Search
  • Follow NativePlanet
Share
» »వేసవిలో సముద్రపు అలల ఒడ్డున సరదాగా

వేసవిలో సముద్రపు అలల ఒడ్డున సరదాగా

రానున్న వేసవి కాలంలో పెద్దలు విహార యాత్రలు ఎక్కువగా చేస్తుంటారు. వేసవి ఉక్కపోతను తప్పించుకోవడానికి వీలుగా దగ్గర్లోని చల్లని ప్రాంతాలు వెలుతుంటారు. కర్ణాటకలోని బీచ్ లకు సంబంధించిన కథనం

By Beldaru Sajjendrakishore

కర్ణాటక 320 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతాన్ని కలిగి ఉంది. ఈ తీరప్రాంతంలో ఎంతో పేరుగాంచిన పర్యాటకానికి అనుకూలమైన బీచ్ లు ఎన్నో ఉన్నాయి. భారత ముఖ్యంగా దక్షిణ భారత దేశ వాతావరణ పరిస్థితులను అనుసరించి వేసవిలో చాలా మంది పర్యాటకానికి వెలుతుంటారు. వీరిలో 75 శాతం మంది బీచ్ లు ఉన్న ప్రాంతానికే వెళ్లాలని భావిస్తుండటం సహజం. ఈ విషయంలో చిన్నాపెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కటి ఓటు బీచ్ లకే ఈ నేపథ్యంలో కర్ణాటకలోని ఓంబీచ్, మురుడేశ్వర వంటి ప్రఖ్యాతి గాంచిన బీచ్ లతో పాటు రాష్ర్టం మొత్తం మీద ఉన్న ప్రముఖ బీచ్ లకు సంబంధించిన కథనం నేటివ్ ప్లానెట్ పాఠకుల కోసం

1.గోకర్ణ

1.గోకర్ణ

Image source

కర్ణాటకలోని ముఖ్యమైన బీచ్ లలో గోకర్ణ కూడా ఒకటి. కర్వార నుంచి 58 కిలోమీటర్ల దూరంలో ఈ బీచ్ ఉంటుంది. ఇక మురుడేశ్వరకు 75 కిలోమీటర్లు, బెంగళూరుకు 514 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ బీచ్ ఉత్తర కన్నడ జిల్లాకు ఆదాయం సమకూర్చే నగరాల్లో ఒకటి. ఇది ప్రముఖ పుణ్యక్షేత్రం కూడా ఉంది. ఇక్కడ శివుడి ఆత్మలింగం ఉందని హిందూ భక్తులు నమ్ముతారు.

ఆత్మలింగ కథనం, పుణ్యక్షేత్రం విశిష్టత కోసం ఆత్మలింగ కథనం, పుణ్యక్షేత్రం విశిష్టత కోసం

2.మంగళూరు

2.మంగళూరు

Image source

కర్ణాటకలోని ప్రముఖ రేవు పట్టణాల్లో మంగళూరు కూడా ఒకటి. మంగళాదేవి పేరుమీద ఈ ప్రాంతానికి మంగళూరు అని పేరు వచ్చింది. అరేబియా సముద్ర తీర ప్రాంతంలోని ఈ పట్టణంలోని బీచ్ అందాలకు నిలయం. కొబ్బరిచెట్లు, చిన్నచిన్న గుట్టలతో కూడిన ఈ బీచ్ చూడటానికి చాలా ముచ్చటగా ఉంటుంది. బెంగళూరు నుంచి 375 కిలోమీటర్ల దూరంలో ఉన్న మంగళూరుకు ప్రయాణ సమయం దాదాపు ఏడున్నర గంటలు. ఇక్కడకు దగ్గర్లో మంగళదేవి ఆలయం, కాద్రి మంజునాథ దేవాలయం తదితర పర్యాటక ప్రాంతలు ఉన్నాయి.

3.ఉడిపి

3.ఉడిపి

Image source

ఉడిపి మంగళూరుకు 65 కిలోమీటర్ల దూరంలో, మురుడేశ్వరకు 102 కిలోమీటర్ల దూరంలో, శివమొగ్గకు 147 కిలోమీటర్ల దూరంలో, మైసూరుకు 309 కిలోమీటర్ల దూరంలో, బెంగళూరుకు 403 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఉడిపి బీచ్ లకే కాకుండా ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రం కూడా. పశ్చిమ కనుమల తీరంలో ఉన్న ఈ పట్టణం చూడటానికి విదేశీయులు సైతం వేసవి కాలంలో ఎక్కువగా వస్తుంటారు. ఇక్కడ శ్రీ క్రిష్ణ దేవాలయం ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది.

4. మురుడేశ్వర

4. మురుడేశ్వర

Image source

At a distance of 162 km from Mangalore, 188 km from Shimoga, 113 km from Karwar, 76 km from Gokarna, 219 km from Hubli, 214 km from Panjim & 497 km from Bangalore, Murudeshwar is a well known pilgrimage and beach destination located in the Bhatkal Taluk of Uttara Kannada district in Karnataka. Murudeshwar is a picturesque place situated between Honnavar and Bhatkal. It is bounded by the Arabian Sea and Western Ghats. Murudeshwar is one of the most famous tourist places to visit in Karnataka, for it's pilgrimage importance apart from being a popular beach resort.
మంగళూరుకు మురుడేశ్వర 162 కిలోమీటర్ల దూరంలో శివమొగ్గకు 188 కిలోమీటర్ల దూరంలో, కార్వారకు 113 కిలోమీటర్ల దూరంలో గోకర్ణకు 76 కిలోమీటర్ల దూరంలో బెంగళూరుకు 497 కిలోమీటర్ల దూరంలో మురుడేశ్వర ఉంటుంది. ఉత్తర కన్నడ జిల్లాలోని బత్కల్ తాలూకాలో ఉంది. అరేబియా తీర ప్రాంతంలోని మురుడేశ్వర ప్రముఖ శైవ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ప్రపంచంలోని రెండో అతి పెద్దదైన శివుడి విగ్రహం ఇక్కడ ఉంది. కందుక గిరి పర్వత పాదల వద్ద ఉన్న బీచ్ లో సూర్యాస్తమయాన్ని చూడటానికి రెండు కళ్లు చాలవు.

5.కార్వార్

5.కార్వార్

Image source

కర్వార గోకర్ణకు 59 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అదే విధంగా కుమతకు 70 కిలోమీటర్లు, పంజీమ్ కు 108 కిలోమీటర్లు, మురుడేశ్వరకు 114 కిలోమీటర్లు, బెంగళూరుకు 517 కిలోమీటర్ల దూరంలో కార్వార బీచ్ ఉంటుంది. గోవ, కర్ణాటక సరిహద్దులో ఉత్తర కన్నడ జిల్లాలలో భాగమైన ఈ ప్రాంతాన్ని గోవకు వచ్చిన వారు తప్పక సందర్శిస్తారు. ఇక్కడ గతంలో సముద్ర వ్యాపారం ఎక్కువగా జరుగుతుండేది. ఈ బీచ్ కు దగ్గర్లో దేవ్ బాగ్ బీచ్, నరసింహా దేవాలయం, వెంకటరమణ దేవాలయం తదితర పర్యాటక కేంద్రాలు ఎన్నో ఉన్నాయి. కరావళి ఉత్సవాల పేరుతో ఇక్కడ ప్రతి ఏడాది జరిగే సంబరాల్లో పాల్గొనడానికి దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజలు వస్తూ ఉంటారు.

6.తన్నీరు బావి బీచ్

6.తన్నీరు బావి బీచ్

Image source

మంగళూరు రైల్వేస్టేషన్ కు కేవలం 12 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఈ బీచ్ ఉంది. మంగళూరు రేవు పట్టణంలో భాగమైన ఈ తన్నీరు బావి బీచ్ సూర్యాస్తమయం సమయంలో బంగారు రంగులో మెరిసిపోతూ కనిపిస్తుంది. అందువల్ల ప్రక`తి ప్రేమికులు ఇక్కడకు ఎక్కువ మంది వస్తుంటారు.

7.ఓం బీచ్

7.ఓం బీచ్

Image source

At a distance of 6 km from Gokarna Bus Station, Om Beach is the most famous beach in Gokarna. Two semi-crescent shapes that join together resembling the Hindu religious symbol of Om. This beach got its name because of its shape.
గోకర్ణకు 6 కిలోమీటర్ల దూరంలో ఈ ఓం బీచ్ ఉంటుంది. హిందూ సంప్రదాయంలో కనిపించే ఓం అక్షరం ఆకారంలో ఈ బీచ్ ఉండటం వల్ల దీనికి ఓం బీచ్ అని పేరు వచ్చింది. ఇక్కడకు దగ్గరగా ఉన్న కూడ్లే బీచ్ కు నడుచుకుంటూ వెళ్లవచ్చు. ఈత రాని వారు కూడా సముద్ర అలల పై ఈత కొట్టడానికి అనువుగా ఈ బీచ్ ఉండటం విశేశం. ఇక్కడ పర్యటకుల అనుకూల కోసం అనేక రెస్టోరెంట్లు ఉన్నాయి. అనేక జల క్రీడలకు కూడా ఈ బీచ్ కేంద్రం.

8.సెయింట్ మేరీస్ ఐల్యాండ్

8.సెయింట్ మేరీస్ ఐల్యాండ్

Image source

At a distance of 15 Kms from Udupi Railway Station, 65 Kms from Mangalore & 100 Kms from Murudeshwar, St. Mary's Island is a group of small beautiful islands to the north of Malpe Beach near Udupi. It is said that Vasco da Gama first reached this Island before reaching the Kappad Beach (near Calicut) while finding sea route to India.
ఉడిపికి దగ్గరగా మల్పే బీచ్ సమీపంలో ఈ ఐల్యాండ్ ఉంటుంది. అనేక చిన్నచిన్న దీవుల సమూహమే సెయింట్ మేరీస్ ఐల్యాండ్. ఇది ఉడిపికి 15 కిలోమీటర్ల దూరంలో, మంగళూరుకు 65 కిలోమీటర్ల దూరంలో, మురడేశ్వరకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వాస్కోడిగామా మొదట ఇక్కడకే వచ్చినట్లు చెబుతారు. ఇక్కడ సహజ సిద్దంగా ఏర్పడిన శిలలు చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంటాయి.

9.దేవ్ బాగ్ బీచ్

9.దేవ్ బాగ్ బీచ్

Image source

కర్ణాటక, గోవ సరిహద్దులో ఈ బీచ్ ఉంది. కర్వారకు కేవలం 5 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉన్న ఈ బీచ్ కు ఒక వైపున అరేబియా సముద్రం ఉంటే మరోవైపు పశ్చిమ కనుమలు ఉంటాయి. ఇక్కడి ఇసుక బంగారు వర్ణంలో మెరిసి పోతుండటం గమనార్హం.

10.తిల్ మాటీ బీచ్

10.తిల్ మాటీ బీచ్

Image source

కార్వార్ బీచ్ కు కేవలం 13 కిలోమీటర్ల దూరంలోనే ఈ బీచ్ ఉంటుంది. ఈ బీచ్ లో ఇసుక నల్లని రంగులో ఉండటం గమనార్హం. ఈ వింతను చూడటానికే చాలా మంది ఇక్కడకు వస్తుంటారు. దాదాపు 200 మీటర్ల మేర నల్లని రంగుగల ఇసుకను మనం ఇక్కడ చూడవచ్చు. అయితే ఈ బీచ్ కు దగ్గరగా ఉన్న పామ్ బీచ్, మజిలి బీచ్ లో ఇసుక సాధారణ రంగులోనే ఉండటం విశేషం.

11. మాల్పే బీచ్

11. మాల్పే బీచ్

Image source

ఉడిపి రైల్వే స్టేషన్ కు కేవలం 10 కిలోమీటర్ల దూరంలో మాల్పే బీచ్ ఉంటుంది. స్వర్ణ నంది నది ఇక్కడకు దగ్గరల్లోనే ఉంటుంది. కర్ణాటకలోనే కాకుండా దేశం మొత్తం మీద అతి సుందరమైన బీచ్ లలో మాల్పే బీచ్ ఒకటి. ఈ బీచ్ లో బోటింగ్ చేయడం మరుపురాని అనుభూతిని మిగిలుస్తుంది.

12.మజాలీ బీచ్

12.మజాలీ బీచ్

Image source

కర్వారకు కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే ఈ బీచ్ ఉంటుంది. గోవ ఇక్కడి నుంచి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. దేవ్ బాగ్ బీచ్ ఇక్కడకు 4.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కర్ణాటక తీర ప్రాంత వంటకాలకు ఈ బీచ్ చాలా ప్రఖ్యాతి గాంచింది. ఇక్కడ పలు రకాలైన సీ ఫుడ్ లభిస్తుంది. ఇక్కడ కయాకింగ్, బోటింగ్ వంటి జల క్రీడలు పర్యాటకులకు మంచి వినోదాన్ని పంచుతాయి.

13.కౌప్ బీచ్

13.కౌప్ బీచ్

Image source

ఉడిపి రైల్వే స్టేషన్ కు కేవలం 16 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఈ బీచ్ ఉంటుంది. సూర్యస్తమయం సమయంలోఇక్కడ ప్రక`తి అందాలు ద్విగునీక్రుతమవుతాయి. అందువల్ల ఉదయం కంటే సాయంత్రం ఇక్కడ పర్యాటకులు ఎక్కువ మంది కనిపిస్తారు. వంద అడుగుల ఎతైన లైట్ హౌస్ ఇక్కడ ఆకర్షణీయంగా ఉంటుంది.

14.సూరత్ కల్ బీచ్

14.సూరత్ కల్ బీచ్

Image source

At a distance of 19 Kms from Mangalore Railway Station, Surathkal Beach on the shores of Arabian Sea is a clean beach with tremendous scenic beauty. The beach offers wonderful views of the sunset and it's usually crowded during evenings. It is one of the popular beaches near Mangalore.
సూర్యాస్తమయ అందాలను ఈ బీచ్ లో చూడటానికి చాలా మంది పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు. మంగళూరు నుంచి ఈ బీచ్ కేవలం 19 కిలోమీటర్ల దూరం మాత్రమే. ఇక్కడకు దగ్గర్లోని సదాశివ దేవాలయం కూడా చూడదగినది.

15.పనంబూర్ బీచ్

15.పనంబూర్ బీచ్

Image source

మంగళూరుకు కేవలం 11 కిలోమీటర్ల దూరంలో ఈ బీచ్ ఉంది. పట్టణానికి దగ్గరల్లో ఉండటం వల్ల ఈ బీచ్ ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఇక్కడ జల క్రీడలతో పాటు ఒంటె సవారి కూడా అందుబాటులో ఉంటుంది.

16.సోమేశ్వర బీచ్

16.సోమేశ్వర బీచ్

Image source

ఈ బీచ్ కు దగ్గర్లో రాణి అబ్బక్క దేవి నిర్మించిన సోమేశ్వర నాథ దేవాలయం ఉండటం వల్ల ఈ బీచ్ కు ఆ పేరు వచ్చింది. ఈ సోమేశ్వర బీచ్ మంగళూరుకు కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఈ బీచ్ లో సహజ సిద్ధంగా ఏర్పడిన శిలను రుద్రశిల అని పిలుస్తారు. సూర్యాస్తమయం సమయంలో సూర్యకిరణాలు ఈ శిల పై పడి ద్విగుణీక`తమవడం చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంటుంది.

17. ఉల్లాల్ బీచ్

17. ఉల్లాల్ బీచ్

Image source

నేత్రావతి నది అరేబియా సముద్రంలో కలిసే ప్రాంతంలో ఈ ఉల్లాల బీచ్ ఉంది. మంగళూరులోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో ఇది ఒకటి. మంగళూరుకు కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఈ బీచ్ ఉంటుంది. జల క్రీడలకు కూడా ఈ బీచ్ ప్రఖ్యాతి గాంచింది.

18.మరావంతే బీచ్

18.మరావంతే బీచ్

Image source

మురుడేశ్వరకు 48 కిలోమీటర్ల దూరంలో, ఉడిపికి 52 కిలోమీటర్ల దూరంలో ఈ మరావంతే బీచ్ ఉంటుంది. రాత్రి సమయంలో కూడా పర్యాటకులు ఈ బీచ్ లో ఎక్కువ సమయం గడుపుతారు. అందుకు అనుగుణంగా ప్రభుత్వ అన్ని చర్యలు తీసుకుంది. ఇక్కడికి దగ్గర్లో ఉన్న కోడచాద్రి హిల్స్ ట్రెక్కింగ్ కు అనుకూలంగా ఉంటాయి.

19.అంజాదీప్ ఐలాండ్

19.అంజాదీప్ ఐలాండ్

Image source

ఇది కర్వారకు కేవలం ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దాదాపు 1.5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఐలాండ్ అనేక జల క్రీడలకు అనుకూలంగా ఉంటుంది. కార్వార నుంచి ఈ ద్వీపానికి బోటులో కూడా వెళ్లడానికి అవకాశం ఉంది.

20.కోడిబాగ్ బీచ్

20.కోడిబాగ్ బీచ్

Image source

అరేబియా సముద్రం, కాళి నది జలాలు కలిసే ప్రాంతంలో ఈ కోడిబాగ్ దేవాలయం ఉంటుంది. కార్వార్ కు కేవలం ఈ బీచ్ 4.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సూర్యాస్తమయాన్ని చూడటానికి ఇక్కడకు ఎక్కువ మంది వస్తుంటారు. వివిధ రకాల జల క్రీడలు కూడా ఇక్కడ ఎక్కువగా జరుగుతాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X