Search
  • Follow NativePlanet
Share
» »చెన్నై గురించి మీకు తెలీని కొన్ని ఆసక్తికర నిజాలు !

చెన్నై గురించి మీకు తెలీని కొన్ని ఆసక్తికర నిజాలు !

By Mohammad

చెన్నైలోని మారినా (మెరీనా) బీచ్ గురించి తెలీని ప్రయాణీకుడు, పర్యాటకుడు ఉండడు అవునా ? మరి ప్రపంచంలోనే రెండవ అతి పొడవైన బీచ్ ఈ మారినా బీచ్ అని మీకు తెలుసా ? చెన్నై దక్షిణ భారతదేశం యొక్క సాంస్కృతిక రాజధానిగా ప్రసిద్ధి చెందిందని మరియు ఇక్కడున్న బీచ్ లు, చారిత్రక కట్టడాలు, ఆలయాలు .. ఇలా ఎన్నో ఈ ప్రాంతంలో గుర్తింపు తెచ్చుకున్నవిగా ఉన్నాయని తెలుసా ?

చెన్నై సిటీ పర్యాటకులకు, యాత్రికులకు అందమైన ప్రదేశాలను, అడ్వెంచర్ క్రీడలను అందిస్తూ ఆకర్షిస్తున్నది. వారసత్వానికి మరియు సంస్కృతికి సంపద గా నిలిచిన ఈ అందమైన నగరం గురించి అతి కొద్ది మందికి తెలిసిన కొన్ని నిజాలు .. ఇప్పుడు మనమూ తెలుసుకుందాం ..!

ఇది కూడా చదవండి : చెన్నై నగరం - 50 కిలోమీటర్లు లోపల గల ఆకర్షణీయ ప్రదేశాలు !

మారినా బీచ్ వద్ద అద్భుత సూర్యాస్తమం

మారినా బీచ్ వద్ద అద్భుత సూర్యాస్తమం

చిత్ర కృప : hangaraj Kumaravel

1. ప్రపంచంలోనే రెండవ పొడవైన బీచ్

ప్రపంచంలోనే రెండవ పొడవైన అర్బన్ బీచ్ గా ప్రసిద్ధి కెక్కింది చెన్నై లోని మారినా బీచ్. దీని పొడవు ఏకంగా 13 కిలోమీటర్లు. చెన్నై లో తప్పక చూడవలసిన పర్యాటక ప్రదేశాలలో ఇది ముందువరుసలో ఉంటుంది. దీనిని చెన్నై వెళ్ళినప్పుడు తప్పక చూడాలి. కోయంబేడ్ బస్ స్టాండ్ నుండి, టి నగర్ నుండి మరియు ఇతర ప్రదేశాల నుండి సిటీ బస్సులు అందుబాటులో ఉంటాయి.

2. భారతదేశంలో మొట్టమొదటి జూ

ది వండలూర్ జంతు ప్రదర్శన శాల లేదా అరిగ్నర్ అన్నా జూలాజికల్ పార్క్ దేశంలోనే మొట్టమొదటి జూ గా ప్రసిద్ధి చెందినది. ఈ జంతు ప్రదర్శన శాల చెన్నై కి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.

అన్న జూ లో తెల్ల చారల పులి

అన్న జూ లో తెల్ల చారల పులి

చిత్ర కృప : prabhu ebenezer

3. దేశంలోనే రెండవ అతి పెద్ద సినిమా

చెన్నై నగరం దేశంలోనే సినిమా ధియేటర్లు ఎక్కువగా కలిగిఉన్న రెండవ నగరంగా ప్రసిద్ధి కెక్కింది. మొదటి స్థానంలో ప్రస్తుతం ముంబై నగరం దేశంలోనే ఎక్కువ సినిమా ధియేటర్లు కలిగిఉన్న నగరంగా నిలిచింది.

4. ఆసియా ఖండం లోనే అతిపెద్ద లైబ్రేరి

చెన్నై లోని కొట్టుర్పురంలో గల 'ది అన్న సెంటినరీ లైబ్రేరి(ACL)' ఆసియా ఖండంలోనే పెద్దది. దీనిని నిర్మించటానికి అప్పట్లోనే 172 కోట్లు ఖర్చయింది.

5. ఇండియాలోని పురాతన క్రికెట్ స్టేడియాలలో ఒకటి

చెన్నై లో క్రీ.శ. 1916 వ సంవత్సరంలో ఏర్పాటు చేసిన ఎం ఎ చిదంబరం స్టేడియం దేశంలోని పురాతన స్టేడియాలలో ఒకటి. అప్పటి నుండి నేటికీ దీన్ని ఉపయోగిస్తున్నారు.

చెన్నై లోని 450 సంవత్సరాల మర్రి చెట్టు

చెన్నై లోని 450 సంవత్సరాల మర్రి చెట్టు

చిత్ర కృప : Aleksandr Zykov

6. 450 సంవత్సరాల మర్రి చెట్టు

చెన్నై లోని ఆడయార్ వద్ద 450 సంవత్సరాల పురాతన మర్రి చెట్టు ఉన్నది. చెన్నై వాసులకు ఇదొక విహార స్థలంగా ఆకర్షిస్తున్నది. ఈ దిగ్గజ చెట్టు యొక్క వేర్లు సుమారు 60,000 చదరపు మీటర్ల వరకు వ్యాపించి ఉన్నాయి.

7. ఇండియాలోని పురాతన బోట్ క్లబ్ లలో ఒకటి

మద్రాస్ బోట్ క్లబ్ దేశంలోని పురాతన బోట్ క్లబ్ లలో ఒకటి. ఇక్కడ యువతీ యువకులకు రోయింగ్ నేర్పిస్తుంటారు. రోయింగ్ లో మాస్టర్ అవ్వటానికి ప్రతి సంవత్సరం సమ్మర్ లో నిర్వహించే తరగతులలో పాల్గొనవచ్చు.

చెన్నై నగరం వీటితో పాటు మరెన్నో పర్యాటక ఆకర్షణలు, సాహస క్రీడలను అందిస్తున్నది. పర్యాటకులు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని, చెన్నై కి ట్రిప్ వేసుకోండి!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X