Search
  • Follow NativePlanet
Share
» »సిక్కిం లెగ్షిప్ లో ఉన్న అద్భుతమైన ఆకర్షణలేంటో చూశారా..

సిక్కిం లెగ్షిప్ లో ఉన్న అద్భుతమైన ఆకర్షణలేంటో చూశారా..

ఈశాన్య రాష్ట్రాల్లో పర్యాటకులను విశేషంగా ఆకర్షించే రాష్ట్రం సిక్కిం. వైశాల్యం..జనాభా పరంగా దేశంలో చిన్నదే అయినా...ఇక్కడ పర్యాటక ప్రదేశాలు మాత్రం కోకొల్లలు. ఓ వైపు తెల్లని దుప్పటి పరచుకున్న హిమగిరులు.. మరో వైపు నీలి రంగు సింగారించుకున్న అందమైన సరస్సులతో మనసు దోచే రాష్ట్రం 'సిక్కిం'. 1975 వరకు సిక్కిం చోగ్యాల్ రాజ వంశీకుల పాలనలో ఉండే ఒక స్వతంత్ర దేశం. సిక్కిం వెళ్లడానికి రైలు మార్గంలో మొదట న్యూజలపాయిగురి అనే ఊరి వరకు వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ నుండి డార్జిలింగ్ వాయువ్యంగా 95కి.మీ దూరంలోనూ, సిక్కిం రాజధాని గ్యాంగ్టక్ కు ఈశాన్యంగా 125కి.మీ దూరంలోనూ ఉన్నాయి. ప్రపంచంలో 3వ ఎత్తైన శిఖరంగల కాంచనగంగ పర్వతం సిక్కిం, నేపాల్లలో విస్తరించి ఉంది. ఎంతో ప్రకృతి సౌందర్యాలను ఒనగట్టుకొన్నందువల్లా, ప్రశాంత రాజకీయ స్థిరత్వం వల్లా సిక్కిం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది.

హిమాలయ పర్వత ప్రాంతంలోని

హిమాలయ పర్వత ప్రాంతంలోని

సిక్కిం, భారతదేశంలో హిమాలయ పర్వత ప్రాంతంలోని రాష్ట్రాలలో ప్రకృతి దీవెనలతో నిండిన ఎంతో అందమైన ఒక అద్భుత భూమి. జీవితకాలంలో ఒక్కసారైనా చూడదగిన సుందర ప్రదేశాలతో, ఈ అద్భుతమైన రాష్ట్రం గొప్పగా చెప్పుకొనే ప్రత్యేకత ఉన్న అనేక విషయాలను కల్గి ఉంది.

PC:blackseav

పురాతన టిబెట్ బౌద్ధ సంస్కృతికి చెందిన అనేక కట్టడాలు ఆకర్షిస్తాయి.

పురాతన టిబెట్ బౌద్ధ సంస్కృతికి చెందిన అనేక కట్టడాలు ఆకర్షిస్తాయి.

చైనా, నేపాల్ మరియు భూటాన్ సరిహద్దులుగా ఉన్న రాష్ట్రం సిక్కిం. హిమాలయ పర్వత పంక్తుల్లో భాగమైన సిక్కిం భారతదేశంలో సందర్శించడానికి అత్యంత ప్రాచుర్యం పొందింది. సిక్కింలో పర్వత సౌందర్యం మరియు పురాతన టిబెట్ బౌద్ధ సంస్కృతికి చెందిన అనేక కట్టడాలు ఆకర్షిస్తాయి.

Photo Courtesy: Stefan Krasowski

అదే విధంగా పర్వత, పూల లోయల సొగసులు

అదే విధంగా పర్వత, పూల లోయల సొగసులు

అదే విధంగా పర్వత, పూల లోయల సొగసులు ఏ వయస్సు వారినైనా ఇట్టే ఆకట్టుకొంటాయి. ఇక్కడి పర్యాటక ప్రాంతాల మధ్య దూరం చాలా తక్కువగానే ఉన్నా వాటిని చేరుకోవడానికి ఎక్కవ సమయం పడుతుంది. పర్వత మయమైన మార్గాలే ఇందుకు కారణం. అయినా అక్కడికి చేరుకొన్నాక మనం పడిన అలసటలన్నింటినీ మరిచిపోతాం. ఈ నేపథ్యంలో సిక్కింలో చూడదగిన పర్యాటక ప్రాంతాలలో ఒకటి లెగ్షిప్ .

PC- Amritendu Mallick

 ఈ అందమైన పట్టణాన్ని పశ్చిమ సిక్కింకి ప్రవేశ ద్వారంగా

ఈ అందమైన పట్టణాన్ని పశ్చిమ సిక్కింకి ప్రవేశ ద్వారంగా

పశ్చిమ సిక్కింలోని చిన్న పట్టణమైన లేగ్షిప్ గత కొన్ని సంవత్సరాలలో నిదానంగా పెరుగాంచబడింది. ఈ అందమైన పట్టణాన్ని పశ్చిమ సిక్కింకి ప్రవేశ ద్వారంగా పిలుస్తారు. ఇక్కడ రంగిత్ డ్యాం అత్యంత ఆకర్షణీయమైనది. ఇది రజింత్ నదీలో కనుగొనబడినది. ఇది సిక్కిం ప్రజల కోసం లేగ్షిప్ లోని వారికి హైడ్రో ఎలక్ట్రిక్ కోసం నిర్మించబడిన మొట్టమొదటి డామ్. ఈ డ్యాం నుండి నీటిని సమీకరించి ఈ పట్టణంలోని రంజిత్ వాటర్ వరల్డ్ అమ్యూజ్మెంట్ పార్కుకు ఉపయోగిస్తారు. చిన్న, పెద్ద తేడాలేకుండా ప్రతి ఒక్కరికీ ఈ ప్రాంతం నచ్చుతుంది. ఇక్కడ ఎన్నో రకాల వాటర్ గేమ్స్ అందుబాటులో ఉండటమే దీనికి ప్రధాన కారణం.

PC:Flickr upload bot

లేగ్షిప్ లోను, చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలు

లేగ్షిప్ లోను, చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలు

లేగ్షిప్ పర్యాటకులకు కొన్ని ఆశక్తికర ఆకర్షణలను కలిగిఉంది. వాటిలో కొన్ని రంజిత్ వాటర్ వరల్డ్, కిరతేశ్వర్ మహాదేవ ఆలయం. ఈ ఆలయం ప్రసిద్ధ హిందూ పురాణం మహాభారతానికి చెందినా అనేక పౌరాణిక భాగాలను తెలియచేస్తుంది. అంతేకాకుండా, ఇక్కడ శివుని ఆలయమే కాకుండా, దుర్గాదేవి, శ్రీరామునికి చెందిన ఆలయాలు కూడా ఉన్నాయి, వీటివల్ల హిందువులలో లేగ్షిప్ ప్రధాన యాత్రాస్థలంగా పేరుగాంచింది.

PC:Raghbirkhanna

రంజిత్ వాటర్ వరల్డ్ః

రంజిత్ వాటర్ వరల్డ్ః

రంజిత్ వాటర్ వరల్డ్ సిక్కిం లోని ఉత్తమ ఆకర్షణలలో ఒకటి, ఇది సాహస ప్రియులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అందమైన పరిసరాల మధ్య ఉన్న ఈ వాటర్ వరల్డ్ రంజిత్ ఆనకట్ట నుండి బైట నీటితో ఏర్పాటుచేయబడిన సరస్సు. లేగ్షిప్ కి సమీపంలోని ఈ వాటర్ వరల్డ్ రివర్ రాఫ్టింగ్, యాన్గ్లింగ్, చేపలు పట్టడం, బోటింగ్, స్విమ్మింగ్ వంటి కార్యకలాపాలను ఏర్పాటుచేసింది. ఈ వాటర్ వరల్డ్ లేగ్షిప్ లోని స్థానికుల సహకారంతో ఏర్పాటుచేయబడింది.

PC:Flickr upload bot

కిరాతేశ్వర్ మహాదేవ మందిరం

కిరాతేశ్వర్ మహాదేవ మందిరం

కిరతేశ్వర్ మహాదేవ మందిరం రంజిత్ నది ఒడ్డున ఉంది, ఇది పర్యాటకులలో ప్రార్ధనకు ప్రసిద్ధ ప్రదేశంగా ఉంది. శివునికి అంకితం చేయబడిన ఈ ఆలయానికి హిందూ పురాణం మహాభారతానికి చెందినా అనేక కధలు ఉన్నాయి. ఈ ఆలయం పెల్లింగ్ నుండి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఉంది, ఈ ఆలయానికి సంబంధించిన ప్రసిద్ధ పురాణం ప్రకారం, అర్జునుని ప్రార్ధనకు, భక్తికి మెచ్చి శివుడు ఈ ప్రదేశంలో ప్రత్యక్షమై మహాభారత యుద్ధంలో వేటగాడుగా ఉంటానని ఆశీర్వదించి విజయం సాధిస్తారని చెప్పాడు.

PC:Bhattaraibinod3

Natural Hot Springs, Hot Springs National Park, Arkansas

బోరాంగ్ వేడినీటి బుగ్గ

బోరాంగ్ అనేది ఒక సహజసిద్ధమైన వేడినీటి బుగ్గ. ఇది రవన్‌గ్లా నుంచి 10 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. ఇక్కడ స్నానం చేస్తే చర్మరోగాలన్నీ నశించిపోతాయని నమ్ముతారు. రంగిత్ నదీ తీరంలోనే ఈ వేడినీట బుగ్గ ఉంటుంది. ఇక్కడ ఔషధ గుణాలు కలిగి ఉన్నాయని నమ్మకం. ఈ నీటి చెలమని స్థానికులు ‘ఫు చ చు గంధకపు స్నానం’ అని పిలుస్తారు.

ల్హో ఖండో సంగ్ ఫో గుహలు

ల్హో ఖండో సంగ్ ఫో గుహలు

ల్హో ఖండో సంగ్ ఫో గుహలు లేగ్షిప్ లోని గంధకపు వేడినీటి చెలమల సమీపంలో ఉన్నాయి. ఎనిమిదవ శతాబ్దంలో రింపోచే గురువు ధ్యానం కోసం ఉపయోగించిన నలుగు గుహలలో ఇది ఒకటి. చ్యంగ్ లహరి న్గింఫు, శర్చో ఫేఫు, నుబ్ దేచెంఫు ఇతర మూడు గుహలు. ఈ గుహలు అత్యంత బౌద్ధ యాత్ర స్థలంగా కూడా భావించబడతాయి, పశ్చిమ బెంగాల్, నేపాల్, భూటాన్ నుండి భక్తులు ఈ ప్రాంతాన్ని సందర్శించి, పవిత్ర ఫు చ చు లో మునక వేస్తారు.

లేగ్షిప్ వాతావరణం లేగ్షిప్ లో ఏడాది పొడవునా మంచుతో, చల్లని వాతావరణం ఉంటుంది.

లేగ్షిప్ వాతావరణం లేగ్షిప్ లో ఏడాది పొడవునా మంచుతో, చల్లని వాతావరణం ఉంటుంది.

మీరు రద్దీగా ఉండే నగర జీవితంనుండి కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి ఇక్కడి ప్రకృతి ఒడిలో సేద తీరవచ్చు. లేగ్షిప్ వాతావరణం లేగ్షిప్ లో ఏడాది పొడవునా మంచుతో, చల్లని వాతావరణం ఉంటుంది.

PC- Amritendu Mallick

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X