Search
  • Follow NativePlanet
Share
» »మహావిద్యాగణపతిని దర్శిస్తే కోరిన కోర్కెలు నెరవేరుస్తూ వరసిద్ధి వినాయకుడయ్యాడు

మహావిద్యాగణపతిని దర్శిస్తే కోరిన కోర్కెలు నెరవేరుస్తూ వరసిద్ధి వినాయకుడయ్యాడు

సత్యప్రమాణల దేవుడిగా విద్యలకు ఒజ్జగా కృష్ణాజిల్లాలో కొలువైన మహావిద్యాగణపతిని ఆరాధిస్తారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా పార్వతీపుత్రుడిని పూజిస్తారు. చోళరాజుల కాలం నాటి నల్లరాతి విగ్రహంతో పాటు ఆ

సత్యప్రమాణల దేవుడిగా విద్యలకు ఒజ్జగా కృష్ణాజిల్లాలో కొలువైన మహావిద్యాగణపతిని ఆరాధిస్తారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా పార్వతీపుత్రుడిని పూజిస్తారు. చోళరాజుల కాలం నాటి నల్లరాతి విగ్రహంతో పాటు ఆలయ మండపంలో ముఫ్రై రెండు రూపాల్లో గణనాథుడు దర్శనమివ్వడం ఈ క్షత్ర విశిష్టత.

వినాయకుడు ప్రథమ పూజ్యుడు. ప్రమథ గణాలకు అధిపతి. విఘ్నాలను పోగొట్టే విశిష్ట దైవం. ఆయన్ను ఆరాధించేవారికి కొండంత అండ. అందుకే దేశవ్యాప్తంగా వినాయక నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తారు. పేద ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఇంట్లో గణపయ్యను కొలువుదీర్చి శక్తిమేరకు పత్రం, పుష్పం, ఫలం సమర్పిస్తారు. అలాంటి గజముఖుడు కృష్ణా జిల్లాలోని చల్లపల్లిలో మహావిద్యాగణపతిగా పూజలందుకుంటున్నాడు. అంతేకాదు ఆలయమండపం చుట్టూ వినాయకుడిని సిద్ధీబుద్ధీ సమేతంగా, సంతాన గణపతిగా, జ్ఞానమూర్తిగా... ఇలా వివిధ రూపాల్లో మొత్తం 32 రూపాల్లో ఏర్పాటుచేశారు ఇక్కడ.

స్వయంభువుగా వెలసిన గణనాథుడు

స్వయంభువుగా వెలసిన గణనాథుడు

ఈ క్షేత్రంలో స్వయంభువుగా వెలసిన గణనాథుడు భక్తులు కోరిన కోర్కెలు నెరవేరుస్తూ వరసిద్ది వినాయకుడయ్యాడు. విద్యార్థులకు మంచి చదువులు ప్రసాదిస్తూ మహావిద్యాగణపతిగా ప్రసిద్ది చెందాడు. ఈ ఆలయంలో ప్రతిస్టింపబడిన విగ్రహం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది.

PC: YOUTUBE

ఒక అరుదైన, పురాతన, నల్లరాతి వినాయకుని విగ్రహం

ఒక అరుదైన, పురాతన, నల్లరాతి వినాయకుని విగ్రహం

ఈ గ్రామములోని కె.సి.పి. పంచదార కర్మాగారంలో, 2014, ఆగష్టు-13వ తేదీనాడు, కర్మాగారంలో వినాయకుని దేవాలయం నిర్మించుటకు, త్రవ్వకాలు జరుపుచుండగా, ఒక అరుదైన, పురాతన, నల్లరాతి వినాయకుని విగ్రహం కనిపించింది.

దైవానుగ్రహంగా భావించి ఆ విగ్రహాన్నే మూలవిరాట్టుగా ప్రతిష్ఠించి

దైవానుగ్రహంగా భావించి ఆ విగ్రహాన్నే మూలవిరాట్టుగా ప్రతిష్ఠించి

దైవానుగ్రహంగా భావించి ఆ విగ్రహాన్నే మూలవిరాట్టుగా ప్రతిష్ఠించి, పూజాదిక క్రతువులు నిర్వహిస్తున్నారు. పురావస్తు అధికారులు ఈ విగ్రహాన్ని పరిశీలించి ఇది చోళరాజుల కాలానికి చెందిందిగా గుర్తించారు.

ఈ ఆలయంలో స్వామివారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం

ఈ ఆలయంలో స్వామివారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం

ఈ ఆలయంలో స్వామివారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం, 2017,ఏప్రిల్-8వతేదీ శనివారం నుండి 12వతేదీ బుధవారంవరకు, వైభవంగా నిర్వహించారు. తమిళనాడుకు చెందిన కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరీ పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్రానంద భారతి మహాస్వామివారి చేతుల మీదుగా, విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించారు.

PC: YOUTUBE

 ఈ మందిర నిర్మాణానికి కావలసిన 20 సెంట్లస్థలాన్ని

ఈ మందిర నిర్మాణానికి కావలసిన 20 సెంట్లస్థలాన్ని

ఈ మందిర నిర్మాణానికి కావలసిన 20 సెంట్లస్థలాన్ని, కె.సి.పి.కంపెనీవారు వితరణగా అందించారు. దీనికి ఒక కోటిరూపాయలు వెచ్చించారు. ఈ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలలో భాగంగా,ప్రతి రోజూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.

PC: YOUTUBE

 ఇక్కడి వినాయకుడిని భక్తితో మనస్ఫూర్తిగా ఏ కోరిక కోరుకున్నా

ఇక్కడి వినాయకుడిని భక్తితో మనస్ఫూర్తిగా ఏ కోరిక కోరుకున్నా

మొదట ఒక చిన్న మందిరాన్ని ఏర్పాటు చేసి వినాయకుడి విగ్రహాన్ని అందులో ఉంచారు. ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత ఆ దొరికిన విగ్రహాన్నే గర్భగుడిలో ప్రతిష్ఠించారు. ఇక్కడి వినాయకుడిని భక్తితో మనస్ఫూర్తిగా ఏ కోరిక కోరుకున్నా అది తప్పక నెరవేరుతుందని భక్తుల విశ్వాసం.

 అందుకే ఏటా జరిగే వార్షికోత్సవాల్లో పాల్గొనడానికి

అందుకే ఏటా జరిగే వార్షికోత్సవాల్లో పాల్గొనడానికి

అందుకే ఏటా జరిగే వార్షికోత్సవాల్లో పాల్గొనడానికి రాష్ట్రం నలుమూలల నుంచీ పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. కాణిపాకం వినాయకుడి దర్శనం వల్ల కలిగే ఫలితమే ఇక్కడి స్వామిని దర్శించినా సిద్ధిస్తుందని స్థానికుల నమ్మకం.

లంబోదరుడు ఈ ఆలయంలో చతుర్భుజాలతో దర్శనమిస్తాడు

లంబోదరుడు ఈ ఆలయంలో చతుర్భుజాలతో దర్శనమిస్తాడు

లంబోదరుడు ఈ ఆలయంలో చతుర్భుజాలతో దర్శనమిస్తాడు. పైన రెండు చేతుల్లో పాశాంకుశాలు అనే ఆయుధాలను కింద వాటిలో కుడి చేతిలో అక్షరమాల ఎడమ చేతిలో మామిడి పండును పట్టుకుని కనిపిస్తాడు. అక్షరమాలను చేతిలో ధరించడం వల్లే ఇక్కడి వినాయకుడిని మహావిద్యా గణపతిగా అర్చిస్తారు.

మహా విద్యా గణపతి ఆలయంలో మాత్రం మండపంగా ఏర్పాటు చేసిన పదహారు శిలా స్తంభాలకు

మహా విద్యా గణపతి ఆలయంలో మాత్రం మండపంగా ఏర్పాటు చేసిన పదహారు శిలా స్తంభాలకు

ఈ ఆలయంలో ఆగమశాస్త్రం ప్రకారం పూజాదిక క్రతువులను నిర్వహిస్తారు. ఏ ఆలయంలోనైనా ప్రధాన విగ్రహం ఒక్కటే ఉండటం సర్వసాధారణంగా భావిస్తారు. కానీ మహా విద్యా గణపతి ఆలయంలో మాత్రం మండపంగా ఏర్పాటు చేసిన పదహారు శిలా స్తంభాలకు ఒక్కోదానికి రెండేసి చొప్పున మొత్తం ముప్పై రెండు విభిన్న ఆకృతుల్లో వినాయక విగ్రహాలు దర్శనమిస్తాయి. సంకట గణపతి, త్రిముఖ గణపతి, రుణ విమోచన గణపతి, సృష్టి గణపతి, ఏకాక్షర గణపతి... ఇలా అనేక రూపాల్లోని వినాయకుడి విగ్రహాలను అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.

నిత్య పూజలు:

నిత్య పూజలు:

ఈ క్షేత్రంలో కొలువైన మహావిద్యాగణపతికి ఉదయం నుండే వివిధ రకాల అభిషేకాలూ అర్చనలూ ప్రారంభవుతాయి. శాస్త్రం ప్రకారం పంచహారతలు, నీరాజన సహిత మంత్రపుష్పాలు సమర్పిస్తారు. ప్రతి బుధవారం అన్నదాన కార్యక్రమాన్ని చేపడతారు. వీటితో పాటు హస్తద్రవ్య అభిషేకం, సహస్రనామార్చనలు, సంకష్టహార చతుర్థినాడు ప్రత్యేక హోమాలు, కార్తిక మాసంలో కోటి దీపోత్సవం, లక్షగరిక పూజలను విశేషంగా జరిపిస్తారు. ఏటా చైత్ర బహుళ పాఢ్యమి రోజున వార్షిక మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు.

ఇలా చేరుకోవాలి:

ఇలా చేరుకోవాలి:

విజయవాడకు అరవై అయిదు కిలోమీటర్ల దూరంలో మహావిద్యాగణపతి ఆలయం ఉంది. బస్ట్ స్టాండ్ నుండి కరకట్ట మీదుగా చల్లపల్లి వెళ్లే బస్సులు అందుబాటులో ఉన్నాయి అక్కడి నుండి మచిలీపట్నం వెళ్లే రహదారిలో అయిదు కిలోమీటర్ల రోడ్ మార్గంలో ప్రయాణించి స్వామిని దర్శించుకోవచ్చు, విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్లే బస్సులూ, ప్రయివేటు వాహనాల్లో కూడా ఇక్కడికి చేరుకోవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X