Search
  • Follow NativePlanet
Share
» »దేవుళ్లు నివసించే ప్రాతం...ఈ శ్రావణ మాసంలో ఈ దేవాలయాలను సందర్శించారా?

దేవుళ్లు నివసించే ప్రాతం...ఈ శ్రావణ మాసంలో ఈ దేవాలయాలను సందర్శించారా?

ఉత్తరాఖండ్ లో ప్రాచూర్యం చెందిన దేవాలయాల గురించి కథనం.

భారత దేశంలో ఉత్తరాఖండ్ హిమాలయాల రాష్ట్రం. హిందూ పురాణాల్లో పేర్కొన్న అనేకమంది దేవతలు ఇక్కడ కొలువై ఉన్నారని చెబుతారు. అందువల్లే ఉత్తరాఖండ్ ను దేవతలు నివసించే రాష్ట్రంగా పేర్కొంటారు. ఈ క్రమంలోనే ఉత్తరాఖండ్ అనేక దేవాలయాలకు నిలయం. ఇక్కడ ప్రతి అడుగుకూ ఒక దేవాలయం కనిపిస్తుంది. ఇందులో చాలా వరకూ పురాణ ప్రాధాన్యత కలిగినవే. ఇందులోనూ అత్యంత ప్రధాన, విశిష్టమైన దేవాలయాల గురించిన పూర్తి వివరాలు మీ కోసం...

ధరి దేవి దేవాలయం....

ధరి దేవి దేవాలయం....

P.C: You Tube

ఉత్తరాఖండ్ లోని గడ్వాల్ భాగంలో అలకనందా నదీ తీరంలో ఈ ధరి దేవి దేవాలయం ఉంది. మన పురాణాల్లో పేర్కొన్న 108 శక్తి పీఠాల్లో ఇది కూడా ఒకటి. ఇక అమ్మవారి తల మాత్రం ఉంటుంది. మొండెం మాత్రం కాళిమఠంలో ప్రతిష్టించి పూజిస్తున్నారు.

ఉదయం పూట అలా

ఉదయం పూట అలా

P.C: You Tube

మరో విశేషం ఏమిటంటే ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉదయం పూట చిన్న బాలిక వలే, మధ్యాహ్న సమయంలో పడుచువలే, రాత్రి మహిళ వలే కనబడుతుంది. ఈ దేవాలయం శ్రీనగర-బద్రీనాథ్ మార్గంలో శ్రీనగర్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రుద్రప్రయాగ నుంచి 20 కిలోమీటర్లు, ఢిల్లీ నుంచి 360 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంటుంది.

మాయాదేవి దేవాలయం

మాయాదేవి దేవాలయం

P.C: You Tube

ఉత్తరాఖండ్ లోని ప్రముఖ ధార్మిక నగరమైన హరిద్వార్ లో ఈ మాయా దేవి దేవస్థానం మనకు కనిపిస్తుంది. సతి దేవి హ`దయభాగం పడిన ప్రదేశంగా ఈ దేవాలయాన్ని భావిస్తారు. అందువల్లే ఈ మాయాదేవి దేవాలయాన్ని కూడా ఒక శక్తిపీఠంగా భావించి పూజలు చేస్తున్నారు.

మూడు తలలు

మూడు తలలు

P.C: You Tube

ఈ దేవాలయంలోని అధిష్టాన దేవత మాయ మూడు తలలతో, నాలుగు చేతులతో ఉంటుంది. ఈ దేవాలయం కాక హరిద్వార్ లో చండీదేవి ఆలయం, మనస దేవి ఆలయం చూడదగినవి. ఈ దేవాలయం 11వ శతాబ్దానికి చెందినది. ఈ దేవాలయానికి అనేక ప్రాంతాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు. ముఖ్యంగా నవరాత్రి, కుంభమేళా సందర్భంలో ఎక్కవ మంది సందర్శిస్తూ ఉంటారు.

చండీ దేవి దేవాలయం.

చండీ దేవి దేవాలయం.

P.C: You Tube

చండీదేవి ఆలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ జిల్లాలో హరిద్వార్ నగరంలో ఉంది. ఈ దేవాలయం హిమాలయాల దక్షిణ ప్రాంతంలోని శివాలిక్ పర్వతాల్లోని నీల పర్వతం పై కొలువుంది. ఈ దేవాలయన్ని 1929లో కాశ్మీర్ రాజు అయినా సుచాన్ సింగ్ చేత నిర్మించబడింది.

ఆదిశంకరాచార్యులు

ఆదిశంకరాచార్యులు

P.C: You Tube

అయినప్పటికీ ఈ ఆలయంలో ప్రధాన దైవమైన చండీదేవి విగ్రహాన్ని ఆదిశంకరాచార్యులు ప్రతిష్టించారన్న వాదన కూడా వినిపిస్తోంది. ఈ దేవాలయం హర్ కీ పౌరికి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ దేవాలయానికి చేరుకొనుటకు చండీఘాట్ నుంచి మూడు కిలోమీటర్ల రోప్ వే మార్గం కూడా ఉంది.

మానసా దేవి దేవాలయం

మానసా దేవి దేవాలయం

P.C: You Tube

హరిద్వార్ లోని మూడు సిద్ధపీఠాల పైకి మానస దేవి దేవాలయం కూడా ఒకటి. ఇక్కడ మానసా దేవిని అదిపరాశక్తి రూపంగా భావించి కొలుస్తారు. మరోవైపు శివుడి మనస్సు నుంచి జన్మించినందువల్ల ఈమెను మానసా దేవిగా భావిస్తారన్న వాదన కూడా వినిపిస్తోంది.

శివాలిక్ పర్వత శ్రేణి

శివాలిక్ పర్వత శ్రేణి

P.C: You Tube

హరిద్వార్ లోని శివాలిక్ పర్వత శ్రేణి బిల్వ పర్వత పై భాగంలో ఈ మానసా దేవి దేవాలయం ఉంది. దీనిని బిల్వతీర్థం అని కూడా పిలుస్తారు. ఇంది పంచతీర్థాల్లో ఒకటి. చండి దేవాలయానికి దగ్గర్లోనే ఈ దేవాలయం ఉంది.

నైనా దేవి దేవాలయం

నైనా దేవి దేవాలయం

P.C: You Tube

ఉత్తరాఖండ్ లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన నైనిటాల్ లో ఈ నైనా దేవి దేవాలయం ఉంది. సతీదేవి కళ్లు పడిన ప్రాంతమే నైనా దేవి దేవాలయం నిర్మించారని చెబుతారు. అంతేకాకుండా మహిషాసురుడనే రాక్షసుడిని నైనాదేవి ఈ ప్రాంతంలోనే సంహరించినందువల్ల నైనా దేవి దేవాలయం మహిష పీఠంగా పిలువబడుతోంది.

మహిషాసురుడనే రాక్షసుడిని

మహిషాసురుడనే రాక్షసుడిని

P.C: You Tube

యుద్ధం సమయంలో ఆ మహిషాసురుడనే రాక్షసుడిని నైనా దేవి ఓడించి ఆయన కళ్లను తొలగిస్తుంది. దీంతో ఈ చర్యలకు దేవతలు సంతోషించి వారు జై నైనా అని నినదిస్తారు. అందువల్ల ఈ దేవాలయాన్ని నైనా దేవిగా పేర్కొంటారు.

సుర్కాంద దేవి దేవాలయం

సుర్కాంద దేవి దేవాలయం

P.C: You Tube

ఉత్తరాఖండ్ లోని తెహ్రీ జిల్లాలోని ధనౌల్తి అనే చిన్న గ్రామంలో ఈ సుర్కాంద దేవి దేవాలయం ఉంది. ఇది కూడా శక్తిపీఠాల్లో ఒకటి. సతీ దేవి తల పడిన ప్రాంతమే సుర్కాంద దేవి దేవాలయం అని చెబుతారు. సముద్ర మట్టం నుంచి దాదాపు 3,030 మీటర్ల ఎత్తులో ఈ దేవాలయం ఉంటుంది.

మూడు కిలోమీటర్ల నడక

మూడు కిలోమీటర్ల నడక

P.C: You Tube

చంబా నుంచి దాదాపు 3 కిలోమీటర్ల దూరం నడిస్తేనే మనం ఈ దేవాలయన్ని చేరుకోగలం. ఇక్కడ మే-జూన్ మధ్య గంగా దసరా ఉత్సవం కన్నుల పండువగా జరుగుతుంది. ఈ ఉత్సవంలో పాల్గొనడానికి దేశనలుమూలల నుంచి ఇక్కడకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు.

మహాసు మహా దేవాలయ

మహాసు మహా దేవాలయ

P.C: You Tube

ఉత్తరాఖండ్ లోని డెహ్రడూన్ జిల్లాలో హనోల్ అనే చోట ఈ అందమైన దేవాలయం ఉంది. తమసా నది ఒడ్డున ఈ దేవాలయం ఉంది. స్థానికులు తమ సమస్యల పరిష్కారం కోసం మహాసు మహా దేవాలయానికి వస్తారు. ఇద్దరు ఫిర్యాదు దారులకు ఇక్కడ ఉన్న తమసా నది నీళ్లను తాగమని చెబుతారు.

తప్పు చేసినవారికి

తప్పు చేసినవారికి

P.C: You Tube

ఎవరైతే తప్పు చేసి ఉంటారో వారికి వెంటనే వాంతులు అవుతాయని చెబుతారు. ఈ ఆచారం ఇక్కడ అనాదిగా వస్తోంది. కేవలం స్థానికులే కాకుండా చుట్టు పక్కల ఉన్న గ్రామాల నుంచి కూడా ఇక్కడకు పెద్ద సంఖ్యలో నిత్యం భక్తులు వస్తుంటారు.

దక్షేశ్వర మహాదేవ దేవాలయం

దక్షేశ్వర మహాదేవ దేవాలయం

P.C: You Tube

హరిద్వార నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో కంఖాల్ అనే ప్రదేశంలో దక్షేశ్వర దేవాలయం ఉంది. ఇక్కడ శివుడిని ప్రధాన దైవంగా పూజిస్తారు. దక్షయాగం భస్మీపటలం చేసే సమయంలో దక్షుడి తల పడిన ప్రదేశంలో ప్రస్తుతం శివలింగం ఉంది.

 కోరిన కోర్కెలు తీరుతాయి.

కోరిన కోర్కెలు తీరుతాయి.

P.C: You Tube

ఇక్కడి శివుడిని దక్షేశ్వర మహాదేవ అని పిలుస్తారు. ఇక్కడికి వస్తే కోరిన కోర్కెలు మొత్తం తీరుతాయని చెబుతారు. అందువల్ల శివరాత్రి పర్వదినంతో పాటు శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన శ్రావణ మాసంలో కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు.

నౌకుచియాతల్ హనుమాన్ దేవాలయం

నౌకుచియాతల్ హనుమాన్ దేవాలయం

P.C: You Tube

నైనితాల్ జిల్లాల్లోని తొమ్మిది కోణాలు కలిగిన చిన్న సరస్సు పేరే నౌకుచియాతల్ సరస్సు. ఈ సరస్సు 175 అడుగుల లోతు ఉంటుంది. సముద్ర మట్టం నుంచి 1,220 మీటర్ల ఎత్తలో ఉంటుంది. ఈ సరస్సు పొడవు 983 మీటర్లు కాగా, వెడల్పు 693 మీటర్లు ఉంటుంది.

 బ్రహ్మ, హనుమాన్ దేవాలయం

బ్రహ్మ, హనుమాన్ దేవాలయం

P.C: You Tube

ఇక్కడ చిన్న బ్రహ్మ దేవాలయం కూడా ఉంది. ముఖ్యంగా అత్యంత ఎత్తైన హనుమాన్ దేవాలయం కూడా పర్యాటకులను పెద్ద సంఖ్యలో ఆకర్షిస్తోంది. ప్రతి ఏడాది జరిగే ఉత్సవానికి దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తారు.

గోలు దేవతా

గోలు దేవతా

P.C: You Tube

ఉత్తరాఖండ్ లోని చాలా కుటుంబాలకు గోలు దేవత కులదైవం. ఈ దేవతను భక్తితో పూజిస్తే అనుకొన్న కోర్కెలన్నీ తొలిగిపోతాయని చెబుతారు. గోలుదేవత శివుడి స్వరూపంగా భావిస్తారు. స్థానిక జానపధ కథనం ప్రకారం ఓ రాజుకు, ఓ సాధారణ స్త్రీ కి జన్మించిన పుత్రుడిని ఆ రాజు భార్యలైన రాణులు గంగానదిలో వదిలేస్తారు.

ప్రజారంజకంగా

ప్రజారంజకంగా

P.C: You Tube

బెస్తవాళ్లకు దొరికిన ఈ బాలుడు అటు పై ఆ రాజ్యానికి రాజై ప్రజారంజకంగా పాలిస్తాడు. గొప్ప శివభక్తుడైన అతడు చివరికి శివుడిలో ఐక్యమై పోతాడు. దీంతో ప్రజలు ఈ గోలును శివుడి అంశగా భావించి గుళ్లను కట్టి పూజించడం మొదలుపెడుతారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X