Search
  • Follow NativePlanet
Share
» »శ్రీకాకుళంలోని శ్రీమధుకేశ్వర ఆలయం దర్శిస్తే మీరు పట్టిందల్లా బంగారమే...

శ్రీకాకుళంలోని శ్రీమధుకేశ్వర ఆలయం దర్శిస్తే మీరు పట్టిందల్లా బంగారమే...

శ్రీకాకుళంలోని శ్రీమధుకేశ్వర ఆలయం దర్శిస్తే మీరు పట్టిందల్లా బంగారమే...

భారతదేశంలో కొలువైన అత్యంత పురాతన దేవాలయాల్లో 'మధుకేశ్వరాలయం'ఒకటి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలో వంశధారనదికి ఎడమ గట్టున ఉండే ఈ ముఖలింగం గ్రామంలో ఈ ఆలయం ఉంది. శ్రీకాకుళం నుండి సుమారు 46కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఊరును పంచపీఠ స్థలంగా ప్రసిద్ది. ఇక్కడ చరిత్ర ప్రసిద్ది చెందిన ముఖలింగేశ్వర స్వామి, భీమేశ్వర స్వామి, సోమేశ్వరస్వామి ఆలయాలున్నాయి. వీటిలో ముఖ్యమైనది ముఖలింగేశ్వరస్వామి ఆయలం. ఈ ఆలయాన్ని మధుకేశ్వరాలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం అతిపురాతనమైనది.

మధూకము అంటే ఇప్ప చెట్టు. మధుకేశ్వరుడు అను పేరు రావడానికి ఇప్ప చెట్టే కారణమని ఇక్కడి స్థలపురాణం చెబుతోంది. ఇప్ప చెట్టును సంస్కృతంలో మధుకం అని పిలిస్తారు కాబట్టి ఇక్కడి గుడికి మధుకేశ్వరస్వామి ఆలయం అనే పేరు శాశ్వతమైంది. ఎంతో ఆసక్తిని కలిగిస్తున్న ఈ మధుకేశ్వర స్వామి వారు వెలసిన పుణ్యక్షేత్రం గురించి తెలుసుకుందాం..

ఒకానొకప్పుడు

ఒకానొకప్పుడు

ఒకానొకప్పుడు ఉత్తరాన ఉన్న మహోన్నతమైన హిమశిఖరాల మీద మహా వైష్ణవ యాగం ఒకటి జరిగినది. ఈ యాగం వీక్షించుటకు గంధర్వుడైన చిత్రగ్రీవుడు గంధర్వ గణాలతో సహా వేచ్చేశారు. అదే సమయంలో ఆ పర్వతాల మీద ఉండే శబరకాంతలు కూడా యాగం చూడటానికై వచ్చారు.

శబరకాంతలు గొప్ప సౌందర్యవతులు.

శబరకాంతలు గొప్ప సౌందర్యవతులు.

శబరకాంతలు గొప్ప సౌందర్యవతులు. వారి సౌందర్యానికి దాసోహం అయిన గంధర్వులు కామానికి లోబడతారు. అది గమనించిన మహదేవ మహర్షి కోపోద్రిక్తుడై సభామర్యాదను అతిక్రమించిన తప్పు చేసిన ఆ గంధర్వులందరిని శబరజాతిలో జన్మించమని శపం పెడతాడు. గంధర్వులందరూ శబరులుగా పుట్టారు. వారి నాయకైన చిత్రగ్రీవుడు కూడా శబర నాయకుడు అయ్యాడు.

శబరునిగా జన్మించిన చిత్రగ్రీవునికి ఇద్దరు భార్యలు

శబరునిగా జన్మించిన చిత్రగ్రీవునికి ఇద్దరు భార్యలు

శబరునిగా జన్మించిన చిత్రగ్రీవునికి ఇద్దరు భార్యలు ఒకరు రాణి చిత్తి, మరో భార్య చిత్కళ. చిత్కళ మహాశివ భక్తురాలు. ఇలా ఉండగా, చిత్రగ్రీవుని భార్యలిద్దకు క్షణ కాలం కూడా పడేది కాదు, ఇద్దరూ ఎప్పుడూ కీచులాడుకుంటుండే వారు. చివరికి ఒక రోజు చిత్తి, భర్త అయిన చిత్రగ్రీవుడి వద్ద వెళ్ళి, ఉంటే తానైనా ఉండాలి లేదా చిత్కళ అయినా ఉండాలి. ఏదో ఒకటి తేల్చాలంటూ భర్తను నిలదీస్తుంది.

ఇప్పచెట్టు కొమ్మలను రెండు వంచి, రాలిన పువ్వులు

ఇప్పచెట్టు కొమ్మలను రెండు వంచి, రాలిన పువ్వులు

శబర నాయకుడైన చిత్రగ్రీవుడు చిత్తి పట్టపురాని కాబట్టి ఆమెను వదులుకోలేక, రెండవ భార్యా అయిన చిత్కళను పిలిచి తమ వాకిలిలో ఉన్న ఇప్పచెట్టు కొమ్మలను రెండు వంచి, రాలిన పువ్వులు ఏరుకుని, వాటిని అమ్ముకుని బతకంటూ ఆజ్జాపిస్తాడు. దాంతో మహాసాధ్వి అయిన చిత్కళ భర్త మాటకు ఎదురు చెప్పలేదు. అలాగే చేసింది.

 శివ భక్తులు రాలు కనుక ఈశ్రానుగ్రం వల్ల ఇప్ప పూలు కాస్త బంగారు పువ్వులుగా

శివ భక్తులు రాలు కనుక ఈశ్రానుగ్రం వల్ల ఇప్ప పూలు కాస్త బంగారు పువ్వులుగా

చిత్కళ ఇప్పచెట్టు కొమ్మలు రెండు వంచి ఆ రాలిన పువ్వులు ఏరుకుని అమ్ముకునేది. అదే క్రమంలో ఒక నాడు ఆమె శివ భక్తులు రాలు కనుక ఈశ్రానుగ్రం వల్ల ఇప్ప పూలు కాస్త బంగారు పువ్వులుగా మారేవి. చిత్కళ ఆ బంగారు పువ్వులను సుమంతపురంలో అమ్మి, కాలం గడిపేది. కానీ ఈ బంగారు పుష్పాల రహాస్యం తెలుసుకున్న చిత్తి అసూయతో చిత్కళతో మళ్లీ గొడవపడింది.

విసుగు చెందిన చిత్రగ్రీవుడు

విసుగు చెందిన చిత్రగ్రీవుడు

విసుగు చెందిన చిత్రగ్రీవుడు తన ఇద్దరు భార్యల నడుము గొడవకు ఆ ఇప్పచెట్టే కారణమని తెలుసుకుని ఆ ఇప్ప చెట్టును నరకడానికి పూనుకున్నాడు. ఇప్పుడు మహాశివుడు రౌద్రాకారంలో ఇప్ప చెట్టులోంచి ప్రత్యక్షమయ్యాడు. అది చిత్రగ్రీవుడు స్పృహ కోల్పోతాడు.

మధూకము అనేబడే ఈ ఆ ఇప్పచెట్టులో నుండి సాక్షాత్కరించిన ఆ మహాశివుడు

మధూకము అనేబడే ఈ ఆ ఇప్పచెట్టులో నుండి సాక్షాత్కరించిన ఆ మహాశివుడు

తమ రాజు స్పృహ కోల్పోవడానికి కారనం చిత్కళయే అని భావించిన శబరులు ఆ శివ భక్తురాలైన చిత్కళను హతమార్చడానికి పూనుకుంటారు. అప్పడు ఆ పరమేశ్వరుడు వారి ముందు ప్రత్యక్షమై శబరురూపులైన ఆ గంధర్వులకు శాపవిముక్తి కలిగిస్తాడు. తర్వాత మధూకము అనేబడే ఈ ఆ ఇప్పచెట్టులో నుండి సాక్షాత్కరించిన ఆ మహాశివుడు మధుకేశ్వరుడుగా ప్రసిద్దిచెందాడనిక ప్రతీతి.

ఈ క్షేత్రంలో స్వామివారితో ఉన్న అమ్మవారిని వరాహిదేవిగా పూజిస్తారు

ఈ క్షేత్రంలో స్వామివారితో ఉన్న అమ్మవారిని వరాహిదేవిగా పూజిస్తారు

ముఖ లింగం ఆలయంలో గర్భాలయం మాత్రమేకాకుండా ఎనిమిది వైపులా ఎనిమిది లింగాలున్నాయి. ఈ క్షేత్రంలో స్వామివారితో ఉన్న అమ్మవారిని వరాహిదేవిగా పూజిస్తారు. సప్త మాతృకల్లో ఒకరుగా వరాహిదేవి అమ్మవారిని భక్తులు సేవిస్తారు. ఇక్కడి శిల్పాలలో వరాహావతారం, వామనావతారం, సూర్యవిగ్రహం వుండటం విశేషం.

మధకేశ్వరుని ఆలయానికి ఎదురుగా పెద్ద నంది విగ్రహం దర్శనమిస్తుంది.

మధకేశ్వరుని ఆలయానికి ఎదురుగా పెద్ద నంది విగ్రహం దర్శనమిస్తుంది.

శ్రీకాకుళం జిల్లాలోని వంశధారా తీరాన వెలిసిన ఈ మధకేశ్వరుని ఆలయానికి ఎదురుగా పెద్ద నంది విగ్రహం దర్శనమిస్తుంది. గర్భాలయంలో శ్వేత వర్నంలో శోభిల్లే ముఖలింగేశ్వరుడు అలౌకిక తేజస్సుతో తరింపజేస్తాడు. అలాగే ఇక్కడ కుమారస్వామి, దక్షిణామూర్తి నాలుగు ముఖాలతో బ్రహ్మ, గణపతి విగ్రహాలున్నాయి.

 ఆ ఆలయంలో అనేక శాసనాలున్నాయి

ఆ ఆలయంలో అనేక శాసనాలున్నాయి

ఇక్కడ త్రవ్వకాల్లో వీణాపాణి అయిన సరస్వతి విగ్రహం, జైనమత ప్రవక్త మహావీరుని విగ్రహం లభించాయి. వీటిని శ్రీముఖలింగాలయంలో భద్రపరిచారు. ఆ ఆలయంలో అనేక శాసనాలున్నాయి. వాటిలో అతి ప్రాచీనమైన శాసనం ప్రకారం మధుకేశ్వరాలయం 8వ శాతాబ్ధిలో నిర్మింపబడినదని పరిశోధకలు అభిప్రాయం.

ఆయనపై శబరుల యుగయుగాల అవ్యాజభక్తికి ఇదే నిదర్శనం.

ఆయనపై శబరుల యుగయుగాల అవ్యాజభక్తికి ఇదే నిదర్శనం.

ఇక సాధారణ భక్తుల మాట ఎలా ఉన్నా..ఇక్కడి మధుకేశ్వరుడు శబరులు, గిరిజనుల ఆరాధ్యదైవంగా ఇప్పటికీ పూజింపడబడుతూనే ఉన్నాడు. ఆయనపై శబరుల యుగయుగాల అవ్యాజభక్తికి ఇదే నిదర్శనం.

 మహా శివరాత్రికి ఇక్కడ గొప్ప ఉత్సవం జరుగుతుంది.

మహా శివరాత్రికి ఇక్కడ గొప్ప ఉత్సవం జరుగుతుంది.

మహాశివరాత్రి పర్వదినాన శ్రీ ముఖలింగేశ్వరునికి పూజలు ఘనంగా చేస్తారు. ఆ గ్రామంలో మహాశివరాత్రి ఉత్సవాలను 9 రోజులపాటు వైభవోపేతంగా నిర్వహిస్తారు. సుదూర గ్రామాలు, పక్కనున్న ఒరిస్సా రాష్ట్రంలోని పలు గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు శివరాత్రి ముందురోజే శ్రీముఖలింగం చేరుకొని తొమ్మిది రోజులూ దేవుని దర్శించుకుని తిరునాళ్ళలో పాల్గొంటారు. మహాశివరాత్రి పర్వదినముతోపాటు ప్రతి ఏటా కార్తీక మాసం నాలుగు సోమవారాలు, మిగతా పవిత్ర దినాల్లో భక్తులు దర్శించి ప్రత్యేక పూజలు చేపడతారు.

ఎలా వెళ్లాలి?

ఎలా వెళ్లాలి?


ఈ క్షేత్రానికి వెళ్లదలచిన వారు శ్రీకాకుళంలోని అముదాలవలస పట్టణం చేరుకుని అక్కడి నుంచీ 38కీమీలు ప్రయాణించాల్సింది వుంటుంది.

శ్రీకాకుళం ఆర్ టి సి బస్ స్టాండ్ నుండి ప్రతి గంట గంట కు ముఖలింగం కు ఆర్టీసీ బస్సులు నడుస్తాయి. ప్రయాణ సమయం 2 గంటలు. గుడి కి సమీపాన వైజాగ్ ఎయిర్ పోర్ట్ కలదు మరియు ఆముదాలవలస (45 కి. మీ.) సమీపాన ఉన్న రైల్వే స్టేషన్.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X