Search
  • Follow NativePlanet
Share
» »‘లక్కుండి’ ఇక్కడికి వెళ్లలేకపోతే చాలా మిస్ అవుతారు

‘లక్కుండి’ ఇక్కడికి వెళ్లలేకపోతే చాలా మిస్ అవుతారు

లక్కుండి పర్యాటకానికి సంబంధించినకథనం.

కర్నాటకలోని గదగ్ జిల్లాలో ఉన్న లక్కుండి గ్రామం కర్నాటక సంస్కతి సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం. ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాలయాలే కాదు దుగుడు బావులు కూడా అద్భుత శిల్ప సంపదను కలిగి ఉండటం విశేషం. అయితే ప్రభుత్వం సరైన ప్రచారం కల్పించక పోవడంతో పర్యాటకంగా కొంత వెనుకబడి ఉందని చెప్పవచ్చు.

ఇక ఇక్కడ ఉన్న కొన్ని దేవాలయాలు పురావస్తు శాఖ ఆధీనంలో ఉండగా మరికొన్ని రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి. మరికొన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ ఏలుబడిలో ఉన్నాయి.

దీంతో సరైన అభివద్ధికి కాదు కదా సరైన ప్రచారం కూడా కల్పించక పోవడంతో పర్యాటకంగా ఈ ప్రాంతం కొంత వెనుబడి ఉంది. అయితే చరిత్ర, సాహిత్యం, శిల్ప, చిత్రకళను ఇష్టపడేవారు ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ లక్కుండి గ్రామానికి సంబంధించిన పర్యాటక విశేషాలు మీ కోసం.

లక్కుండి

లక్కుండి

P.C: You Tube

లక్కుండిలో ప్రభుత్వ లెక్కలను అనుసరించే 50 దేవాలయాలు, అద్భుత శిల్పకళతో అలరాలుతోంది. అంతేకాకుండా చరిత్రకు సాక్ష్యమైన 29 రాతి శాసనాలను కూడా మనం చూడవచ్చు. ఇక ఇక్కడ ఉన్న జైనదేవాలయాల సౌదర్యాన్ని జీవితంతో ఒక్కసారైనా చూడాల్సిందే.

లక్కుండి

లక్కుండి

P.C: You Tube

నల్లటి గ్రానైట్ రాయితో కూడిన దేవాలయం జైన తీర్థాంకర విగ్రహాలకు నిలయం. చాళుక్యుల నుంచి మొదలుకొని ఎన్నో రాజ్యాలు ఈ లయ్కుండి అభివ`ద్ధికి సహకారం అందించారు. ముఖ్యంగా ఇక్కడి శిల్పకళను అభివ`ద్ధి చేయడంలో కీలక పాత్ర వహించారు.

లక్కుండి

లక్కుండి

P.C: You Tube

ఇక్కడ ప్రముఖంగా కాశీ విశ్వేశ్వర దేవాలయం, బ్రహ్మ జైన దేవాలయం, దాదాపు వెయ్యి మెట్లు ఉన్న బావి చూడదగినది. ముఖ్యంగా చాలుక్యవంశ శైలి శిల్పకళ మనలను అలరిస్తుంది. ఇక ఇక్కడి బావులు కూడా ఎంతో అందమైన శిల్పాలను కలిగి ఉండి పర్యాటకులను ఇట్టే ఆకర్షిస్తాయి.

లక్కుండి

లక్కుండి

P.C: You Tube


దీనివల్ల అప్పటి శఇల్పకళఆ నైపుణ్యాన్ని పొగడుకుండా ఉండలేము. ఇక లక్కొండి లుంగీల తయారికి చాలా ప్రాచూర్యం చెందినది. ఇక్కడ దొరికే లుంగీల నాణ్యత మరెక్కడా ఉండదని చెబుతారు. కర్నాటక జానపథ కథల్లో కూడా ఈ లుంగీల ప్రస్తావన ఉందంటే వీటి తయారీ ఎన్ని వందల ఏళ్ల నుంచి కొనసాగుతూ ఉందో అర్థం చేసుకోవచ్చు.

లక్కుండి

లక్కుండి

P.C: You Tube

ఇక్కడ చతుర్ముఖుడుగా పేరుగాంచిన బ్రహ్మ దేవాలయం, అంతేకాకుండా జైనగురువైన అధినాతుడి దేవాలయం కూడా చూడటానికి చాలా బాగుంటాయి. ఈ రెండు దేవాలయాల్లోని శిల్పకళా రీతులు వస్త్రాల పై ప్రింట్ చేస్తుంటారు. అంతేకాకుండా ఇక్కడి శిల్పాల్లోని అభరణాల డిజైన్లను కూడా చాలా మంది జువెలరీ డిజైనర్లు అనుకరిస్తూ ఉంటారు.

లక్కుండి

లక్కుండి

P.C: You Tube

ఈ లక్కుండి గ్రామం గదగ్ జిల్లాలో జిల్లా కేంద్రమైన గదక్ నుంచి 11 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అదే విధంగా హుబ్లీ, హంపీ నుంచి కూడా నిత్యం ఇక్కడకు ప్రభుత్వ, ప్రైవేటు బస్సు సర్వీసులు ఉన్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X