Search
  • Follow NativePlanet
Share
» »ఏడాదిలో 11నెలలు నీటిలో మనిగి ఉండే గ్రామం, 1 నెల మాత్రంపైకి కనబడుతూ పర్యాటకులను ఆకర్షిస్తుంది

ఏడాదిలో 11నెలలు నీటిలో మనిగి ఉండే గ్రామం, 1 నెల మాత్రంపైకి కనబడుతూ పర్యాటకులను ఆకర్షిస్తుంది

ఏడాదిలో 11నెలలు నీటిలో మనిగి ఉండే గ్రామం, 1 నెల మాత్రంపైకి కనబడుతూ పర్యాటకులను ఆకర్షిస్తుంది

కొన్ని విషయాలు వినడానికి వింతగా ఉన్నా..అవి నిజం అని తెలిసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. మీకు తెలుసా అహ్మదాబాద్ లోని భావ్ నగర్ సమీపంలో ఉన్న సముద్రంలో నిష్కళంక్ మహాదేవ్ అనే ఆలయం రోజూ నీట మునుగుతూ, పైకి తేలుతుంటుంది. . సముద్రం ఆటుపోటుల మద్యలో కనిపించి, కనబడకుండా నీటిలో మునిగి ఉంటుంది. శివాలయం పూర్తిగా పైకి తేలినప్పుడు మాత్రమే ఆ ఆలయంలోని శివలింగాన్ని పూజించేందుకు భక్తులు భారీ సంఖ్యలో అక్కడి చేరుకుంటుంటారు. అయితే అది ప్ర‌కృతి విచిత్రం.

అదే విధంగా గోవాలోనూ అలాంటి ఓ వింత. విచిత్రమే జరుగుతోంది. కాకపోతే అక్కడ ఓ గ్రామం నీట మునుగుతూ తేలుతుంటుంది. అది రోజుకోసారి మాత్రం కాదు సుమా!ఏకంగా 11 నెలలకు ఒకసారి..ఆ గ్రామం తేలుతుందంటే అది విచిత్రం కాక మరేంటి. అటువంటి ప్రదేశాన్ని సందర్శించేందుకు వేసవికాలంలో అటు పర్యాటకులు, ఇటు గ్రామస్థులు ఎదురుచూస్తారంటే అతిశయోక్తి లేదు. మరి ఆ ప్రదేశం ఎక్కడ ఉంది, దాని వెనుక ఉన్న అసలు కథ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

గోవాలోని పశ్చిమ కనుమల్లో కొండల మధ్యలో ఉన్న సలౌలిం నది

గోవాలోని పశ్చిమ కనుమల్లో కొండల మధ్యలో ఉన్న సలౌలిం నది

గోవాలోని పశ్చిమ కనుమల్లో కొండల మధ్యలో ఉన్న సలౌలిం నది ప్రవహిస్తూ ఉటుంది. ఆ నది పరివాహక ప్రాంతంలో కుర్ది అనే గ్రామం ఉంది. నిజానికి ఆ గ్రామం ఒకప్పుడు మామూలుగానే ఉండేది. కాకపోతే 1986లో ఆ నదిపై ఆనకట్టను నిర్మించారు . దాంతో ఆ గ్రామం మొత్త నీట మునిగింది.

pc:youtube

ఇక్కడ విచిత్రమేంటంటే సంవత్సరంలో పదకొండు నెలలు

ఇక్కడ విచిత్రమేంటంటే సంవత్సరంలో పదకొండు నెలలు

ఇక్కడ విచిత్రమేంటంటే సంవత్సరంలో పదకొండు నెలలు పాటు ఆ గ్రామం నీటిలోనే మునిగి ఉన్నా..వేసవిలో మాత్రం తేలుతుంది. కారణం అక్కడ జలాశయంలో ఉండే నీరు పూర్తిగా ఇంకిపోవడం వల్ల ఆ సమయంలో గ్రామం ఆనవాళ్లు శిథిలాలు బయటకు కబడుతాయి.

pc:youtube

ది కొద్ది రోజులు మాత్రమే..

ది కొద్ది రోజులు మాత్రమే..

అది కొద్ది రోజులు మాత్రమే. నీరు పూర్తిగా ఇంకిపోయినప్పుడు ఒక నెల రోజుల మాత్రమే ఆ గ్రామం కనబడుతుంది. ఆనకట్ట కోసం ఆ గ్రామంలోని ఇతర ప్రాంతాల్లో నివశించే వారు. ఈ నెలరోజుల పాటు ఇక్కడి వచ్చి, సంబరాలు చేసుకుంటారు. వారు నివశించిన ప్రాంతాన్ని చూస్తూ అక్కడ సంతోషంగా గడుపుతుంటారు.

pc:youtube

విందులు, వినోదాలు

విందులు, వినోదాలు

అంతకు ముందు ఆ గ్రామంలో ఉన్న చర్చి, ఒక దేవాలయం ఉండగా అవి ఇప్పుడు శిథిలావస్థకు చేరుకున్నాయి. అయినా సరే.. ఆయా మతస్థులు వాటిల్లోనే తమ తమ దైవాలను ప్రార్థిస్తుంటారు. విందులు, వినోదాలు చేసుకుంటుంటారు.

pc:youtube

భారీ సాగునీటి ప్రాజెక్టుల్లో సలౌలిం నది ప్రాజెక్ట్ మొదటిది

భారీ సాగునీటి ప్రాజెక్టుల్లో సలౌలిం నది ప్రాజెక్ట్ మొదటిది

1961 లో పోర్చుగీసు వాళ్ళు గోవాను వదిలి వెళ్లాక అక్కడ నిర్మించిన భారీ సాగునీటి ప్రాజెక్టుల్లో సలౌలిం నది ప్రాజెక్ట్ మొదటిది. ఇది ప్రస్తుతం దక్షిణ గోవా ప్రాంతానికి తాగు, సాగునీరు పరిశ్రమలకు అవసరం అయ్యే నీటిని అందిస్తోంది. అయితే అప్పట్లో సిఎంగా ఉన్న దయానంద్ బందోద్కర్ కుర్ది గ్రామ ప్రజలతో మాట్లాడి, వారిని ఒప్పించి ఆ ప్రాజెక్టుకు అవసరం అయ్యే భూమునలు సేకరించారు. ఈ క్రమంలో ఆ ప్రాజెక్ట్ కట్టగానే కుర్ది గ్రామం నీట మునిగింది. అప్పటికే ఆ గ్రామ ప్రజలను ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అలాగే వారికి నష్టపరిహారం కూడా అందించారు.

pc:youtube

అయితే అప్పట్లో ఆ గ్రామంలో చక్కని సాగు భూములు, తోటలు

అయితే అప్పట్లో ఆ గ్రామంలో చక్కని సాగు భూములు, తోటలు

అయితే అప్పట్లో ఆ గ్రామంలో చక్కని సాగు భూములు, తోటలు, పొలాలు ఉండేవట. కానీ ప్రాజెక్ట్ కారణంగా అవన్నీ నీట మునిగాయి. ఆ విధంగా ఆ గ్రామంలో ఉన్న నిర్మాణాల తాలూకు శిథిలాలే ఇప్పుడు మనకు బయట పడుతుంటాయి.

pc:youtube

అందుకే ఆ గ్రామంతో ఉన్న అనుబంధాన్ని మరిచిపోలేక

అందుకే ఆ గ్రామంతో ఉన్న అనుబంధాన్ని మరిచిపోలేక

అందుకే ఆ గ్రామంతో ఉన్న అనుబంధాన్ని మరిచిపోలేక వేసవిలో ఆ గ్రామం బయట పడగానే నెల రోజుల పాటు ఆ గ్రామస్తులు అక్కడ వేడుకలను జరుపుకుంటారు. కాగా అప్పట్లో ఆ గ్రామంలో మొత్తం 600 కుటుంబాలు ఉండేవట. అయితే వారంత సమీపంలోని గ్రామాల్లో స్థిరపడి, వేసవి సమయంలో ఆ గ్రామానికి మళ్లీ వెళ్లి సంబరాలు చేసుకుంటుంటారు.

pc:youtube

ఆనకట్ట కోసం గ్రామస్థులు చేసిన త్యాగం చాలా గొప్పదని

ఆనకట్ట కోసం గ్రామస్థులు చేసిన త్యాగం చాలా గొప్పదని

ఆనకట్ట కోసం గ్రామస్థులు చేసిన త్యాగం చాలా గొప్పదని ప్రకాష్ కుర్దికర్ అనే వృద్ధుడు వ్యాఖ్యానించారు. అది బయటికి చెప్పుకోలేని భావోద్వేగం గ్రామస్థులందరిలోనూ ఉంది. గోవా రక్షణ కోసం ఆనకట్ట నిర్మాణం చేపట్టడం, దాని కోసం యావన్మంది గ్రామస్థులు స్వచ్ఛందంగా తరలివెళ్లడానికి సిద్ధపడి ఎవరూ చేయలేని త్యాగాన్ని ప్రపంచానికి చాటారని ఆయన వ్యాఖ్యానించారు.

pc:youtube

వేసవిలో పదిరోజులు మినహా ఏడాది పొడవునా కుర్ది ముంపులోనే

వేసవిలో పదిరోజులు మినహా ఏడాది పొడవునా కుర్ది ముంపులోనే

వేసవిలో పదిరోజులు మినహా ఏడాది పొడవునా కుర్ది ముంపులోనే ఉంటుంది. వర్షాలు ప్రారంభమైన వారం పది రోజుల్లోనే గ్రామం మాయమవుతుంది. ఈసారి రుతుపవనాలు ఆలస్యం కావడంతో గ్రామం ఇంకా కనపడుతోంది. వర్షాలు ప్రారంభమయ్యాయంటే క్రమేణా మునిగే కుర్ది గ్రామం ఒక దశలో ఓ దీవిలో దర్శనమిస్తుంది. ఆ దృశ్యం కోసం పర్యాటకులు, గ్రామస్థులు ప్రతి ఏటా ఎదురుచూడటం కుర్ది ప్రత్యేకత.

pc:youtube

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X