Search
  • Follow NativePlanet
Share
» » పాలమూరు పర్యాటకం వెళ్లొద్దాం?

పాలమూరు పర్యాటకం వెళ్లొద్దాం?

మహబూబ్ నగర్ జిల్లాలోని పర్యాటక స్థలాలకు సంబంధించిన కథనం.

తెలంగాణలో అత్యంత వెనుకబడిన జిల్లాగా, వలసలు ఎక్కువగా ఉన్న జిల్లాగా మహాబూబ్ నగర్ కు పేరు. అయితే ప్రస్తుతం ఈ జిల్లా కేంద్రంగా తెలంగాణ పర్యాటక రంగం అభివద్ధి చెందుతోంది. ఒక వైపు ఆధ్యాత్మిక ప్రాంతం, మరోవైపు ఆహ్లాదకరమైన ప్రాంతాలతో మహబూబ్ నగర్ పర్యాటక రంగంలో దూసుకుపోతోంది. ముఖ్యంగా పాలమూరుకు చుట్టు పక్కల పిల్లలమర్రి, మయూరి పార్కు, సలేశ్వరం వంటి ఎన్నో స్థలాలు పర్యాటకులను రారమ్మని ఆహ్లానిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలు మీ కోసం...

పిల్లల మర్రి

పిల్లల మర్రి

P.C: You Tube

సుమారు ఏడు వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ మహావ`క్షం ప్రధాన పర్యాటక కేంద్రం. పట్టణానికి దాదాపు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెట్టు కింద ఒకేసారి వెయ్యి మంది కుర్చొని వనభోజనాలు చేయవచ్చు. ఈ చెట్టు ప్రధాన కాండం ఎక్కడ ఉందో చెప్పడం కష్టం .

వీకెండ్ లో

వీకెండ్ లో

P.C: You Tube

ఇక్కడ ఒక చిన్న జంతుప్రదర్శనశాల, వస్తుప్రదర్శనశాల, అక్వేరియం ఉన్నాయి. ముఖ్యంగా పిల్లలతో వీకెండ్ ను సరదాగా గడపడానికి పిల్లల మర్రికి మించిన ప్రదేశం మరొకటి లేదని చెబుతారు. అందువల్లే ప్రజలు ఇక్కడకు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు.

మయూరి పార్క్

మయూరి పార్క్

P.C: You Tube

మహబూబ్ నగర్, జాదుచెర్ల రహదారి మధ్య అప్పన్నపల్లి శివారులో 200 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ మయూరి పార్క్లో యువతను ఆకర్షించేందుకు అడ్వెంచర్ జోన్ ను ఏర్పాటు చేశారు. 25 అడుగుల ఎత్తులో 150 మీటర్ల దూరం గాలిలో తేలుతూ జిప్ లైన్ పై వెళ్లడం మరిచిపోలేని అనుభూతి.

జిప్ సైకిల్

జిప్ సైకిల్

P.C: You Tube

అడ్వెంచర్ జోన్ లో రెండోది జిప్ సైకిల్. 40 అడుగుల ఎత్తులో 300 మీటర్ల దూరం తీగల పై సైకిల్ తొక్కటం అనేది సవాల్ తో కూడుకున్నది. నిపుణుల పర్యవేక్షణలో జరిగే ఈ జిప్ సైక్లింగ్ చూసేవాళ్లకు కూడా థ్రిలింగ్ కలిగిస్తుందనిచెప్పడం అతిశయోక్తి కాదు.

అద్భుత క్షేత్రం సలేశ్వరం

అద్భుత క్షేత్రం సలేశ్వరం

P.C: You Tube

సలేశ్వర క్షేత్రం మహబూబ్నగర్ జిల్లా నల్లమల అడవిలో ఉంది. మన్ననూరుకు సుమారు 30 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలోని ఒక లోయలో ఈ క్షేత్రం ఉంటుంది. ప్రతి సంవత్సరం చైత్ర పున్నమి రోజు ఈ క్షేత్రానికి భక్తులు లక్షల సంఖ్యలో వస్తారు.

జలపాతం

జలపాతం

P.C: You Tube

ఆ రోజురాత్రి అతి కష్టసాధ్యమైన లోయలోకి దిగి స్వామివారిని దర్శనం చేసుకొంటారు. ఇక్కడ శివాలయం ఎదురుగా దాదాపు మూడు వందల అడుగుల ఎత్తు నుంచి జాలువారే జలపాతం మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. సలేశ్వర ప్రయాణం చాలా కష్టంతో కూడుకున్నది.

ఆలంపూర్ జోగులాంబ

ఆలంపూర్ జోగులాంబ

P.C: You Tube

అష్టాదశ శక్తిపీఠాల్లో మహబూబ్ నగర్ జిల్లాలోని ఆలంపూర్ జోగులాంబ కూడా ఒకటి. రాయలసీమ ముఖద్వారంగా పేర్కొనబడే కర్నూలుకు సమీపంలో మహబూబ్ నగర్ శివారులో ఆలంపూర్ జోగులాంబ ఆలయం ఉంటుంది.

తుంగభద్రానదీ తీరం

తుంగభద్రానదీ తీరం

P.C: You Tube

పరమ పవిత్ర అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా, పావన తుంగభద్రానదీ తీరంలో ఇక్కడ అమ్మవారు జోగులాంబగా వెలిసి ఉన్నారు. అమ్మవారి దర్శనం మరపురాని ఆధ్యాత్మిక అనుభూతిని మిగుల్చుతుందని చెప్పవచ్చు.

చాళుక్యరాజులు

చాళుక్యరాజులు

P.C: You Tube

ఆలయ పురాతన నిర్మాణ శైలి భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. క్రీస్తుశకం 6వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని చాళుక్యరాజులు నిర్మించినట్లు తెలుస్తోంది. అత్యద్భుతమైన గోపురాలు, వాటి పై ఉన్న శిల్పాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి.

మల్లెల తీర్థం

మల్లెల తీర్థం

P.C: You Tube

మల్లెల తీర్థం శ్రీశైలం పట్టణానికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ నీరు ఎంతో పవిత్రమైదని భావించటంతో భక్తులు ప్రతి ఏడాది వేల సంఖ్యలో వచ్చి స్నానాలు చేస్తుంటారు.

దట్టమైన అటవీ మార్గం

దట్టమైన అటవీ మార్గం

P.C: You Tube

దట్టమైన అడవుల మధ్య ఉన్న ఈ జలపాతం చేరుకోవడానికి చక్కని రోడ్డు మార్గం ఉంది. ఈ మల్లెల తీర్థంలో స్నానాలు చేస్తే పాపాలు పోతాయని భావించటంతో ఎక్కువ మంది ఈ జలపాతాన్ని తరుచుగా సందర్శిస్తూ ఉంటారు.

గద్వాల కోట

గద్వాల కోట

P.C: You Tube

మహబూబ్ నగర్ జిల్లాలోని కోటలన్నింటిలోకి ప్రసిద్ధి చెందిన కోట గద్వాల్ కోట. ఇది గద్వాల పట్టణం నడి బొడ్డున ఉంది. ఈ కోటను రాజా పెద్ద సోమభూపాలుడు క్రీస్తుశకం 1662లో నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది.

చెన్నకేశవ దేవాలయం

చెన్నకేశవ దేవాలయం

P.C: You Tube

ఈ కోటలోని చెన్నకేశ స్వామి దేవాలయాన్ని కూడా పెద్ద సోమభూపాలుడే నిర్మించాడు. దేవాలయ గోడల పై ఉన్న శిల్పకళ చూపరులను అకట్టుకొంటోంది. కోట లోపల ప్రస్తుతం ప్రభుత్వ, జూనియర్, డిగ్రీ కళాశాలలు నడుస్తున్నాయి.

కొల్లాపూర్ సంస్థానం

కొల్లాపూర్ సంస్థానం

P.C: You Tube

మహబూబ్ నగర్ జిల్లాలో క`ష్ణానది తీరంలో వెలిసిన అత్యంత ప్రాచీన సంస్థానం కొల్లాపూర్ సంస్థానం. దీనినే జటప్రోలు సంస్థానం అని కూడా పిలుస్తారు. ఇక్కడ 1500 ఏళ్లనాటి అనేక దేవాలయాలు ఇప్పటికీ చెక్కు చెదరకపోకుండా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. వీకెండ్ సమయంలో ఇక్కడకు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు.

కోయిల్ సాగర్ ప్రాజెక్టు

కోయిల్ సాగర్ ప్రాజెక్టు

P.C: You Tube

కోయిల్ సాగర్ ప్రాజెక్టు మహబూబ్ నగర్ జిల్లాలోని మధ్యతరహా నీటి పారుదల ప్రాజెక్టు. రెండు కొండల మధ్య నిర్మితమైన ఈ ప్రాజెక్టు పర్యాటకులను ముఖ్యంగా ప్రక`తి ప్రేమికులను విశేషంగా ఆకర్షిస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X