Search
  • Follow NativePlanet
Share
» »అరుదైన పుస్త‌కాల‌ను అన్వేషిస్తూ.. ఇష్ట‌మైన రుచుల‌ను ఆస్వాదించండి!

అరుదైన పుస్త‌కాల‌ను అన్వేషిస్తూ.. ఇష్ట‌మైన రుచుల‌ను ఆస్వాదించండి!

అరుదైన పుస్త‌కాల‌ను అన్వేషిస్తూ.. ఇష్ట‌మైన రుచుల‌ను ఆస్వాదించండి!

పుస్తకాలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కొంతమందైతే ఏకంగా రోజుల తరబడి పుస్తకాలను తిరగేస్తుంటారు. చాలామంది పుస్తకాల పురుగులుగా మారుతుంటారు కూడానూ. అలా వారికి ఇష్టమైన పుస్తకాలను వెతకడం చాలా కష్టమవుతుంది. అలాంటివారికి ఆర్డర్ వేయగానే కావాల్సిన పుస్తకం వారి ముందు ప్రత్యక్షమయ్యేలా ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది.

అలాంటి బుక్స్ కేఫ్‌ల‌ గురించే మనమిప్పుడు ప్రస్తావించుకుంటున్నాం. భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో బుక్ మెన్యూలో బుక్స్ ఆర్డర్ చేయగానే మన ముందు ఉంటాయి. బుక్స్‌తో పాటు అక్కడి రుచులను కూడా ఆస్వాదించవచ్చు. మరెందుకు ఆలస్యం పదండి చ‌క్క‌ని పుస్త‌క ప్ర‌పంచంలో మ‌న‌సుకున‌చ్చే రుచుల‌ను ఆస్వాదించేందుకు..!

సికింద్రాబాద్, కాఫీ కేఫ్

సికింద్రాబాద్, కాఫీ కేఫ్

సికింద్రాబాద్‌లోని కెఫె కాఫీ టేబుల్ బుక్స్ లైబ్రరీ. ఈ కెఫేలో బుక్స్ చదవడం మాత్రమే కాకుండా వాటిని కొనుక్కోవచ్చు కూడా. ఇక్కడి టేస్టి కాఫీ ఆస్వాదించడమే కాదు, ఎంతసేపైనా కూర్చొని బుక్స్ చదువుకోవచ్చు. అంతేకాదు, స్నేహితుల‌తోక‌లిసి స‌ర‌దాగా రౌండ్ టేబుల్‌పై కూర్చొని చ‌ర్చ‌లు కూడా పెట్టుకోవ‌చ్చు. మ‌రెందుకు ఆల‌స్యం ఒక్క‌సారి ఇక్క‌డి కాఫీ రుచిచూసి, మీకు న‌చ్చిన పుస్త‌కాన్ని తిర‌గేసేందుకు సిద్ధ‌మ‌వ్వండి.

కోల్‌క‌తా, కెఫె స్టోర్‌

కోల్‌క‌తా, కెఫె స్టోర్‌

సంస్కృతి మ‌రియు సాహిత్యానికి ప‌ర్యాయ‌ప‌దంగా చెప్పుకోబ‌డుతోంది కోల్‌క‌తా. ఎవరైనా పుస్తకాల పుస్త‌కాల పురుగుల‌కు ఈ కెఫే బాగా సూటవుతుందట! ఈ అందమైన కెఫేలోని రెండో అంతస్తు పుస్తకాలతో నిండి ఉంటుంది. దీంతోపాటు ఇక్కడ ఇటాలియన్ ఆఫ్ కాంటినెంటల్ ఫుడ్‌తోపాటు పాటు ఫ్రీ వైఫై కూడా అందుబాటులో ఉంటుంది. మ‌రీ ముఖ్యంగా ఇక్క‌డి కుకీలు, ఐస్ క్రీమ్ టేస్ట్ చూడ‌కుండా ఎవ్వ‌రూ వెళ్ల‌రు.

గుర్గావ్, కెఫె వండల్ల‌స్ట్

గుర్గావ్, కెఫె వండల్ల‌స్ట్

గుర్గావ్ లోని ట్రావెల్ కెఫె వండల్ల‌స్ట్‌లో ట్రావెల్ బుక్స్ అన్నీ ఇక్కడ అందుబాటులో ఉంటాయి. మ్యాగజైన్స్ లభిస్తాయి. పుస్తకాలతో పాటు రుచికరమైన భోజనం కూడా ఉంటుంది. న‌దుల్లోని గుల‌క‌రాళ్లు, హాయిగా ఊగిస‌లాడే ఊయ‌ల‌తో అలంక‌రించ‌బ‌డిన ఈ కేఫ్ నిజంగా ప్ర‌శంశ‌నీయం. సెల్ఫ్‌స‌ర్వీస్ కార‌ణంగా మీరే మీకు కావాల్సిన ఫుడ్‌ను క‌ల‌క్ట్ చేసుకుని ఆనందించ‌వ‌చ్చు.

ప‌గ్దండి బుక్‌స్టోర్ కేఫ్‌, పుణే

ప‌గ్దండి బుక్‌స్టోర్ కేఫ్‌, పుణే

ఒకవేళ ట్రావెలింగ్ కోసం పుణె వెళ్తుంటే మాత్రం ఫుణెలోని ప‌గ్దండి బుక్‌స్టోర్ కేఫ్‌ను తప్పకుండా వీక్షించాల్సిందే. ప్రముఖ రచయితల పుస్తకాలెన్నో ఇక్కడ లభిస్తాయి. మిమ్మ‌ల‌ని మీరు సాహిత్య లోకానికి ప‌రిచ‌యం చేసుకునేందుకు ఈ కేఫ్ స‌రికొత్త వేదిక‌. వాటితో పాటు మనకు నచ్చిన, మెచ్చిన వంటకాలూ ఉంటాయి. ఇక్క‌డి కాఫీతోపాటు కుకీస్ చాక్‌లెట్స్‌, వెజ్ రోల్స్ మ‌న‌సారా రుచి చూసేందుకు అవ‌కాశం ఉంది.

ది ఫ్ల‌యింగ్ గోట్‌, గోవా

ది ఫ్ల‌యింగ్ గోట్‌, గోవా

నార్త్ గోవాలోని అంజునాలో ఈ రిలాక్స్ స్పేస్ బుక్ కేప్ మ‌రియు బార్‌ను త‌ప్ప‌క సంద‌ర్శించండి. బుక్స్ కెఫేలో కొత్త, పాత పుస్తకాలన్నీ లభిస్తాయి. ఇక్క‌స సుమారు ఐదు వేల‌కు పైగా సాహిత్య ర‌చ‌న‌లు అందుబాటులో ఉంటాయి. అంతేకాదు, ఆర్ట్ ఈవెంట్‌ల‌ను నిర్వ‌హించేందుకు వీరికి ప్ర‌త్యేక ఓపెన్ పోడియం కూడా ఉంది. ఈ కేఫ్‌లో ఫిష్ మీట్ బాల్స్ రుచిని ఆస్వాదించ‌కుండా బ‌య‌ట‌కు అడుగుపెట్టేవారు ఉండ‌రంటే న‌మ్మండి.

Read more about: best books cafes secunderabad
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X