Search
  • Follow NativePlanet
Share
» »మగధీరుడు అడిపాడిన ఎడారిలో పర్యటిద్దామా?

మగధీరుడు అడిపాడిన ఎడారిలో పర్యటిద్దామా?

గుజరాత్ లో ప్రతి ఏడాది నిర్వహించే రన్ ఆఫ్ కచ్ ఉత్సవం గురించి కథనం.

మగధీర సినిమా చూసిన వారికి అందులో తెల్లటి మంచులాగా కనిపించే మైదానం పై హీరో హీరోయిన్ ధీర...ధీర అనే పాట పాడుకోవడం చూసే ఉంటారు. అయితే మీరనుకొన్నట్లు అది మంచుకాదు. ఒక ఉప్పుటెడారు. ఆ ఉప్పుటెడారులో నవంబర్ 1 నుంచి నాలుగు నెలల కాలం పాటు పర్యాటకులను ఆకర్షించడానికి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అదే రణ్ ఆఫ్ ఉత్సవ్. గుజరాత్ లోని రణ్ ఆఫ్ కచ్ ప్రాంతంలో ఆ ఉప్పుటెడారు ఉంది. ఈ నేపథ్యంలో ఆ ఉత్సవంతో పాటు చుట్టు పక్కల ఉన్న పర్యాటక ప్రాంతాల వివరాలన్నీ మీ కోసం...

రాణ్ ఆఫ్ కచ్, రణ్ ఉత్సవ్

రాణ్ ఆఫ్ కచ్, రణ్ ఉత్సవ్

P.C: You Tube

నాలుగు నెలల పాటు జరిగే రణ్ ఉత్సవ్ పర్యాటక ప్రేమికులకు ఎంతో ఇష్టమైనది. ఈ ఏడాది నవంబర్ 1న మొదలయ్యే ఈ రణ్ ఉత్సవ్ 2019 ఫిబ్రవరి 20 వరకూ జరగనుంది. ఈ ఉత్సవాలనికి లక్షలసంఖ్యలో పర్యాటకులు వస్తారు.

రాణ్ ఆఫ్ కచ్, రణ్ ఉత్సవ్

రాణ్ ఆఫ్ కచ్, రణ్ ఉత్సవ్

P.C: You Tube

ఇందులో విదేశీయులు కనీసం 30 శాతం మంది ఉంటారు. వీరి సంఖ్య ఏడాదికేడాది పెరుగుతూ ఉంది. పర్యాటకుల కోసం ఉప్పు సరస్సుకు సమీపంలో ఉన్న థోర్డో గ్రామంలో తాత్కాలికంగా బస ఏర్పాటు చేస్తారు.

రాణ్ ఆఫ్ కచ్, రణ్ ఉత్సవ్

రాణ్ ఆఫ్ కచ్, రణ్ ఉత్సవ్

P.C: You Tube

ఈ బస చాలా వరకూ టెంట్ హౌస్ లలో ఉంటుంది. ఇక ఈ టెంట్ హౌస్ చుట్టూ అనేక వినోద సంబంధ వేదికలు ఉంటాయి. ఈ వేదికల్లో తోలుబొమ్మలాటలు, ఇంద్రజాల విద్యలు, కచ్ సంప్రదాయ సంగీత న`త్య ప్రసదర్శనలు కొనసాగుతూనే ఉంటాయి.

రాణ్ ఆఫ్ కచ్, రణ్ ఉత్సవ్

రాణ్ ఆఫ్ కచ్, రణ్ ఉత్సవ్

P.C: You Tube

ముఖ్యంగా సాయంత్రం సమయంలో ఈ వినోదం పాలు మరికొంత ఎక్కువగా ఉంటుంది. ఈ రణ్ ఉత్సవం కోసం గుజరాత్ పర్యాటక శాఖ ప్రత్యేక ప్యాకేజీలతో ఈ ఏడాది ముందుకు వచ్చింది. హైదరాబాద్ లోనూ ఈ ప్యాకేజీలను బుక్ చేసుకోవచ్చు.

రాణ్ ఆఫ్ కచ్, రణ్ ఉత్సవ్

రాణ్ ఆఫ్ కచ్, రణ్ ఉత్సవ్

P.C: You Tube

ప్యాకేజీని అనుసరించి ధర, మనకు అందే సౌకర్యాలతో పాటు కచ్ లోని వివిధ పర్యాటక ప్రాంతాలను చూసే అవకాశం లభిస్తుంది. ఈ వివరాలన్నింటి కోసం 9493350099 లో సంప్రదించవచ్చు. లేదా www.rannutsav.com లోకి లాగిన్ కావచ్చు.

రాణ్ ఆఫ్ కచ్, రణ్ ఉత్సవ్

రాణ్ ఆఫ్ కచ్, రణ్ ఉత్సవ్

P.C: You Tube

రణ్ ఉత్సవ్ ధోర్డో గ్రామం శివారులో రాణ్ ఆఫ్ కచ్ ప్రాంతంలో జరుగుతుంది. ఈ ప్రాంతం అహ్మదాబాద్ నుంచి 408 కిలోమీటర్లు, రాజ్ కోట్ నుంచి 140 కిలోమీటర్లు, గాంధీధామ్ నుంచి 169 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

రాణ్ ఆఫ్ కచ్, రణ్ ఉత్సవ్

రాణ్ ఆఫ్ కచ్, రణ్ ఉత్సవ్

P.C: You Tube

చాలా మంది పర్యాటకులు ముందుగా ఈ పట్టణాకలు చేరుకొని అటు పై భుజ్ మీదుగా ధోర్డో విలేజ్ కు చేరుకొంటారు. హైదరాబాద్, విశాఖపట్టణం, విజయవాడ, నుంచి ఆయా నగరాలకు రైలు సౌకర్యం ఉంది.

రాణ్ ఆఫ్ కచ్, రణ్ ఉత్సవ్

రాణ్ ఆఫ్ కచ్, రణ్ ఉత్సవ్

P.C: You Tube
విజయవాడ, విశాఖ నుంచి గాంధీ ధామ్ కు రైళ్లు ఉన్నాయి. అదే విధంగా బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్టణం నుంచి అహ్మదాబాద్ కు నాన్ స్టాఫ్ విమానసర్వీసులు ఉణ్నాయి. అక్కడి నుంచి రైళ్లు, బస్సుల్లో భుజ్ చేరుకోవచ్చు.

రాణ్ ఆఫ్ కచ్, రణ్ ఉత్సవ్

రాణ్ ఆఫ్ కచ్, రణ్ ఉత్సవ్

P.C: You Tube

పున్నమి రాత్రుల్లో రణ్ ఉత్సవ సంబరాలు పతకస్థాయికి చేరుతాయి. నవంబర్ 22 -24, డిసెంబర్ 21 - 23, జనవరి 20-22, ఫిబ్రవరి 18-20 మధ్య రణ్ ఉత్సవాలకు ఎక్కువ సంఖ్యలో పర్యాటకులు పాల్గొంటారు.

రాణ్ ఆఫ్ కచ్, రణ్ ఉత్సవ్

రాణ్ ఆఫ్ కచ్, రణ్ ఉత్సవ్

P.C: You Tube

థోర్డే గ్రామం నుంచి ఉప్పుటెడారి దాదాపు ఆరు కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ మధ్య ప్రయాణం జీవితంలో మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుంది. కొంతమంది ఒంటెల పై ప్రయాణం చేస్తే మరికొంతమంది అందుబాటులో ఉన్న ఓపెన్ టాప్ జీప్ సఫరీని వినియోగించుకొంటారు.

రాణ్ ఆఫ్ కచ్, రణ్ ఉత్సవ్

రాణ్ ఆఫ్ కచ్, రణ్ ఉత్సవ్

P.C: You Tube

ఇక ఫొటోగ్రఫీ అంటే ఇష్టమున్నవారికి ఈ రణ్ ఉత్సవ్ లో తీరికే ఉండదు. ఎప్పుడూ తమ కెమరాకు పనిచెబుతూనే ఉంటారు. వైట్ రణ్ కు దగ్గర్లో అనేక సాహస క్రీడల వేదికలు కూడా ఉంటాయి. రాక్ క్లైంబింగ్, పారా సైలింగ్, ర్యాపెలింగ్ వాల్ వంటికి యువతను రారమ్మని పిలుస్తుంటాయి.

రాణ్ ఆఫ్ కచ్, రణ్ ఉత్సవ్

రాణ్ ఆఫ్ కచ్, రణ్ ఉత్సవ్

P.C: You Tube

ఇక్కడికి దగ్గర్లో ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. ధోర్డోకు 30 కిలోమీటర్ల దూరంలో లుదియా అనే గ్రామం ఉంది. హస్తకళలకు ఈ గ్రామం ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. మట్టితో కట్టిన ఇళ్లను చూడటానికే చాలా మంది ఇక్కడికి వస్తుంటారు.

రాణ్ ఆఫ్ కచ్, రణ్ ఉత్సవ్

రాణ్ ఆఫ్ కచ్, రణ్ ఉత్సవ్

P.C: You Tube

టెంట్ విలేజ్ కు 140 కిలోమీటర్ల దూరంలో మాండ్వీ పట్టణానికి సమీపంలో అరబియా మహాసముద్రం అందాలు మనలను మైమరిపింపజేస్తాయి. ఈ ప్రాంతం పడవల తయారీకి ప్రసిద్ధి చెందినది.

రాణ్ ఆఫ్ కచ్, రణ్ ఉత్సవ్

రాణ్ ఆఫ్ కచ్, రణ్ ఉత్సవ్

P.C: You Tube

ఇక్కడ చిన్న చిన్న నాటు పడవల నుంచి భారీ నౌకల వరకూ తయారు చేస్తుంటారు. ఇక్కడికి దగ్గర్లో ఉన్న విజయప్యాలెస్ కూడా పర్యాటకంగా ప్రసిద్ధి చెందినది. పర్యాటకులు దీనిని తప్పకుండా సందర్శిస్తారు.

రాణ్ ఆఫ్ కచ్, రణ్ ఉత్సవ్

రాణ్ ఆఫ్ కచ్, రణ్ ఉత్సవ్

P.C: You Tube

టెంట్ విలేజ్ కు దాదాపు 82 కిలోమీటర్ల దూరంలో ఉన్న భుజ్ పట్టణంలో స్వామినారాయణ స్వామి ఆలయం ఉంది. 2001లో వచ్చిన భూ కంపంతో ఈ ఆలయం పూర్తిగా తుడిచిపెట్టుకు పోయింది. అటు పై దీనిని పూర్తిగా పాలరాతితో పున: నిర్మించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X