Search
  • Follow NativePlanet
Share
» »తిరుపతిలో ఉన్న ఒకే ఒక శివాలయం ఇది !

తిరుపతిలో ఉన్న ఒకే ఒక శివాలయం ఇది !

ప్రపంచ ప్రసిద్దిగాంచిన పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి. ఇక్కడ శ్రీవారి ఆలయంతోపాటు గోవిందరాజస్వామి, కోదండరామస్వామివారి ఆలయాలున్నాయి. గొప్ప వైష్ణవ క్షేత్రమైన తిరుపతిలో ఓ శైవక్షేత్రం కూడా ఉంది.

By Venkatakarunasri

ప్రపంచ ప్రసిద్దిగాంచిన పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి. ఇక్కడ శ్రీవారి ఆలయంతోపాటు గోవిందరాజస్వామి, కోదండరామస్వామివారి ఆలయాలున్నాయి. గొప్ప వైష్ణవ క్షేత్రమైన తిరుపతిలో ఓ శైవక్షేత్రం కూడా ఉంది. అదే కపిలతీర్థం. తిరుపతికి ఉత్తరంగా, తిరుపతి కొండలకు ఆనుకుని అలిపిరి దిగువకు వెళ్తే మనోహరమైన ఈ తీర్థం కనిపిస్తుంది. ముఖ్యంగా, వర్షాకాలంలో ఇక్కడకు వస్తే... ప్రకృతి సుందర జలపాత దృశ్యాలు చూపుతిప్పనివ్వవు. ఇక్కడి ప్రశాంత వాతావరణం... అడుగుతీసి అడుగు వేయనివ్వదు.

తిరుమల అంటే శ్రీవారే. అణువణువూ వేంకటేశ్వరుడే. తమిళంలో తిరు అంటే శ్రీ అనీ, మల అంటే శైలం (కొండ) అనీ కూడా అర్థం. అంటే తిరుమల... శ్రీశైలమన్నమాట. శివకేశవులకు భేదం లేదు కదా... అలాంటప్పుడు తిరుపతిలో శివాలయం ఉండటంలో ఆశ్చర్యమేముంది! అలా తిరుపతిలో వెలసిన పవిత్ర తీర్థరాజమే కపిలతీర్థం.

తిరుపతిలో ఉన్న ఒకే ఒక శివాలయం ఇది !

తిరుపతిలో ఉన్న ఒకే ఒక శివాలయం ఇది !

ఏడుకొండలకు వెళ్ళే దారి

శేషాద్రికొండ దిగువన, ఏడుకొండలకు వెళ్ళే దారిలో ఉంది. కపిల తీర్ధమునకు చక్రతీర్థం లేదా ఆళ్వార్ తీర్థం అని కూడా పిలుస్తారు. కృతయుగములో పాతాళలోకంలో కపిలమహర్షి పూజించిన కపిలేశ్వరస్వామి, ఏవో కారణాలవల్ల, భూమని చిల్చుకొని, ఇక్కడ వెలిసినట్లుగా చెప్తారు. అందులో ఇది 'కపిలలింగం' గా పేరొందింది.

చిత్రకృప : Bhaskaranaidu

ముల్లోకాలూ

ముల్లోకాలూ

త్రేతాయుగములో అగ్ని పూజించిన కారణంగా 'ఆగ్నేయలింగం' అయి, ఇప్పుడు కలియుగంలో కపిల గోవు పూజలందుకుంటోంది. ముల్లోకాలలోని సకల తీర్థాలూ ముక్కోటి పౌర్ణమి నాడు మధ్యాహ్నం వేళ పది ఘటికల (నాలుగు గంటల) పాటు కపిలతీర్థంలో నిలుస్తాయని ప్రతీతి.

చిత్రకృప : Bhaskaranaidu

మేరు పర్వతం

మేరు పర్వతం

ఆ సమయంలో అక్కడ స్నానం చేసి, నువ్వు గింజంత బంగారాన్ని దానం చేసినా, అది మేరుపర్వత సమాన దానంగా పరిగణింపబడుతుందని భక్తుల విశ్వాసం.

చిత్రకృప : Bhaskaranaidu

కార్తీకమాసం

కార్తీకమాసం

కార్తిక మాసం నందు వచ్చు కార్తిక దీప పర్వ దినాన ఇక్కడ కొండ పైన దీపం సాక్షాత్కరిస్తుంది. భక్తులందరు కపిలతీర్థం వైపు దీప నమస్కారం చేస్తారు. ఈ ఆలయం తి.తి.దే. వారి ఆద్వర్యంలో పని చేస్తుంది, శివరాత్రి పండుగ మరియు బ్రహ్మొత్సవాలు వైభవంగా జరుగుతాయి.

చిత్రకృప : Bhaskaranaidu

చోళులు నిర్మించారు

చోళులు నిర్మించారు

11వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన మొదటి రాజేంద్రచోళుని కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగిందని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. చోళులు శివభక్తులు కావడంతో దీన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్మించారు. ఆహ్లాదకరమైన కపిల తీర్థాన్ని చోళులు అభివృద్ధి చేస్తే... అచ్యుతదేవరాయల హయాంలో వైష్ణవులు దీన్ని ఆళ్వారుతీర్థంగా మార్చారు.

చిత్రకృప : Bhaskaranaidu

ఆళ్వారు గుడి

ఆళ్వారు గుడి

ఈ ఆలయానికి ముందు ఒక పాడుబడ్డ గుడి ఉంటుంది. అది నమ్మాళ్వార్‌ అనే ఆళ్వారు గుడి అని చెబుతారు. 12వ శతాబ్దం నుంచీ 18వ శతాబ్దం వరకూ దీన్ని ఆళ్వారు తీర్థంగానే వ్యవహరించారు.

చిత్రకృప : Bhaskaranaidu

చుట్టూ విగ్రహాలు

చుట్టూ విగ్రహాలు

పదహారో శతాబ్దంలో విజయనగరం నుంచి వచ్చిన సెవ్వుసాని అనే దేవదాసి ఈ ఆలయానికి ఎంతో సేవ చేసిందట. ఆలయంలోని వినాయకుణ్ణి ఆవిడే ప్రతిష్ఠించిందట. కపిలతీర్థంలో కపిలేశ్వర స్వామితోపాటు కాశీవిశ్వేశ్వరుడు, సహస్రలింగేశ్వరుడు, లక్ష్మీనారాయణుడు, శ్రీకృష్ణుడు, అగస్త్యేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు కూడా ఉన్నారు.

చిత్రకృప : Agasthyathepirate

రాతిమెట్లు

రాతిమెట్లు

విజయనగర చక్రవర్తి, అచ్యుత రాయలు ఈ తీర్ధము చుట్టూ రాతి మెట్లు, మంటపము నిర్మించాడు. 1830ల నాటికి ఈ ప్రాంతం చుట్టూ విశాలమైన మంటపం ఉండేదని చాలా రమ్యమైన ప్రదేశమని యాత్రికుడు, యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య వ్రాశారు.

చిత్రకృప : Venugopal

విశాల మంటపం

విశాల మంటపం

బ్రాహ్మణ సమారాధనకు ఇక్కడ కట్టియున్న విశాలమైన మంటపం అనుకూలంగా ఉండేదని, ఆ చుట్టుపక్క స్థలాల్లో హైదరాబాద్ రాజ్య పేష్కారు చందులాలా ఏర్పాటుచేసిన దానధర్మాలు బాగా జరిగేవని ఆయన వ్రాశారు.

చిత్రకృప : Bhaskaranaidu

ఆకాశ గంగ

ఆకాశ గంగ

ఇక్కడ కపిలేశ్వరుడు కామాక్షీదేవి సమేతంగా కొలువయ్యాడు. ఈ ఆలయానికి ఉన్నత శిఖరమా అనిపించేలా ఉంటాయి తిరుమల కొండలు. ఆ కొండలమీది నుంచి గలగలా పారుతూ, 20 అడుగుల ఎత్తునుంచి ఆలయ పుష్కరిణిలోకి దూకుతుంది ఆకాశగంగ. ఈ పుష్కరిణినే కపిలతీర్థం అంటారు.

చిత్రకృప : Agasthyathepirate

సుదర్శన రాతిశిలలు

సుదర్శన రాతిశిలలు

ఈ తీర్థాన్ని శైవులు కపిల తీర్థమనీ, వైష్ణవులు ఆళ్వార్‌ తీర్థమనీ పిలుస్తారు. వైష్ణవులు కోనేటి చుట్టూ నాలుగు మూలల్లోనూ నాలుగు సుదర్శన రాతిశిలలను స్థాపించారట. రాతిమెట్లు, సంధ్యావందన దీపాలనూ ఏర్పాటుచేశారు. అందుకే, అప్పట్నుంచీ దీన్ని చక్రతీర్థమని పిలిచేవారు వైష్ణవులు.

చిత్రకృప : Adityamadhav83

కపిలతీర్థం ఎలా చేరుకోవాలి ?

కపిలతీర్థం ఎలా చేరుకోవాలి ?

తిరుపతి బస్ స్టాండ్ నుండి 3.3 కిలోమీటర్ల దూరంలో ఉన్న కపిలతీర్థానికి టిటిడి బస్సులు తిరుగుతుంటాయి. ఇందులో ఉచితంగా ప్రయాణించవచ్చు. కపిలతీర్థానికి రైల్వే స్టేషన్ 4 కిలోమీటర్ల అదూరంలో కలదు. ఇక్కడి నుండి కూడా టిటిడి బస్సులలో ఉచితంగా ప్రయాణించవచ్చు లేదా ప్రవేట్ సదుపాయాలనూ ఆశ్రయించవచ్చు.

చిత్రకృప : Agasthyathepirate

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X