెద్ద పెద్ద గోదాములు ఉన్నాయి. ఈ పోర్ట్ ను పూర్తిగా కంటైనర్ హబ్ గా తీర్చిదిద్దేందుకు నవయుగ సంస్థ కృషి చేస్తోంది. 42 బెర్తులతో అత్యుత్తమ సాంకేతిక నైపుణ్య కలిగిన పోర్ట్ గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించారు.

pc: youtube

పారిశ్రామికంగా పురోగతి సాధిస్తున్న కృష్ణపట్నం ప్రాంతం పర్యాటకంగానూ ప్రసిద్ధి

పారిశ్రామికంగా పురోగతి సాధిస్తున్న కృష్ణపట్నం ప్రాంతం పర్యాటకంగానూ ప్రసిద్ధి

పారిశ్రామికంగా పురోగతి సాధిస్తున్న కృష్ణపట్నం ప్రాంతం పర్యాటకంగానూ ప్రసిద్ధి పొందుతోంది. చోళుల కాలంలో సముద్ర వర్తకానికి పేరుగాంచింది. విహారయాత్రకు ఇది చాలా అనుకూలమైన సముద్రతీరం.

సిద్ధేశ్వరస్వామి ఆలయం

సిద్ధేశ్వరస్వామి ఆలయం

డీప్‌వాటర్‌ పోర్టుగా అభివృద్ధి చెందుతున్న కృష్ణపట్నం పోర్టుతో పాటు కృష్ణపట్నం గ్రామంలో శతాబ్దాల కాలం నాటి సిద్ధేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకోవచ్చు. ఈ ఆలయాన్ని క్రీ.శ. 1270వ సంవత్సరంలోనే మనుమసిద్ధి మహారాజు పునర్నిర్మించినట్టు శాసనాల ద్వారా తెలుస్తోంది. ఆలయ మండపంలోని స్తంభాలపై అద్భుతమైన శిల్పాలు కనువిందు చేస్తాయి.

YVSREDDY

కృష్ణపట్నం బీచ్ :

కృష్ణపట్నం బీచ్ :

నెల్లూరు పట్టణానికి 24 కిలోమీటర్ల దూరంలో అంత్యత పురాతనమైన బీచ్ ఉంటుంది. సహజ సిద్ధమైన పరిశుద్ధమైన వాతావరణ ఈ బీచ్ సొంతం. విశాలమైన ఇసుక తిన్నెలతో, పచ్చటి కొబ్బరి చెట్లతో ఈ ప్రాంతం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.

Dr. P.V Chandramohan

బీచ్‌కి వెళ్లే దారిలో వున్న కృష్ణపట్నం లైట్‌హౌస్‌

బీచ్‌కి వెళ్లే దారిలో వున్న కృష్ణపట్నం లైట్‌హౌస్‌

బీచ్‌కి వెళ్లే దారిలో వున్న కృష్ణపట్నం లైట్‌హౌస్‌ పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఈ లైట్‌హౌస్‌ పైనుంచి కృష్ణపట్నం పోర్టు, పరిసర ప్రాంతాలను తిలకించవచ్చు. కృష్ణపట్నం పోర్టులో పర్యటించేందుకు, లైట్‌హౌస్‌ ఎక్కేందుకు ముందుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

pc:www.ibiblio.org

కృష్ణపట్నం పోర్ట్ అత్యుత్తమ పోర్ట్ అని నీతి అయోగ్ సిఇఓ అమితాబ్ కాంత్ కితాబ్

కృష్ణపట్నం పోర్ట్ అత్యుత్తమ పోర్ట్ అని నీతి అయోగ్ సిఇఓ అమితాబ్ కాంత్ కితాబ్

అంతే కాదు దక్షిణాసియాలోనే కృష్ణపట్నం పోర్ట్ అత్యుత్తమ పోర్ట్ అని నీతి అయోగ్ సిఇఓ అమితాబ్ కాంత్ కితాబిచ్చారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని కృష్ణపట్నం పోర్ట్ ఆధునిక టెక్నాలజీతో ముందుకు సాగడంతో పాటు, క్లీన్ అండ్ గ్రీన్ పోర్ట్ గా దేశంలోనే గుర్తింపు పొందిన పోర్ట్ గా మారింది.

Nellore

నెల్లూరు కు ఎలా చేరుకోవాలి ?

నెల్లూరు కు ఎలా చేరుకోవాలి ?

నెల్లూరు నగరానికి 28 కి.మీ. దూరంలో వున్న కృష్ణపట్నం పోర్టు, కృష్ణపట్నం గ్రామానికి నెల్లూరు నుంచి నేరుగా ఆర్టీసీ బస్సులు వున్నాయి. బీచ్‌ను చేరుకోవాలంటే కృష్ణపట్నం నుంచి ఆటోల్లో లేదా సొంత వాహనాలపై రెండు కి.మీ. ప్రయాణించాలి.

pc: youtube

నెల్లూరు కు ఎలా చేరుకోవాలి ?

నెల్లూరు కు ఎలా చేరుకోవాలి ?

విమాన ప్రయాణం
తిరుపతి లో కల ఎయిర్ పోర్ట్ నుండి నెల్లూరు చేరవచ్చు. దీని దూరం 130 కి. మీ. లు. ఈ ఎయిర్ పోర్ట్ నుండి హైదరాబాద్, విశాఖపట్నంలకు విమానాలు కలవు. నెల్లూరు కు సమీప అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ 177 కి. మీ. ల దూరంలో చెన్నై నగరం లో కలదు. ఇక్కడ నుండి దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు విమానాలు కలవు.

ట్రైన్ ప్రయాణం
నెల్లూరు కు రైలు స్టేషన్ కలదు. చెన్నై నుండి మూడు గంటల ప్రయాణంలో నెల్లూరు చేరవచ్చు. వయా నెల్లూరు అనేక ట్రైన్ లు ప్రయాణిస్తాయి.

రోడ్డు ప్రయాణం
నెల్లూరు పట్టణం చెన్నై కు నాలుగు వరుసల రోడ్డు మార్గం ద్వారా కార్లు లేదా బస్సు లలో ప్రయాణించవచ్చు. చెన్నై, హైదరాబాద్ లకు రెగ్యులర్ బస్సు సర్వీస్ లు కలవు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X