Search
  • Follow NativePlanet
Share
» »ఈ సరోవరంలోని నాగమణి కోసం ఆశపడి చాలా మంది...

ఈ సరోవరంలోని నాగమణి కోసం ఆశపడి చాలా మంది...

మధురలోని కుసుమ సరోెవరం గురించి కథనం.

విశాల భారత దేశంలో అనేక రహస్యమయ ప్రదేశాలు ఉన్నాయి. అందులో కొన్ని పురాణ ప్రధానమైనవి కాగా, మరికొన్ని చారిత్రాత్మక ప్రధానమైనవి. ఇందులో కొన్ని దేవాలయాలు, మరికకొన్ని కోటలు కాగా అరుదుగా సరస్సులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఇటువంటి రహస్య స్థలాల్లో మనకు చాలా వరకూ నిధి ఉన్నట్లు కథలు వినిపిస్తాయి. కొందరికి ఆ నిధి దొరుకుతుంది. మరికొందరు ఆ నిధి కోసం ప్రాణాలు పోగొట్టుకొన్నారు. ఇంకొందరు పట్టువదలని విక్రమార్కుల్లా ఆ నిధి కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇటువంటి కోవకు చెందిన ఓ రహస్య ప్రాంతం గురించిన వివరాలు మీ కోసం...

వసంతపంచమి వేడుకలు జరిగే దర్గా చూశారా?వసంతపంచమి వేడుకలు జరిగే దర్గా చూశారా?

రావణాసురుడు తన తలలను తెగ నరుక్కొన్నది ఇక్కడే...రావణాసురుడు తన తలలను తెగ నరుక్కొన్నది ఇక్కడే...

కుసుమ సరోవరం

కుసుమ సరోవరం

P.C: You Tube

భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్ లోని మధురలో గోవర్థన అనే చిన్న గుట్ట పై గోవర్థన, రాధా తీర్థాల మధ్య ఉంది. ఇది ఒక స్మారకంగా కూడా చెబుతారు. ఈ సరోవరానికి దగ్గర్లోనే నారద తీర్థం కూడా ఉంది.

కుసుమ సరోవరం

కుసుమ సరోవరం

P.C: You Tube
ఇక్కడే నారధుడు భక్తి సూత్రాలను రచించినట్లు చెబుతారు. ఇక్కడకు దగ్గర్లోనే రాధ వన బిహారీ దేవాలయం ఉంది. ఈ కుసుమ సరోవరం అత్యంత పవిత్రమైనదే కాకుండా అనేక రహస్యాలను తనలో దాచుకున్న సరస్సుగా ధీనికి పేరు.

కుసుమ సరోవరం

కుసుమ సరోవరం

P.C: You Tube
ముఖ్యంగా ఇక్కడ మనం కోరిన కోర్కెలను తీర్చే నాగమణి ఈ సరస్సు లోపల ఉందని ఇక్కడి స్థానికులు చాలా ఏళ్లుగా నమ్ముతున్నారు.

కుసుమ సరోవరం

కుసుమ సరోవరం

P.C: You Tube
ఈ మణిని సొంతం చేసుకోవడానికి చాలా ఏళ్ల నుంచి ఇక్కడి స్థానికులే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.

కుసుమ సరోవరం

కుసుమ సరోవరం

P.C: You Tube
అయితే ఇప్పటి వరకూ ఏ ఒక్కరూ ఆ సరోవరం లోపలికి వెళ్లి ఆ మణి అందుకోలేకపోయారు. అయితే ఈ ప్రయత్నంలో చాలా మంది తమ ప్రాణాలను మాత్రం పోగొట్టుకున్నారు.

కుసుమ సరోవరం

కుసుమ సరోవరం

P.C: You Tube
ఇందుకు ఎన్నో ప్రత్యక్ష ఉదాహరణలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ మణిని చేజెక్కించుకోవాలని ప్రయత్నించిన వారిలో చాలా మందికి కుష్టు వ్యాధి సోకిందని చెబుతారు.

కుసుమ సరోవరం

కుసుమ సరోవరం

P.C: You Tube
మరికొందరు చూపును పోగొట్టుకున్నారని తెలుస్తోంది. అయినా కూడా ఈ మణిని చేజెక్కించుకునే ప్రయత్నాలు మాత్రం ఆగిపోవడం లేదు. కుసుమ సరస్సు ఎంత అందంగా ఉందో అంతే భయంకరమైనది.

కుసుమ సరోవరం

కుసుమ సరోవరం

P.C: You Tube
ఇందులోని నీరు చాలా కాలంగా ఎటువంటి కదలికలు లేకుండా ఉండిపోవడం వల్ల పాచిపట్టి దుర్గందంగా మారింది. అయితే స్థానికులు మాత్రం ఈ సరస్సు లోపల ఉన్న పెద్ద పాము నిత్యం వదిలే విషయం వల్లే ఈ సరోవరం విషపూరితంగా మారిపోయిందని చెబుతారు.

కుసుమ సరోవరం

కుసుమ సరోవరం

P.C: You Tube
ఇదిలాఉండగా ఈ సరోవరం చుట్టు పక్కల రాత్రి పూట విద్యుత్ దీపాలు వెలుగుతూ ఈ సరోవరం చూడటానికి ముచ్చటగా ఉంటుంది. అందువల్లే ఈ సరోవరాన్ని చూడటానికి చాలా మంది పర్యాటకులు వస్తుంటారు.

కుసుమ సరోవరం

కుసుమ సరోవరం

P.C: You Tube
మొదట నాలుగు వైపులా మట్టితో నిర్మించిన ఈ కుసుమ సరస్సును రాజా వీర్ సింగ్ క్రీస్తుశకం 1675లో నిర్మించాడని చెబుతారు. అటు పై సురజ్ మాల్ జాట్ అనే రాజు తన భార్య కిషోరీ జాట్ పేరుతో ఇక్కడ ప్రసిద్ధ ఉద్యానవనాన్ని నిర్మింపజేశాడని చెబుతారు.

కుసుమ సరోవరం

కుసుమ సరోవరం

P.C: You Tube
ఈ కుసుమ సరోవరం ఉత్తరప్రదేశ్ లోని మధురలో ఉంది. మధుర బస్ స్టాండ్, లేదా రైల్వేస్టాండ్ నుంచి ఈ కుసుమ సరోవరానికి చేరుకోవడానికి ట్యాక్సీలు అందుబాటులో ఉన్నాయి.

కుసుమ సరోవరం

కుసుమ సరోవరం

P.C: You Tube
మధురకు దగ్గరగా ఢిల్లీ ఎయిర్ పోర్ట్ ఉంటుంది. ఇక్కడే ఆ నల్లనయ్య తన ప్రేయసి రాధా కోసం ప్రతి రోజూ వస్తూ ఉంటాడని స్థానికులు నమ్ముతుంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X