Search
  • Follow NativePlanet
Share
» »ఇక్కడ స్నానం చేయాలంటే 2028 వరకూ ఆగాల్సిందే

ఇక్కడ స్నానం చేయాలంటే 2028 వరకూ ఆగాల్సిందే

కుంభకోణంలోని మహామహం పుష్కరిణి గురించి కథనం

భారత దేశంలో ప్రతి దేవాలయం ముందు ఒక పుష్కరిణి ఉంటుంది. మొదట ఈ దేవాలయంలో స్నానం చేసి అటు పై దైవ దర్శనం చేసుకొంటే పుణ్యం వస్తుందని మన పురాణాలు చెబుతాయి. అయితే అవే పురాణాలు ఒకే ఒక పుష్కరణికి దీని నుంచి మినహాయింపు ఇచ్చాయి.

ఇక్కడ దేవాలయమే ఉండదు. అయితే ఆ పుష్కరిణిలో స్నానం చేస్తే పంచమహాపాతకాలు తొలిగిపోతాయని భక్తులు నమ్ముతారు. ముఖ్యంగా 12 ఏళ్లకు ఒకసారి వచ్చే ఆ శుభసమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు.

గతంలో అంటే 2016లో వచ్చిన ఆ పుణ్యకాలంలో ఆ పుష్కరిణిలో స్నానం చేసిన భక్తులు మరలా 2028 కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ పుష్కరిణికి సంబంధించిన క్లుప్తమైన వివరాలు మీ కోసం....

ప్రళయం తర్వాత

ప్రళయం తర్వాత

P.C: You Tube

ప్రళయం తర్వాత బ్రహ్మదేవుడు తిరిగి స`ష్టిని సాగించేందుకు గాను అవసరమయ్యే జీవాన్నంతా ఒక కుంభం (కుండ)లో ఉంచి ఈ భూమి పైకి పంపించాడు. అలా భూమి పైకి వచ్చిన కుంభం మొదట ఎక్కడ ఈ భూమిని తాకిందో అదే కుంభకోనంగా మారిపోయిందని మన పురాణ కథనాలు చెబుతాయి.

కాశీని దర్శించినంత పుణ్యం

కాశీని దర్శించినంత పుణ్యం

P.C: You Tube

అందుకే ఈ కుంభకోణం అత్యంత పవిత్రమైన ప్రాంతం. ఇక ఈ కుంభకోణంలో పూజకు నోచుకోని బ్రహ్మ దేవాలయం కూడా ఉండటం గమనార్హం. ఇక ఈ కుంభకోణంలో ప్రతి అడుగుకూ ఒక దేవాలయం కనిపిస్తుంది. దీంతో కాశీకి వెళితే ఎంత పుణ్యమో కుంభకోణాన్ని దర్శించినా అంతే పుణ్యమని మన పురాణాలు చెబుతున్నాయి.

సింహరాశిలోకి ప్రవేశించే సమయంలో

సింహరాశిలోకి ప్రవేశించే సమయంలో

P.C: You Tube

ఇటువంటి పుణ్యస్థలమైన కుంభకోణంలో ఓ బ్రహ్మండమైన పెద్ద కోనేరు ఉంది. ఈ కోనేరు భారత దేశంలోనే అత్యంత పెద్దదైన తీర్థం. 12 ఏళ్లకు ఒకసారి బ`హస్పతి సింహరాశిలోకి వచ్చే సమయంలో ఈ కోనేటిలోకి సకల తీర్థాలు వచ్చి చేరుతాయని చెబుతారు. ఆ సమయంలో ఈ కోనేరులో స్నానం చేస్తే భారత దేవంలోని అన్ని పవిత్ర తీర్థాల్లో స్నానం చేసిన పుణ్యం దక్కుతుందని పురాణ కథనం.

మహామహం

మహామహం

P.C: You Tube

అందువల్లే ఈ తీర్థంలో స్నానం చేయడానికి విదేశాల నుంచి కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటారు. ఆ ఒక్కరోజే లక్షల సంఖ్యలో భక్తులు ఇక్కడ స్నానం చేస్తారు. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే ఆ పుణ్యకాలాన్ని మహామహం అని పిలుస్తాం.

మకర సంక్రాంతి రోజు కూడా

మకర సంక్రాంతి రోజు కూడా

P.C: You Tube

అదే సమయంలో ఇక్కడ పుణ్యస్నానాలు జరుగుతాయి కాబట్టి దీనిని మహామహం కోనేరు అని పిలుస్తారు. కేవలం మహామహం సమయంలోనే కాకుండా మకర సంక్రాంతి మాఘ పౌర్ణిమ తదితర రోజుల్లో ఇక్కడ స్నానాలు చేయడానికి ఎక్కువ మంది ఉత్సాహం చూపుతారు. ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కోనేరు చుట్టూ 16 మంటపాలు 21 బావులు ఉన్నాయి. మంటపాల్లో ఉన్న శిల్ప సంపద మన మన భారతీయ శిల్పకళకు అద్దం పడుతుందని చెబుతారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X