Search
  • Follow NativePlanet
Share
» »మహానంది - మహాశివుడు నంది రూపంలో వెలసిన పుణ్య క్షేత్రం !!

మహానంది - మహాశివుడు నంది రూపంలో వెలసిన పుణ్య క్షేత్రం !!

మహానంది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రము. నంద్యాలకు 14 కి.మీ దూరంలో ఉన్న మహాక్షేత్రం మహానంది. ఇక్కడ గల స్వామి మహానందీశ్వరుడు, అమ్మవారు కామేశ్వరీ దేవి.

By Mohammad

క్షేత్రం : మహానంది

జిల్లా : కర్నూలు (ఆంధ్ర ప్రదేశ్)

సమీప పట్టణం : నంద్యాల (14 కి.మీ.ల దూరంలో)

సమీప క్షేత్రాలు : శ్రీశైలం (172 కి.మీ.), అహోబిలం (69 కి.మీ.)

మహానంది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రము. నంద్యాలకు 14 కి.మీ దూరంలో ఉన్న మహాక్షేత్రం మహానంది. ఇక్కడ గల స్వామి మహానందీశ్వరుడు, అమ్మవారు కామేశ్వరీ దేవి. ఇక్కడి మహానందీశ్వర దేవాలయం 7వ శతాబ్దినాటిది. ఈ ఆలయ శిల్పశైలిని బట్టి ఇది బాదామి చాళుక్య చక్రవర్తి వినయాదిత్యుని పాలనాకాలం (680-696) నాటిదని అంచనా. ఇచ్చట గల శివలింగము ఎత్తుగా కాక కొంచెము తప్పటగ వుంటుంది.

<strong>గుండ్ల బ్రహ్మశ్వరం అభయారణ్యం - నంద్యాల !!</strong>గుండ్ల బ్రహ్మశ్వరం అభయారణ్యం - నంద్యాల !!

అలా ఉండటానికి కారణం

పుట్టలో గల స్వామివారికి ఆవు పాలు ఇస్తుండగా కోపించిన యజమాని ఆవుని కొట్టగా పుట్టలో గల స్వామివారిని ఆవు తొక్కిలో వలన లింగము కొంచెము అణిగివుంటుంది. ఆవు గిట్ట గుర్తు లింగముపై వుంటుంది. ఇచ్చట శుద్ధ స్ఫటిక వర్ణంలో కనిపించే జలం జలజలా ప్రవహించే దృశ్యం మహానంది ప్రత్యేకత.ఈ పుష్కరిణిలు విశ్వబ్రాహ్మణ శిల్పుల యొక్క పనితనాన్ని తెలియచేస్తుంది.

ప్రధాన ఆలయం

ప్రధాన ఆలయం

ప్రధాన ఆలయానికి ఆలయ ముఖ ద్వారం గోపురానికి మధ్యలో ఉన్న పుష్కరిణి లోనికి స్వచ్ఛమైన నీరు సర్వ వేళలా గోముఖ శిల న్నుండి ధారావాహకంగా వస్తుంటుంది. ప్రధాన ఆలయంలోని లింగం క్రింద భూమిలో ఐదు నీటి ఊటలు ఉన్నాయి.

చిత్రకృప : Adityamadhav83

పుష్కరిణి

పుష్కరిణి

లింగము క్రింద నుండి నీరు ఊరుతూ వుంటుంది. ఆ నీరు పుష్కరిణిలోనే బయటకు కనిపిస్తుంది. అందులోనికి వచ్చిన నీరు గోపురం ముందున్న రెండు గుండాల ద్వారా బయటకు పారుతుంది. పుష్కరిణిలో నీరు ఎల్లప్పుడు ఒకే స్థాయిలో (1.7 మీటర్లు) నిర్మలంగా, పరిశుభ్రంగా ఉంటుంది.

చిత్రకృప :sai sreekanth mulagaleti

నీటి స్వచ్ఛత

నీటి స్వచ్ఛత

ఈ నీరు ఎంత స్వచ్ఛంగా వుంటుందంటే నీటిపై కదలిక లేకుంటే నీరున్నట్టే తెలియదు. ఐదున్నర అడుగులు లోతున్నా క్రిందనున్న రూపాయి బిళ్ల చాల స్పష్టంగా కనబడుతుంది. ఈ నీటిని తీర్ధంగా భక్తులు తీసుకెళతారు.

చిత్రకృప : Pranayraj1985

మహాశివరాత్రి

మహాశివరాత్రి

ఇచ్చట బ్రహ్మ, విష్ణు, రుద్ర గుండాలు (పుష్కరుణులు) ఉన్నాయి. మహాశివరాత్రి పుణ్యదినమున లింగోధ్బవసమయమున అభిషేకము, కళ్యాణోత్సవము, రథోత్సవములు జరుగుతాయి. కోదండరామాలయం, కామేశ్వరీదేవి ఆలయం ఇతర దర్శనీయ స్థలాలు.

చిత్రకృప : Yvramr

ప్రత్యేకత

ప్రత్యేకత

ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఉంది. అదేమంటే, గర్భాలయానికి ప్రక్కన ఒక శిలా మండపం ఉంది. అది నవీన కాలంలో చెక్కిన శిల్పాలు. ఆ శిలా స్థంబాలపై ఆ శిల్పి తల్లి తండ్రుల శిల్పాలు చెక్కి తల్లి దండ్రులపై తనకున్న భక్తిని చాటుకున్నాడు. మహానంది ఆలయం సందర్శించు సమయం : ఉదయం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు.

చిత్రకృప : Yvramr

నంద్యాల

నంద్యాల

మహానందికి 18 కిలోమీటర్ల పరిధిలో తొమ్మిది నంది ఆలయాలు ఉన్నాయి. వీటన్నిటినీ కలిపి నవ నందులని పేరు. కార్తీక మాసంలో సోమవారం రోజున నంద్యాల చుట్టు కొలువై ఉన్న నవనందుల దర్శనం జన్మజన్మల నుండి వెంటాడుతున్న పాప గ్రహ దోషాలన్ని పటాపంచలు అవుతాయని పెద్దల నానుడి.

చిత్రకృప : Yvramr

కోర్కెలు

కోర్కెలు

సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపల ఈ క్షేత్రాలన్నింటినీ దర్శిస్తే అన్ని దోషాలు తొలగి కుటుంబంలో ఆయురారోగ్యాలతో కోరిన కోర్కెలు ఇట్టే తీరుతాయని భక్తుల ప్రధాన విశ్వాసం.

చిత్రకృప : Aryan paswan

నవనందులు - 1

నవనందులు - 1

14వ శతాబ్దం నందన మహారాజుల కాలంలో నవనందుల నిర్మాణ జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. వీటిని దర్శించాలంటే నంద్యాల పట్టణంలో శ్యామ్‌ కాల్వ గట్టున ప్రథమనందీశ్వర ఆలయం, ఆర్టీసి బస్టాండ్‌ దగ్గర ఉన్న శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో నాగనందీశ్వరుడు, ఆత్మకూరు బస్టాండ్‌ సమీపంలో సోమనందీశ్వరుడు, బండిఆత్మకూరు మండలం కడమకాల్వ సమీపంలో శివనందీశ్వరుడు ఇంకా

చిత్రకృప : Nsmohan

నవ నందులు -2

నవ నందులు -2

కడమకాల్వ కు సుమారు 3 కిలో మీటర్ల దూరంలో కృష్ణనంది (విష్ణునంది), నంద్యాల మహానందికి వెళ్ళే దారిలో కుడి వైపుకు తమ్మడపల్లె గ్రామ సమీపంలో సూర్యనందీశ్వర ఆలయం, మహానంది క్షేత్రంలో మహానందీశ్వరుని దర్శనం అనంతరం వినాయక నందీశ్వరుడు, అనంతరం నందివిగ్రహం సమీపంలో గరుడనందీశ్వర ఆలయాలు కొలువై ఉన్నాయి. వీటికి ప్రత్యేకంగా నంద్యాల ఆర్టీసి వారు బస్సులను ఏర్పాటు చేశారు.

చిత్రకృప : Sai Sreekanth

వసతి

వసతి

మహానంది లో అనేక గెస్ట్ హౌస్ లు, హోటళ్ళు కలవు. గుడికి సమీపంలో శంభుప్రియ గెస్ట్ హౌస్, బ్రాహ్మణ కరివేన నిత్యాన్నదాన సత్రం, హరితా హోటల్, హోటల్ బాలాజీ, న్యూ ఉడుపి హోటల్, శ్రీ కృష్ణ డీలక్స్ ఏసీ, నాన్ ఏసీ మరియు శివప్రియ లాడ్జ్ మొదలగునవి యాత్రికులకు వసతి సదుపాయాలను అందిస్తున్నాయి.

మహానంది ఎలా చేరుకోవాలి ?

మహానంది ఎలా చేరుకోవాలి ?

మహానంది కి సమీపాన కడప ఎయిర్ పోర్ట్, నంద్యాల రైల్వే స్టేషన్ కలదు. బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, గుంటూరు తదితర ప్రాంతాల నుండి నంద్యాల కు బస్సులు కలవు.

చిత్రకృప : Kautilya1

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X