Search
  • Follow NativePlanet
Share
» »సుఖ ప్రసవం కోసం విదేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ప్రార్థిస్తారు.

సుఖ ప్రసవం కోసం విదేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ప్రార్థిస్తారు.

బిడ్డకు జన్మనివ్వడం అంటే మహిళ మరోసారి జన్మించడమేనని అంటారు. ఈ విషయంలో రెండో మాటకు తావులేదు. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని అంగీకరిస్తారు. అందుకే గర్భవతితో పాటు ఆమె బంధువులు, స్నేహితులేకాదు తెలియని వారు కూడా ఆ మహిళకు సుఖ ప్రసవం జరగాలని ఒకసారి కాకుండా మరోసారి ఆ దేవుడిని ప్రార్థిస్తారు. ఈ నేపథ్యంలో ఒక దేవాలయం గర్భగుడిలోని మూలవిరాట్టును దర్శించుకొని పూజిస్తే సుఖ ప్రసవం జరుగుతుందని నమ్ముతారు. అందువల్లే విదేశాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆ దేవాలయానికి సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం...

ఈ దేవాలయాల్లో ఇదేమి ఆచారంఈ దేవాలయాల్లో ఇదేమి ఆచారం

ఈ ఆశ్రమంలో ఉన్నవారికి చావన్నదేరాదా?ఈ ఆశ్రమంలో ఉన్నవారికి చావన్నదేరాదా?

మాదవార్ విలగమ్ వైద్యనాథార్

మాదవార్ విలగమ్ వైద్యనాథార్

P.C: You Tube

ఇంతటి ప్రాధాన్యత కలిగిన దేవాలయం తమిళనాడులోని విరుదునగర్ జిల్లా శ్రీ విల్లి పుత్తూర్ గ్రామానికి ఒక కిలోమీటరు దూరంలో ఉన్న మాదవార్ విలగమ్ అనే గ్రామంలో ఉంది.

దక్షిణ భారతదేశ ఖజురహో - డిచ్ పల్లి, తెలంగాణ !దక్షిణ భారతదేశ ఖజురహో - డిచ్ పల్లి, తెలంగాణ !

మాదవార్ విలగమ్ వైద్యనాథార్

మాదవార్ విలగమ్ వైద్యనాథార్

P.C: You Tube

ఇక్కడి గర్భగుడిలోని మూలవిరాట్టును వైద్యనాథార్ అని పిలుస్తారు. ఆ పరమశివుడే వైద్యుడి రూపంలో ఇక్కడ కొలువై ఉన్నాడని భక్తుల నమ్మకం.

మాదవార్ విలగమ్ వైద్యనాథార్

మాదవార్ విలగమ్ వైద్యనాథార్

P.C: You Tube

అందువల్లే ఈ దేవాలయానికి మాదవార్ విలగమ్ వైద్యనాథార్ దేవాలయం అనే పేరు వచ్చింది. ఇక్కడ ఉన్న తీర్థంలో పవిత్ర స్నానం చేస్తే ఎటువంటి రోగాలైనా సమసిపోతాయని చెబుతారు.

మాదవార్ విలగమ్ వైద్యనాథార్

మాదవార్ విలగమ్ వైద్యనాథార్

P.C: You Tube

ఇందుకు సంబంధించిన పురాణ కథనం ఒకటి ప్రాచారంలో ఉంది. దీని ప్రకారం ఒకసారి స్థానిక రాజైన తిరుమలై నాయక్ కడుపునొప్పితో తీవ్రంగా బాధపడేవాడు.

మాదవార్ విలగమ్ వైద్యనాథార్

మాదవార్ విలగమ్ వైద్యనాథార్

P.C: You Tube

వైద్యనాథన్ మహిమ ఆ రాజుకు తెలుస్తుంది. దీంతో ఆ రాజు మదవార్ విలగమ్ లో 48 రోజుల పాటు ఉండి ఆ పవిత్ర స్నానంలో స్నానం చేస్తారు. దీంతో అతడి కడుపునొప్పి పూర్తిగా తగ్గిపోతుంది.

మాదవార్ విలగమ్ వైద్యనాథార్

మాదవార్ విలగమ్ వైద్యనాథార్

P.C: You Tube

దీంతో తన పల్లకిని దేవస్థానానికి ఇచ్చి కాలినడకన రాజు తన అంత:పురానికి వెలుతాడు. అంతేకాకుండా రాజ తిరుమల నాయక్ ఆ దేవాలయంలో మధ్యాహ్న పూజ అనంతరమే భోజనం కూడా చేసేవాడు.

మాదవార్ విలగమ్ వైద్యనాథార్

మాదవార్ విలగమ్ వైద్యనాథార్

P.C: You Tube

అందు కోసం మధురైలో ఉన్నట్టు ఇక్కడ ఒక హాలును నిర్మించి పెద్ద పెద్ద డోలులను ఏర్పాటు చేశారు. ఈ డోలులు మోగిస్తే మధ్యాహ్న పూజ ముగిసినట్లు అర్థంప ఆ శబ్దాలు వినే రాజు భోజనం చేసేవాడని స్థానికులు చెబుతున్నారు.

మాదవార్ విలగమ్ వైద్యనాథార్

మాదవార్ విలగమ్ వైద్యనాథార్

P.C: You Tube

ముఖ్యంగా ఇక్కడ పరమశివుడు వైద్యుడిగా వెలిసినందువల్ల భక్తులు వచ్చి పూజలు చేస్తే తన లేదా తనకు సంబంధిచిన వారికి సుఖ ప్రసవం జరుగుతుందని నమ్ముతారు.

మాదవార్ విలగమ్ వైద్యనాథార్

మాదవార్ విలగమ్ వైద్యనాథార్

P.C: You Tube

ఇందుకు ఎన్నో ఉదాహరణలు చూసిప్తారు. అందుకే స్థానికుల్లో కొందరు విద్యా, వ్యాపారం, ఉపాధి, ఉద్యోగాల నిమిత్తం విదేశాల్లో ఉన్నా సాధ్యమైనంత వరకూ ప్రసవం కోసం ఇక్కడికి వచ్చి దేవాలయంలో అర్చన చేయిస్తారు.

మాదవార్ విలగమ్ వైద్యనాథార్

మాదవార్ విలగమ్ వైద్యనాథార్

P.C: You Tube

ఒకవేళ వారు రాకపోతే వారి తరఫున ఎవరో ఒకరు ఇక్కడ పూజలు చేస్తారు. ఇక సుఖ ప్రసవం జరిగిన తర్వాత స్వామివారికి ముడుపుగా చీరలు అందజేస్తారు. ఇందుకు సంబంధించిన ఒక కథనం ప్రచారంలో ఉంది.

మాదవార్ విలగమ్ వైద్యనాథార్

మాదవార్ విలగమ్ వైద్యనాథార్

P.C: You Tube

దానిని అనుసరించి పూర్వం శివుడి భక్తురాలైన ఒకామే ప్రసవం సమయంలో బిడ్డ కడుపులో అడ్డంతిరిగి తీవ్రంగా బాధపడుతూ ఉండేది. ఆ సమయంలో శివుడు సదరు బాధితురాలి తల్లి వేషంలో అక్కడికి వచ్చారు.

దక్షిణ భారతదేశంలోని టాప్ 5 కృష్ణ జింక అభయారణ్యాలు !దక్షిణ భారతదేశంలోని టాప్ 5 కృష్ణ జింక అభయారణ్యాలు !

మాదవార్ విలగమ్ వైద్యనాథార్

మాదవార్ విలగమ్ వైద్యనాథార్

P.C: You Tube

అయితే అప్పటికే ఆ మహిళ తల్లి చనిపోయి చాలా కాలమయ్యింది. దీంతో ఆ మహిళ తీవ్రంగా భయపడి మూర్చపోయింది. దీంతో బాధితురాలి తల్లివేశంలో ఉన్న పరమశివుడు తన గోరుతో నేల పై గీత గీస్తాడు.

మాదవార్ విలగమ్ వైద్యనాథార్

మాదవార్ విలగమ్ వైద్యనాథార్

P.C: You Tube

దీంతో ఆ ప్రాంతం నుంచి నీళ్లు ఉద్భవిస్తాయి. ఆ నీటితోనే ఆ మహిళకు సపరిచర్యలు చేసి సుఖ ప్రసవం అయ్యేలా చేస్తాడు. ఆ నీరు ఉద్భవించిన ప్రాంతంమే నేడు ఒక సరస్సుగా రూపాంతరం చెందింది. దానిని కాయకుడి కారు అని పిస్తారు.

మాదవార్ విలగమ్ వైద్యనాథార్

మాదవార్ విలగమ్ వైద్యనాథార్

P.C: You Tube

ఈ దేవాలయానికి వచ్చిన వారు ఈ సరస్సులోని నీటిని తప్పకుండా తీర్థంగా తీసుకొంటారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, అదే విధంగా సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ ఈ దేవాలయంలో భక్తుల సందర్శనకు అనుమతి ఇస్తారు.

మాదవార్ విలగమ్ వైద్యనాథార్

మాదవార్ విలగమ్ వైద్యనాథార్

P.C: You Tube

తమిళ క్యాలెండర్ మొదటి రోజు ఇక్కడ విశేష పూజలు జరుగుతాయి. అంతేకాకుండా సూర్యుడి కిరణాలు నేరుగా స్వామివారిని తాకుతాయి. ఇక ఈ దేవాలయానికి వెళ్లడానికి నిత్యం బస్సులు అందుబాటులో ఉంటాయి. మధురై నుంచి వివళ్లిపుతురు వెళ్లి అక్కడి నుంచి మాధవర్ వలగంకు నేరుగా చేరుకోవచ్చు. శివళ్లిపుతురులో రైల్వే స్టేషన్ కూడా ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X