Search
  • Follow NativePlanet
Share
» »వసంతపంచమి వేడుకలు జరిగే దర్గా చూశారా?

వసంతపంచమి వేడుకలు జరిగే దర్గా చూశారా?

వసంత పంచమి వేడుకలు జరిగే దర్గాకు సంబంధించిన వివరాలు

వసంత పంచమి వేడులకు హిందూ దేవాలయాల్లో ఘనంగా జరుగుతాయి. అయితే అదే రోజు ఓ దర్గాలో ఆ వసంతపంచమి వేడుకలు జరుగుతున్నాయి. దాదాపు ఏడు వందల ఏళ్ల నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. మత సామరస్యానికి ప్రత్యక్ష నిదర్శనమైన ఈ ఘటన ఎక్కడో కాదు మన దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతోంది. దీనిని ఆదర్శంగా తీసుకొని మన హైదరాబాద్ లోని ఓ ప్రసిద్ధ దర్గాలో కూడా గత మూడేళ్లుగా ఈ ఉత్సవాలను ఘనంగా జరుపుతున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు మీ కోసం....

వసంతపంచమి

వసంతపంచమి

P.C: You Tube

భారతీయ ముస్లీంలు వసంత పంచమి పర్వదినాన్ని భక్తితో జరుపుకోవడం 12వ శతాబ్డంలోనే మొదలయ్యింది. ఢిల్లీలోని సూఫీ ప్రబోధకుడైన హజ్రత్ నిజాముద్దీన్ హయాంలో ఈ సంప్రదాయానికి బీజం పడింది.

వసంతపంచమి

వసంతపంచమి

P.C: You Tube
మత గురువైన నిజాముద్దీన్ శోకం నుంచి తేరుకోవడానికి అతని శిష్యుడు ప్రముఖ కవి, సితార్ సంగీత విద్వాంసుడు అమీర్ ఖుస్రో తొలిసారిగా ఈ కార్యక్రమాలను నిర్వహించాడని చరిత్ర చెబుతోంది.

వసంతపంచమి

వసంతపంచమి

P.C: You Tube
మేనల్లుడి మరణంతో దిగులుగా ఉన్న నిజాముద్దీన్ ను ఆ బాధ నుంచి బయటకు తీసుకురావాలన్న ఉద్దేశ్యంతో అమీర్ ఖుస్రో వీటిని నిర్వహించారు.

వసంతపంచమి

వసంతపంచమి

P.C: You Tube
అజ్మీర్ దర్గా, ఢిల్లీలోని హజ్రత్ కుతుబుద్దీన్ ఏ భక్తియార్ పేహరోలి కుతుబ్ దర్గా లో సూఫీ వసంత పంచమి కార్యక్రమాలు జరుగుతాయి. ఈ క్రమంలోనే మత సామరస్యతను చాటేలా తొలిసారి 2015లో పత్తర్ గట్టిలోని దర్గాలో ఉత్సవాలను మొదలుపెట్టారు.

వసంతపంచమి

వసంతపంచమి

P.C: You Tube
సూఫీ సందేశాలను ప్రచారం చేసే గురువు హజ్రత్ షేక్ జీహలీ అబుల్ ఉలాయి రెండు వందల ఏళ్ల కిందట రాజస్థాన్ నుంచి హైదరాబాద్ వచ్చారు. ఆయన పత్తార్ గట్టీ ఉర్ధూ గల్లీలో పారాతితో దర్గాని నిర్మింపజేశాడు.

వసంతపంచమి

వసంతపంచమి

P.C: You Tube
సూఫీ సామరస్య సందేశాలను అందించే ఈ దర్గాను వంశపారంపర్యంగా ప్రస్తుతం హజ్రత్ మహ్మద్ ముజఫర్ అలీ చిస్తీ అబుల్ ఉలాయి నిర్వహిస్తున్నారు. సమరస్యతను చాలిన అమీర్ ఖుస్రో వసంతపంచమి, సంగీత వాయిద్యాల పై రాసిన కవితలు, పాటలు పత్తార్గట్టీలోని దర్గాలోనూ ఆలపిస్తారు.

వసంతపంచమి

వసంతపంచమి

P.C: You Tube
చైత్ర మాసంలో ఆరంభమయ్యే వసంతరుతువు మాఘమాసంలో అందుకు కావాల్సిన రూపు రేఖలను సంతరించుకొంటుంది. ఆ విషయాన్ని సూచిస్తూ వసంతపంచమి జరుపుకొంటారు.

వసంతపంచమి

వసంతపంచమి

P.C: You Tube
సరస్వతీ దేవి జయంతి ఈ రోజు కావడం వలన దీనిని శ్రీ పంచమి అని కూడా అంటారు. ఆ రోజున ఆమెను ఆరాధించాలని మన శాస్త్రాలు చెబుతాయి. ఈ సరస్వతీ దేవి విద్యను ప్రసాదించే దేవతగా పురాణ కాలం నుంచి మనం నమ్ముతున్న విషయం తెలిసిందే.

వసంతపంచమి

వసంతపంచమి

P.C: You Tube
హంస పాల నుంచి నీటిని వేరుచేస్తుందని చెబుతారు. అలా అజ్జానం నుంచి జ్జానం వేరు చేయబడుతుందని చెప్పడానికి సూచనగా ఆమె హంసను వాహనంగా చేసుకొని కనిపిస్తుంది. అందుకే ఈ రోజున దేశంలోని వివిధ ప్రాంతాల్లో సరస్వతీ ఆలయాలు భక్తులను విశేష సంఖ్యలో దర్శిస్తుంటారు.

వసంతపంచమి

వసంతపంచమి

P.C: You Tube
సరస్వతీ దేవికి తెలుపు రంగు అంటే ఇష్టం కాబట్టి ఆమెకు తెల్లని పూలు, అంచులతో కూడిన తెల్లని వస్త్రాలను సమర్పిస్తుంటారు. ఆ రోజున బాసర సరస్వతీ దేవాలయంతో పాటు దేశంలోని ఇతర సరస్వతీ దేవాలయాల్లో పెద్దలు తమ పిల్లలకు పెద్ద ఎత్తున అక్షరాభ్యాస కార్యక్రమాలు చేయిస్తూ ఉంటారు.

వసంతపంచమి

వసంతపంచమి

P.C: You Tube
ఇక ఈ రోజున వసంతుడితో పాటు రతీ మన్మథులను కూడా పూజిస్తారు కాబట్టి దీనిిన మదన పంచమి అని కూడా అంటారు. ఇక దర్గాల్లో అచ్చం ఇలాగే కాకున్నా దర్గాలో అక్షరాభ్యాస కార్యక్రమాలు,వివిధ భక్తి గీతాలు ఆ రోజు ప్రత్యేకంగా ఆలపించే కార్యక్రమాలు జరుగుతాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X