Search
  • Follow NativePlanet
Share
» »చరిత్రకందని శైవక్షేత్రం ఖమ్మంలోని కూసుమంచి గణపేశ్వరాలయం విశేషం ఏంటో తెలుసుకోండి

చరిత్రకందని శైవక్షేత్రం ఖమ్మంలోని కూసుమంచి గణపేశ్వరాలయం విశేషం ఏంటో తెలుసుకోండి

ఖమ్మంలోని కూసుమంచి ఆలయం యొక్క విశేషం ఏంటో తెలుసుకోండి

ఖమ్మం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జిల్లా. ఈ జిల్లాలో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో కొన్ని జాతీయ స్థాయిలో ఖ్యాతి గడిస్తే ... మరికొన్ని అంతర్జాతీయ స్థాయిలో పేరుప్రఖ్యాతలు సంపాదించాయి. ఈ జిల్లా ముఖ్యకేంద్రం అదేపేరుతో ఉన్న ఖమ్మం పట్టణం. ఇక్కడికి హైదరాబాద్, వరంగల్, నల్గొండ, విజయవాడ, రాజమండ్రి తదితర ప్రాంతాల నుండి బస్సులు కలవు. మీరు ఖమ్మం జిల్లా చేరుకుంటే చాలు ... అక్కడి నుండి జిల్లాలోని అన్ని ముఖ్య పర్యాటక స్థలాలను సులభంగా చూడవచ్చు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన భద్రాచలం ఈ జిల్లాలోనిదే.

కూసుమంచిలో కాకతీయులు నిర్మించిన అతి పురాతన శివాలయం

కూసుమంచిలో కాకతీయులు నిర్మించిన అతి పురాతన శివాలయం

ఖమ్మం పట్టణం నుంచి 20 కి.మీ. దూరంలో ఉన్న కూసుమంచి మండల కేంద్రంలో ఒక పురాతన ఆలయం ఒకటి ఉంది. కూసుమంచిలో కాకతీయులు నిర్మించిన అతి పురాతన శివాలయం ఇది. కూసుమంచీని కాకతీయ కాలంలో కుప్రమణి అని పిలిచేవారు. దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద శివలింగం ఉన్న గుడిగా దీనికి పేరుంది.

కూసుమంచి ఎక్కడ ఉంది?

కూసుమంచి ఎక్కడ ఉంది?

కూసుమంచి తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో కూసుమంచి మండలంలోని ఒక పట్టణం. ఇది జిల్లా ప్రధాన కార్యాలయం ఖమ్మం నుండి పశ్చిమానికి 24కి.మీ దూరంలో ఉంది. ఇది కూసుమంచి మండలం ప్రధాన కార్యాలయం అయ్యింది. ఈ ప్రదేశం ఖమ్మం మరియు నల్గొండ జిల్లా సరిహద్దుల్లో ఉంది. నల్గొండ జిల్లా నాడిగూడెంకు దక్షిణంగా ఉంది.

 కుప్రమణి ఎందుకు పిలిచేవారు

కుప్రమణి ఎందుకు పిలిచేవారు

ఇది 12 మరియు 13 వ శతాబ్దాలలో కాకతీయ పాలకులు నిర్మించిన శ్రీ గణపేశ్వర ఆలయం మరియు ముక్కంఠేశ్వరాలయం అనే రెండు శివాలయాలకు నిలయం. ఈ రెండు దేవాలయాలు కాకతీయ రాజుల నిర్మాణ నైపుణ్యానికి నిదర్శనం. చారిత్రక దేవాలయాలు వరంగల్ జిల్లాలోని కాకతీయ కాలంలోని ప్రసిద్ద ఘన్ పూర్ మరియు రామప్ప దేవాలయాలతో పోలి ఉన్నాయి.

ఎత్తైన శివలింగం

ఎత్తైన శివలింగం

గణపేశ్వరాలయం కూసుమంచి బస్ స్టాండ్ నుండి 1.7 కి.మీ దూరంలో ఈ ఆలయ ఉంది. కాకతీయులు రాజ్య అవసరాల కోసం, ఆధ్యాత్మిక ప్రశాంతత కోసం నిర్మించిన ఆలయాలలో ఒకానొక పురాతన చారిత్రక ఆధారమే ఈ కూసుమంచి గణపేశ్వరాలయం.

వాస్తు శిల్పంలో వరంగల్ దేవాలయం

వాస్తు శిల్పంలో వరంగల్ దేవాలయం

వాస్తు శిల్పంలో వరంగల్ దేవాలయం వెయ్యి స్తంభాల గుడిని పోలి ఉండే రాతితో ఈ దేవాలయం నిర్మించబడం జరిగింది. ఈ ఆలయంలో ఉన్న శివలింగం మూడు మీటర్ల ఎత్తులో ఉంది మరియు ఇది రాష్ట్రంలోని అతిపెద్ద శివలింగాలలో ఒకటి.

ఆలయ నిర్మాణం

ఆలయ నిర్మాణం

ఈ ఆలయ శిల్పరీత ప్రాచీనమైనదే కాక అత్యంత విశిష్టమైనది కూడా ఆలయ నిర్మాణ సందర్భంలో సిమ్మెంటు సున్నం వంటి పదార్దాలతో రాళ్లను అతికించడం కాకుండా అనుసంధానం (ఇంటర్ లాకింగ్) విధానంలో పెద్దపెద్దరాళ్ళకు గాడులూ, కూసాలు పద్ధతిలో బిగింపు చేయడం ద్వారా నిర్మించారు.

15 అడుగుల ఎత్తైన వేణుగోపాల్ విగ్రహం

15 అడుగుల ఎత్తైన వేణుగోపాల్ విగ్రహం

తూర్పుముఖంగా ఉ్న ఎత్తైన వేదికపై నిర్మించిన ఈ దేవాలయ స్తంభాలు రంగమంటప మరియు అంటార్లా ఉన్నాయి. ఈ దేవాలయం మూడు ప్రవేశాలతో అందంగా నిర్మింపబడ్డ భవనం. గణపేశ్వరాయలం వరంగల్, నల్గొండ మరియు ఇతర ప్రదేశాల నుండి శివరాత్రి పండుగ సమయంలో అధిక సంఖ్యలో భక్తులను ఆకర్షిస్తుంది. దేవాలయం దక్షిణ భాగంలో 15 అడుగుల ఎత్తైన వేణు గోపాల విగ్రహం ఉంది.

ముక్కంటేశ్వరాలయం

ముక్కంటేశ్వరాలయం

ముక్కంటేశ్వరాలయం గణపేశ్వరాలయం నుండి కొన్ని మీటర్ల దూరంలో ఉంది. ఇది సామాన్య మంటపం ఒకటికి మూడు ఒకేలాగా ఉండటం వల్ల త్రికుంటాలయం అయింది. త్రికూటాలయం ఈ ఆవరణలో ప్రధానమైన గణపేవ్వరాలయమే కాక త్రికూటాలయ పద్ధతిలో నిర్మించిన మరోగుడి ఉత్తరదిశకు తిరిగి వుంటుంది. త్రికూటమూ అంటే మూడు గర్భగుడులు ఒకదానితో ఒకటి అనుసంధానం చేసి నిర్మించిన గుడి అని అర్ధం. దీనిలోని మూడు గర్భాలయాలలోనూ శివలింగాలే నిర్మించారు. ఈ మూడు శివలింగాలతో కలిసిన మొత్తం గుడి ప్రధాన ఆలయం వైపుగా తిరిగి వుంటుంది. సామాన్య మంటప స్తంభాలపై హంసలు మరియు పూల నమూనాలతో చిత్రాలతో అద్భుతంగా చెక్కబడ్డాయి.

కమ్మంను పాలించిన నాయకులు

కమ్మంను పాలించిన నాయకులు

ఖమ్మంను కాకతీయులు, ముసునూరి నాయకులు మరియు వెలామా రాజులు, రెడ్డి రాజులు, కుతుబ్ షాహి మరియు హైదరాబాద్ నిజాంలతో సహా అనేక రాజవంశాలు ఖమ్మంను పాలించాయి. ఖమ్మం జిల్లాలో భద్రాచలం, కిన్నెరసాని ఆనకట్ట మరియు అభయారణ్యం, ఖమ్మం కోట, కూసుమంచి దేవాలయాలు, నేలకొండపల్లి బౌద్ధస్తూపం వంటి అనేక పర్యాటక ఆకర్షణలున్నాయి.

ఎలా చేరుకోవాలి?

ఎలా చేరుకోవాలి?

రోడ్డు ద్వారా
రోడ్డు మార్గం ద్వారా ఖమ్మం నగరానికి తేలికగా చేరుకోవచ్చు. ఖమ్మం నుండి ప్రభుత్వ మరియు అనేక ప్రైవేట్ బస్సులు అటు-ఇటు ప్రతిరోజూ నడపబడతాయి. అనేక డీలక్స్, అలాగే వాల్వో బస్సులు కూడా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల నుండి ఖమ్మం కి బైల్దేరతాయి. ఖమ్మం నగరం గుండా జాతీయ రహదారులు 5 మరియు 7 రెండు జాతీయ రహదారులు ఉంటాయి.

రైలు ద్వారా
ఖమ్మం నగరం దక్షిణ రైల్వే వారి మంచి నెట్వర్క్ ద్వారా భారతదేశం లోని ఇతర నగరాలకు, పట్టణాలకు అనుసంధానించబడి ఉంది. ఈ పట్టణం హైదరాబాద్-విజయవాడ లైన్ లో వస్తుంది. ఈ లైన్ ద్వారా వరంగల్, విశాఖపట్టణం, తిరుపతి, చెన్నై, న్యూ డిల్లీ, ముంబై, బెంగళూర్ వంటి ఇతర పట్టణాలకు ఈ నగరం అనుసంధానించబడి ఉంది. ఇక్కడ అనేక సూపర్ ఫాస్ట్, పాసెంజర్, ఎక్స్ప్రెస్ రైళ్ళు ఖమ్మలో ఆగుతాయి.

వాయు మార్గం ద్వారా
ఖమ్మంలో విమానాశ్రయం లేదు. గన్నవరం ఖమ్మం కి దగ్గర విమానాశ్రయ౦, ఇది ఒక దేశీయ విమానాశ్రయం. ఖమ్మం నగరం నుండి 298 కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ లో ఉన్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీప విమానాశ్రయ౦. ఖమ్మంలో విమానాశ్రయ నిర్మాణ౦ ప్రతిపాదన పరిశీలనలో ఉంది. విమానం ద్వారా హైదరాబాద్ వచ్చిన వారు అద్దె టాక్సీలలో లేదా బస్సులలో ఖమ్మం చేరుకోవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X