Search
  • Follow NativePlanet
Share
» »పార్వతికి పరమేశ్వరుడు సృష్టి రహస్యం చెప్పింది ఈ పుణ్యక్షేత్రంలోనే...

పార్వతికి పరమేశ్వరుడు సృష్టి రహస్యం చెప్పింది ఈ పుణ్యక్షేత్రంలోనే...

ఆధునిక సాంకేతికత ఎంత అందుబాటులోకి వచ్చినా సష్టి రహస్యాన్ని ఇప్పటికీ తెలుసుకోలేక పోతున్నాం. అటు వంటి సష్టి రహస్యాన్ని లయకారకుడైన పరమశివుడు తన అర్థాంగి అయిన పర్వాతీ దేవికి తెలిపిన ప్రాంతం ఓ పరమ పవిత్ర

By Beldaru Sajjendrakishore

ఆధునిక సాంకేతికత ఎంత అందుబాటులోకి వచ్చినా సృష్టి రహస్యాన్ని ఇప్పటికీ తెలుసుకోలేక పోతున్నాం. అటు వంటి సష్టి రహస్యాన్ని లయకారకుడైన పరమశివుడు తన అర్థాంగి అయిన పర్వాతీ దేవికి తెలిపిన ప్రాంతం ఓ పరమ పవిత్ర పుణ్యక్షేత్రంగా విరాజిల్లు తోంది. అంతే కాదు ఆ సమయంలో సదరు రహస్యాన్ని విన్న పావురాలు ఇప్పటికీ అదే చోట జీవించి ఉన్నాయని భక్తులు విశ్వసిస్తున్నారు. హిమాలయ పర్వతాల్లో ఉన్న ఆ పరమ పవిత్రమైన క్షేత్రమే అమర్ నాథ్ గుహాలయం. జీవితంలో ఒక్కసారైనా ఈ హిమలింగాన్ని దర్శించుకోవాలని పరితపిస్తారు. భోళాశంకరుడిని దర్శనానికి దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. అయితే ఈ పుణ్యక్షేత్రం దర్శనం వేసవి కాలంలోనే వీలవుతుంది. ఇందు కోసం ముందస్తు అనుమతి తప్పనిసరి. 2018 ఏడాదికి సంబంధించి ఈ యాత్ర జూన్ 28న ప్రారభమవుతుంది. అయితే అందుకు ఇప్పటి నుంచి ముందస్తు ప్రణాలిక అవసరం. ఈ నేపథ్యంలో పుణ్యక్షేత్ర విశిష్టతతో పాటు ఆనుమతులు ఎలా తీసుకోవాలి, యాత్ర సాగే తీరు తెన్నులు నేటివ్ ప్లానెట్ పాఠకుల కోసం...

1. ఇప్పటికీ ఆ పావురాలే...

1. ఇప్పటికీ ఆ పావురాలే...

Image source

పురాణాల ప్రాకారం లయకారుడైన పరమశివుడు తన భార్య పార్వతిదేవికి సృష్టి రహసాన్నిఅమర్నాథ్ గుహలోనే చెప్పాడని తెలుస్తోంది. ఈ రహస్యాన్ని ఎవరూ వినడకూడదని నందీశ్వరుడిని పహల్గామ్ లో, నెలవంకను చందన్వాడీలో, వాసుకిని శేష్ నాగ్ దగ్గర, వినాయకుడిని మహానగణేశ పర్వతం వద్ద, పంచభూతాలను పంచతరణి సమీపంలో వదిలిపెట్టాడట. అటు పై పార్వతీదేవికి మాత్రమే స`ష్టి రహస్యాన్ని పరమ శివుడు తెలిపాడు. అయితే ఆ సమయంలో గుహలో ఉన్న పావురాల జంట విన్నది. అమర రహస్యాన్ని విన్న ఆ పావురాలు మ`త్యురాహిత్యాన్ని పొందాయని అవే పావురాలు ఇప్పటికీ అమర్ నాథ్ గుహాలయంలో కనిపిస్తున్నాయని స్థానికులు కూడా చెబుతుంటారు.

2. అమర్ నాథ్ యాత్ర అనుమతి కోసం. ..

2. అమర్ నాథ్ యాత్ర అనుమతి కోసం. ..

Image source

యాత్ర నోటిఫికేషన్ ఇప్పటికే అమర్నాథ్ బోర్డ్ జారీ చేసింది. ముందస్తు అనుమతి తీసుకున్న వారికి మాత్రమే అమర్ నాథ్ యాత్రకు అనుమతిస్తారు. అధికారిక వెబ్ సైట్ http://www.shriamarnathjishrine.com/ నుంచి నుంచి ఫామ్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. వివరాలను నమోదు చేసి ధ`వీకరణ పత్రాలు జత చేయాలి. అటు పై వెబ్ సైట్లో పేర్కొన్న బ్యాంకుల్లో రూ.50 రుసుము చెల్లించి యాత్ర చేయాల్సిన తేదీలను నమోదు చేయించుకోవాలి. మొదటి సారి అమర్ నాథ్ యాత్ర చేసే వారు ఆయా రాష్ట్రాల పర్యాటక శాఖ కార్యాలయాన్ని కాని లేదా ప్రైవేటు టూర్ ట్రావెల్స్ సంస్థలను కాని సంప్రదించడం ఉత్తమం.

3. మొదట శ్రీనగర్ కు...

3. మొదట శ్రీనగర్ కు...

Image source

అనుమతి లభించినత తర్వాత మొదట శ్రీనగర్ కు చేరుకోవాలి. దేశంలోని వివిధ ప్రాంతల నుంచి ఢిల్లీకు నేరుగా విమానయాన సేవలు అందుబాటులో ఉన్నాయి. బడ్జ్ ట్ తో పాటు మిగిలిన పుణ్యక్షేత్రాలను కూడా చూసి రావాలనుకునే వారు రైళ్లు మార్గాన్ని ఎంచుకోవచ్చు. ఇక ఢిల్లీ నుంచి శ్రీనగర్ కు ట్యాక్సీల్లో వెళ్లవచ్చు. ప్రక`తి అందాలను చూస్తూ లోయలు, గుహల నుంచి వెళ్లడం మనసుకు ఆహ్లాదం కలిగిస్తుందనడంలో సందేహం లేదు.

4. రెండు మార్గాల్లో మొదటిది...

4. రెండు మార్గాల్లో మొదటిది...

Image source

శ్రీనగర్ కు చేరుకున్నతర్వాత అక్కడి నుంచి రెండు మార్గల్లో బేస్ క్యాంప్ లకు చేరుకోవచ్చు. అందులో మొదటిది బాల్టాల్ బేస్ క్యాంప్. శ్రీనగర్ నుంచి ఈ బేస్ క్యాంప్ 95 కిలోమీటర్లు. శ్రీనగర్ నుంచి బస్సలు ట్యాక్సీల ద్వార ఈ బేస్ క్యాంప్ చేరుకోవచ్చు.

5. పలహల్గామ్ కు

5. పలహల్గామ్ కు

Image source

శ్రీనగర్ నుంచి రెండో మార్గమైన పలహల్గామ్ బేస్ క్యాంప్. శ్రీనగర్ నుంచి ఇక్కడికి 91 కిలోమీటర్లు. ఇక్కడికి కూడా రోడ్డు మార్గం ద్వారం ప్రక`తి అందాలను చూస్తూ ప్రయాణం కొనసాగించవచ్చు.

భద్రతా సిబ్బంది తనిఖీలను నిర్వహించన తర్వాతనే బస్ క్యాంపుల్లోకి అనుమతిస్తారు. అందువల్ల అన్ని వ్యక్తి గత ధ`వీకరణ పత్రాలు మనం ఎప్పుడూ దగ్గర ఉంచుకోవాలి.

6. బేస్ క్యాంపుల నుంచి నడక లేక డోలిలే...

6. బేస్ క్యాంపుల నుంచి నడక లేక డోలిలే...

Image source

బేస్ క్యాంపుల నుంచి అమర్ నాథ్ గుహకు నడక ద్వారా చేరుకోవచ్చు. నడవ లేని వారకి డోలిలు, గుర్రాలు అందుబాటులో ఉంటాయి తప్పిస్తే ఎటువంటి వాహనాలు ఈ మార్గంలో ప్రయాణం చేయలేవు. ఇక బేల్టాల్ బేస్ క్యాంప్ నుంచి అమర్నాథ్ గుహను చేరుకోవడానికి 16 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉండగా పలహల్గామ్ బేస్ క్యాంప్ నుంచి ఈ దూరం 45 కిలోమీటర్లు. ఈ మార్గం నుంచి వెళ్లే వారు అమర్నాథ్ గుహాలయం చుట్టు పక్కల ఉన్న మరొకొన్ని దర్శనీయ స్థాలను కూడా చూడవచ్చు.

7. దర్శనీయ ప్రదేశాలు ఇవే....

7. దర్శనీయ ప్రదేశాలు ఇవే....

Image source

పహల్గామ్ నుంచి బేస్ క్యాంప్ ద్వార వెళ్లే వారు పంచతరణిని మొదట చూడవచ్చ. ఇక్కడే శివుడు స`ష్టి రహస్యం చెప్పే ముందు పంచభూతాలను వదిలి పెట్టాడని చెబుతారు. అటు పై 11 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే శేష్ నాగ్ వస్తుంది. ఇక్కడి నీలిరంగు సరస్సులోనే పరమేశ్వరుడి ఆభరణమైన వాసుకి నిద్రిస్తోందని స్థానికుల కథనం. ఇక్కడి నుంచి అమర్ నాథ్ గుహకు 18 కిలోమీటర్లు.

8. హెలీక్యాప్టర్ సదుపాయం కూడా...

8. హెలీక్యాప్టర్ సదుపాయం కూడా...

Image source

బేస్ క్యాంపుల నుంచి అమర్ నాథ్ గుహ చేరుకోవడానికి హెలీక్యాప్టర్ సదుపాయం కూడా ఉంది. ధర రూ.2000 నుంచి రూ.3000 మధ్య ఉంటుంది. మంచు కురుస్తున్న వేళ మేఘాలలో తేలిపోవడం సరికొత్త అనుభూతిని ఇస్తుందనడంలో సందేహం లేదు.

9. ఆరుగంటల వరకే అనుమతి...

9. ఆరుగంటల వరకే అనుమతి...

Image source

వేర్వేరు మార్గాల ద్వార అమర్నాథ్ గుహాలయం చేరుకున్న వారు కిలోమీటరు దూరంలో ఉన్న గుడారాల్లో సెల్ ఫోన్ లు, బ్యాగులను, పాదరక్షలను వదిలి వేయాల్సి ఉంటుంది. అటు పై కిలోమీటరు మెట్ల పై నడిస్తే దవళ కాంతుల్లో మెరిసిపోయే శివలింగం దర్శనమవుతుంది. సాయంత్రం ఆరు గంటల తర్వాత భక్తులను ఆలయంలోకి అనుమతించరు.

10. వాతావరణం అనుకూలించకపోతే...

10. వాతావరణం అనుకూలించకపోతే...

Image source

పరమేశ్వరుడిని దర్శించుకున్న తర్వాత వచ్చిన మార్గాల్లోనే లేదా వేర్వేరు మార్గాల్లో భక్తులు వెనుతిరుగుతారు. ఒక వేళ వాతావరణం అనుకూలించకపోతే ఆ రోజు రాత్రికి అక్కడే ఉన్న గుడారాల్లో విశ్రాంతి తీసుకుని మరుసటి రోజు తిరుగు ప్రయాణం అవుతారు.

 11. వీరికి ప్రవేశం లేదు...

11. వీరికి ప్రవేశం లేదు...

Image source

13 ఏళ్లలోపు పిల్లలకు, 75 ఏళ్లు పైబడిన వారికి, ఆరునెలలు నిండిన గర్భవతులకు యాత్రకు అనుమతించరు. అదే విధంగా దీర్ఘకాలిక శ్వాసకోస సంబంధమైన వ్యాధులతో బాధపడే వారు కూడా ఈ యాత్ర నుంచి దూరంగా ఉంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

 12. పోస్ట్ పెయిడ్ ఖచ్చితం...

12. పోస్ట్ పెయిడ్ ఖచ్చితం...

Image source

జమ్ము కాశ్మీర్ లో ప్రీపెయిడ్ కార్డ్ లు పనిచేయవు. పోస్ట్ పెయిడ్ కార్డులు ఖచ్చితంగా ఉండాల్సిందే. బేస్ క్యాంప్ వద్ద వ్యక్తిగత ధ`వీకరణ పత్రం చూపించి పోస్ట్ పెయిడ్ సిమ్ కార్డులను పొందవచ్చు. బీఎస్ఎన్ఎల్ సంస్థ ఈ సేవలను అందిస్తోంది.

13. మరింత సమాచారం కోసం...

13. మరింత సమాచారం కోసం...

Image source

Shri Amarnathji Shrine Board
అమర్నాథ్ ఫ్లోర్, బ్లాక్ 3, ఇంజనీరింగ్ కంప్లెక్స్
రాజ్ భాగ్, శ్రీనగర్
పిన్ కోడ్ 190008
91-194-2313146, 2313147, 2313148
[email protected]
మే నుంచి అక్టోబర్ వరకూ...
Phone No. : +91-194-2313146, 2313147, 2313148, 2313149
Tele Fax : +91-194-2501679
Email :[email protected]
నవంబర్ నుంచి ఏప్రిల్ వరకూ...
November to April
Phone No. : +91-191-2555662, 2503399
Tele Fax : 0191-2503399
Email : [email protected]

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X