Search
  • Follow NativePlanet
Share
» »త్రిమూర్తులను సరస్వతి దేవి శపించిన పుణ్యక్షేత్రం చూశారా?

త్రిమూర్తులను సరస్వతి దేవి శపించిన పుణ్యక్షేత్రం చూశారా?

మహారాష్ట్రంలోని మహాబలేశ్వర్ దేవాలయం గురించి కథనం.

అటు ఆధ్యాత్మికంగానే కాకుండా ఇటు అడ్వెంజర్ టూరిజానికి కూడా అనుకూలమైన పర్యాటక ప్రాంతాలు చాలా అరుదుగా ఉంటాయి. అటువంటి వాటిలో మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ ముందువరుసలో ఉంటుంది. పూణే నుంచి మహాబలేశ్వర్ 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక హైదరాబాద్ నుంచి పూణెకు విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్ తదితర చోట్ల నుంచి రైళ్లు కూడా ఉంటాయి. పూణే నుంచి బస్సులు, ట్యాక్సీల్లో మహాబలేశ్వర్ ను చేరుకోవచ్చు.

మహాబలేశ్వర్, మహారాష్ట్ర

మహాబలేశ్వర్, మహారాష్ట్ర

P.C: You Tube

త్రిమూర్తులు పుణ్యనదులుగా మారిన ప్రాంతమే మహాబలేశ్వర్. ఇక్కడ త్రిమూర్తులైన పరమశివుడు, బ్రహ్మ, విష్ణువు వెన్నా, కొయినా, కృష్ణా నదిగా మారారని చెబుతారు. వీటితోపాటు మరో రెండు కూడా అత్యంత పవిత్రమైన నదులు ఉన్నాయి. వాటి జన్మస్థానాలు కూడా ఇక్కడే.

 మహాబలేశ్వర్, మహారాష్ట్ర

మహాబలేశ్వర్, మహారాష్ట్ర

P.C: You Tube
ఇందుకు సంబంధించిన పురాణ కథ ఒకటి ప్రచారంలో ఉంది. దానిని అనుసరించి మహావిష్ణువు సూచన మేరకు పరమశివుడి పర్యవేక్షణలో బ్రహ్మదేవుడు ఒక యాగాన్ని నిర్వహించాలని భావిస్తాడు. ఇందుకు సంబంధించి అన్ని పనులను పూర్తి చేసుకొంటారు.

 మహాబలేశ్వర్, మహారాష్ట్ర

మహాబలేశ్వర్, మహారాష్ట్ర

P.C: You Tube
అయితే యాగసమయానికి సరస్వతి దేవి రాకపోవడంతో మరో స్త్రీతో బ్రహ్మ యాగాన్ని మొదలుపెడుతాడు. ఈ విషయం తెలుసుకొన్న సరస్వతి బ్రహ్మతో పాటు విష్ణువు, పరమశివుడుని నదులుగా మారిపోవాల్సిందిగా శాపం పెడుతుంది.

 మహాబలేశ్వర్, మహారాష్ట్ర

మహాబలేశ్వర్, మహారాష్ట్ర

P.C: You Tube
ఆ శాప ఫలితంగా మహాబలేశ్వర్ లో వారు ముగ్గురూ నదులుగా మారిపోతారు. ఈ మూడు నదులతోపాటు సావిత్రి, గాయిత్రీ నదులు కూడా ఇదే ప్రాంతంలో జన్మించాయి. ఇవి ఐదు కొద్ది దూరం ప్రయాణం చేసి పంచగంగ అనే ప్రాంతంలో సంగమిస్తాయి. ఇక్కడ మహాదేవుడికి ఆలయం ఉంది.

 మహాబలేశ్వర్, మహారాష్ట్ర

మహాబలేశ్వర్, మహారాష్ట్ర

P.C: You Tube
ఇక మహాబలేశ్వర్ లో పరమశివుడు స్వయంభువుగా వెలిశాడని చెబుతారు. ఇక్కడ పరమశివుడికి ప్రీతిపాత్రమైన రుద్రాక్ష ఆకారంలో శివలింగం దర్శనమిస్తుంది. ఆలయంలో స్వామివారి కోసం పడక కూడా ఉంటుంది. ఈ పడకన ఇక్కడి పూజారులు ఎంతో భక్తి భావంతో అలంకరిస్తారు.

 మహాబలేశ్వర్, మహారాష్ట్ర

మహాబలేశ్వర్, మహారాష్ట్ర

P.C: You Tube
ప్రతి రోజూ పరమేశ్వరుడు దీని పై శయనిస్తాడని భక్తులు విశ్వసిస్తారు. అందువల్లే ఇక్కడ ఉన్న ఆలయం మూసివేసే సమయంలో ఏమాత్రం నలగకుండా ఉండే పక్క తెల్లారేసరికి చెదిరి కనిపిస్తుంది. ఇక ఈ ఆలయ సమీపంలో కృష్ణానది జన్మస్థానంలో కృష్ణాబాయి ఆలయం ఉంటుంది.

 మహాబలేశ్వర్, మహారాష్ట్ర

మహాబలేశ్వర్, మహారాష్ట్ర

P.C: You Tube
ఇదిలా ఉండగా మహానదుల జన్మస్థలమైన మహాబలేశ్వర్ పరిసర ప్రాంతాల్లో అద్భుతమైన జలపాతాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఆరువందల అడుగుల నుంచి కిందికి దుమికే లింగమల జలపాతం ప్రధానమైనది. అటు పై దోభి జలపాతం. ఇది మహాబలేశ్వర్ కు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

 మహాబలేశ్వర్, మహారాష్ట్ర

మహాబలేశ్వర్, మహారాష్ట్ర

P.C: You Tube
దీనిని చూడటానికే చాలా మంద పర్యాటకులు వస్తూ ఉంటారు. అటు పై చైనామన్స్ జలపాతం. ఇక్కడ బ్రిటీష్ వాళ్లు చైనా మలేసియాకు చెందిన ఖైదీలను ఇక్కడ బందీలుగా ఉచేవారని చెబుతారు. అటు పై ఇక్కడ ఉన్న వెన్నా సరస్సులో బోటింగ్ చాలా సరదాగా ఉంటుంది. ఇక్కడ క్రమం తప్పకుండా కయాకింగ్ పోటీలు జరుగుతాయి.

 మహాబలేశ్వర్, మహారాష్ట్ర

మహాబలేశ్వర్, మహారాష్ట్ర

P.C: You Tube
ఈ ప్రాంతం కోటలకు కూడా చాలా ప్రాచూర్యం చెందినది. శతాబ్దాలకు పూర్వం సింగన్ అనే రాజు ఈ ప్రాంతాన్ని పాలించాడు. ఇక్కడి మహాబలేశ్వరుడికి దేవాలయం కూడా ఆయనే కట్టించాడని చెబుతారు. ఇక ఈ మహాబలేశ్వర్ ను మరాఠా యోథుడు ఛత్రపతి శివాజీ 17వ శతాబ్దంలో కైవసం చేసుకొన్నాడు.

 మహాబలేశ్వర్, మహారాష్ట్ర

మహాబలేశ్వర్, మహారాష్ట్ర


P.C: You Tube
క్రీస్తు శకం 1656లో ఇక్కడకు 24 కిలోమీటర్ల దూరంలో రాయ్ ఘడ్ కోటను కట్టించాడు. కొండ పై కోటలో భవానీ దేవి, మహాదేవ ఆలయాలు ఉన్నాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ కోటలోకి అనుమతిస్తారు. అటు పై ఈ కోట పైకి ఎవ్వరినీ అనుమతించరు.

 మహాబలేశ్వర్, మహారాష్ట్ర

మహాబలేశ్వర్, మహారాష్ట్ర

P.C: You Tube
ప్రముఖ హిల్ స్టేషన్ గా మహాబలేశ్వర్ కు పేరుంది. ఇక్కడ దాదాపు 30 వ్యూపాయింట్లు ఉన్నాయి. విల్సన్ పాయింట్ అత్యంత ఎత్తైన ప్రదేశం. ఆ తర్వాతి స్థానం కొన్నాట్ శిఖరానిది. ఏనుగు తల ఆకారంలోని పర్వాతాన్ని ఎలిఫెంట్ హెడ్ అని అంటారు. ఈ వ్యూపాయింట్ నుంచి చుట్టు పక్కల ఉన్న అనేక ప్రాంతాలను చూడవచ్చు.

 మహాబలేశ్వర్, మహారాష్ట్ర

మహాబలేశ్వర్, మహారాష్ట్ర

P.C: You Tube
సూర్యాస్తసమయానికి పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి చేరుకొంటారు. ముంబై పాయింట్, ఆర్ధర్ సీ పాయింట్, హెల్స్ న్ పాయింట్ నుంచి కూడా సంధ్యా సమయం ఇక్కడ మనోహరంగా కనిపిస్తుంది. సాహస యాత్రికుల కోసం మహాబలేశ్వర్ లో ట్రెక్కింగ్ అందుబాటులో ఉంది. వీకెండ్ సమయంలో ఈ అడ్వెంచర్ అంటే ఇష్టపడే వారు ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X