Search
  • Follow NativePlanet
Share
» »ఇక్కడ కాకులు తిన్న ఆహారమే భక్తులకు ప్రసాదం

ఇక్కడ కాకులు తిన్న ఆహారమే భక్తులకు ప్రసాదం

కుచనూరు శనీశ్వర దేవాలయం గురించి కథనం.

శనిమహాత్ముడు నవగ్రహాల్లో ఒక ప్రముఖమైన గ్రహం. అందువల్లే హిందువుల్లో శనిమహాత్ముడికి ఎనలేని గౌరవం. భక్తి తో పూజలు చేసి తమ పై శని పీడలు ఉండకుండా చేయమని కోరుతూ ఉంటారు. మన జీవితంలో జరిగే అనేక ముఖ్య సంఘటనలకు ఆయన చూపు మన పై ఎలా ఉంటుందన్నదే ప్రధాన కారణమని చాలా మంది బలంగా నమ్ముతారు. శని మహాత్ముడంటే ఎంత భక్తి ఉంటుందో అంతే భయం కూడా ఉంటుంది. అందుకే వీలు దొరికినప్పుడు చాలా మంది శనిమహాత్ముడు ఉన్న చోటుకు వెళ్లి భక్తితో దీపం వెలిగించి తమను చల్లగా చూడమని వేడుకొంటూ ఉంటారు. సాధారణంగా స్వయంభువుగా వెలిసిన శనీశ్వరుడి విగ్రహం ఎక్కడా అంటే కేవలం మహారాష్ట్రలోని శని సింగ్నాపూర్ లో ఉందని చెబుతాం. అయితే తమిళనాడులో కూడా స్వయంభువుగా వెలిసిన శనీశ్వరుడి దేవాయం ఉంది. ఇందుకు సంబంధించిన వివరాలన్నీ మీ కోసం...

జూనియర్ హంపిని చూశారా?జూనియర్ హంపిని చూశారా?

రావణుడు స్వర్గానికి సోపానాలు నిర్మించడానికి ఎంపిక చేసుకున్న స్థలాలు ఇవేరావణుడు స్వర్గానికి సోపానాలు నిర్మించడానికి ఎంపిక చేసుకున్న స్థలాలు ఇవే

తమిళనాడులోని కుచనూర్

తమిళనాడులోని కుచనూర్

P.C: You Tube

తమిళనాడులోని థేణి జిల్లా చిన్నమానూర్ దగ్గర్లోని కుచనూర్ లో స్వయంభువుగా వెలిసిన శనీశక్వర దేవాలయం ఉంది. ఈ దేవాలయం సురభి అనే నదీ తీరం వద్ద ఉంది. చుట్టు పక్కల పరిసరాలు చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి.

అరుదైన ‘సబ్బురాయి' తో నిర్మించిన దేవాలయాలు ఈ జంట నగరాల్లోఅరుదైన ‘సబ్బురాయి' తో నిర్మించిన దేవాలయాలు ఈ జంట నగరాల్లో

స్వయంభువుడు

స్వయంభువుడు

P.C: You Tube

ఈ దేవాలయ గర్భగుడిలోని శనీశ్వరుడు స్వయంభువుగా వెలిశాడని చెబుతారు. నవగ్రహాల్లో శనీశ్వరుడికి ప్రత్యేక స్థానం ఉండటం అన్నది మనందరికీ తెలిసిన సంగతి. అందువల్లే చాలా మంది భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు.

రెండు దేవాలయాల్లో

రెండు దేవాలయాల్లో

P.C: You Tube

శనీశ్వరుడు స్వయంభువుగా వెలసిన భారత దేశంలోని రెండే రెండు దేవాలయాల్లో ఇది ఒకటి. ఈ దేవాలయం థేణి నుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడకు చేరుకోవడానికి ప్రయాణ సౌకర్యాలు చాలా బాగున్నాయి.

ఎన్నో పురాణా గాథలు

ఎన్నో పురాణా గాథలు

P.C: You Tube

ఇక్కడే ఆ శనిమహాత్ముడి దేవాలయం ఉంది. ఇక్కడి విగ్రహాన్ని ఎవరూ ప్రతిష్టించలేదు. స్వయంగా భూమి నుంచి ఆ పరమాత్ముడు వెలిశాడని చెబుతారు. ఇందుకు సంబంధించిన పురాణ కథలు ఎన్నో ఉన్నాయి.

దినకరన్ అనే రాజు

దినకరన్ అనే రాజు

P.C: You Tube

స్థానిక కథలను అనుసరించి ఒకానొక కాలంలో దినకరన్ అనే రాజు కలింగ దేశాన్ని పాలిస్తుండేవాడు. రాజధానిని మణికర్నిక నుంచి ఆళ్విక కు మార్చుతాడు. ఆ సమయంలో అతను తన వాళ్ల నుంచే ముప్పును ఎదుర్కొనే పరిస్థితులు ఉత్పన్నమవుతాయి.

కుమారుడైన చంద్రవంత

కుమారుడైన చంద్రవంత

P.C: You Tube

అతని కుమారుడైన చంద్రవంత ప్రఖ్యత జ్యోతిష్యుడు. తనకున్న పరిజ్జానంతో తన తండ్రి ఏడేళ్ల పాటు అష్ట కష్టాలు అనుభవిస్తాడని తెలుసుకొంటాడు. ఇందుకు పరిహారం ఏమీ లేదా అని తీవ్రంగా ఆలోచిస్తాడు.

పరిహారం

పరిహారం

P.C: You Tube

అయితే ఆ శనిమహాత్ముడి కరుణ లభిస్తే ఆ కష్టాలకు పరిహారం లభిస్తుందని తెలుసుకొంటాడు. దీంతో ఇక్కడ స్వయంభువుగా వెలిసిన శనిమహాత్ముడిని పూజించాలని తన తండ్రికి చెబుతారు. అతడు అలా చేయడంలో కష్టాలన్నీ సమిసిపోతాయి.

ఇక్కడ తపస్సు చేశాడు

ఇక్కడ తపస్సు చేశాడు

P.C: You Tube

మరో కథనం ప్రకారం ఇక్కడ ఆ శనిమహాత్ముడు తపస్సు చేశాడని చెబుతారు. సుమారు వెయ్యి సంవత్సరాల పాటు ఆ తపస్సు కొనసాగుతుంది. దీంతో తనకు చుట్టుకున్న బ్రహ్మహత్యాపతకం నుంచి విముక్తి పొందాడని చెబుతారు.

శివలింగం

శివలింగం

P.C: You Tube

కాగా తమస్సు చేసిన తర్వాత ఒక శివలింగం ఇక్కడ భూమి నుంచి ఉద్భవించడం ప్రారంభిస్తుంది. అంతే కాకుండా ఆ శివలింగం అంతకంతకూ పెరిగిపోతూ ఉంటుంది. అలాగే వదిలేస్తే ఈ భూ మండలం మొత్తం ఆక్రమిస్తుందని భయపడుతారు.

పరమశివుడిని ప్రార్థించి

పరమశివుడిని ప్రార్థించి

P.C: You Tube

దీంతో ఆ పరమశివుడిని ప్రార్థించి ఆ శివలింగం పెరగకుండా చేస్తాడు. అటు పై శనీశ్వరుడు అక్కడ స్వయంభువుగా వెలుస్తాడు. ఇక్కడ కేవలం శనిదేవుడి విగ్రహమే కాకుండా సుబ్రహ్మణ్యస్వామి దేవాలయం, గణపతి దేవాలయం కూడా చూడదగినవి.

లక్షల సంఖ్యలో భక్తులు

లక్షల సంఖ్యలో భక్తులు

P.C: You Tube

శని దోషాల నుంచి విముక్తి కోసం కేవలం తమిళనాడు నుంచే కాకుండా దేశం లోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి లక్షల సంఖ్యలో భక్తులు వచ్చి పూజలు చేస్తూ ఉంటారు. అవసరమైన పూజా సామాగ్రి కూడా దేవాలయం వద్దే దొరుకుతుంది.

ఆది నెలలో

ఆది నెలలో

P.C: You Tube

ముఖ్యంగా తమిళ మాసమైన ఆది లో ఎక్కువ మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. శని దేవుడి దర్శనానికి ముందు సురభి నదిలో స్నానం చేసి అనంతరం దేవాలయ ప్రవేశం చేస్తారు. స్నానానికి, బట్టలు మార్చుకోవడానికి ప్రత్యేక సదుపాయాలు ఉన్నాయి.

మొదట కాకులు

మొదట కాకులు

P.C: You Tube

ఇక్కడ శనిదేవుడి నైవేద్యాన్ని మొదట కాకులు తిన్న తర్వాతనే అటు పై భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు. ఈ ప్రసాదం తినడం కోసం వేల సంఖ్యలో భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు. ఇందు కోసం ఎంత సమయమైనా వేచి చూస్తారు.

ప్రత్యేక ప్రర్థనలు

ప్రత్యేక ప్రర్థనలు

P.C: You Tube

ఒక వేళ ఏరోజైనా కాకులు ఆ నైవేద్యాన్ని తినకుంటే అక్కడి పూజారులతో పాటు భక్తులు తమ తప్పును క్షమించమని పేర్కొంటూ ఆ కాకులకు కూడా ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. దీంతో కాకులు వచ్చి నైవేద్యాన్ని తింటాయి.

ఐదు వారాలు

ఐదు వారాలు

P.C: You Tube

ఇదిలా ఉండగా ఇక్కడ శనిదేవుడికి జులై నుంచి ఆగస్టు మధ్య కాలంలో దాదాపు ఐదు వారాల పాటు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ సమయంలో కేవలం తమిళనాడు నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా లక్షల సంఖ్యలో ఇక్కడకు భక్తులు వస్తారు.

ఇలా చేరుకోవచ్చు.

ఇలా చేరుకోవచ్చు.

P.C: You Tube

తమిళనాడులోని కుచనూర్ కు రోడ్డు మార్గం ద్వారా సులభంగా చేరుకోవచ్చు. సేలం, మట్టూరు, ధర్మపురి నుంచి ప్రతి ఐదు నిమిషాలకు ఒక బస్సు ఇక్కడికి వెలుతూ ఉంటుంది. కుచనూర్ కు థేణి, దిండుక్కల్, సేలం, మధురై నుంచి రైలు సౌకర్యం ఉంది. ఇక్కడికి దగ్గరగా మధురై విమానాశ్రయం ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X